శ్రీకాకుళం జిల్లా లో సుధీర్ఘమైన సుమారు 198 కి.మీ పొడవుగల సముద్రతీర ప్రాతం ఉన్నది . రణస్థలం మండలం నుండి ఇచ్చాపురం వరకూ విస్తరించి ఉన్న ఈ సువిశాలమైన సముద్రతీరప్రాంతము సుమారు 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఇందులో చేపల వేటపైన ఆధారపడ్డ కుటుంబాలు సుమారు 50,000(యాబై వేలు) వరకు ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్నవారు సుమారు 1% కూడా ఉండరు. వీరిలో కొంతమంది " sea man" లు గా ఓడలపైన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది గుజరాత్ లోని " ఈరావల్లి " ప్రాంతానికి పనులకోసం వలసవెళ్తూ ఉంటారు. అక్కడకుడా చేపల వేట నే పనిగా చేస్తూ ఉంటారు.
శ్రీకాకుళం సముద్రతీరప్రాంతం మత్స్యకారులు నాటు పడవలు , బోటులు , మరపడవలు పైన చేపలవేట చేస్తూ ఉంటారు. ఇక్కడ సుమారు 1000 మరపడవలు వినియోగములో ఉన్నట్లు బోగట్టా.... ఇవన్నీ డీసెల్ పైనే పనిచేసతాయి. యీ మధ్యకాలములో డీసెల్ ధర బాగా పెరగడము వలన గిట్టుబాటు రావడములేదు ... నస్టాలనే చనిచూస్తున్నారు. మత్స్యకార కుటుంబాలలో అధికశాతము నిరక్షరాస్యులే . అరకొర చదువులతో వేట వృత్తిలో స్థిరపడుతున్నారు. కొన్ని సీజన్లలోనే చేపలవేట ఉంటుంది. గాలివానలు ... వర్షాకాలము లోనూ వీరిని పనే ఉండదు.
మత్స్యకార కుటుంబాలలో మూడనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అమ్మోరు అని . . రాజమ్మ , కొత్తమ్మ అని వివిధ పేర్లతో పిలువబడే అమావార్లను మొక్కుతూ , పూజలు , జాతర్లు , పూనకాలు చేస్తారు. ఎక్కువగా మేనరకాలు రూపములో దగ్గరసంబంధీకుల్నే వివాహమాడుతారు. కులపెద్దల కనుసన్నలలో వీరి ఆచార వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి.
- ======================