very beautiful waterfall seen here at a place 20 km away from Palasa . It looks like a stream of milk flow from a distance gives a pleasant effect on the minds of pilgrims / tourists . This is the border area between Andhra & Orissa.
నింగిని తాకడానికి పోటీపడుతున్నామా అనిపించే పర్వత పంక్తులు , రా ... రమ్మని సాదరం గా తలలు ఊపుతూఆహ్వానించే వృక్షసంపద . ఆకాశ గంగలా ప్రవహించే జలపాతము ... అదే " గండాహతి జలపాతము " ఒరిస్సా రాస్ట్రం లో పర్లాకిమిడి సమీపం లో రాయగడ సమితి లో ఉన్నది . 200 అదుగుల ఎత్తు నుంచి జాలువారుతూ ఉంటుంది . జూలై నుండి సెప్టెంబర్ వర్కు జలపాతము హోరు అధికం గా ఉంటుంది .
ఈ జలపాతము నీరు ఒరిస్సా గొర్ని పంచాయతీలోని కృఉష్ణ సాగరం లో కలుస్తుంది . కృఉష్ణ సాగరం ప్రధాన కాలువ నీరు పాతపట్నం నియోజకవర్గము లోని పట్టుపురము , చాపర వరకూ వస్తుంది . ఈ నీటిని సరఫరా చేస్తున్నందుకు ఆంధ్ర ప్రభుత్వము ... ఒరిసా ప్రభుత్వానికి ఏటా శిస్తు చెల్లిస్తూంది .
వెళ్ళేందుకు దారి :
పర్లాకిమిడి నుంచి కంట్రగడ , గోఠైల మీదుగా 25 కి.మీ. బస్సులో వెళ్ళేవారు అర కిలోమీటరు దూరము నడవాలి . జీపులు , కార్లు , మోటారు వాహనాలలో వెళ్ళేవారు జలపాతము వరకూ వెళ్ళవచ్చును .
మెళియాపుట్టి మండళము గొప్పిలి గ్రామము నుండి 10 కి.మీ. దూరములోనే జలపాతము ఉన్నది . పక్కారోడ్డు సౌకర్యము ఉన్నాది .
- ==================================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !