Showing posts with label Beauty Parlars in Srikakulam Town. Show all posts
Showing posts with label Beauty Parlars in Srikakulam Town. Show all posts

Monday, June 14, 2010

Beauty Parlars in Srikakulam Town , బ్యూటీపార్లర్లు శ్రీకాకుళం లో




ప్రస్తుతం హైటెక్ యుగం లో సౌందర్యము పట్ల క్రేజ్ బాగా పెరిగింది . అదే మోతాదులో సౌందర్యసాధనాల వాడకమూ పెరుగుతోంది .కాలేజీ అమ్మయిలు మొదలు ఆంటీల వరకూ అంతా సౌందర్య పోషణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు .
అందం గా కనిపించాలని కోరుకోనివారు ఎచరుంటారు . దేహ సౌందర్యం పై అన్నివర్గాల వారు ఇటీవల ఆసక్తి చూపుతున్నారు . ముఖ సౌందర్యము , కేసాలంకరణపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు . ముఖం పై ముడతలు , మొటిమలు తొలగించుకునేందుకు నిపుణుల సహాయము తీసుకుంటున్నారు . దీంతొ అందానికి మెరుగులు ఎఇద్దే బ్యూటీపార్లర్ లు విరివిగా వెలిసాయి . గతం లొ కొన్ని వర్గాలకే పరిమితమైన ఇవి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి . కొన్నాళ్ళ కిందట మధ్య తరగతి మహిళలు బ్యూటీపార్లర్లకు వెళ్ళాలంటే బిడియపడేవారు కాని ప్రస్తుతం సామాన్యుల కోసమే అన్నట్లు ప్రతివీధిలోను వీటిని ఏర్పాటు చేస్తున్నారు .నేటి మహిళలు , యువతులు ... వేడుకలు , శుభకార్యాలు వంటి ప్రత్యేక సంధర్భాలలో తమ ముఖారవిందాన్ని మెరుగుపర్చుకోవడం ఎక్కువయినందున బ్యూటీ క్లినిక్ లు ఎక్కువయ్యాయి . . . దీన్నే ఉపాదిగా తీసుకొని కొందరు మహిళలు ఆర్ధిక స్వాలంబన దిశగా ఆడుగులు వేస్తున్నారు .




శ్రీకాకుళం పట్నం లో సుమారు 50 వరకూ బ్యూటీపార్లర్లు ఉన్నాయి . మంచి ఆదాయము , ఆదరణ ఉన్నాయి . ఇవ్పుడు బ్యూటీ పార్లర్‌కు అంతా పెళ్తున్నారు. ఆదాయం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కోర్సు నేర్చుకుంటున్నారు . ముందుగా ఒక పార్లర్‌లో చేరి నెలకు ఎంతో కొంత సంపాదించగలననే ధీమా వచ్చింది.

అదనవు ఆదాయం

టైలరింగ్‌, అవ్పడాలు, కొప్వొత్తుల తయారీలను సంఘాల సభ్యులు చేస్తున్నారు . ఇవ్పుడీ బ్యూటీషియన్‌ కోర్సు వల్ల అదనవు ఆదాయం లభిస్తుంది. ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు.


మంచి డిమాండు ఉంది

బ్యూటీపార్లర్‌కు ఇవ్పుడు మంచి డిమాండ్‌ ఉంది. శిక్షణ అనంతరం ఆసక్తి ఉన్న మహిళలు ముందుకొస్తే, మహిళలు రూ. 50 వేల సబ్సిడీతో రూ. 2 లక్షల రుణం పొంది బ్యూటీ పార్లర్‌ వెట్టుకోవచ్చు. - డా. వి.రరగారావు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌.



  • ======================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.