Showing posts with label ట్రిపుల్ ఐ.టి.చదువులు శ్రీకాకుళం లో. Show all posts
Showing posts with label ట్రిపుల్ ఐ.టి.చదువులు శ్రీకాకుళం లో. Show all posts

Sunday, May 9, 2010

Triple I.T.education in Srikakulam, ట్రిపుల్ ఐ.టి.చదువులు శ్రీకాకుళం లో




రాస్టం లో ప్రతిభ గల విద్యార్ధులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందించాలన్న ఉద్దేశం తో 2008 లో రాజీవ్ గాంధీ సాంగేతిక విశ్వ విద్యాలయం పాలక మండలి సహకారము తో
  • బాసర (అదిలాబాద్ జిల్లా),
  • నూజివీడు (కృష్ణా జిల్లా),
  • ఇదుపులపాయ (కడప జిల్లా) ,
లలో ట్రిపుల్ ఐ.టి.లు ఏర్పాతు చేసారు . ఏటా ఒక్కో కేంద్రం లో 2 వేల మందికి ప్రవేశాలు కల్పించాలన్నది అప్పటి లక్ష్యము . ఈ మూడు కేంద్రాలలో 6 వేల మందికి ప్రవేశాలు లబించేవి .

పదో తరగతి లో ప్రతిభ అనుగుణం గా 85 శాతము గ్రామీణ విద్యార్ధులకు కేటాయించారు . విగిలినవి ప్రతిభ ఆధారముగా ప్రబుత్వ ఎయిడెడ్ , ప్రవేటు పాఠశాలల్లో చదివిన పట్టణ విద్యార్ధులకు కేటాయించారు . ఈ విద్య 6 ఏళ్ళు కొనసాగగా , 18 సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు . ఇంటర్మీడియట్ తో పాటు ఇంఫర్మేషన్క్ష్ టెక్నాలజీ ,కంప్యూటర్ సైన్స్ , పై ఇంజనీరింగ్ దిగ్రీలను విద్యార్ధులకు అందజేస్తారు . విద్యార్ధుల ఫీజుల్లో 95 శాతము ప్రభుత్వమే చెల్లిస్తుంది .
2010 సమ్వత్సరములొ ట్రిపుల్ ఐ.టి. సీట్లలలో కోత విదించి సగానికి తగ్గించారు మొత్తం 3 వేలు సీట్లే ఉన్నాయి

శ్రీకాకుళం జిల్లలో ->
  • గతం లో కేటాయించిన సీట్లు ----193 ,
  • 2010 లో మంజూరయిన సీట్లు --96 ,
రిజర్వేషన్క్ష్ వారీగా :->
  • O.C ---------53 ,
  • B.C(a)-------7 ,
  • B.C(b)-------10 ,
  • B.C(c)-------1 ,
  • B.C(d)-------7 ,
  • B.c(e)-------4 ,
  • S.C---------8 ,
  • S.T---------6 ,

దరఖాస్తు చేయు విధానము :

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) అధ్వరములొ హైదరాబాద్ లోని విశ్వవిద్యాలయం కార్యాలయం తొ పాతు రాస్టం లొని 3 ట్రుపు ఐ.టి. కేంద్రాలలోను , ఎంపిక ఛేసిన కొన్ని బ్యాంక్ లలోను దరఖాస్తు ఫారాలు 100/- రూపాయిలు జమచేసి , కొనాని . వాటిని నింపి నిర్ధేసించిన కాలపరిధిలో అప్లై చేసుకొవాలి . ప్రతిసంవత్సరము సుమారు 50 వేలు మంది దరఖాస్తు చేయుచున్నారు .

  • =======================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.