Tuesday, July 28, 2015

E-pass system in Ration distribution in Srikakulam-రేషన్‌ పంపినిలో ఈ-పాస్ విధానము
నిరు పేదలకు రేషన్‌ డిపోల ద్వారా ప్రభుత్వము నిత్యవసర సరుకులు అందిజేయడము  మంచిదే . . . కాని అందిరినీ పేదవారిగా పరిగణించి ఓట్ల బ్యాంక్ కోశము పబ్బము కడుపుకోవడము ఎంతమాతము మంచిది కాదు. ఉత్తనే  లేదా తక్కువ ధరకు వస్తువులు దొరుకుతున్నాయంటే ఎవరికి  వద్దు ... టాటా .. బిర్లా లు కూడా లైన్లు ల లో ఉంటారు.

ఈ-పాస్ విధానము లో ఒక ఈ-పాస్ పరికరము వివరాలన్నీ నమోదు చేసి రొటేషన్‌ విధానము లో సరకులు పంపినీ అవుతాయి. బోగస్ కార్డులు ఉండవు .. కార్డ్ వివరాలు ఈ యంత్రములో వివిధ ఆఫీసులలో ఖచ్చితము నమోదై ఉన్నందున పర్యవేక్షణ పగడ్బందీగా ఉంటుంది .
 శ్రీకాకుళం జిల్లాలో 1991 రేషన్‌ డిపోలున్నాయి. 2015 లో మొదటి విడతగా 242 డిపోలలో అమలు చేసారు.

జిల్లాలో 2011 జబాభా లెక్కక ల ప్రకారము 6.87 లక్షల కుటుంబాలున్నాయి. తెలుపు రేషన్‌ కార్డ్ లు 7.57 లక్షలు గాను , మిగగావె గులాబీ కార్డులు వేలల్లో ఉన్నాయి.
 • ==================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, July 7, 2015

Salaries of Local bodies Srikakulam

================================== Visit my Website > Dr.Seshagirirao - MBBS. http://dr.seshagirirao.tripod.com/

Thursday, June 11, 2015

Costal development in Srikakulam dist,శ్రీకాకులం లో సాగరతీర సంపదరాష్ట్రము లోనే అత్యధిక విస్తీర్ణము కలిగిన సముద్ర తీర ప్రాంతమున్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. జిలాల్లో 193 కిలోమీటర్ల  విస్తీర్ణములో సముద్ర తీరము వ్యాపించి ఉంది . ఇచ్చాపురం నుంచి రణస్థలం వరకు 9 మండలాలో 104 గ్రామాలలో 50 వేల మత్స్య కార కుటుంబాలకు ఉపాది కల్పిస్తుంది. పరోక్షము గా మరో 100 గ్రామాలు ప్రజలు తీరము పైనే ఆధారపడి బతుకుతున్నారు. తీరానికి ఆనుకొని 53 వేల ఎకరాల కొబ్బరి తోటలు , లక్ష ఎకరాల జీడిమామిడి తోటలు ఉన్నాయి. సముద్ర తీరము నుండి 10 కిలోమీటర్ల పరిదిలోనే జిల్లా ప్రజలు ప్రధానము గా ఉపాది పొందుతున్నారు.

మత్స్య సంపద ఆధారముగా :

శ్రీకాకుళం జిల్లాలో 5500 పడవలు ఆధారము గా మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. అందులో 15 శాతము సందనే వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. సుమారు ఏడాదికి 800 - 1000 కోట్ల రూపాయిల అదాయము ఉంటుంది.

కాలుష్యరహిత పరిశ్రమలకు అనుకూలముగా ఉంటుంది. తీర ప్రాంతానికి 5-10 కిలోమీటర్ల పరిదిలోనే జాతీయ రహదారి , రైల్వేసదుపాయము ఉండడముతో  కాలుశ్యరహిత పరిశ్రమలకు మంది అవకాశము ఉంటుంది. కొబ్బరి , జీడిమామిడి పరిశ్రమలు ,ఇసుక  పరిశ్రమలకు అనువుగా ఉంటుంది.

ఓడ రేవులు  :
జిల్లాలో ఓడ రేవుల ఏర్పాటుకు అనువుగా కళింగపట్నం , భావనపాడు  ఉన్నాయి.

పర్యాటక ప్రదేశాలు :

బారువ , కళింగపట్నం , బావనపాడు , మొగదలపాడు , అక్కుపల్లి  బీచ్ లు విహార కేంద్రాలు గా అభివృద్ధి చెందాయి. 11 మండలాలలొ 20 ప్రాంతాలు పర్యాటక కేంద్రాలు గా జిల్లా ఆదాయాన్ని పెందుకోవచ్చు.

టైగర్ రొయ్య పిల్ల పరిశ్రమ :

అత్యధిక విదేశీ మారకద్రవ్యము తెచ్చిపట్టే టైగర్ రొయ్యపిల్లల ఉత్పత్తి కి జిల్లా తీరప్రాంతము అనువుగా ఉంటుంది. 2007 లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు జిల్లాలో అద్యనము చేసి సోంపేట , సంతబొమ్మాలి , గార మండలాలు టైగర్ రొయ్యపిల్లల ఉత్పత్తికి  అనుకూల ప్రాంతాలు గా గుర్తించారు.

పూలసాగుకు అనుకూలము :

శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతములో 15 వేల హెక్టార్ల వరకు చిత్తడి నేలలున్నాయి. సహజ సిద్ధముగా ఏర్పడిన వాటితోపాటు కాల్వలు , చెరువులు , నదీ సంగమ ప్రాంతాలలో ఏర్పడిన  ఈ నేలల పరిధిలో పూలసాగు చేసేందుకు  అవకాశాలున్నాయని ఉద్యానవన శాఖ అధికారులు స్పష్టము చేస్తున్నారు. వివిధ రకాల పూలమొక్కలు , ఔషధ మొక్కలు పెంచేందుకు తీరప్రాంత భూములు  చాలా అనుకూలము. ఇదే విధము గా తీరప్రాంతాలలో ఉప్పు తయారీ కి అనుకూలము .

అక్వా పరిశ్రమ :
శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతములో రొయ్యల సాగుకు ఎంతో అనుకూలము .ప్రస్తుతానికి కేవలము 12 ఎకరాకలో ఆక్వా పరిశ్రమ నడుస్తూ ఉంది. రణస్థమ్లము తీరము లో చేపలు ఎండబెడుతూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు.

Tuesday, May 19, 2015

Weather reporting centers in Srikakulam,శ్రీకాకుళం జిల్లాలో వాతావరణ కేంద్రాలుశ్రీకాకుళం జిల్లాలో 63 ఆటోమెటిక్‌ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ ఇంజినీరు ఎం.సమ్మయ్య చెప్పారు. చల్లవానిపేట సబ్‌స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా వాతావరణంలో మార్పులు, వర్షం నమోదు, ఉష్ణోగ్రత, గాలివేగం, దిశ, తదితర విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఇందులో ఉన్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఈ కేంద్రంలో విషయాలు వెంటనే హైదరాబాద్‌ తెలుస్తాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1224 కేంద్రాలు ఉన్నాయన్నారు. నదీతీర ప్రాంతాల్లోని కేంద్రాల ద్వారా నదుల్లో నీటి ప్రవాహం గురించి తెలుస్తుందన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో..... 2015 సంవ్వత్సరములో ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాలు......

 • హిరమండలం, 
 • గార, 
 • బూరవెల్లి, 
 • అరకబద్ర, 
 • బాతుపురం, 
 • తమ్మినాయుడుపేట, 
 • కొరసవాడ, 
 • నేతేరు, 
 • నారువ, 
 • బొడ్డబోడ 


వద్ద కేంద్రాలు ఏర్పాటు చేసారు .


 • ==================================

 Visit my Website > Dr.Seshagirirao - MBBS. 

Wednesday, May 6, 2015

NRC(nutrition rehabilitation centre) Srikakulam,పోషకాహార కేంద్రం -న్యూట్రిషన్‌ రీహేబిలిటేషన్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌సీ)శ్రీకాకుళం.
2012 డిసెంబరులో రిమ్స్‌లో ఎన్‌ఆర్‌సీఏర్పాటు చేశారు. ఏడాదికి 600 మందికి పైబడి చికిత్స చేయవచ్చు.20 పడకలున్నాyi .


* వయసుకు తగ్గ బరువు లేని పిల్లలును సరైన ఎదుగుదల లేని వారిని గుర్తించి వారిని ఆసుపత్రికి తీసుకు వచ్చిన వారికి డబ్బులిస్తారు.

* అలా నిర్ణీత సమయాల్లో ఎన్నిసార్లు తీసుకువచ్చినా 'నగదు ప్రోత్సాహం' లభిస్తుంది.

* చిన్నారికి సమయం ప్రకారం ఆహారం. అదీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు అందిస్తారు.

* చిన్నారి ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటే అన్ని రోజుల పాటు తల్లికి భోజనం అందిస్తారు. అంతే కాదు నిత్యం వంద రూపాయలు కూడా అందిస్తారు.

* ఇద్దరు వైద్యులు పర్యవేక్షిస్తారు. ఆరోగ్యం మెరుగుపడే వరకూ నిపుణులు దగ్గరుంచి చూసుకుంటారు.


శ్రీకాకుళం జిల్లాలో వందలాది మంది గర్భిణులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పటికే పుట్టిన వేలాది మంది చిన్నారులు తగిన బరువు లేరు. పోషకాహారం అందకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. పేదల బిడ్డలే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిని ఆరోగ్యవంతులుగా చేయటానికి 'న్యూట్రిషన్‌ రీహేబిలిటేషన్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌సీ)'ను రిమ్స్‌లో ఏర్పాటు చేశారు.  సకల సౌకర్యాలు సమకూర్చుతున్నా సరైన అవగాహన లేక చాలా వినియోగించుకోవటం లేదు.

శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి
జిల్లాలో ఎంతో మంది చిన్నారులు పౌష్టికాహర లోపంతో బాధపడుతున్నారు. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహరం పొందుతున్న వారిలో ఎంతో మంది బలహీనంగా కనిపిస్తుంటారు. చికిత్స చేయించలేని తల్లిదండ్రులు ఉంటారు. 2012 డిసెంబరులో రిమ్స్‌లో ఎన్‌ఆర్‌సీఏర్పాటు చేశారు. ఏడాదికి 600 మందికి పైబడి చికిత్స చేయవచ్చు.

పేరుకు ఎన్‌ఆర్‌సీ కేంద్రం ఉన్నా ఉపయోగించుకుంటున్నది మాత్రం చాలా తక్కువ మంది. ఫలితంగా ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌) జనరల్‌ ఆసుపత్రిలోని చిన్న పిల్లల విభాగంలో ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌సీ కేంద్రాన్ని20 పడకలతో ఏర్పాటు చేశారు. చిన్నారులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేస్తారు. బలహీనతకు కారణాలు గుర్తిస్తారు. అనంతరం ఇన్‌పేషంటుగా చేర్చుకుని 14 నుంచి 30 రోజుల పాటు ఒక పద్ధతి ప్రకారం పాలు, పండ్లు, ఆహారం అందించి వారు బరువు పెరిగేలా చేస్తారు. ఇంతటి చక్కటి కేంద్రం ఉన్నా కేవలం ఇద్దరు, ముగ్గురు తప్పా అక్కడి పడకలు ఖాళీగా ఉంటున్నాయి. జిల్లాలో ఎంతో మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే రిమ్స్‌లో వారికి పూర్తిగా ఉచిత చికిత్స అందించే సౌకర్యం ఉన్నా ప్రజలు వినియోగించుకోవడం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఎన్‌ఆర్‌సీలో చికిత్స పొందుతున్న ఇద్దరు, ముగ్గురు కూడా రిమ్స్‌ చిన్న పిల్లల విభాగానికి చికిత్సకు రాగా వారిని గుర్తించి ఇక్కడ చేర్పించారు.


ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లతో పాటు మధ్యాహ్న భోజన పథకం నిర్వహించే మహిళలు ఈ కేంద్రం గురించి స్థానికులకు తెలియజేయాలి. వీరంతా తమ పరిధిలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారిని రిమ్స్‌ ఆసుపత్రికి తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులకు వచ్చే వారిని పరిశీలించే వైద్యులు కూడా చిన్నారులను ఎన్‌ఆర్‌సీకి రిఫర్‌ చేయాలి. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కూడా ఇటువంటి చిన్నారులు ఉంటే వారి తల్లిదండ్రులకు వివరించి ఇందులో చేరేలా చేయాలి.

పారితోషికం ఇస్తారు
చిన్నారులను ఎన్‌ఆర్‌సీకి తీసుకువచ్చే వారిని ప్రోత్సహించేందుకుపారితోషికం కూడా ఇస్తారు. మొదటి సారి తీసుకువచ్చే వారికి ఒక బిడ్డకు రూ.50 వంతున చెల్లిస్తారు. అదే విధంగా డిశ్చార్జి అయిన తరువాత వైద్యుల సూచన మేరకు మూడు సార్లు అనుశీలన(ఫాలోఅప్‌) చేయాల్సి ఉంటుంది. ఇలా తీసుకు వచ్చిన ప్రతిసారి సంబంధిత వ్యక్తులకు ఒక దఫాకు రూ.25 వంతున మూడు సార్లు తెచ్చినందుకు రూ.75 వంతున చెల్లిస్తారు.

తల్లికి రోజుకు రూ.వంద
ఎన్‌ఆర్‌సీ కేంద్రలో చికిత్స కోసం చేరిన బిడ్డకు 14 నుంచి 30 రోజులు... ఆపై ఎన్ని రోజులు చికిత్స పొందితే అన్ని రోజుల పాటు పౌష్టికాహారం ప్రతి రెండు గంటలకు ఒక సారి బిడ్డ వయస్సు ఆధారంగా అందిస్తారు. పిల్లలను కేంద్రంలో ఆడుకోనిస్తారు. బిడ్డతో ఉండే తల్లికి ఉచిత భోజనం లేదా రూ.50 ఇస్తారు. దీనికి అదనంగా రోజుకి రూ.100 వంతున ఎన్ని రోజులు బిడ్డ చికిత్స పొందితే అన్ని రోజులకు ప్రోత్సాహకాన్ని చెక్కు రూపంలో అందిస్తారు.

మంచి ఆహారం అందిస్తారు
పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులను ఎన్‌ఆర్‌సీకి తీసుకువస్తే తగు పరీక్షలు చేస్తారు. అనారోగ్యం, ఎదుగుదల లేకపోవడం గుర్తిస్తే నిత్యం మంచి ఆహారం అందించి ఆరోగ్యంగా చేస్తాం. ఇద్దరు వైద్యాధికారులు ప్రతి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి.

- డాక్టర్‌ మణికంఠ చైతన్య, ఎన్‌ఆర్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌-RIMS srikakulam.

రిమ్స్‌కు నేరుగా రావచ్చు
పౌష్టికాహర లోపంతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను నేరుగా రిమ్స్‌ ఓపీకి తీసుకువస్తే వారికి తక్షణ వైద్యం అందిస్తాం. న్యూట్రిషియన్‌ కౌన్సిలర్లు పరిశీలించి ఒ.పి. ద్వారా చిన్నపిల్లల విభాగానికి పంపించి అవసరమైన పరీక్షలు చేయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ఉండే బలహీనమైన చిన్నారులను తక్షణమే ఇన్‌పేషంటుగా చేర్చి ఎన్‌ఆర్‌సీకి పంపించి చికిత్స అందజేసి పంపిస్తారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు బాధ్యతగా వ్యహరిస్తే ఎంతోmandhi బాలలను ఆరోగ్యంగా చేయవచ్చు.

- డాక్టర్‌ తెన్నేటి జయరాజు, డైరెక్టర్‌, రిమ్స్‌-Srikakulam.

 • ================================== 
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, January 27, 2015

Drinking water Taps in srikakulam Town-శ్రీకాకుళం పట్టణం లో మంచినీటి కుళాయిలు 2015 -01-28 నాటికి శ్రీకాకుళం లో వ్యక్తిగత మంచినీటి కుళాయిలు ,హోటల్స్ , బేకరీలు , హాస్పిటల్స్ , వాణిజ్య భవనాలు  అన్నీ కలిపి మొత్తం 12,301 మంచినీటీ కుళాయిలు ఉన్నాయి.

as on Thursday, March 25, 2010

శ్రీకాకుళం పట్టణము :
36 వార్డులు , లక్షా 27 వేల జనాభా ఉన్న శ్రీకాకుళం టౌన్‌ లో ఒక సెంట్రల్ రిజర్వాయర్ , 9 సర్వీస్ రిజర్వాయర్లు , 3 పంపింగ్ స్టేషన్లు , 285 వరకు బోర్ల ద్వారా పస్తుతము తాగునీటి సరఫరా చేస్తున్నారు . 8950 ఇంటి కుళాయి కనెక్షన్లు , 412 పబ్లిక్ కుళాయిలు , ద్వారా రోజుకు 10.50 మిలియన్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు . ఈ లెక్కన ఒక్కో పౌరుడుకి 90 లీటర్ల నీటిని ఇస్తున్నందునట్లు అధికార గణాంకాలు చూ్సిస్తున్నాయి . కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా తాగునీటిని సరఫరా అవుతుంది . నాగావళి నది నీటిని క్లోరినేషన్‌ చేసి సరఫరా అవుతుంది .

కొన్ని నిజాలు :

    శ్రీకాకుళం లో సుమారు 22 ఏళ్ళ క్రితం వేసిన గొట్టాల ద్వారానె నేటికి నీరు సరఫరా చేస్తున్నారు . కొన్ని చోట్ల నీటి గొట్టాలు తృప్పు పట్టి రంద్రాలు ఏర్పడి కొన్ని చోట్ల మురుగు కాలవల నీటితో కలుసితమవుతున్నాయి.
    పైపుల లీకుల మూలాన నీటిలో బ్యాక్టీరియా , ఇతరత్రా విషపదార్దాలు నేరుగా కలిసిపోతున్నాయి.
    ఏడాది రూ. 75 లక్షల వరకూ ఆదాయము వస్తున్నా నీటి గొట్టాలు మార్చడం కాని , రిపేరు చేయడం గాని , అధికారుల , నాయకుల పర్యవేక్షణ లేదు.
    చాలా కుళాయిలము డైరెక్ట్ గా మోటార్లు పెట్టి నీటిని తోడేయడం వలన ఎత్తు ప్రాంతాలకు నీరు అందడం లేదు . హొటల్లు, లాడ్జీలు, ఆపార్ట్మెంట్లు, పెద్దపెద్ద హాస్పిటల్ ఈ మోటార్ల ద్వారా తమ నీటి అవసరాలు తీర్చుకుంటున్నాయి. వీరికి తగిన శిక్షలు వేయాలి . లంచాలకు అలవాటైన ఉద్యోగులు ఈ విషయాన్ని చూసి చూడనట్లు కాలం వెళ్ళబుచ్చుతున్నారు .
    పేద , ధనిక అనే తారతమ్యము లేకుండా కుళాయిలన్నింటికీ మీటర్లు పెట్టి నీటి వాడకం బట్టి రుసుము వసూలు చేయాలి . నాయకులు ఓటు బ్యాంక్ కోసం ఆ పని చేయడం లేదు .

    శ్రీకాకుళం జనాభా ------------------లక్షా 27 వేలు ,
    మొత్తము వార్డులు -----------------36 ,
    కుళాయి కనెక్షన్లు ------------------8950,
    పబ్లిక్ కుళాయిలు ------------------412 ,
    పట్టణములో పైపులైన్ల పొడవు ------110 కి.మీ.,
    రోజుకు ఒక్కక్కరికి అవసరమైననీరు -100 లీ.
    సరఫరా అవుతున్న నీరు -----------90 లీ. • ================================== 
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Monday, January 19, 2015

Aadhaar cards in Srikakulam dist, ఆధార్ కార్డ్స్ శ్రీకాకుళం జిల్లాలో

 •  
 •  

 తేదీ : 20-జనవరి -2015 :
శ్రీకాకుళం లో ::
జనాభా : 27,03,114 .

ఆధార్ కార్డులు పొందినవారు : 26 లక్షలు మంది. 

శ్రీకాకుళం జిల్లాలో వంట గాస్ కనెక్షన్లు : 2,91,687 ... ఉనాయి.ఆధార అనుసంధానము అయినవి : 2,88,820.

శ్రీకాకుళం జిల్లాలో రేషన్‌ కార్డులు : 7,57,364... వీటికి సంబంధించి  లభిదారులు =25,85,794 . ఆధార్
అనుసంధానము అవనివారు  : 22,59,842.

శ్రీకాకుళం జిల్లాలో సామాజిక భద్రత పించన్లు : 2,69,545 మంది ఉన్నారు . చాలామందికి ఆధార అనుసందానము కాలేదు .

శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లు ; 20,09,458 . మంది ఉన్నారు.  ఆధార్ అనుసంధానము కాలేదు .

శ్రీకాకుళం జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు : 4,79,360 . . . వీరిలో ఆధార్ అనుసంధానము : 3,98,728 .
Courtesy with Eenadu telugu news paper 19.01.2015.


 • ================================== 
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, November 19, 2014

Villages in Srikakulam dist.,Panchayats in Srkakaulam dist.

 •  
 11/11/2014..Villages in Srikakulam dist.,Panchayats in Srkakaulam dist.
 •  
 జిల్లావ్యాప్తంగా 1,107 పంచాయతీల్లో 4,134 గ్రామాల్లో 5,93,350 కుటుంబాలు నివసిస్తున్నాయి.
శ్రీకాకుళం లో 38 మండలాలు , 1107 గ్రామపంచాయతీలు , 16 మేజరు పంచాయతీలు , 2 నోటిఫైడ్ నగరపంచయత్  -- రాజాం,పాలకొండ  , & 4 మునిసిపాలిటీలు -- శ్రీకాకుళం , ఆమదాలవలస , పలాస , ఇచ్చాపురం . ఉన్నాయి .

In Srikakulam Dist (శ్రీకాకుళం జిల్లాలో )->
-----------------Panchayats (పంచాయతీలు )=1107 , -> శ్రీకాకుళం డివిజన్‌ = 362 , పాలకొండ డివిజన్‌ = 380, టెక్కలి డివిజన్‌ లో = 365.
-----------------MPPs (మండల పరజా పరిసత్లు )=38.
---------------- MPTC (మండల ప్రజా పరిషత్ సభ్యులు )= 648 ,
---------------- ZPP(Z.P)జిల్లాపరిషత లు =1 ,
----------------ZPTC (జిల్లా ప్రజా పరిసత్ సబ్యులు ) =38.

 • =========================