శ్రీకాకుళం జిల్లాలో వంగర మండలం సంగాం గ్రామము వద్ద " సువర్ణముఖి , వేగావతి , నాగావళి " నదులు కలుస్తాయి . ఈ ప్ర్రాంతాన్ని " త్రివేణి సంగమం " గా పిలుస్తారు .
వంగర మండలం సంగాం సంగమేశ్వరుడు,
నాగావళి నదీతీరాన ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్టించిన ఐదు శివలింగాలను ఈ మహాశివరాత్రి రోజున సూర్యోదయంనుంచి సూర్యాస్తమయంలోగా దర్శించుకున్నవారి పాపాలన్నీ పోవడమేకాకుండా, వారికి పునర్జన్మం లేకుండా శాశ్వతంగా శివసన్నిధిని ఉంటారన్నది ప్రతీతి. ద్వాపరయుగంలో ప్రజలు కరవుకాటకంతో ఈ ప్రాంతంలో అలమటిస్తున్నప్పుడు బలరాముడు ఈ ప్రాంతంలో పర్యటిస్తుండగా ప్రజల కష్టాలను చూసి భూమిలో నాగలిని గట్టిగా పెట్టి ఒరిస్సానుంచి శ్రీకాకుళం జిల్లా కళ్లేపల్లి వరకూ గంగను తీసుకువచ్చాడని, అలా నాగలితో వచ్చిన గంగకు నాగావళి అనే పేరు వచ్చిందని చరిత్రకారులు తెలియచేశారు. అయితే గంగను నాగలితో బాధించి బలరాముడు తెచ్చినందుకుగాను ఆ పాప ప్రక్షాళనకు ఈ నాగావళి నదీతీరంలో ఐదు శివలింగాలను ప్రతిష్టించినట్లు ఆయా స్థల పురాణాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ ఐదు శివలింగాలు ప్రతిష్టించిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా నేడు విరాజిల్లుతున్నాయి. వీటిలో రెండు క్షేత్రాలు ఒరిస్సా రాష్ట్రంలోని పాయకపాడులోను, మరొకటి విజయనగరం జిల్లా పార్వతీపురం దరిలో గుంప క్షేత్రం కాగా, మిగిలిన మూడు క్షేత్రాలు వంగర మండలం సంగాంలో సంగమేశ్వరునిగా, శ్రీకాకుళం పట్టణంలో ఉమా రుద్రకోటేశ్వరునిగా, కళ్లేపల్లి వద్ద మణినాగేశ్వరస్వామి పేర్లతో ఈ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. వీటిలో వంగర మండలం సంగాం సంగమేశ్వరుడు ఉన్న ప్రాంతంలో మూడు నదుల సంగమం త్రివేణి సంగమంగా చెబుతుంటారు. నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులు కలిసే చోట ఈ శివలింగాన్ని ప్రతిష్టించినందున ఈ శివుడు సంగమేశ్వరునిగా పిలుస్తున్నారు.
- ==============================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !