Showing posts with label Exibition in Srikakulam Town. Show all posts
Showing posts with label Exibition in Srikakulam Town. Show all posts

Sunday, May 2, 2010

విజ్ఞాన వినోద ప్రదర్శన శ్రీకాకుళం లో, Exibition in Srikakulam Town





శ్రీకాకుళం పట్నం లో ప్రతి సమ్వత్సరమూ వేసవి సెలవులలలో పిల్లలకు వినోదాన్ని , విజ్ఞానాన్ని అందించే ఉద్దేశం తో " వినోద విజ్ఞాన ప్రదర్శన జిల్లా కలెక్టర్ గారి అధ్వర్యం లో యేర్పాటు చేస్తున్నారు . ఇది వేసవి లొ ఆటవిడుపుగా సాయంత్రము వేళ ప్రజలకు కాసింత ఊరట కల్గిస్తుంది .

1978 లో అప్పటి కలెక్టర్ దానం నిర్వహణలో ఎన్క్ష్ టీ ఆర్ పురపాలక ఉన్నత పాఠశాల మైదానము లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తుండేవారు . అప్పటిలో రెండు ఏళ్ళకు ఒక సారి ఫిబ్రవరి నెల లో ఏర్పాటు చేసేవారు . ఎన్నో వానిజ్య వ్యాపార కేంద్రాలు స్టాల్స్ గా ఏర్పాటు అయ్యేవి . కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూవుండేవి .
అనిల్ చంద్ర పునేథ కలెక్టర్ గా ఉన్న సమయం లో ఎగ్జిబిషన్క్ష్ సొసైటీ ద్వారా ఏప్రిల్ మొదటి వారం లొ ప్రరంభించేవారు . వేలం పాట ద్వారా వచ్చే ఆధాయాన్ని వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తూ మూలనిధిగా కొంత ఉంచేవారు .


పెద్ద మార్కెట్ ని ఎంటిర్(N.T.R ) ముంచిపల్ హైస్కూల్ మైదానం లోనికి మార్చడం వలన ఎగ్జిబిధన్క్ష్ ని పి.ఎస్.ఎం.ఎం. హైస్కూల్ మైదానం లోనికి మార్చారు . రోజు సాయంతం వేసవివినోదం గా సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి . కొద్ది కాలం క్రితం ప్రభుత్వ అధికారులను సొసైటీ నుండి తప్పించి పురపాల పరిధిలొకి మార్పుచేశారు . ప్రభుత్వ సౌజన్యం లేకపోవడం తో ఎగ్జిబిషన్క్ష్ కొంత మేరకు ఆకర్శణ కోల్ఫోయినది . ముంచిపాలిటీ అధికారులు వేలం పాట ద్వారా రాజకీయ ప్రమేయం ఉన్న వారికే ఎగ్జిబిషన్క్ష్ నడిపింఛేందుకు మాచ్-ఫిచ్చ్ అవడంతో అంతా వ్యాపార ధోరణిగా , నాసిరం గా మారినది .


  • =============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.