జిల్లాలో జాతీయ రహదారి : 196 కిమీ
పంచాయితీరాజ్ రహదారులు: 4,200 కిమీ
ఆర్ అండ్ భవనాలు పరిధిలో: 2,450 కిమీ
గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో 220 గ్రామాలకు రహదారులు లేవు .
జిల్లాలో ఒకే ఒక రైలు మార్గం 160కిలోమీటర్ల మేరా ఉంది. 24 రైల్యేస్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం సంతబొమ్మాళి మండలం నౌపాడ నుంచి ఒరిస్సాలోని గుణుపూర్ వరకు మరో రైలుమార్గం నిర్మిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 479 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, టెక్కలి, పలాస, పాలకొండలో బస్‌డిపోలు ఉన్నాయి. రెండు లక్షల కిలోమీటర్లు మేరా బస్సులు నడుస్తున్నాయి. రోజుకు రూ.25 లక్షల ఆదాయం లభిస్తోంది. మొత్తం 1880 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో 1550 రెవెన్యూ గ్రామాలకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. జిల్లాలో 194 కి.మీ మేర సముద్రతీరం ఉన్నా జలమార్గం జరగడం లేదు. నాగావళి, వంశధార నదులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో నాటుపడవలు మీద ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు.
- ====================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !