Showing posts with label Residential Schools in Srikakulam. Show all posts
Showing posts with label Residential Schools in Srikakulam. Show all posts

Sunday, April 18, 2010

శ్రీకాకుళం లో గురుకుల పాటశాలలు , Residential Schools in Srikakulam

గురుకుల విద్యా విధానం ఒక ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ. ఈ విధానంలో విద్యార్థులే గురువు ఆశ్రమానికి లేదా నివాసానికి వచ్చి విద్యను అభ్యసించవలసి ఉంటుంది. గురుకులం అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని సముపార్జించాలి. అభ్యాస సమయంలో గురు శుశ్రూష చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి సకల విద్యల యందూ ప్రావీణ్యం సంపాదించడమే దీని ముఖ్యోద్దేశ్యం.


ప్రతిభ ఉన్న విద్యార్దులకు మంచి విద్యావకాశాలు కల్పించే ఉద్దేశం తో ప్రభుత్వం కొన్ని గురుకుల పాటశాలలను ఏర్పాటు చేసినది .ఐదో తరగతి లో చేరిన విద్యార్ధి పదో తరగతి వరకూ ప్రభుత్వం అందించే సౌకర్యాలతో చదువును కొనసాగించవచ్చును . విద్యార్ధులకు వసతి , భోజనం , నిపుణుల బోధన తదితర సౌకర్యాలు అందుతాయి.


2007-08 ముందు ఏపీ గురుకులం , సాంఘిక సమ్క్షేమ శాఖ , గినిజన సంక్షేమ , ఆశ్రం పాటశాలల ప్రవేశ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించేవారు . అయితే పస్తుతం అన్ని గురుకులాలకు ఒకటే ఉమ్మడి పవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు . మార్కుల ఆధారముగా కావాల్సిన గురుకులం లో విద్యార్ధి ప్రవేశం పొందవచ్చును . పూర్తిగా 4 వ తరగతి సిలబస్ పైనే ప్రవేశ పరీక్ష ఉంటుంది . వంద మార్కుల ప్రవేశ పరీక్షలో తెలుగు భషతో పాటు భౌతిక , సామాన్య , గణిత శాస్త్రాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది .

శ్రీకాకులం జిల్లా లో పాటశాలలు :

  • ఎ.పి.రెసిడెన్సియల్ పాఠశాలకు = 4 ,
  • సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు = 11 ,
  • గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు = 4 ,
  • గిరిజన ఆశ్రమ పాఠశాలలు = 9 ,
ఏపీ గురుకులం పరిధిలో ->
  1. షేర్ మహమ్మద్ పురం ,
  2. అంపోలు బాలుర పాటశాల ,
  3. వమరవెల్లి ,
  4. టెక్కలి బాలికల పాటశాల ,
సాంఘిక సంక్షేమ శాఖ పరిధి లో ->
  1. దుప్పలవలస ,
  2. కొల్లివలస ,
  3. కంచిలి ,
  4. పాలకొండ బాలుర పాటశాల ,
  5. ఎచ్చెర్ల ,
  6. శ్రీకాకుళం ,
  7. నందిగాం ,
  8. భమిని ,
  9. మందస ,
  10. వంగర ,
  11. పాతపట్నం బాలికల పాటశాల ,
గిరిజ సంక్షేమ శాఖ పరిధి లో ->
  1. సీతం పేట బాలికల పాటశాల ,
  2. పెద్దమడి ,
  3. సీతం పేట (బాలుర ) ,
  4. మల్లి బాలుర పాటశాల ,
గిరిజన ఆశ్రమ పాఠశాలలు :
బాలురకు సంభందించి ->
  1. జైపురం ,
  2. దోనుభాయి ,
  3. కిల్లోయి ,
బాలికలకు సంభందించి ->
  1. బండపల్లి ,
  2. హడ్డబంగి,
  3. సీతంపేట ,
  4. పెద్దమడి ,
  5. బుడంబో ,
  6. సవరబొంతు ,పాఠశాలలు ........ ఉన్నాయి .
జిల్లాలోని గురుకుల పాటశాలలు ప్రవేటు సంస్థలకు ధీటుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి . షేర్మహమ్మద్ పురం గురుకుల పాటశాల జిల్లాలొ ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది . అన్ని గురుకుల పాటశాలలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి . ఇంటర్ మీడియట్ స్థాయిలొ గురుకుల జూనియర్ కళాశాలల్లో , ఇందిరాక్రాంతి పధం అందజేస్తున్న కార్పొ రేట్ ఇంటర్మీడియట్ విధ్య ప్రవేశ పరీక్షల్లో ఎక్కువగా ఎంపికవుతున్నది ... ఈ గురుకుల పాటశాలలనుండే .



గురుకుల పాటశాలల్లో భోజనం , వసతి , వి్ధ్యాబోదన , ప్రత్యేక స్టడీ మెటీరియల్ , అన్ని పాఠ్య పుస్తకాలు ఉచితం గా అందజేస్తారు . గిరిగన సంక్షేమ పాఠశాలల్లో చెప్పులు , యునిఫాం , నోట్సు పుస్తకాలు , కాస్మోటిక్ చార్జీలు సైతము ఉచంతం గా ఇస్తారు .

  • ==============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.