Tuesday, July 29, 2014

పిల్లల ఆరోగ్య పునరుజ్జీవ కేంద్రాలు (శ్రీకాకుళం జిల్లా),అక్షయ పునరుజ్జీవ కేంద్రాలు (శ్రీకాకుళం జిల్లా)

  •  

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏరియా ఆసుపత్రుల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. శ్రీకాకుళం రిమ్స్ లో ఏర్పాటు కానున్నాయి.‌,  . రాష్ట్రంలో చిన్నారుల కోసం ‘అక్షయ’ పేరుతో ఆరోగ్య పునరుజ్జీవ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. పోషకాహార లోపంతో బాధపడుతూ అనారోగ్యానికి గురవుతున్న బాలల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ నడుంబిగించింది. ప్రతి వందమందిలో దాదాపు 6శాతం మంది వరకు 5 సంవత్సరాల లోపు చిన్నారులు తీవ్రమైన పోషకాహారలోపంతో బాధపడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువమంది గిరిజన బాలలు పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో 30 పిల్లల ఆరోగ్య పునరుజ్జీవ కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించనున్నారు. గిరిజన ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసు పత్రుల్లో 10 పడకలలో 7 కేంద్రా లను నిర్వహించనున్నారు. అలాగే ఒక్కొ క్కటి రూ.7లక్షల వ్యయంతో 20 పడకల సౌకర్యంతో 13 ప్రభుత్వ బోధనాసుపత్రు ల్లోనూ వీటిని నెలకొల్ప నున్నారు. ఒక్కొ క్కటి రూ.4.70లక్షలతో 10 పడకలతో జిల్లా ఆసు పత్రుల్లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు.

అక్షయ పునరుజ్జీవ కేంద్రాలు ఇవే.
విశాఖపట్నం జిల్లా పాడేరు, తూర్పు గోదా వరి జిల్లా రంపచోడవరం, ఖమ్మం జిల్లా భద్రా చలం, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు, కర్నూలు జిల్లా శ్రీశైలం, విజయనగరం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏరియా ఆసుపత్రుల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. శ్రీకాకుళం రిమ్స్‌, విశాఖ పట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కడప రిమ్స్‌, కర్నూలు, వరంగల్‌, ఆదిలాబాద్‌ రిమ్స్‌, హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలలో కూడా అక్షయ ఆరోగ్య పునరుజ్జీవ కేంద్రాలను నెలకొల్పుతారు. విజయనగరం, ఏలూరు, నెల్లూరు, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, తాండూరు, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మంలలో కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

రాష్ట్రంలో వీటి నిర్వహణ ఇలా
ఈ కేంద్రాలలో పోషకాహార లోపంతో పాటుగా ఇతర వ్యాధులకు చికిత్సలను అందిస్తారు. సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసి మానసిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తారు. 20 పడకల కేంద్రానికి 3.5లక్షలు, 10 పడకల కేంద్రానికి రూ.1.40లక్షలను పరికరాల కోసం వినియోగిస్తున్నారు. ఈ కేంద్రాలలో ఒక వైద్యాధికారి, స్టాఫ్‌ నర్సులు, న్యూట్రిషనిస్ట్‌లు పనిచేస్తారు. ఆరోగ్య పునరుజ్జీవ కేంద్రాల నుంచి ఇంటికి పంపిన తరువాత వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌ వాడీ సిబ్బంది క్రమం తప్పకుండా వారి ఎదుగుదలను గమనిస్తుంటారు.

చిన్నారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం
DSCరాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కుటుంబ సంక్షేమ శాఖ పనిచేస్తోందని ఆ శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ 30 అక్షయ ఆరోగ్య కేంద్రాలు సమర్ధవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతా ల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, పట్టణ వాడలలో మహిళా ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచరు, ఆశా వర్కర్లు అంగన్‌వాడీ కేంద్రా లలో క్రమం తప్పకుండా బరువు తూస్తూ పెరుగుదలను గమనిస్తూ పోషకా హార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తిస్తారని చెప్పారు. ప్రభుత్వ వైద్యు లు ఈ చిన్నారులు ఇతర వ్యాధులకు గురైన ట్లయితే ఈ కేంద్రాలకు రిఫర్‌ చేస్తారని అన్నారు. ఈ చిన్నారులను ఆసు పత్రులకు రిఫర్‌ చేసినందుకు ఆరోగ్య కార్యకర్త, ఆశ కార్యకర్తకు రూ.50 పారితోషకం అంది స్తారని తెలిపారు. ఆసుపత్రిలో పాపతో పాటుగా ఉన్న తల్లులకు రోజువారీ భత్యం రూ.100 భోజన నిమిత్తం, భోజన నిమిత్తం రూ.50 ప్రతి రోజూ ఇవ్వనున్నట్లు వెల్లడిం చారు. రవాణా ఖర్చులకు అదనంగా మరో రూ.200 ఇస్తారని తెలిపారు.

--హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : Monday, June 02, 2014.

అభిప్రాయము : ఆసుపత్రులు రోగాలను నయము చేయడానికే పరిమితమైతే అవి సమర్ధవంతముగా పనిచేయడానికి ఆస్కారముంటుంది. వాటిని భోజన శాలలుగా మార్చడము ఎంతమాత్రము మంచిదికాదు. హాస్పిటల్స్ మూల ధర్మాన్ని మరిచి నాసిరక్ము వైద్యము అందే అవకాశానికి దారితీయును. పౌ్స్టికాహార లోపాలకు వేరే కేంద్రాల ద్వారా తగిన పద్దతితో పని ప్రారంభించి తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఒకేదగ్గర అన్నీ ఉన్నచో దేనికీ సరియైన న్యాయము జరుగక పోవచ్చును. ప్రజలు కూడా ఆసుపత్రులంటే రోగాలు నయముచేసుకొనేందుకే ఆలోసిస్తారు కాని తిండికోసము రారు. . . అలా వచ్చినవారు నకిలీరోగాలతో హాస్పిటల్ లో జాయిన్‌ అవుతారు. . . దానికి తోడు రాజకీయ ప్రమేయమూ ఉంటుంది. . . దొడ్డిదారిన నిధులు మింగే వారు ఎక్కువైపోతారు. ఇటువంటి నాసిరకము ఆలోచనలు IAS ఆఫీషర్స్ కి రానేకూడదు.
-- డా.శేషగిరిరావు వండాన(శ్రీకాకుళం ).

  • =============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !