శ్రీకాకుళం జిల్లాలో 63 ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ఇంజినీరు ఎం.సమ్మయ్య చెప్పారు. చల్లవానిపేట సబ్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా వాతావరణంలో మార్పులు, వర్షం నమోదు, ఉష్ణోగ్రత, గాలివేగం, దిశ, తదితర విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఇందులో ఉన్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ కేంద్రంలో విషయాలు వెంటనే హైదరాబాద్ తెలుస్తాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1224 కేంద్రాలు ఉన్నాయన్నారు. నదీతీర ప్రాంతాల్లోని కేంద్రాల ద్వారా నదుల్లో నీటి ప్రవాహం గురించి తెలుస్తుందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో..... 2015 సంవ్వత్సరములో ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాలు......
- హిరమండలం,
- గార,
- బూరవెల్లి,
- అరకబద్ర,
- బాతుపురం,
- తమ్మినాయుడుపేట,
- కొరసవాడ,
- నేతేరు,
- నారువ,
- బొడ్డబోడ
వద్ద కేంద్రాలు ఏర్పాటు చేసారు .
- ==================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !