Monday, November 9, 2009

Picnic Spots & Tourist Places in Srikakulam District.

  •  
  •  

There are many Picnic Spots and Tourist places in Srikakulam dist.

Some Notable places are mentioned here >

ఇంటిపనులలో కొందరు , ఆఫీషు పనులలో కొందరు ప్రతి నిత్యము పని వత్తిడితో బంధు మిత్రులతో కాసేపైనా సరదా కబుర్లు చెప్పుకునేందుకు టైం లేదనుకునేవారికి కొంతలో కొంతైనా కార్తీకమాసము లో పిక్నిక్ లవలన వీలుకలుగుతుంది . నేటి సమాజములో వనబోజనాలు (పిక్నిక్లు) సాధారణమయిపోయాయి . మనిషి ఆరోగ్యానికి మానసిక ఉల్లాసము ఎంతో అవసరము . కుటుంబ సమేతముగా సముద్రతీరానికి , కొన్ని ముఖ్యమైన ఆహ్లాదకరమైన ప్రదేశాలకు ప్రతి ఆదివారము , మధ్యలో పబ్లిక్ హాలిడె అయితే ఆరోజుల్లోనూ వెళ్తూఉంటాఅరు . శ్రీకాకుళం జిల్లాకి సుమారు 198 కి.మీ. సముద్రతీరప్రాంతము ఉన్నది . అదికాకుండా ఈ క్రిందను పేర్కొన్న ప్రదేశాలు పిక్నిక్ స్పాట్స్ గా మంచి పేరుగాంచినవి .

శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఉన్న పిక్నిక్ ప్రదేశాలు : (In the Srikakulam District)
  1. Gundahathi Water falls near Palasa.
  2. Pathapatnam as picnic spot
  3. Icchapuram as picnic /tourist spot
  4. Madeenasaheb baba Dargah --kalingapatnam
  5. Mahendragiri Hills
  6. Kaviti ,
  7. Tarlakota ,
  8. Telineelapuram Bird Sanctuary,
  9. Surangiraja palace - ichapuram,
  10. Sangam ,
  11. Ponduru Khadi,
  12. Korasavada ,
  13. Rajam ,
  14. Mandasa fort,
  15. Budithi Handicrafts ,
  16. Gottabarage -45 km from srikakulam town,
  17. Madduvalasa Reservoier
  18. Baruva beach & picnic spots / temples
  19. Bhavanapadu harbor beach 



శ్రీకాకుళం పట్టణము నకు దరిదాపులో ఉన్న పిక్నిక్ ప్రదేశాలు (Near Srikakulam Town) :

  1. Arasavilli Suryanarayana Swamy temple at Srikakulam Town.
  2. Srikurmanadha swamy Temple at Srikurmaam village.
  3. kalingapatnam beech
  4. Salihundam Buddha stupa area
  5. vijayaditya park,
  6. Arasavilli surya temple area,
  7. Manguvari thota
  8. Ragolu thota ,
  9. kotta bridge thota ,
  10. kallepalli beech ,
  11. Mogadalpadu beech ,
  12. Madina Saheb baba Dargah at Kalingapatnam
  13. Telineelapuram saiberia bird sanctuary ,
  14. Madduvalasa praject ,
  15. Triveni Sangamam ,
-------------------------------------------------------------
ఫిక్నిక్ (వనభోజనాలు) అంటే ! ............
కార్తీక మాసం లో ఇంటికి దూరంగా ప్రశాంతంగా ఉన్న తోటలు , జలపాతాలు, దేవాలయాలు ఉన్న ప్రాంతానికి వెళ్లి తోటల్లోనే శాఖాహర భోజనం తయారుచేస్తూ ఆనందంగా పిల్లా పాపలతో సహా పంక్తి భోజనాలు చేసి ఉల్లాసముగా గడపడమే పిక్నిక్ అంటాము .
వనభోజనాల ఉద్దేశం :
కలసి వెళ్తాం. కలసి కబుర్లు చెప్పుకుంటాం. కలసి వండుకుంటాం. కలసి భోంచేస్తాం. ఒకరి ఆకలి ఒకరికి అర్థమవుతుంది. ఒకరి ఇష్టాలు ఒకరికి తెలిసిపోతాయి. కలసిమెలసి ఉండటంలోని ఆనందం అనుభవంలోకి వస్తుంది. 'మనం' అన్న భావన పెంపొందించడమే వనభోజనాల ఉద్దేశం.

ప్రకృతికి అతిథి మర్యాదలు బాగా తెలుసు. అందులోనూ కార్తీకం వచ్చిందంటే చాలు, 'పిల్లలొస్తున్నారు...పిల్లలొస్తున్నారు' అంటూ తెగ హడావిడి చేసేస్తుంది. ఆకాశానికి వెల్లవేయిస్తుంది. వానచినుకులతో నేలంతా కడిగేస్తుంది. పచ్చగడ్డి తివాసీ పరుస్తుంది. తంగేడు పూలతో సింగారాలు చేస్తుంది. సీతాకోకచిలుకలైతే, పిల్లపేరంటాల్లా ఒకటే సందడిచేస్తుంటాయి. చెట్టు మీదున్న పిట్టలు, చుట్టాలొచ్చారేవో అని ఆశగా తొంగి చూస్తుంటాయి.

ప్రకృతి, మనిషి...తల్లీబిడ్డ.
మనిషి అవసరాలూ అవకాశాలూ పెరిగాక, కరవులూ కష్టాలూ వెుదలయ్యాక వలసలు తప్పలేదు. పొలిమేరలు దాటాడు. సరిహద్దులు దాటాడు. సముద్రాలు ఈదాడు. బతుకు పరుగులో పడి ఎక్కడ తన మూలాల్ని మరచిపోతాడో అన్న భయంతో పెద్దలు ఓ మాట తీసుకున్నారు. ఏడాదికి ఒక్కసారైనా తన చెట్టునూ చేమనూ మట్టినీ పుట్టనూ తనివితీరా చూసుకోవాలని నిబంధన పెట్టారు. మనిషి బుద్ధి వంకర. తిన్నగా చెబితే ఏదీ అర్థంకాదు. అర్థమైనా పట్టించుకోడు. అందుకే, దేవుణ్ని ఇరికించారు. పుణ్యాల ఆశపెట్టారు. పాపాల బూచిచూపించారు. అందమైన కథలల్లారు. కార్తీకం, ఉసిరిచెట్టు, వనభోజనం... ఆ కథలోని పాత్రలే!అందుకేనేవో మన పెద్దలు ఏరికోరి కార్తీకంలోనే వనభోజనాలు ఏర్పాటు చేశారు. చప్పట్లకైనా ముచ్చట్లకైనా ఇలాంటి హుషారైన నేపథ్యమే ఉండాలి.

* * *పరిధి * * *
వనభోజనాల పరిధి విస్తృతం అవుతోంది. బంధుమిత్రులకే పరిమితమైన కార్యక్రమం కాస్తా, 'మెగా ఈవెంట్‌'గా మారుతోంది. కాలనీ అసోసియేషన్లు, అపార్టుమెంటు సంఘాలు, కుల సంఘాలు, కార్పొరేట్‌ కంపెనీలు, పూర్వ విద్యార్థుల సంఘాలు, ఫలానా జిల్లా నుంచో ఫలానా గ్రామం నుంచో నగరానికి వలస వచ్చిన కుటుంబాలు...ఇలా ఎవరికివారు వనభోజనాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌... ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు కార్తీకమాసంలో ఓ వారాంతాన్ని వనభోజనాలకు కేటాయిస్తున్నారు. అక్కడ, పాతస్నేహాలు ప్రగాఢమవుతాయి. కొత్త స్నేహాలకు పునాదులు పడతాయి. పొద్దున్నే బిడియంగా మొదలైన పరిచయం... మధ్యాహ్నం ఆటపాటల్లో మరింత బలపడి, సాయంత్రం వీడ్కోలు నాటికి ఫ్రెండ్‌షిప్‌గా మారిపోతుంది. 'ఎ లాట్‌ కెన్‌ హ్యాపెన్‌ ఓవర్‌ ఎ కాఫీ' అన్న 'కాఫీ డే' క్యాప్షను వనభోజనాలకూ వర్తిస్తుంది. మన ప్రపంచాన్ని విస్తరించుకోడానికి ఇదో మంచి వేదిక.
  • courtesy : Eenadu paper
* * *వనభోజనాల ఉద్దేశం* * *
కార్తీకమాసంలో...పవిత్ర వనాలకెళ్లి, ఉసిరిచెట్టు కింద సాలగ్రామానికి పూజచేసి, వనభోజనాలు చేయాలన్నది శాస్త్రం. భోజనాలవేళ... అన్నపూర్ణాదేవి శివుడికీ వ్యాసుడికీ వడ్డించిన విందునూ ,శబరి శ్రీరాముడికిచ్చిన ఆతిథ్యాన్నీ ,కృష్ణకుచేలుల స్నేహాన్నీ, విదురుడు శ్రీకృష్ణుడికి చేసిన మర్యాదల్నీ గుర్తుచేసుకోవాలంటారు.
కుచేలుడు నిరుపేద. కృష్ణుడు లక్ష్మీపతి.శబరి గిరిజన మహిళ. రాముడు అయోధ్య సార్వభౌముడు.కానీ ఎవరూ ఆ తేడాలు పట్టించుకోలేదు. సంకుచితంగా ఆలోచించలేదు. మన భావాలూ అంత విశాలంగా ఉండాలన్నది పెద్దల ఉద్దేశం. తీరిగ్గా ఉన్నప్పుడైనా కాస్త తలకెక్కించుకుంటామన్న ఆలోచనతో వనభోజనాల్లో ఈ కథల్ని ఇమిడ్చారు.

వైద్యపరంగానూ వనభోజనాలకు ప్రత్యేకత ఉంది. ఇసుమంతైనా కాలుష్యంలేని పచ్చదనంలో..ఆయుర్వేద వనమూలికల సువాసనల్నీ పవిత్రవృక్షాల ఔషధగుణాల్నీ మోసుకొచ్చే ఆ స్వచ్ఛమైన గాలి బోలెడంత ఆరోగ్యాన్నిస్తుంది. ఇక ఉసిరి గురించి చెప్పేదేముంది. విటమిన్‌-సి పుష్కలం. ఆ చెట్టునీడలో భోజనమంటే...ఇంకెంత ఆరోగ్యం! ఉదయం నుంచి సాయంత్రం దాకా మన ఒంటిమీద ప్రసరించే సూర్యకిరణాలు విటమిన్‌-డిని అందిస్తాయి. ఆటాపాటా ఎంతోకొంత కొవ్వును కరిగిస్తాయి. ఓ రోజంతా మహానగర కాలుష్యానికి దూరంగా ఉండటమంటే, శ్వాసకోశ వ్యవస్థకు, కాస్తంత పనిభారం తగ్గించినట్టే.

* * *భోజనాలు * * *
'మనుచరిత్ర'లో ప్రవరాఖ్యుడి భార్య వండివార్చడంలో దిట్ట. అతిథి అభ్యాగతసేవలో తెలుగుమహిళలు ఆమెకు సరిసాటి. ఆ గాజుల చేతులు కొసరికొసరి వడ్డిస్తుంటే, అతిథులంతా ఆనందంగా విందారగిస్తారు. వడ్డించి వడ్డించి అలసిపోయిన గృహిణులకు మాత్రం, చివరిపంక్తిలో పచ్చడి మెతుకులే మిగులుతాయి. వంటలు బావున్నాయన్న ప్రశంసతోనే ఆ తల్లుల కడుపు నిండిపోతుంది. వచ్చే కార్తీకం దాకా...ఎక్కడ భోజనాల ప్రస్తావన వచ్చినా, ఆ రుచుల్ని మెచ్చుకోవాల్సిందే!

రోజూ వండే వంటలే, రోజూ తినే భోజనమే... ఆ రోజే ఎందుకంత రుచి! ఆఫీసుల హడావిడి ఉండదు. పిల్లల్ని స్కూళ్లకు పంపాలన్న తొందరుండదు. ఎవరికీ డైటింగులు గుర్తుకురావు. బీపీలూ షుగర్లూ కాసేపు విశ్రాంతి తీసుకుంటాయి. చుట్టూ పచ్చదనం. అరిటాకు భోజనం. నోరూరించే రుచులు. వనదేవత అదృశ్యరూపంలో వచ్చి ఆ వంటల్లో చిటికెడు అమృతాన్ని చిలకరిస్తుందేవో! అందుకే ఆ కమ్మదనం. వనభోజనాలు కూడా ఓ ఈవెంట్‌లా మారిపోయి, క్యాటరింగ్‌ సంస్థలు రంగప్రవేశం చేశాక...అచ్చంగా హోటల్‌కెళ్లి తినిరావడమే అయిపోతోంది కానీ, లేకపోతే ఎంత హంగామా, ఎంత సంతృప్తి! ఇప్పటికీ చాలామంది సొంత వంటలకే ప్రాధాన్యం ఇస్తారు. ఉప్పూకారం ఎవరైనా వేయగలరు, ఆత్మీయత రంగరించడం అందరికీ కుదరదుగా!
కలసి ఉద్యోగాలు చేస్తాం. కలసి వ్యాపారాలు చేస్తాం. కలసి ప్రయాణాలు చేస్తాం. ఎన్ని కలసినా, కలసి భోంచేసినప్పుడే మనసులు కలిసేది. సహపంక్తికి ఆ మహత్తు ఉంది. చాలా కార్పొరేట్‌ కంపెనీలు బోర్డ్‌రూమ్‌ మీటింగులను డైనింగ్‌హాళ్లకు మారుస్తున్నాయి. డైరెక్టర్లూ మేనేజింగ్‌ డైరెక్టర్లూ లాప్‌టాప్‌లు పక్కనపడేసి, చెంచాలూ ఫోర్కులూ అందుకుంటున్నారు. కడుపునిండా భోంచేస్తూ వ్యాపార లక్ష్యాల గురించి చర్చించుకుంటున్నారు. పళ్లెం ముందు కూర్చోగానే మనిషి సాధ్యమైనంత నిజాయతీగా ఉంటాడు. మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. కలసి భోంచేయడం ద్వారా అనుబంధాలు బలపడతాయని మానసిక నిపుణులు కూడా నిర్ధారిస్తున్నారు. ఏ సంస్థ విజయానికైనా కావలసింది ఆ రెండే.. ఉద్యోగుల మధ్య సమన్వయం, నిజాయతీ! ఈ సూత్రాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రమే పరిమితం చేయలేం. పెద్ద కుటుంబం, అపార్ట్‌మెంట్‌, కాలనీ...దేనికైనా వర్తిస్తుంది. కార్తీక వనభోజనాలు...ఆ 'అనుబంధాల మేళా'కు వేదికగా నిలుస్తాయి.

* * *జాగ్రత్తలు* * *

'మనం ఇబ్బందిపడకూడదు. ఇతరుల్నీ ఇబ్బందిపెట్టకూడదు'... వనభోజనాలే కాదు, విందులకూ వినోదాలకూ వెళ్తున్న ప్రతిసారీ గుర్తుంచుకోవాల్సిన విషయమిది. ఆ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.

పిల్లలు జాగ్రత్త!
కబుర్లలోపడి, పిల్లల్ని వదిలేయకండి. అసలే అడవి. పురుగూపుట్రా తిరుగుతుంటాయి. నదీతీరాల్లో సముద్రతీరాల్లో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్దల పర్యవేక్షణ లేకుండా ఈత కొట్టడానికీ చెట్లెక్కి కాయలు తెంచుకోడానికీ అనుమతించకూడదు. ఏటా ఎక్కడో ఓచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

నిదానంగా భోంచేయండి
పంక్తిలో పాటించాల్సిన కనీస మర్యాదల గురించి ముందే పిల్లలకు చెప్పాలి. పెద్దలూ కచ్చితంగా పాటించాలి. నలుగురితో కూర్చుని నలుగురితో లేవడం, పక్కన ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా భోంచేయడం, మన ప్లేటు మనమే తీసుకెళ్లి చెత్తబుట్టలో వేయడం...ఇవన్నీ భోజన మర్యాదల్లో భాగమే. బఫే తరహా విందులైతే, తినగలిగినంత మాత్రమే వడ్డించుకోవాలి. వృథా మంచిదికాదు.

పరిసరాలు శుభ్రంగా
పచ్చగా పరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని సాయంత్రానికల్లా చెత్తబుట్టలా మార్చేస్తాం. పాలిథిన్‌ సంచులు, కూల్‌డ్రింక్‌ సీసాలు, ఎంగిలి విస్తళ్లు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు... అదంతా చూసి మనకే అసహ్యంగా అనిపిస్తుంది. ఆ పరిస్థితి రానివ్వకండి. బయల్దేరే ముందే నిర్వాహకులు అవసరమైన సూచనలు చేస్తే సరిపోతుంది. తిరిగి వెళ్తున్నప్పుడు తలోచేయీ వేసి...వ్యర్థాల్ని తొలగించాలి. అది మనందరి బాధ్యత.

దొంగలున్నారు జాగ్రత్త!
ఇలాంటి కార్యక్రమాలకు మహిళామణులు నగానట్రా వేసుకుని వస్తారు. ఆత్మీయుల్ని కలుసుకున్న ఆనందంలో తమనుతాము మరచిపోతారు. మగవాళ్లేవో పేకాట వోజులోపడి, సెల్‌ఫోన్లు పక్కనపడేస్తారు. పర్సుల మీద ధ్యాసే ఉండదు. ఇంకేముంది, చిల్లరదొంగలకు చేతినిండా పని. ఎవర్నీ అనుమానించలేం. మన జాగ్రత్తలో మనం ఉండాలి.

ఆధ్యాత్మికం :
చన్నీటి స్నానాలూ ఉపవాసాలూ వ్రతాలూ దీపాలూ దానాలూ...కార్తీకంలో ఇంటింటా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో సంచరిస్తుంటాడు. తొలిపొద్దు కిరణాలు...జలాశయాల మీద ప్రసరిస్తూ ఉంటాయి. ఆ నీటిని హంసోదకం అన్నారు. అందులో మునిగితే కోటితీర్థాల ఫలమని పెద్దలు చెబుతారు. కార్తీకంలో దేవుడికి దీపారాధన చేస్తే వైకుంఠ ప్రాప్తికలుగుతుందని పురాణాలు ఘోషిస్తాయి. అందుకే, కార్తీక దీపాలకు అంత ప్రాధాన్యం. శివకేశవులిద్దరికీ ఇష్టమైన నెల ఇది. విష్ణువును తులసితో, శివుడిని మారేడు దళాలతో పూజించాలంటారు. కార్తీకశుద్ధ విదియ రోజు సోదరి చేతివంట తినడం ఆచారం. 'నాగుల చవితి', 'ఉత్థాన ఏకాదశి', 'క్షీరాబ్ది ద్వాదశి', 'వైకుంఠ చతుర్దశి', 'కార్తీక పౌర్ణమి'...కార్తీకమాసమంతా రోజూ ఏదో ఓ పండగే.
ఇక వనభోజనాల గురించి చెప్పేదేముంది!


  • =====================================
Visit my Website > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !