Showing posts with label Hatakeswara swamy temple at Singupuram. Show all posts
Showing posts with label Hatakeswara swamy temple at Singupuram. Show all posts

Monday, September 28, 2009

Hatakeswara swamy temple at Singupuram













It is the only Cave temple of Srikakulam district on Sindura hill . Inscriptions on the pillar establish that it was constructed during 11th Century A.D. Every year in the month of Chaitram (February / march ) kalyanotsavam is celebrating auspiciously for 9 days . Here on the hill-top there is a holy spring through which holy water springs out through out the year.

ఆలయ పూజారి - పెంట రామకృష్ణ శర్మ గారు చెప్పిన స్థలపురాణము :

పూర్వము ఒకప్పుడు ప్రయాగ పుణ్యక్షేత్రము దగ్గర భ్రుగు , వశిష్ట ,వామదేవ , అత్రి , భరద్వాజ, మున్నగు మహర్షులు అంతా కలిసి చేసిన యజ్ఞము నందు శివునిచే అవమానింపబడ్డ దక్షుడు " భూతప్రేత పిశాచ గణములతో కూడి శ్మశాన వాసియైయి దిగంబరుడువు గా నుందువు గాక " అని శివునే శపించగా ... వేద వేదంగా పారాయనుడు ను , బ్రహమునుడు ను అయినందున దక్షునకు శివుడేమి అనకున్నా ... కోపోద్రిక్తుడైన నందీశ్వరుడు ప్రతిశాపముగా "బుద్ధి జ్ఞానము లేని యాచాకుదవుడవు గాక " అని శపించెను . ఆప్పటినుంది దక్షుడు అల్లుడైన శివుని యందు , శివ గణాల యందును ద్వేషియై ప్రవర్తించు చూ ... కొంత కాలము తర్వాత , శివుని పరభావించుటకె అన్నట్లు ద్రాక్షారామము లో దక్ష యజ్ఞము నారంభించి , ముక్కోటి దేవతలను , ఋషులను , రాజులను , బ్రహ్మ , విష్ణు , నారదాది మహర్షులను ఆహ్వానించి శివుని , కూతురైన సతీ దేవిని పిలవలేదు .

తండ్రి (దక్షుడు) చేస్తున్న యజ్ఞము వార్త , యజ్ఞము నాకు వెళ్తున్న రోహిణి- చంద్రుల చెలికత్తె ద్వారా తెలుసుకున్న సతీదేవి, భర్త (శివుని) ఆనతి తీసుకొని పిలవని పేరంటానికి , శివగానాలతో కలసి వెళ్లి .. తండ్రి చేసిన పరాభవానికి మూర్చిల్లి పోగా ... అది తెలుసుకున్న శివుడు రుద్రుడి రూపము దాల్చి యజ్నవాటికను ద్వంశము చేసి ముర్చిల్లిన సతీదేవిని తీసుకొని ఆకాశ మార్గమున కైలాసానికి ప్రయనమాయేను . అది చూసిన విష్ణు , బ్రహ్మాది దేవతలు శివ స్తోత్రము చేయగా ... శాంతించిన శివుడు మార్గమధ్యములో ఒక పర్వతముపై కాలుపెట్టి (దిగి) , అప్పటికే స్పృహ నుండి బయటపడ్డ సతీదేవిని ఆ పర్వతము పై ఉంచి యోగాగ్ని లో పడి చనిపోతానన్న సతీదేవిని శాంతింప జేసి యోగిని అయి యోగాదీక్ష లో ఉండమని, తగిన శక్తిని పొందిన తరువాత హిమగిరికి పుత్రికవై పార్వతి గా తనని చేరుకొమ్మని ఆజ్ఞాపించెను . ఆ పర్వతమే సింగుపురము (సింహగిరి) కి పడమరన ఉన్న "సింధూర " పర్వతము .

కొంత కాలము తరువాత యోగనిద్రలో ఉన్న సతీదేవి దేహ త్యాగము గావించు కొని జ్యోతియై హిమగిరి , "మేనక - హిమవంతు " లకు పుత్రిక గా మరో జన్మ లో అడుగిడెను .

సింహపురి ని రాజధాని గా చేసుకొని సింహబలుడు అనే రాజు .. రాజ్యపాలన చేయుచుండెను . రాజు మహా శివ భక్తుడు , ప్రతినిత్యము శ్రీకాకుళం లో కొలువై ఉన్న ఉమరుద్ర కోటేశ్వర స్వామిని కొలుస్తూ ఉండేవారు . ఒక రాత్రి తన కలలో అమ్మవారు (దేవి) ని కొండపై చూసునట్లు స్వప్నకు కని ... కలలో దేవి ఆజ్ఞా ప్రకారము ఆలయము కట్టి "చైత్ర శుద్ధ సప్తమి మొదలు బహుళ పాడ్యమి వరకు నవరాత్ర దీక్షాకంకన బద్ధుడై భక్తితో శాక్తేయ సంప్రదాయానుసారము , "జప పూజ , బలి హోమాది కార్యక్రమములు ప్రతి ఏటా చేయుచూ ",కులదైవము గా కొలుచు చుండెను . కొండ దిగువభాగాన ఒక కోనేరు తవ్వబడి ఉన్నదనీ ... దేవీ మహత్యము వల్ల కొనపై నుండి ఒక నీటి పాయ వచ్చి చేరుతూ ఉండేదని పురాణాలలో చెప్పబడి ఉన్నది .

పార్వతీ పరమేశ్వరులు కళ్యాణము తరువాత ... ఒకానొక రోజున ఏకాంత సమయము లో శివుడు సతీదేవి వృత్తాంతమును పార్వతీ దేవికి చెప్పెను . కధవిన్న పార్వతి, సతీ దేవి యోగిని గా జ్యోతి రూపము చెందిన ఆ పర్వత ప్రదేశమును చూడాలని కోరగా ... కలియుగమున తన భక్తులైన మానవులను పాపవిముక్తులను చేయు కార్యార్ధము తానూ అవతరించు సమయము లో తన కోరిక తీరునని సెలవిచ్చేనని పురాణాలు తెలియజేయుచున్నవి .

కాలానుక్రమములో రాజ్యాలు పోయాయి , యుగాలు మారిపోయాయి , రామరాజ్యము పోయే , శ్రీకృష్ణ రాజ్యము పోయే , కలియుగామారంబము అయ్యెను . భారత ఖండములో ఎన్నో మార్పులు సంభవించాయి , హిందూ దేశాన్ని కొల్లకొట్టి ముస్లింలు రాజ్యపాలన గావించారు . ఎన్నో హిందూ దేవాలయాలు , గోపురాలు , భవనాలు కూలగోట్టబడ్డాయి . అయిననూ ఈ దేవిమాత ప్రజలచే పూజింపబడుతునే ఉంది . . . కాని చాలా దీనావస్తలో ఉండి సింహబలుడు ప్రతిష్టించిన విగ్రహాలు , ప్రతిమలు ముక్కలై తలోచోట పడిఉండేవి . ఈ పరిస్థి కి జాలిపడి , బాధపడిన , ఆప్రాంతానికి చెందిన , మహా శివ భక్తుడైన " నారాయనప్ప " అనే బ్రాహ్మణుడు శివుని కై ఘోర తపమాచరించి , శివ అనుగ్రహమును పొంది , వరము కోరుకోమ్మనినా ఆశపడక మోక్షాన్ని కోరుకున్న అతనికి ,శివుడు బంగారాన్ని తయారుచేసే " స్వర్నయోగము " అనే బంగారము ను తయారుచేసే విద్యనూ భోధించి , దేవి ఆలయాన్ని పునరుద్ధరించి తనని ప్రతిష్టించి ఆరాధించి మోక్షము పొందమని ఉద్భోదించెను . ఆ విధం గా క్రీ .శ. ము . 11 - 12 శతాబ్దముల మధ్య కాలములో ఈ ఆలయం పునః ప్రతిష్ట చేయబడినది .

బంగారానికి " హాటక" అనే మరో పేరు కలదు ... హాటక వరమును ప్రసాదించిన శివునకు "హాటకేశ్వర స్వామీ" అని అమ్మవారు ని 'ఉమా ' అని "ఉమా హాతకేస్వరస్వామి " అని ఆ పూజారి , ఆ ఆలయాన్ని పిలుస్తూ ఎంతో అభివృద్ధి చేశారు . ఇప్పటికి తన వంశీయులు పూజారులు గా ఉంటూ వస్తున్నారు . ఆ కుటుంబీకుడే ఈ పెంట రామకృష్ణ శర్మ .

ఈ ఆలయానికి ఉత్తరమున 'వంశధార' నది , దక్షిణమున 'నాగావళి ' నది ఉన్నాయి, సుమారు 60 ఎకరముల పొలము ఈనామి భూములు ఉన్నాయి .

కరజాడ గ్రామానికి చెందిన " కొండమ్మ" అనే వైశ్య కుంటుంబానికి చెందిన బాలిక దేవి అనుగ్రహము తో పుట్టినదని , తన పెండ్లి సమయం లో జ్యోతి అయి పార్వతి లో ఐక్యము అయినది అని చరిత్ర కలదు . అందుచే ఈ స్వామిని " ఉమా కొండమ్మ హటకేస్వరస్వామి " అని పిలిచే అలవాటు కలదు .
ఈ ఆలయము లో
1. శ్రీ హటకేస్వరస్వామి ,
2. పార్వతీ దేవి ,
3. కొండమ్మవారు ,
4. శ్రీ త్రిశూల స్వామి ,
5. అన్నపూర్ణమ్మ (వృద్ధి కొండమ్మ )
వెలసి ఉన్నారు .

ఉత్సవాలు :
౧ . చైత్ర్స్ శుద్ధ సప్తమి -- ధ్వజారోహణము
౨ , దశమి ఆహ్వానము --- పెండ్లి పిలుపు ,
౩ . ఏకాదశి --- కళ్యాణము ,
౪ . త్రయోదశి --- సదస్యోత్సవము ,
౫. చతుర్దశి ---దోపోత్సవము ,
౬. పౌర్ణమి -- వసంతోత్సవము ,
౭ . బహుళ పాడ్యమి -- శక్తి ఉత్సవము ,

విజయదశమి , కార్తీగ పౌర్ణమి , కనుమ , మహాశివరాత్రి పర్వదినములందు స్వామి పుష్పక ము నందు గిరిజ కొండమ్మల తో కలిసి గ్రామమంతయు ఉరేగి భక్తులకు దర్శన భాగ్యము కలిగించును . మహాశివరాత్రి నాడు స్వామి వంశధార పున్యనదీ జాలములో శుక్రస్నానమాచారించును .. జనము స్వామిని అనుసరించి తమ మొక్కు బడులను తీర్చుకుంటూ స్వామి కృప పొందుచున్నారు .
==============================================================
Visit my Website > Dr.Seshagirirao-MBBS