Tuesday, January 27, 2015

Drinking water Taps in srikakulam Town-శ్రీకాకుళం పట్టణం లో మంచినీటి కుళాయిలు



 2015 -01-28 నాటికి శ్రీకాకుళం లో వ్యక్తిగత మంచినీటి కుళాయిలు ,హోటల్స్ , బేకరీలు , హాస్పిటల్స్ , వాణిజ్య భవనాలు  అన్నీ కలిపి మొత్తం 12,301 మంచినీటీ కుళాయిలు ఉన్నాయి.

as on Thursday, March 25, 2010

శ్రీకాకుళం పట్టణము :
36 వార్డులు , లక్షా 27 వేల జనాభా ఉన్న శ్రీకాకుళం టౌన్‌ లో ఒక సెంట్రల్ రిజర్వాయర్ , 9 సర్వీస్ రిజర్వాయర్లు , 3 పంపింగ్ స్టేషన్లు , 285 వరకు బోర్ల ద్వారా పస్తుతము తాగునీటి సరఫరా చేస్తున్నారు . 8950 ఇంటి కుళాయి కనెక్షన్లు , 412 పబ్లిక్ కుళాయిలు , ద్వారా రోజుకు 10.50 మిలియన్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు . ఈ లెక్కన ఒక్కో పౌరుడుకి 90 లీటర్ల నీటిని ఇస్తున్నందునట్లు అధికార గణాంకాలు చూ్సిస్తున్నాయి . కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా తాగునీటిని సరఫరా అవుతుంది . నాగావళి నది నీటిని క్లోరినేషన్‌ చేసి సరఫరా అవుతుంది .

కొన్ని నిజాలు :

    శ్రీకాకుళం లో సుమారు 22 ఏళ్ళ క్రితం వేసిన గొట్టాల ద్వారానె నేటికి నీరు సరఫరా చేస్తున్నారు . కొన్ని చోట్ల నీటి గొట్టాలు తృప్పు పట్టి రంద్రాలు ఏర్పడి కొన్ని చోట్ల మురుగు కాలవల నీటితో కలుసితమవుతున్నాయి.
    పైపుల లీకుల మూలాన నీటిలో బ్యాక్టీరియా , ఇతరత్రా విషపదార్దాలు నేరుగా కలిసిపోతున్నాయి.
    ఏడాది రూ. 75 లక్షల వరకూ ఆదాయము వస్తున్నా నీటి గొట్టాలు మార్చడం కాని , రిపేరు చేయడం గాని , అధికారుల , నాయకుల పర్యవేక్షణ లేదు.
    చాలా కుళాయిలము డైరెక్ట్ గా మోటార్లు పెట్టి నీటిని తోడేయడం వలన ఎత్తు ప్రాంతాలకు నీరు అందడం లేదు . హొటల్లు, లాడ్జీలు, ఆపార్ట్మెంట్లు, పెద్దపెద్ద హాస్పిటల్ ఈ మోటార్ల ద్వారా తమ నీటి అవసరాలు తీర్చుకుంటున్నాయి. వీరికి తగిన శిక్షలు వేయాలి . లంచాలకు అలవాటైన ఉద్యోగులు ఈ విషయాన్ని చూసి చూడనట్లు కాలం వెళ్ళబుచ్చుతున్నారు .
    పేద , ధనిక అనే తారతమ్యము లేకుండా కుళాయిలన్నింటికీ మీటర్లు పెట్టి నీటి వాడకం బట్టి రుసుము వసూలు చేయాలి . నాయకులు ఓటు బ్యాంక్ కోసం ఆ పని చేయడం లేదు .

    శ్రీకాకుళం జనాభా ------------------లక్షా 27 వేలు ,
    మొత్తము వార్డులు -----------------36 ,
    కుళాయి కనెక్షన్లు ------------------8950,
    పబ్లిక్ కుళాయిలు ------------------412 ,
    పట్టణములో పైపులైన్ల పొడవు ------110 కి.మీ.,
    రోజుకు ఒక్కక్కరికి అవసరమైననీరు -100 లీ.
    సరఫరా అవుతున్న నీరు -----------90 లీ.



  • ================================== 
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !