ఉద్దానం అంటే ముందుగా గుర్తుకొచ్చేది కొబ్బరి తోటలు.. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా లేని విధంగా 90 శాతం విస్తీర్ణాన్ని ఇవే ఆక్రమించాయి. . జిల్లాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉపయోగపడుతున్న తోటలు చీడపీడలతో కుదేలవుతున్నాయి. ఉత్తరాంధ్రాలో 2 లక్షల మందికిపైగా రైతులు కొబ్బరే జీవనాధారంగా బతుకులీడుస్తున్నారు.. . బారువ లోకొబ్బరి నారుమడి ఉన్నది. జిల్లాలో 52 వేల ఎకరాలకుపైగా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో 25 వేల ఎకరాల వరకు సాగవుతున్నాయి.
పరిశోధనా కేంద్రం వస్తే - కొబ్బరికి సంబంధించిన చీడపీడలు.. అధిక దిగుబడులపై పరిశోధిస్తారు.. రైతులకు కావాల్సిన విలువైన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తారు. నీటి తడులు మొదలుకొని ఎరువుల యాజమాన్యంతోపాటు ప్రతివిషయంలోనూ వారి భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపడతారు
* ఉద్దానంలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తే కొబ్బరి రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది.
* ప్రస్తుతం అంబాజీపేటలో మాత్రమే ఏకైక కేంద్రం ఉంది. ఇది కేవలం గోదావరి జిల్లాలకే పరిమితమవుతుంది.
* ఎకరా తోటలో 1200 వరకు కాయలు దిగుబడి రావల్సి ఉండగా 300 కూడా రావడంలేదు.
* కె.కొత్తూరులో కొబ్బరి పరిశీలన-పరిశోధన క్షేత్రాన్ని గతంలో ఏర్పాటు చేశారు. అది కొద్దిరోజులకే మూతపడింది.,
* గాలి ద్వారా వ్యాపించిన ఎర్రనల్లి (ఇరియోఫైడ్ నల్లి) విస్తరిస్తుండడంతో దిగుబడి, పరిమాణం, నాణ్యతపై తీవ్ర ప్రభావం పడింది. నల్లముట్టే, ఎర్రముక్కు, కొమ్ము, తెల్లలద్దె, చెద తదితర పురుగులతోపాటు గ్యానోడెర్మా, ఆకుతేలు తెగుళ్లు భారీస్థాయిలో తోటలను ఆశించాయి. అంచెలంచెలుగా పురుగులు తోటలపై ఆధిపత్యం చెలాయించి నాశనం చేస్తున్నాయి. వీటి నివారణ కోసం రైతులకు కనీసస్థాయిలో కూడా సూచనలు అందించడంలేదు.
శ్రీకాకుళం లో కొబ్బరి తోటలు :
* కవిటి మండలం బల్లిపుట్టుగకు చెందిన బి.మృత్యుంజయరావు 40 ఎకరాల కొబ్బరి తోట,
* సోంపేట మండలం గొల్లగండికి చెందిన నాగం భాస్కరరావు 25 ఎకరాల కొబ్బరి తోట,
* కంచిలి మండలం పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన మాదిన రామారావు 10 ఎకరాల తోట,
* మందస మండలం గంగువాడకు చెందిన కృష్ణారావు కుటుంబ సభ్యులు ఐదు ఎకరాల కొబ్బరి తోట,
* మండపల్లికి చెందిన మాదిన రాఘవులు ఆరు ఎకరాల తోట,
* ఆముదాలపుట్టుగకు చెందిన శ్రీధర్ 10 ఎకరాల తోట,
* కుత్తుమ గ్రామానికి చెందిన గొండేల సత్యనారాయణ ఐదెకరాల తోట,
పరిశోధన కేంద్రం వస్తే..
ఉద్దానంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దీంతో కొబ్బరితోపాటు ఇతర ఉద్యాన పంటలకూ మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఏటా ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అవకాశం ఉండడంతో తోటల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు, వివిధ పంటలకు చెందిన నిపుణులు, ఉన్నతస్థాయి అధికారులు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ నెలకొన్న సమస్యలకు తక్షణ పరిష్కారం లభించడమే కాకుండా ప్రభుత్వానికి సమస్య తీవ్రత వెంటనే తెలిసే అవకాశం ఉంటుంది. చీడపీడలు, తెగుళ్లు ఆశించిన తోటలలో ప్రత్యేక క్షేత్రాలు ఏర్పాటుచేసి వాటి నివారణకు చర్యలు తీసుకోవచ్చు. కొబ్బరి అభివృద్ధి బోర్డు, ఉద్యానశాఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు రైతులకు నేరుగా అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
Courtesy with : న్యూస్‌టుడే, సోంపేట, కవిటి
- =======================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !