Showing posts with label Wooden Arts in Srikakulam. Show all posts
Showing posts with label Wooden Arts in Srikakulam. Show all posts

Sunday, April 25, 2010

Wooden Arts in Srikakulam, చెక్కతో శిల్పాలు శ్రీకాకులం లో




బొమ్మలు చెక్కడము అనేది ఒక కళ . ఒక నాడు కులవృత్తి గా ఒకే వర్గానికి పరిమితమైన కొన్ని పనులు ఆధునిక యుగం లో , సరికొత్త యంత్రాలతో అందరికీ ఉపాది మార్గాలుగా మారుతున్నాయి. తమ సృజన , కళతో కూడిన విద్యను ప్రదర్శించి నాలుగు దబ్బులు సంపాదించుకుంటున్నారు ... నేటి యువత .

పూర్వకాలం లో శల్పి అంటే వయసు మీద పడి కురువృద్దులుగా కనిపించేవారు . ప్రుస్తుత కాలం లో నూనూగుమీసాల వయసున్న యువకులే ఎక్కువగా కనిపిస్తున్నారు . చదువు మద్యలో ఆపేసిన వారేకాదు ... డిగ్రీలు పూర్తిచేసిన వారూ ఈ కళల రంగం లో రాణిస్తునారు . శ్రీకాకుళం జిల్లాలో చెక్కతో ' శిల్పాలు ' చెక్కే కళాకారులు ఈ మధ్యకాలంలో ప్రగతిపధం లో సాగుతున్నారు . శ్రీకాకుళం పట్టణములో అధికంగా కలప బొమ్మల తయారీ కేంద్రాలున్నాయి . ప్రక్కనే ఉన్న ఒరిసా ప్రాంతం లో అంకుడు , టేకు తదితర రకాల కలపను కుగోలు చేసి ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నారు . పట్టణము లో ఎనిమిది దుకాణాల్లో తలుపుల పై ఇతరులను ఆకట్టుకునేలా బొమ్మలు చిత్రించే కళాకారులున్నారు . ఈ పనికి మంచిడిమాండు ఉంది -- ఒక్కోతలుపు పై కళా ఖండాలు చెక్కడానికి రూ.2 నుండి 3 వేల వరకు ఖర్చవుతుంది .

కొత్తగా ఇల్లు కట్టుకున్నావారు తమ గృహాన్నీ అందం గా ఆహ్లాదకరం గా తీర్చిదిద్దుకోవాలనుకుంటారు . ఈ నేపధయం లో ద్వార బంధాలు , తలుపుల పై అందమైన దేవతామూర్తుల బొమ్మలు , పువులు , వివిధ రకాల ఆకృతులను వేయించుకుంటున్నారు . ఇవి ఇంటికి వచ్చే అతిధులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి .
  • ============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.