- శ్రీకాకుళం జిల్లాలో 42 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి . 36 మాత్రమే పనిచేస్తున్నాయి . సుమారు 7,౦౦౦ (ఏడువేలు ) మగ్గాలు ఉన్నాయి ... వీటిపై 50 వేలమంది ప్రత్యక్షము గాను , మరో 50 వేలమంది పరోక్షముగాను ఆధారపడిజీవిస్తున్నారు . మన రాష్టము లో 748 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి
- నేటి సమాజము లో ప్రపంచమతా మరమగ్గాల తో బట్టలు నేస్తూ ఉంటే ... మన రాస్తాం లో ఇంకా ఉపాదికల్పన అనే పేరుతొ చేతి మగ్గాలతో బట్టలు తయారు చేస్తూ (నేస్తూ) ఉన్నారు . ఇది ఒకవిధము గా అభివృద్ధి ని ఆటంకపరచినట్లేకదా . మిల్లు లో తయారైన వస్త్రాలు మంచి నాణ్యత తో ఉంటాయి ... నిముషాలలో వేల టన్నులు కొద్దీతయారవుతూ ఉంటాయి . చేతితో అలా అవదుకదా . జీవనోపాదికి వేరే మార్గాలు చూపించవచ్చు గాని అభివృద్ధి నిఅడ్డుకోకూడదు ... అని నా అబిప్రాయము .
- మూలము : కలక్టర్ ఆఫీసు - శ్రీకాకుళంస్
చేనేత సహకార సంఘాలు
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు చేనేత సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఫిబ్రవరిలోనే వీటి ఎన్నికలు నిర్వహించాలని చేనేత శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. చేనేత సంఘాల ఎన్నికల తర్వాతే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)ల ఎన్నికలు నిర్వహించాలని కోరింది. రాష్ట్రంలో 1200 చేనేత సహకార సంఘాలుండగా అందులో 388 మూతపడ్డాయి. 812 ప్రస్తుతం నడుస్తున్నాయి. వీటిలో 1.60 లక్షమంది సభ్యులున్నారు. వ్యవసాయ సహకార సంఘాల తర్వాత చేనేత సంఘాలే ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నాయి. చేనేత సంఘాల పాలకమండళ్ల గడువు ఫిబ్రవరి 14తో ముగియనుంది. వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల షెడ్యూలును ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
- =============================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !