- మానవ అవసరాల్లో అతి ముఖ్యమైనది నీరు ... ప్రకృతిలో దొరికే స్వచ్చమైన నీరంతా కలుషితమయిపోతుండటంతో రక్షిత నీటికోసం పరుగులు తీస్తున్నారు . పట్టణ ప్రజలు శుద్దజలాలకోసం అధిక మొత్తములో డబ్బులు వెచ్చిస్తూన్నారు . అయినా ప్రజలకు అందుతున్నది నిజమైన శుద్దజలమేనా అని సందేశమే . అయా ప్లాంట్ల యజమాన్యాలు సురక్షిత నీటిని సరఫరాచేయడము లో నిబందనలు , ప్రామాణాలు (standards) పాటించడము లేదనే తెలుస్తుంది . తగిన మోతాదులో అవసరమైన లవణాలు సమతుల్యము గా అందించాల్చింది పోయి ఏదో నీటిని తూతూమంత్రముగా పరీక్షచేసి బాటిల్లలో నింపి అందిస్తున్నారు .
శ్రీకాకుళం జిల్లా 4 మునిసిపాలిటీలు , 38 మండలాలతో మొత్తము 26, ౦౦,౦౦౦ ల జనాబా ఉండి 198 కి.మీ . సముద్ర తీరప్రాంతము తో 9 జీవనదులతో ఎల్లాప్పుడు పచ్చదనము తో కళలాడుతూ ఉంటుంది . కాని త్రాగేందుకు మంచి నీరు ఉండదు . దానికి కారణము ఇక్కడ నెలకొని ఉన్న రాజకీయము . డబ్బు రాజకీయము , పదవీ వ్యామోహ రాజకీయము , నెరవేరని హామీల రాజకీయము .
ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్స్ క్యాన్ల ద్వార త్రాగే నీటిని అమ్ముతూ ఉంటుంటారు . శ్రీకాకుళం లో లైసెన్స్ ఉన్నవి 8 ఖనిజ లవణ జల సరఫరా కేంద్రాలు , లైసెన్స్ లేనివి 8 ఖనిజ లవణ జల సరఫరా కేంద్రాలు ఉన్నాయి . జిల్లాలోని ప్రధాన పట్టణాలైన - >
- శ్రీకాకుళం ,
- ఆమదాలవలస ,
- రాజాం ,
- పాలకొండ ,
- నరసన్నపేట ,
- టెక్కలి ,
- పలాస - కాశీబుగ్గ ,
- సోంపేట ,
- ఇచ్చాపురం ,
ఏమిటీ 'మినరల్ వాటర్' ? : నీటిని మూడు కేటగిరీల రసాయన పరీక్షలు నిర్వహించాలి . మొదటి కేటగిరీలో " నీటి ఆమ్ల స్వభావము (phc value) , క్లోరైడ్ , సల్ఫేట్ ... తదితర పరీక్షలు లను రోజూ క్రమము తప్పకుండా చేపడుతుండాలి " రెండో కేటగిరిరీ లో ... బేరియం , కాల్సియం , మిగ్నీషియం , అల్యూమినియం , జింక్ , కాపర్ తదితర ఖనిజాలను వారానికి ఒకసారి పరీక్షించాలి . వీటితోపాటు బోరేట్ , ఆంటిమొనీ లోహాల గాడతను నెలకొకసారి తప్పనిసరిగా పరీక్షించాలి . మూడో కేటగిరిలో నీటిలో ఉన్న సూక్ష్మ జీవులను గుర్తించేందుకు ' కోలి ఫారంస్ ' మైక్రోబయోలజీ పరీక్షలు అతికీలకమైనవి . అలాగే బౌతిక పరీక్షలకు సంభందించి ... రంగు , రుచి , వాసన , నీటిలో మొత్తము కలిగిఉన్న పదార్దాల పరీక్షలు నిర్వహించాల్సిఉంటుంది .
ఇటువంటి పరీక్షలకు వాటి నిర్వహణ కు వినియోగించే రసాయనాల కోసం అధిక మొత్తములో ఖర్చు చేయాల్సి ఉంటుంది . వీటికి తోడు శుద్దజలము ప్రక్రియ జరుగుతున్న ప్రాంతములో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందకుండా ఏసీ సౌకర్యము ఉండాలి . పరికరాలు , కేన్లు . స్టెరిలైజేషన్ కోసము ' హాట్ ఎయిర్ ఓవెన్ " ఏర్పాటు చేసుకోవాలి . ఇవన్ని ఖరీదైనవి కావడము తో సంబంధిత యాజమాన్యాలు తూతూమంత్రం గా పరీక్షలు చేపట్టి చేతులు దులిపేసుకుంటున్నాయి .
-
సిబ్బంది కి సంకూర్చే రక్షక కవచాలు :
ప్లాంటు లోని కార్మికులు తమ చేతులకు స్పిరిట్ రాసుకోని ' గ్లౌస్ ' తొడుక్కొని పనిచేయాల్సి ఉంటుంది . శరీరానికి " ఆప్రాన్ " ధరించాలి . ముక్కుకు మాస్కు ధరించాలి . అయితే ఇవేవీ ఏ ప్లాంట్ లోనూ కనిపించడం లేదు . వీరి జీతాలు కూడా అరకొర గానే ఉంటాయి కావును వ్యక్తిగత శుభ్రతకూడా ఏమీ బాగుండదు .
నాణ్యత పాటించకుంటే అనర్ధాలే : సాధారణ జలము శుద్ద జలము గా మార్చే ప్రక్రియలో పలు దశల్లో నిర్వహిస్తున్న పరీక్షలు సక్రమముగా లేనట్లయితే చాలా అనర్ధాలకు దారితీస్తుంది . ప్రత్యేకము గా సూక్ష్మజీవులు , ప్రమాదకర ఖనిజాల కోసము చేసే పరీక్షలు పక్కాగా లేకుంటే ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదము ఉంటుంది . బాటిల్స్ లో ఉన్న శుద్దజలము కొంతవరకు సురక్షితమైనా ప్యాకెట్లలో ఉండే నీరు ఆరోగ్యానికి అంతమంచిది కాదని మైక్రోబయోలజీ నిపుణులు చెబుతున్నారు . ప్యాకెట్లలో ఉన్న నీటికి యు.వి (ఆల్ట్రా వైలెట్) ప్రక్రియ జరిగే అవకాసము లేదని పేర్కోంటున్నారు . కోలీఫారంస్ పరీక్షల్లో భాగంగా ఈ కోలీబాక్టీరియా పూర్తిగా తొలగించకుంటే ఉదరకోశ వ్యాధులు , అల్సర్లు , జీర్ణసంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదము ఉంటుంది . సాదారణ జలాలో ఉండే హెపటైటిస్ -బి వైరస్ ను నిర్మూలించకపోతే పచ్చకామెర్ల వ్యాది సోకుతుంది . బాసిల్లస్ బ్యాక్టీరియాతో టైఫాయిడ్ , డయేరియా తదితర వ్యాధులు సోకుతాయి . నీటి ఆమ్లపు భావాన్ని పి.హ్చ్.సి 6.0 కంటే తక్కువ విలువ అయితే గాస్ట్రిక్ అల్సర్లు వస్తాయి . కాల్సియం , నైట్రేట్లు మోతాదు మించితే కిడ్నీ , రక్త సంబంధిత వ్యాధులు వస్తాయి . నీటిలో ఉన్న వృదా ఖనిజాల తొలగింపుతో పాటు అవసరమైన వాటిని పరిమిత మోతాదులో ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోపోతే మినరల్ వాటర్ అవదు కదా ' అశుద్ధ జలము ' అవుతుంది
ఈ బాదలన్ని పడే కంటే నీటిని బాగా కాచి వడపోసి తాగితే 100 శాతము సురక్షితము .
ఒకప్పుడు 'మినరల్ వాటర్' అనే పదాన్ని కేవలం ప్రకృతి సహజంగా భూగర్భం నుండి ఉబికి వచ్చే నీటికి లేదా ఎత్తయిన పర్వత ప్రాంతాల నుంచి సహజంగా ఊటగా వచ్చే నీటికి వాడేవారు. భూగర్భం నుండి సహజంగా ఉబికి వచ్చే నీటిలో కొన్ని ప్రత్యేకమైన లవణాలు (గంధకంలాంటివి) కరిగి ఉంటాయని, ఈ నీటితో స్నానం చేస్తే కొన్ని జబ్బులు నయమవుతాయని, అలాగే ఈ నీటిని తాగినప్పుడు ఆరోగ్యం బాగు పడుతుందని ఎంతోమందికి నమ్మకం. అందువల్ల ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సహజంగా వచ్చే ఈ నీటి ఊట స్థలాలకు వెళ్లి స్నానాలు చేసేవారు. ఇలాగే పెద్ద పెద్ద పర్వతాల నుండి (హిమాలయాలు) వచ్చే నీరు అత్యంత పరిశుభ్రంగా ఉండడమే కాక, ఆరోగ్యానికీ పనికివచ్చే మూలకాలు దీనిలో కరిగి ఉంటాయని, ఈ నీరు కూడా ఆరోగ్యానికి మంచిదని ఎంతోమంది నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు మనదేశంలో పంప్ చేస్తున్న అన్ని భూగర్భ జలాలను 'మినరల్ వాటర్‌గా' పరిగణిస్తున్నారు. (1954 ఆహారకల్తీ నిరోధకచట్టం రూల్ ఎ 32) అందు వల్ల పరిశుభ్రం చేసి బాటిళ్లలో (సీసాలు) నింపి న ప్రతినీరునూ 'మినరల్ వాటర్' అనే పిలుస్తు న్నారు. వాణిజ్యపరంగా ఇప్పుడు మార్కెట్‌లో విస్తారంగా దొరుకుతున్న 'మినరల్ వాటర్', మనకు మొదట తెలిసిన 'మినరల్ వాటర్' ఒకటే కావు. ఇది కేవలం శుద్ధిచేసిన బోరుబావి నీళ్ళే. దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
పై నేపథ్యంలో ఇప్పుడు ఎంతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ కనీసం ప్రయాణ సమ యంలో ఎంతోమంది బాటిల్ నీళ్లను కొని, తాగుతు న్నారు. దీనికి ప్రధానకారణం ప్రయాణంలో మామూ లుగా దొరికే నీళ్ల కన్నా బాటిల్ నీళ్లు సురక్షితమని వీరు భావించటమే. కానీ, బాటిల్ నీళ్లు మామూలుగా తాగే కుళాయి నీళ్లు నాణ్యతల మధ్య తేడా అంతగా లేదని కొన్ని సందర్భాలలో బాటిల్ నీళ్లలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెబ్‌సైట్ సమాచారం తెలుపుతోంది
మినరల్ వాటర్ మామూలుగా బోరుబావి నుండి తీసిన నీటితో తయారుచేస్తున్నప్పుడు దీనికీ, కుళాయి నీటి నాణ్యతకూ తేడా ఏమిటి? అన్న ప్రశ్న వస్తుంది. బోరుబావి నీటిని వడకొట్టి, క్లోరినేషన్ చేస్తే సురక్షితమైన నీరుగా మారిపోతుంది. సురక్షిత నీటి పథకం పేరుతో ఎన్నో గ్రామాల్లో బోరుబావి నీళ్లను కేవలం పంపుచేసి, పైపుల ద్వారా సురక్షిత నీరుగా సరఫరా చేస్తున్నారు. కానీ ఈ నీటిని శుద్ధి చేయడానికి వడకట్టడం గానీ, క్లోరినేషన్‌గానీ చేయడం లేదు. కానీ, ప్రజల్లో మాత్రం ఈ నీరు సురక్షితమైనదనే ప్రచారం జరుగుతుంది. ఈ బోరు బావి నీటిని శుద్ధిచేసి పంపితే అదే 'మినరల్ వాటర్' అవుతుంది. ఇలా శుద్ధిచేయడానికి నామమాత్రపు ఖర్చే అవుతుంది. దురదృష్టంగా దీనికై కేటాయించిన బడ్జెట్ దుర్వినియోగం అవుతుంది. ఎక్కడా క్లోరినేషన్ జరగడం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున వున్న భోలకపూేర్ ప్రాంతంలో క్లోరినేషన్ చేయడంలోని వైఫల్యం ఇటీవల ఎంతో మంది మరణాలకు, అంటురోగాల వ్యాప్తికి దారి తీసిందంటే.. రాష్ట్రం మొత్తంలో క్లోరినేషన్ ద్వారా శుద్ధి చేయడంలో ఎంత నిర్లక్ష్యం జరుగుతుందో తెలుసు కోవచ్చు. కేవలం తగు యాజమాన్యంతో అవసరమైన చోట నామమాత్రపు బడ్జెట్‌తో శుద్ధిచేసి, మంచి నీటిని అందించే బదులు ఎంతో ఖర్చుతో కూడిన బాటిల్ వాటర్‌ను సరఫరా చేసి, గిరిజనుల ప్రాణాలను రక్షిస్తా మన్న ప్రభుత్వ నిర్ణయం అశాస్త్రీయమైంది, అసంబద్ధ మైంది. ఇదే విధంగా కాచి, చల్లార్చి, వడబోసిన నీటిని తాగే అలవాటును ప్రజల్లో వ్యాప్తిచేయకుండా, బాటిల్ నీళ్ళే సురక్షితమైనవనే భావనను వ్యాప్తిచేయడం ప్రజల ప్రయోజనానికికాక, వ్యాపార, వాణిజ్యవర్గాలకు సహాయ కారిగానే కొనసాగుతుంది. పేదలు, మధ్యతరగతి కుటుంబ బడ్జెట్‌లపై ఇది ఎనలేని భారాన్ని మోపుతుంది.
ఎందుకిలా?
సహజంగా, దాదాపు ఉచితంగా దొరికే మంచినీటిని సరఫరా చేసే స్థితిలో ఉన్న ప్రభుత్వం ఖర్చుతో కూడిన బాటిల్ నీళ్ళను గిరిజనుల ప్రాణాలను రక్షించే పేరుతో ఎందుకు సరఫరా చేసేందుకు నిర్ణయించిందనేది ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు చేపట్టిన తర్వాత సహజవనరులైన నీటిని కూడా అమ్మి, కొనే మార్కెట్ వస్తువుగా మార్చి, వ్యాపార స్తులకు ఎనలేని లాభాలను సమకూర్చే విధానాలను ప్రభుత్వం చేపట్టింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర 'నీటి విధానాన్ని' ప్రభుత్వం రూపొందించింది. కానీ ఈ విధా నాలకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రజల్ని మానసికంగా, భౌతికంగా నీటిని కొని తాగేందుకు అలవాటు చేయడా నికి మొదట నామమాత్రపు ధరలో లేదా ఉచితంగా మినరల్‌వాటర్‌ను సరఫరా చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని భావించాల్సి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, ఇదే బోరుబావుల నీటిని వడకట్టి, క్లోరినేషన్ చేసి, శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని అతి తక్కువ ఖర్చుతో కాపాడవచ్చు.
- ================================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !