Showing posts with label Sports Associations in Srikakulam. Show all posts
Showing posts with label Sports Associations in Srikakulam. Show all posts

Thursday, August 12, 2010

Sports Associations in Srikakulam, క్రీడా సంఘాలు శ్రీకాకుళం లో



  • క్రీడలు శారీకం గాను , మానసికం గాను ఎంతోఉపయోగ పడతాయి . శరీర సౌస్ఠవాన్నీ , శరీర ఆరోగ్యాని పెంపొందిస్తాయి . మానసిక ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని , మనోవికాసాన్ని కలిగిస్తాయి . నిర్ధిస్టమైన లక్ష్య సాధన కోసం సమూహం గా ఏర్పడి ఆ దిశగా కృషి చేయడమే సంఘాల ఆశయము . ఆ దిశ గా ఏర్పడినవే ఈ క్రీడాసంఘాలు ... శ్రీకాకులం జిల్లాలో 32 క్రీడా సంఘాలేర్పడ్డాయి . క్రీడల ఖిల్లాగా పేరొందిన చిక్కోలులో ఇవి తమదైన రీతిలో ముందుకు సాగుతున్నాయి .

శ్రీకాకుళం జిల్లాలో క్రీడా సంఘాలు :
  1. అథ్లెటిక్స్ ,
  2. ఆర్చరీ ,
  3. వెయిట్ లిఫ్టింగ్ ,
  4. కబడ్డీ ,
  5. ఖోఖో ,
  6. వాలీబాల్ ,
  7. బాస్కెట్ బాల్ ,
  8. ఫుట్ బాల్ ,
  9. త్రోబాల్ ,
  10. బేస్ బాల్ ,
  11. బ్యాడ్మింటన్‌ ,
  12. టేబుల్ టెన్నిస్ ,
  13. చదరంగము ,'
  14. తైక్వాండో ,
  15. కరాటే ,
  16. బాక్షింగ్ ,
  17. రెజ్లింగ్ ,
  18. టెన్నికాయిట్ ,
  19. క్రికెట్ సీనియర్స్ ,
  20. క్రికెట్ జూనియర్స్ ,
  21. హాకీ ,
  22. కేరమ్‌స్ ,
  23. నెట్ బాల్ ,
  24. టెన్నిస్ ,
  25. సటిల్ కాక్ ,
  26. జావలిన్‌,
  27. ఒలింపిక్ సంఘము , ఇంకా ?

సంఘాల నిర్మాణము :
సభ్యులుగా చేరేవారు సంబంధిత క్రీడలో రాస్ట్ర , జాతీయ స్థాయిలోని ప్రతిభ చూపినవారై ఉండాలి . వీరిలోనే కార్యవర్గాన్ని ఎనూకుంటారు . జిల్లా ఒలింపిక్ సంఘం , సంబంధిత రాస్ట్ర సంఘ ప్రతినిధుల అధ్వర్యము లో ఎన్నిక జరుగుతుంది . ప్రబుత్వ ప్రతినిధి కూడా ఎన్నిక పరిశీలకులు గా వ్యవహరిస్తారు . క్రీడా సంఘాలన్నీ ఒలింపిక్ అస్సోసియేషన్‌ సభ్యులుగా ఉంటారు . ఎంఫికలో పారదర్శకత పాటించాలి . నకిలీ జన్మ ధ్రువ పత్రాలతో పోటీలకు వెళ్ళే వారి సంఖ్య పెరుగుతుంది . ఈ విషయము లో అలసత్వము పనికిరాదు . దశాబ్దాల తరబడి కొన్ని సంఘాల్లో ప్రతినిధులు వివిధ హోదాలలో నాటుకుపోయారు . వీరు వైదొలగి చురుకైన , ఆసక్తి ఉన్న యువతరాన్ని ప్రోత్సహించాలి .

క్రీడా సంఘాల బాధ్యతలు :
  • మారుమూల ప్రాంతాలలో క్రీడలను అభివృద్ధి పరచడం .
  • జిల్లాలో అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో క్రీడా ఎంఫికలు , పోటీల నిర్వహణ ,
  • ఎంపికలో పారదర్శకత పాటించాలి ,
  • రాస్ట్ర పోటీ్లకు జిల్లా జట్టును సిద్ధం చేయడం ,
  • పోటీల కోసం ఆర్ధిక వనరులను దాతల నుంచి సేకరించడం , అవరము మేరకు వితరణ శీలుర సాయాన్ని తీసుకోవడం ,
  • క్రీడలకు సంబంధించిన మౌలికసదుపాయాల కల్పనకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం ,
  • సెమినార్ లు , వర్కుషాపులు నిర్వహించి మెలకువలను క్రీడాకారులకు తెలియజేయడం ,
  • ఆధునిక క్రీడా సంకేతిక పరిజ్ఞానాన్ని క్రీడాకారులు అందిపుచ్చుకునేలా చొరవ చూపాలి ,
  • జాతీయ , అంతర్జాతీయ క్రీడా ముత్యాలను సత్కరించి వర్ధమాన క్రెశాకారులకు స్పూర్తి కలిగించడం ,
  • అవగాహన లేని కొన్ని క్రీడాంశాల కోసం సంబంధిత సంఘాలు పాఠశాల స్థాయిలో విద్యార్ధుల్లో ఆసక్తి కలిగించేలా ప్రదర్శించాలి ,
  • క్రీడా పరికరాలు ప్రభుత్వ సహాయము తో సమకూర్చాలి .
  • :
ప్రభుత్వము స్పందన ఇలా ఉండాలి ->
అన్ని ప్రాంతాల్లో మౌళిక వసతులు కల్పించాలి . అథ్లెటిక్స్ కు సంబందించి రాస్ట్రం మొత్తం మీద రాజధానిలో మాత్రమే సింథటిక్ ట్రాక్ ఉన్నది . ప్రతి జిల్లాకు క్రీడా శిక్షకులను నియమించాలి . రాస్ట్రం లో అథ్లెటిక్స్ కు 07 శిక్షకులుండగా శ్రీకాకుళం జిల్లాలో లేరు . ఇక్కడ మూడు క్రీడాంశాలకే శిక్షకులున్నారు . నిధులను సెస్ ద్వారా కాకుండా రాస్ట్ర బడ్జెట్ నుండే విడుదల చేయాలి . కార్పొరేట్ సంస్థలను భాగస్వాముల ను చేయడానికి అవసరమైతే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి .
  • ===========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.