Showing posts with label Costal development in Srikakulam dist. Show all posts
Showing posts with label Costal development in Srikakulam dist. Show all posts

Thursday, June 11, 2015

Costal development in Srikakulam dist,శ్రీకాకులం లో సాగరతీర సంపద







రాష్ట్రము లోనే అత్యధిక విస్తీర్ణము కలిగిన సముద్ర తీర ప్రాంతమున్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. జిలాల్లో 193 కిలోమీటర్ల  విస్తీర్ణములో సముద్ర తీరము వ్యాపించి ఉంది . ఇచ్చాపురం నుంచి రణస్థలం వరకు 9 మండలాలో 104 గ్రామాలలో 50 వేల మత్స్య కార కుటుంబాలకు ఉపాది కల్పిస్తుంది. పరోక్షము గా మరో 100 గ్రామాలు ప్రజలు తీరము పైనే ఆధారపడి బతుకుతున్నారు. తీరానికి ఆనుకొని 53 వేల ఎకరాల కొబ్బరి తోటలు , లక్ష ఎకరాల జీడిమామిడి తోటలు ఉన్నాయి. సముద్ర తీరము నుండి 10 కిలోమీటర్ల పరిదిలోనే జిల్లా ప్రజలు ప్రధానము గా ఉపాది పొందుతున్నారు.

మత్స్య సంపద ఆధారముగా :

శ్రీకాకుళం జిల్లాలో 5500 పడవలు ఆధారము గా మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. అందులో 15 శాతము సందనే వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. సుమారు ఏడాదికి 800 - 1000 కోట్ల రూపాయిల అదాయము ఉంటుంది.

కాలుష్యరహిత పరిశ్రమలకు అనుకూలముగా ఉంటుంది. తీర ప్రాంతానికి 5-10 కిలోమీటర్ల పరిదిలోనే జాతీయ రహదారి , రైల్వేసదుపాయము ఉండడముతో  కాలుశ్యరహిత పరిశ్రమలకు మంది అవకాశము ఉంటుంది. కొబ్బరి , జీడిమామిడి పరిశ్రమలు ,ఇసుక  పరిశ్రమలకు అనువుగా ఉంటుంది.

ఓడ రేవులు  :
జిల్లాలో ఓడ రేవుల ఏర్పాటుకు అనువుగా కళింగపట్నం , భావనపాడు  ఉన్నాయి.

పర్యాటక ప్రదేశాలు :

బారువ , కళింగపట్నం , బావనపాడు , మొగదలపాడు , అక్కుపల్లి  బీచ్ లు విహార కేంద్రాలు గా అభివృద్ధి చెందాయి. 11 మండలాలలొ 20 ప్రాంతాలు పర్యాటక కేంద్రాలు గా జిల్లా ఆదాయాన్ని పెందుకోవచ్చు.

టైగర్ రొయ్య పిల్ల పరిశ్రమ :

అత్యధిక విదేశీ మారకద్రవ్యము తెచ్చిపట్టే టైగర్ రొయ్యపిల్లల ఉత్పత్తి కి జిల్లా తీరప్రాంతము అనువుగా ఉంటుంది. 2007 లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు జిల్లాలో అద్యనము చేసి సోంపేట , సంతబొమ్మాలి , గార మండలాలు టైగర్ రొయ్యపిల్లల ఉత్పత్తికి  అనుకూల ప్రాంతాలు గా గుర్తించారు.

పూలసాగుకు అనుకూలము :

శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతములో 15 వేల హెక్టార్ల వరకు చిత్తడి నేలలున్నాయి. సహజ సిద్ధముగా ఏర్పడిన వాటితోపాటు కాల్వలు , చెరువులు , నదీ సంగమ ప్రాంతాలలో ఏర్పడిన  ఈ నేలల పరిధిలో పూలసాగు చేసేందుకు  అవకాశాలున్నాయని ఉద్యానవన శాఖ అధికారులు స్పష్టము చేస్తున్నారు. వివిధ రకాల పూలమొక్కలు , ఔషధ మొక్కలు పెంచేందుకు తీరప్రాంత భూములు  చాలా అనుకూలము. ఇదే విధము గా తీరప్రాంతాలలో ఉప్పు తయారీ కి అనుకూలము .

అక్వా పరిశ్రమ :
శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతములో రొయ్యల సాగుకు ఎంతో అనుకూలము .ప్రస్తుతానికి కేవలము 12 ఎకరాకలో ఆక్వా పరిశ్రమ నడుస్తూ ఉంది. రణస్థమ్లము తీరము లో చేపలు ఎండబెడుతూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు.