2012 డిసెంబరులో రిమ్స్‌లో ఎన్‌ఆర్‌సీఏర్పాటు చేశారు. ఏడాదికి 600 మందికి పైబడి చికిత్స చేయవచ్చు.20 పడకలున్నాyi .
* వయసుకు తగ్గ బరువు లేని పిల్లలును సరైన ఎదుగుదల లేని వారిని గుర్తించి వారిని ఆసుపత్రికి తీసుకు వచ్చిన వారికి డబ్బులిస్తారు.
* అలా నిర్ణీత సమయాల్లో ఎన్నిసార్లు తీసుకువచ్చినా 'నగదు ప్రోత్సాహం' లభిస్తుంది.
* చిన్నారికి సమయం ప్రకారం ఆహారం. అదీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు అందిస్తారు.
* చిన్నారి ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటే అన్ని రోజుల పాటు తల్లికి భోజనం అందిస్తారు. అంతే కాదు నిత్యం వంద రూపాయలు కూడా అందిస్తారు.
* ఇద్దరు వైద్యులు పర్యవేక్షిస్తారు. ఆరోగ్యం మెరుగుపడే వరకూ నిపుణులు దగ్గరుంచి చూసుకుంటారు.
శ్రీకాకుళం జిల్లాలో వందలాది మంది గర్భిణులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పటికే పుట్టిన వేలాది మంది చిన్నారులు తగిన బరువు లేరు. పోషకాహారం అందకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. పేదల బిడ్డలే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిని ఆరోగ్యవంతులుగా చేయటానికి 'న్యూట్రిషన్ రీహేబిలిటేషన్ సెంటర్(ఎన్‌ఆర్‌సీ)'ను రిమ్స్‌లో ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు సమకూర్చుతున్నా సరైన అవగాహన లేక చాలా వినియోగించుకోవటం లేదు.
శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి
జిల్లాలో ఎంతో మంది చిన్నారులు పౌష్టికాహర లోపంతో బాధపడుతున్నారు. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహరం పొందుతున్న వారిలో ఎంతో మంది బలహీనంగా కనిపిస్తుంటారు. చికిత్స చేయించలేని తల్లిదండ్రులు ఉంటారు. 2012 డిసెంబరులో రిమ్స్‌లో ఎన్‌ఆర్‌సీఏర్పాటు చేశారు. ఏడాదికి 600 మందికి పైబడి చికిత్స చేయవచ్చు.
పేరుకు ఎన్‌ఆర్‌సీ కేంద్రం ఉన్నా ఉపయోగించుకుంటున్నది మాత్రం చాలా తక్కువ మంది. ఫలితంగా ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) జనరల్ ఆసుపత్రిలోని చిన్న పిల్లల విభాగంలో ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌సీ కేంద్రాన్ని20 పడకలతో ఏర్పాటు చేశారు. చిన్నారులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేస్తారు. బలహీనతకు కారణాలు గుర్తిస్తారు. అనంతరం ఇన్‌పేషంటుగా చేర్చుకుని 14 నుంచి 30 రోజుల పాటు ఒక పద్ధతి ప్రకారం పాలు, పండ్లు, ఆహారం అందించి వారు బరువు పెరిగేలా చేస్తారు. ఇంతటి చక్కటి కేంద్రం ఉన్నా కేవలం ఇద్దరు, ముగ్గురు తప్పా అక్కడి పడకలు ఖాళీగా ఉంటున్నాయి. జిల్లాలో ఎంతో మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే రిమ్స్‌లో వారికి పూర్తిగా ఉచిత చికిత్స అందించే సౌకర్యం ఉన్నా ప్రజలు వినియోగించుకోవడం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఎన్‌ఆర్‌సీలో చికిత్స పొందుతున్న ఇద్దరు, ముగ్గురు కూడా రిమ్స్ చిన్న పిల్లల విభాగానికి చికిత్సకు రాగా వారిని గుర్తించి ఇక్కడ చేర్పించారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లతో పాటు మధ్యాహ్న భోజన పథకం నిర్వహించే మహిళలు ఈ కేంద్రం గురించి స్థానికులకు తెలియజేయాలి. వీరంతా తమ పరిధిలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారిని రిమ్స్ ఆసుపత్రికి తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులకు వచ్చే వారిని పరిశీలించే వైద్యులు కూడా చిన్నారులను ఎన్‌ఆర్‌సీకి రిఫర్ చేయాలి. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కూడా ఇటువంటి చిన్నారులు ఉంటే వారి తల్లిదండ్రులకు వివరించి ఇందులో చేరేలా చేయాలి.
పారితోషికం ఇస్తారు
చిన్నారులను ఎన్‌ఆర్‌సీకి తీసుకువచ్చే వారిని ప్రోత్సహించేందుకుపారితోషికం కూడా ఇస్తారు. మొదటి సారి తీసుకువచ్చే వారికి ఒక బిడ్డకు రూ.50 వంతున చెల్లిస్తారు. అదే విధంగా డిశ్చార్జి అయిన తరువాత వైద్యుల సూచన మేరకు మూడు సార్లు అనుశీలన(ఫాలోఅప్) చేయాల్సి ఉంటుంది. ఇలా తీసుకు వచ్చిన ప్రతిసారి సంబంధిత వ్యక్తులకు ఒక దఫాకు రూ.25 వంతున మూడు సార్లు తెచ్చినందుకు రూ.75 వంతున చెల్లిస్తారు.
తల్లికి రోజుకు రూ.వంద
ఎన్‌ఆర్‌సీ కేంద్రలో చికిత్స కోసం చేరిన బిడ్డకు 14 నుంచి 30 రోజులు... ఆపై ఎన్ని రోజులు చికిత్స పొందితే అన్ని రోజుల పాటు పౌష్టికాహారం ప్రతి రెండు గంటలకు ఒక సారి బిడ్డ వయస్సు ఆధారంగా అందిస్తారు. పిల్లలను కేంద్రంలో ఆడుకోనిస్తారు. బిడ్డతో ఉండే తల్లికి ఉచిత భోజనం లేదా రూ.50 ఇస్తారు. దీనికి అదనంగా రోజుకి రూ.100 వంతున ఎన్ని రోజులు బిడ్డ చికిత్స పొందితే అన్ని రోజులకు ప్రోత్సాహకాన్ని చెక్కు రూపంలో అందిస్తారు.
మంచి ఆహారం అందిస్తారు
పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులను ఎన్‌ఆర్‌సీకి తీసుకువస్తే తగు పరీక్షలు చేస్తారు. అనారోగ్యం, ఎదుగుదల లేకపోవడం గుర్తిస్తే నిత్యం మంచి ఆహారం అందించి ఆరోగ్యంగా చేస్తాం. ఇద్దరు వైద్యాధికారులు ప్రతి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి.
- డాక్టర్ మణికంఠ చైతన్య, ఎన్‌ఆర్‌సీ మెడికల్ ఆఫీసర్-RIMS srikakulam.
రిమ్స్‌కు నేరుగా రావచ్చు
పౌష్టికాహర లోపంతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను నేరుగా రిమ్స్ ఓపీకి తీసుకువస్తే వారికి తక్షణ వైద్యం అందిస్తాం. న్యూట్రిషియన్ కౌన్సిలర్లు పరిశీలించి ఒ.పి. ద్వారా చిన్నపిల్లల విభాగానికి పంపించి అవసరమైన పరీక్షలు చేయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ఉండే బలహీనమైన చిన్నారులను తక్షణమే ఇన్‌పేషంటుగా చేర్చి ఎన్‌ఆర్‌సీకి పంపించి చికిత్స అందజేసి పంపిస్తారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు బాధ్యతగా వ్యహరిస్తే ఎంతోmandhi బాలలను ఆరోగ్యంగా చేయవచ్చు.
- డాక్టర్ తెన్నేటి జయరాజు, డైరెక్టర్, రిమ్స్-Srikakulam.
- ==================================
Visit my Website >
Dr.Seshagirirao - MBBS.