- image : courtesy with Eenadu Telugu daily.
జిల్లాలో మొత్తం విద్యుత్తు కనెక్షన్లు 7.29 లక్షలు.
రోజుకు 30 లక్షల యూనిట్ల పైబడి విద్యుత్తు వినియోగమవుతోంది.
ఏడాదికి సుమారుగా 10.80 కోట్ల యూనిట్ల విద్యుత్తును వాడుతున్నారు.
రాస్ట్రము లో టెలిస్కోపిక్ విధానం కొనసాగుతున్నట్లు చూపిస్తూనే.. స్లాబులు పెంచి, ఛార్జీల మోత మోగించడంతో సామాన్యుడి ఇల్లు గుల్ల కావడం ఖాయం. కరెంటు కనెక్షన్లు సంఖ్య 2.40 కోట్లు ఉంటే, ఇందులో గృహ వినియోగదారులే 2 కోట్ల ఉన్నారు. ఇందులో నెలకు 50 యూనిట్ల వరకు వాడుకునే కుటుంబాలే అధికంగా ఉన్నాయి. ఈ కేటగిరిలో నాన్ టెలిస్కోపిక్ విధానం వర్తింప చేయడంతో ఒక యూనిట్ తేడా వచ్చినా బిల్లుకి కోరలు వస్తున్నాయి. నెలకు 50 యూనిట్ల కంటే తక్కువ వాడితే యూనిట్ రూ.1.45 మాత్రమే అనీ, పేదలకు ఛార్జీ తక్కువగా ఉందని చెప్తున్న ప్రభుత్వం.. అంతకు మించి ఒక్క యూనిట్ దాటినా రూ.2.60 ఛార్జీ వేస్తోంది. అంటే ఒక్క యూనిట్ వాడకంతోనే పేదోడు.. ధనవంతుడుగా మారతాడా..? ఇలాంటి వారిపై భారం ఎలా పడుతుందో చూద్దాం..
Courtesy with : 31-Mar-13 Eenadu Srikakulam Edition
- =====================