Wednesday, March 31, 2010

ఫ్లోరోసిస్ వ్యాది శ్రీకాకుళం లో , Florosis in Srikakulam


----




ఫ్లోరిన్‌ అధికంగా ఉండే నీటిని తాగడం ద్వారా వచ్చే వ్యాధి ఫ్లోరోసిస్‌. ఇది ఎముకలకు వస్తుంది. అమెరికా, యూరప్‌, ఆఫ్రికా, భారతదేశాల్లోని అనేక మంది ఈవ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రాంతాల్లో ఈవ్యాధి అధికంగా కనిపిస్తోంది. చవిటి భూముల్లో, రాతిబావుల్లో ఫ్లోరైడ్‌ అధిక శాతంలో ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తుంది. మనిషికి విటమిన్లు, ప్రొటీన్లతోపాటు కొన్ని పోషక పదార్థాలు కూడా అవసరమవుతాయి. వీటిని "trace"‌ ఎలి మెంట్స్‌ అని అంటారు. వీటిలో జింక్‌, మెగ్నీషియం, కాపర్‌,ఐరన్‌, ఫ్లోరిన్‌ మొదలైనవి ఉన్నాయి.

శారీరక ఆరోగ్యానికి ఫ్లోరిన్‌ అవసరం. ఫ్లోరైడ్‌ రూపంలో ఫ్లోరిన్‌ మన శరీరంలోకి చేరుతుంది. చిన్న ప్రేగుల్లో జీర్ణమయ్యే ఫ్లోరిన్‌ను శరీరం తన అవసరాలకు ఉపయోగించుకుంటుంది. మిగిలినది మలమూత్రాదుల ద్వారా బైటికి వెళ్లిపోతుంది.

మనం తాగే నీటిలో ఒక లీటర్‌కు ఒక మిల్లీగ్రాము ఫ్లోరిన్‌ ఉంటే మనకు రోజుకు ఒకటి లేదా రెండు మిల్లీగ్రాముల ఫ్లోరిన్‌ లభిస్తుంది. దీనిని ఒక పిపిఎం అంటారు. తాగడానికి ఉపయోగించే తీపి నీటిలో ఫ్లోరిన్‌ అసలు ఉండదు. ఉప్పు నీటిలో 10 పిపిఎంకు పైగా ఫ్లోరిన్‌ ఉంటుంది. సముద్రపు చేపల్లో 5 నుంచి 10 పిపిఎంలకుపైగా, టీలో ఇంకా ఎక్కువగా ఉంటుంది.

నీటిలో ఫ్లోరిన్‌ ఒక పిపిఎం కంటే తక్కువగా ఉంటే కలిగే ఫ్లోరిన్‌ లోపం వలన చిన్న పిల్లలో సుమారు 60 నుంచి 70 శాతం మేరకు దంతాలు త్వరగా పుచ్చిపో తాయి. దంతాలు సరిగ్గా ఏర్పడవు. వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్న వారిలో ఫ్లోరిన్‌ లోపం వలన ఆస్తియోపోరోసిస్(Osteoporosis)‌ అనే ఎముకల వ్యాధి లక్షణాలు కనిపి స్తాయి. దంతరక్షణకు, ఎముకల పటిష్టతకు ఫ్లోరిన్‌ అవసరం. తాగే నీటిలో ఫ్లోరిన్‌ 3 నుంచి 5 పిపిఎం వరకూ ఉంటే ఫ్లోరోసిస్‌ అనే వ్యాధి సోకుతుంది.

ఫ్లోరోసిస్‌ వలన ముందు దంతాలు దెబ్బ తింటాయి. పంటి ఎనామిల్‌పోయి దంతాలు పసుపుపచ్చ రంగులోకి మారుతాయి. దంతాలపై తెల్లటి మచ్చలు, గోధుమ రంగు గీతలు ఏర్పడుతాయి. దీనిని మాట్లింగ్‌ అంటారు. పళ్ల ఉపరితలంపై గుంటలు ఏర్పడుతాయి. ఫ్లోరోసిస్‌ కేవలం పండ్లకే పరిమితమైనవారు 70 శాతం మంది ఉంటారు.

నీటిలో 10 పిపిఎం కన్నా ఎక్కువ ఉంటే ప్రజలు ఈ వ్యాధికి గురవుతారు. దీని వలన వీరికి ఆకలి ఉండదు. వెన్నెముక, నడము, కాళ్లు, చేతులలోని ఎముకలు దళసరిగా మారుతాయి. ఎముకలలో ఉండే లిగమెంట్స్‌, టెండాన్స్‌లో ఫ్లోరైడ్‌ ధాతువు చేరి లోపాలేర్పడుతాయి.
కళ్ల ఎముకలు సన్నబడి వంకర్లుపోవడం, నడుము వంగడం, కీళ్లు వంగిపోవడం మొదలైన లక్షణాలు కనిపి స్తాయి. వీరికి మోకాళ్లు ఒకదానికి మరొకటి దగ్గర దగ్గ రగా వస్తాయి. ఈ వ్యాధికి గురైన వారు శ్రమించి ఏ పనీ చేయలేరు. పిల్లల్లో పెరుగుదల ఉండదు. దీర్ఘ కాలంగా ఫ్లోరిన్‌ ఎక్కువ ఉన్న నీటిని తాగడం వలన క్రానిక్‌ ఫ్లోరైడ్‌ పాయిజనింగ్‌ పరిస్థితి ఏర్పడుతుంది.

నీటిలో ఫ్లోరిన్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు రాతి బావుల్లోని, చవిటి భూముల్లోని నీటిని తాగకూ డదు. ఫ్లోరైడ్‌ ఎక్కువ ఉన్న నీటిలో పటికవంటి రసా యనాలు కలిపి అపాయం లేకుండా చేసుకుని తాగాలి.

శ్రీకాకుళం జిల్లాలో ప్రధానం గా ఉద్దానం ప్రాంతం లో 239 గ్రామాలలో - టెక్కలి , సంతబొమ్మాలి , నందిగం , పాతపట్నం , సారవకోట , మెళియాపుట్టి , తదితర మండలాలలో ఫ్లోరోసిస్ చాయలు కనిపిస్తున్నాయి . భాగీరదిపేట ,శాసనం , అబ్బాయిపేట , గంగాధరపేట , కైలాసపురం , కృష్ణాపురం , సంతలబయలు , ఉదికలపాడు ,బొంతువలస , పరశురాం పురం , ముకుందాపురం , పెద్దమడి , పద్దినాయుడుపేట , పోలవరం , పోతులూరు , స్వరభానాపురం , గంగువాడ , కే-తాల్లబద్ర , జైజోల , మొదుగువలస , కోటపాలెం , , చోమ్పాపురం , దీపావళి , తదితర గ్రామాలలో ఫ్లోరైడ్ జాడలు కనిపిస్తున్నాయి .
ఫ్లోరోసిస్ ఉన్న ప్రాంతాలలో టాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేయాలి , నీటిలో ఫ్లోరిన్అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు రాతి బావుల్లోని, చవిటి భూముల్లోని నీటిని తాగకూ డదు. ఫ్లోరైడ్ఎక్కువ ఉన్న నీటిలో పటికవంటి రసా యనాలు కలిపి అపాయం లేకుండా చేసుకుని తాగాలి. ఫ్లోరోసిస్ బాదితులు అదికం గా ఉన్న ప్రాంతాలవారికి సురక్షితమైన ప్రాంతాలలో పునరావాసము ఏర్పాటు చేయాలి . అమాయక ప్రజలకు మాస్ మీడియా ద్వారా ఫ్లోరోసిస్ గురించి చప్పాలి .

శ్రీకాకుళం లో ఫ్లోరైడ్ బాదితులు , Florosis effects in Srikakulam dist.--(courtesy Eenadu news paper)

జలం కాదు... హాలాహలం-ఫ్లోరైడ్‌ దెబ్బకు జనం విలవిల-పీడిత గ్రామాలు 52కుపైగానే-నివారణ చర్యలు శూన్యం.


ఒకటో రెండో కుటుంబాల వ్యథ కాదు... సుమారు 52 గ్రామాల ప్రజల కన్నీటి గాథ. జలమే హాలాహలమై... బతుకులనే విషపూరితం చేస్తున్న దయనీయస్థితి. కళ్లెదుట ఆడుతూ.. పాడుతూ.. తిరిగే పిల్లలు చివరకు కాళ్లు కదపలేని స్థితికి చేరుకుంటున్నారు. కారణం తాగునీటిలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉండడమే. ఆ నీరు తాగితే జబ్బులొస్తాయని తెలుసు. తెలిసినా ఏమీ చేయలేని దీనస్థితి. వేరే దిక్కులేక.. జీవితాలనే బలి తీసుకుంటున్నారు. ఈ పాపం ఎవరిది...? సురక్షిత మంచినీరు అందివ్వలేని పాలకులదా..? ప్రజలేమైపోతున్నారో అసలు పట్టించుకోని ప్రజాప్రతినిధులదా..? జనం అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారెవరు?


తాగునీటిలో హానికర మూలకాల శాతం ఎక్కువగా ఉంటే ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. సాధారణంగా లీటరు నీటిలో ఫ్లోరైడ్‌ కణాల శాతం 1.5 మిల్లీగ్రాములు దాటితే దంతహాని. మూడు మిల్లీగ్రాములు దాటితే ఎముకలపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రకారంగా చూస్తే జిల్లావ్యాప్తంగా ఫ్లోరైడ్‌, బ్రాకిస్‌ (ఉప్పునీరు) పీడిత ప్రాంతాల గ్రామాలు 52 వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏటా నీటి నమూనాలు సేకరిస్తున్నా అందులో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయటంలో జిల్లా యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఉద్దానం ప్రాంతంలో 239 గ్రామాల ప్రజలకు ఉపకరించేలా ఉద్దానం నీటిపథకం నిర్మించినా అది పూర్తిస్థాయిలో పని చేయటం లేదు. అయితే ఆ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ పీడితులకు కొంతవరకు ఉపశమనం కలిగింది.

  1. పీడిత గ్రామాలివే
  2. టెక్కలి,
  3. సంతబొమ్మాళి,
  4. నందిగాం,
  5. పాతపట్నం,
  6. సారవకోట,
  7. మెళియాపుట్టి......................... తదితర మండలాల పరిధిలో ఫ్లోరైడ్‌ ఛాయలు కనిపిస్తున్నాయి.
  8. బూరగాం,
  9. భగీరధిపేట,
  10. శాసనాం,
  11. అబ్బాయిపేట,
  12. గంగాధరపేట,
  13. కైలాసపురం,
  14. కృష్ణాపురం,
  15. సంతలబయలు,
  16. ఊడికలపాడు,
  17. బొంతువలస,
  18. పరశురాంపురం,
  19. ముకుందాపురం,
  20. పెద్దమడి,
  21. పెద్దినాయుడుపేట,
  22. పోలవరం,
  23. పోతులూరు,
  24. స్వరభనాపురం,
  25. గంగువాడ,
  26. కె.తాళ్లభద్ర,
  27. కైజోల,
  28. మోదుగువలస,
  29. కోటపాలెం,
  30. చొంపాపురం,
  31. దీపావళి,
  32. పెద్దరోకళ్లపల్లి,
  33. జెండాపేట,
  34. సింగుమహంతిపేట
తదితర ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

- ఈ ప్రాంతాల్లో పళ్లు గారపట్టడం, కీళ్లనొప్పులతో బాధపడటం, ఫ్లోరోసిస్‌ వ్యాధితో కాళ్లు వంకర్లు పోవటం వంటి ఛాయలు కనిపిస్తున్నాయి.


ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతంలో ప్రజారోగ్యం దెబ్బతింటున్నా పాలనా యంత్రాంగానికి పట్టడం లేదు. వేసవిలో కంటితుడుపు చర్యగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. కొన్నిచోట్ల నీటి పథకాలు నిర్మించినా నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఉపయోగం లేకుండా పోయింది. బూరాడలో మంచినీటి పథకం నిరుపయోగంగా ఉంది. పెదరోకలపల్లి, జెండాపేట, సింగుమహింతిపేట, బాలకవానిపేట, అగ్రహారం గ్రామాల్లో చెరువు నీరే ఆధారం. కిడ్నీ సంబంధిత వ్యాధులతోపాటు క్షయ, క్యాన్సర్‌ వంటి వాటితో జనం మృత్యువాత పడుతున్నారు.

పరిష్కారానికి చర్యలు
జిల్లాలో ఫ్లోరైడ్‌, బ్రాకిస్‌ (ఉప్పునీరు) ఉన్న 57 ప్రాంతాలున్నాయి. ఫ్లోరైడ్‌ పీడితప్రాంతాల్లో నీటిపథకాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. ఈ ఏడాది ప్రాంతాలన్నింటికీ దాదాపుగా తాగునీటిని పథకాల ద్వారా అందిస్తాం. మిగిలిన జిల్లాలతో పోలీస్తే శ్రీకాకుళంలో ఫ్లోరైడ్‌ సమస్య తక్కువే. అని ఆంటున్నారు - ఆర్‌.కాంతనాధ్‌, ఎస్‌.ఇ., ఆర్‌.డబ్ల్యు.ఎస్‌., శ్రీకాకుళం.

ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తమవంతు నివారణ , నియంత్రణ చర్యలు చేపడితే బాగుంటుంది . గ్రామాలలో సమిస్టిగా నీటిని సుద్దిచేసే ఏర్పాట్లు చేపట్టాలి . సంఘాలు , సమావేశాలతో ప్రజలను జాగ్రుత పరచాలి , కలుషిత నీటివలన నష్టాలను , కష్టాలను వివరించి అవగాహన కల్పించాలి .
  • ===========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, March 30, 2010

Sports and PlayGrounds in Srikakulam , క్రీడలు మైదానములు శ్రీకాకుళం లో



ఆటల ఖిల్లా గా అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సిక్కోలు లో ప్రతిభ పుష్కలం గా ఉన్నా సౌకర్యాలు కొరవడి ఆటలు నిర్వీర్యమయిపోతుంది .మైదానాలు దురవస్థలో ఉన్నాయి . జాతీయ , అంతర్జాతీయ పోటీల సాధనకు అవసరమైన మినీ స్టేడియం లు అసలే లేవు . జిల్లా కేంద్రం లో ఉన్న కోడిరామముర్తి స్టేడియం మాత్రమే ఆటలము పెద్ద దిక్కు గా ఉన్నది .

జిల్లాలో అనేక పాటశాలలో సరియైన ఆటస్తలములు లేవు . ప్రైవేట్ పాటశాలలు సంఖ్యా ఎక్కువైనకొద్దీ ఆటస్తలములు ఆసాలే ఉండడం లేదు . ఉన్నత పాతశాలలకు గ్రామీణ ప్రాంతం లో అయితే సుమారు ఐదు (5) ఎకరాలు , పట్టనప్రాంతం లో అయితే రెండు వేలు (2000) చదరపు గజాలు స్థలము మైదానానికి అవసరము .

శరీరక సౌష్టవము కొరకు, మానసిక ఉల్లాసము కొరకు తర తరాలనుండి ఆటలు ఒక అద్భుతమైన సాధనం ఉన్నాయి. మన వాళ్ళు రక రకాల ఆటలు ఆడుతూ ఉంటారు.

శ్రీకాకుళం కి చెందినా కొంతమంది క్రీడాకారులు

* కోడి రామమూర్తి - పహిల్వాన్
* కరణం మల్లీశ్వరి - ఒలింపిక్ విజేత
* పూజారి శైలజ - క్రీడాకారిణి
* నీలంశెట్టి లక్ష్మి - క్రీడాకారిణి


  • ==============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Saturday, March 27, 2010

రంగస్థల నాటక కళాకారులు శ్రీకాకుళం లో , Drama Artists in Srikakulam





అలసి సొలసిన మనసుకు సాంత్వన చేకున్చేవి కళలు. అలనాడు రాజుల ఆలనా .. పాలనలో ఎందఱో కళాకారులు తమ ప్రతిభతో ప్రజలను రంజిమ్పచేషేవారు . కాల క్రమేనా రాజులు పోయారు ... రాజ్యాలు కనిపించకుండా పోయాయి .
నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్య రూపకం. జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యదికంగా ఆధరింపబడిన కళ నాటకం.


నాటకం సంగీత నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుదే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకొంటూ రంగప్రవేశం చేస్తాయి. పదహారవ{16} శతాబ్ధంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీది నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చిన వారు కూచిపూడి భాగవతులు. కాకతీయులు కాలంలో ప్రధర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే.తెలుగు నాటకరంగ చరిత్ర తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అనడాన్ని బట్టి నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకొవచ్ఛు.

నాటకం రకాలు

  • * వీధి నాటకాలు
  • * స్టేజి నాటకాలు
  • * రేడియో నాటకాలు
  • * పౌరాణిక నాటకాలు
  • * సాంఘిక నాటకాలు
  • * జానపద నాటకాలు

బహుకళ సమాహారం 'నాటక రంగం' * నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ' - చిక్కోలు ఆణిముత్యాలు

నటుడి చలిని కప్పే దుప్పట్లు... చప్పట్లు! శభాష్‌ అంటూ రసజ్ఞుల ప్రశంసలు... రసానందంతో మైమరిచిపోయి వన్స్‌మోర్‌ టపటపమంటూ కరతాళధ్వనులతో ప్రేక్షకుల ఆదరణ.. ఇవే నాటక రంగానికి ఊపిరి, ఉత్సాహాన్ని అందిస్తాయి. ఇప్పటికీ పల్లెల్లో జరిగే జాతర్లకు, శ్రీరామోత్సవాలు, వివిధ శుభకార్యాల్లో నాటకాల ప్రదర్శనలతో రంగస్థలం ప్రత్యేకత చాటుకుంటోంది. వివిధ మాధ్యమాలు వస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నాటకాలు ప్రదర్శింపజేసి విభిన్న రుచులు కలిగిన జనావళికి ఏకపత్ర సమారాధన చేసే మహత్తర కళా ప్రక్రియ నాటక కళ. శతాబ్ది పైచిలుకు సుదీర్ఘ చరిత్ర కలిగిన నాటకానికి ఎందరో రచయితలు, మరెందరో నటులు... ఇంకెందరో దర్శకులు, ప్రయోక్తలు మెరుగులు దిద్దారు. నటరాజ కాలి అందెల్లో సిరిమువ్వలుగా నిలిచారు.

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎందరో కళాకారులు నాటకరంగం వికాసానికి దోహదపడ్డారు. ప్రభుత్వపరంగా కూడా రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా 686 మంది కళాకారులకు జీవన భృతిని అందిస్తుండడం, శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య లాంటి సాంస్కృతిక సంస్థలు పేద కళాకారులకు ప్రతినెలా ఆర్థిక చేయూతతో పాటు జిల్లా కేంద్రం, ఇతర ప్రాంతాల్లో ప్రదర్శనకు అవకాశాలు కల్పిస్తుండడంతో చిక్కోలు నాటకరంగం చిగురిస్తోందని చెప్పొచ్చు. జిల్లా నుంచి నాటకరంగం రైలెక్కి, సినిమా రంగం విమానంలో విహరించిన ఆనాటి మేటి జె.వి.సోమయాజులు, రమణమూర్తి, శరత్‌బాబు లాంటి కళాకారులతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్రస్థాయిలో 'నంది' కీర్తి పతాకం ఎగురవేసిన కళాకారులు ఉన్నారు. మీగడ రామలింగస్వామి, కేశిరెడ్డి రాజేశ్వరీ, ఎం.రామచంద్రరావు, మీగడ మల్లికార్జునరావు, బి.మోహనరావు, పి.చలపతిరావు లాంటి కళాకారులు నంది పురస్కారాలు అందుకున్నారు.

విశ్వమానవాళికి చైతన్యం.. విశ్వనాటకం
కళాత్మక వారసత్వ సంపద ఒక దేశానికే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా మానవీయ సంబంధాలు పెంపొందించాలనే సదుద్దేశంతో విశ్వమానవాళి చైతన్యం కోసం విశ్వనాటకం దోహదపడాలనే సదాశయంతో పారిస్‌ నగరంలో 1947 మార్చి 27న ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ థియేటర్‌ పేరిట సమావేశం ఏర్పాటు చేశారు. ఆ నాటి నుంచి ప్రపంచ నాటకరంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

చిక్కోలు ఆణిముత్యాలు
ఆనాటి నుంచి నేటి వరకు చిక్కోలు ప్రాభవ వైభవాన్ని చాటిన రంగస్థల కళాకారులెందరో ఉన్నారు. నాటి కళావారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేడు రాష్ట్ర నందులను చిక్కోలుకు తెచ్చిన కళాకారులు అభినందనీయులు. అపరశివాజీగా పేరొందిన చట్టి పూర్ణయ్యపంతులు, అభినవ కృష్ణులుగా స్వర్ణకంకణాలు పొందిన పీసపాటి, అమరావు సత్యం భక్త రామదాసుగా కన్నేపల్లి సుబ్రమణ్యం, కబీరుగా అంపోలు ఎర్రయ్య, కలగా లక్ష్మయ్య అందరికీ సుపరిచిత సుప్రసిద్ధులు కాగా, నేడు కురిటి సత్యంనాయుడు, చీకటి రామారావు, యడ్ల గోపాలరావు, కిలారి లక్ష్మి, ఉయ్యూరు దుర్గాప్రసాద్‌, బగ్గు అప్పారావు నాయుడు, రాజ్యలక్ష్మి, కొత్తూరు పార్వతీశం, కేశిరెడ్డి రాజేశ్వరీ, మోహినీ ఇలా ఎందరో జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు.

'నంది'వర్ధనాలు..
రాష్ట్రప్రభుత్వ నంది నాటక పురస్కారాలను అందుకొని రాష్ట్రంలో చిక్కోలు ఖ్యాతిని చాటిన రంగస్థల కళాకారులుగా.. మీగడ రామలింగస్వామి (రాజాం) ఉత్తమ నటుడు, దర్శకుడిగా రెండు బంగారు నంది అవార్డులను పొందడమే కాకుండా కళాబృందం తరపున 18 నందులను తన ఖాతాలో జమ చేసుకున్నారు. ఉత్తమ అధ్యాపకుడిగా రాష్ట్ర పురస్కారం పొందారు. నత్కీర, నిగమశర్మ, కుంతీకర్ణ వంటి నాటకాలకు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సోదరుడైన మీగడ మల్లికార్డునరావుకి హార్మోనిస్టుగా సంగీతంలో నంది అవార్డు వచ్చింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన కేశిరెడ్డి రాజేశ్వరీ 2006లో నంది పురస్కారం అందుకున్నారు.

* బోరివంకకు చెందిన రంగస్థల కళాకారులు బి.మోహనరావుకి 'కాటు' నాటికకు, పి.చలపతిరావు 'రేల' నాటికకు నంది అవార్డులు దక్కాయి. వీరిని శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య అప్పటి జిల్లా కలెక్టర్‌ వి.ఎన్‌.విష్ణు సత్కరించి అభినందించారు.

* జి.సిగడాం, ఎస్‌.పి.రామచంద్రాపురంనకు చెందిన ముళ్లపుడి రామచంద్రరావుకు అశ్వత్థామకి నంది అవార్డు లభించింది.

* జిల్లాలో సుమారు 250 వరకు పౌరాణిక సాంఘిక నాటక సమాజాలున్నాయి. పరిషత్‌ నాటక పోటీల్లో శ్రీశయన సంస్థ, టెక్కలి ప్రాంతానికి చెందిన మూల తాతయ్య, స్టాలిన్‌ల నిర్వహణలో ఎయిడ్స్‌ భూతంపై 'అంతం... అంతం' నాటకం జాతీయస్థాయి గుర్తింపు పొందింది.

కొందరి అభిప్రాయాలు
* నాటక ప్రదర్శనలు ప్రజల భావనాశక్తిని మెరుగుపరుస్తాయి. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వినూత్న దృష్టితో అవలోకించేందుకు మనిషిని ప్రోత్సహిస్తాయి.
- బెర్నార్ట్‌ షా

* నటనకు రసానుభూతి లేదు. నవ్వినట్లుగా ఉండి నవ్వించడం, ఏడ్చినట్లు ఉండి ఏడ్పించాలి... అంతే! అయితే అది స్వభావసిద్ధంగా ఉండాలి.
- మాధవపెద్ది వెంకట్రామయ్య

* నలుగురు పొగిడినంతమాత్రాన నటీనటులు ఉబ్బితబ్బిబై సవాళ్లకు దిగరాదు. నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందనే సంకల్పంతో ముందుకు సాగాలి.
- మిక్కిలినేని రాధాకృష్ణ

* ఎవరు ప్రదర్శించినా రక్తికట్టే నాటకాల కంటే, దేన్ని ప్రదర్శించినా రక్తి కట్టించే నటీనటులే Andhra దేశంలో ఎక్కువమంది ఉన్నారు.
- శ్రీశ్రీ

తెలుగు నాటకరంగ దినోత్సవం : కందుకూరి మీరేశలింగం పంతులు గారి పుత్తిన రోజైన ఏప్రిల్ 16 తేదీని తెలుగు నాటకరంగం దినోత్సవం గా రాష్ట్ర సాంసృఉతిక శాఖ గుర్తించినది .

  • ============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Friday, March 26, 2010

ఇంజనీరింగ్ కాలేజీలు శ్రీకాకుళం లో , Engineering Colleges in Srikakulam dist.




శాస్త్ర , సాంకేతిక రంగాలలో శ్రీకాకుళం జిల్లా పురోగమిస్తోంది . జిల్లాలో పది (10) ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి . వేలాది మంది విద్యార్ధులు వివిధ రంగాలలో చదువుకుంటున్నారు .

రాస్ట్రం లో ఉన్న టెక్నికల్ కాలేజీలు :

  • ఫేకల్టీ ----------- కాలేజీలు ------- సీట్లు
  • బి.టెక్.----------656------------2,27,410.
  • బి.ఫార్మసీ--------269------------8067.
  • యం.భి.ఎ.------- 865------------58,716.
  • యం.సి.ఎ.--------704------------47596.

జిల్లా సమాచారము :

కళాశాలలు/సీట్లు -ఇంజినీరింగ్= 10 /3630, బి.ఫార్మసీ=2/60 , యం.బి.ఎ.=9/540 , యం.సి.ఎ.=6/360.

ఇంజినీరింగ్ కళాశాలలు - 10
విద్యార్దులు :
  • కంప్యుటర్ సైన్స్---- = 789.
  • ఐటి -------------= 545,
  • ఈ సి ఈ ---------= 731 ,
  • ఇ ఇ ఇ ----------= 692 ,
  • మెకానికల్ -------= 180,
  • సి వి ల్ ---------= 120 ,
  • ఇనస్టు మెంటేషన్ -= 60 ,
  • కెమికల్ ---------= 60 ,
  • సి ఈ -----------= 60 ,
  • ------------మొత్తం =3237
ఇంజినీరింగ్ కాలేజీలు :


  • 1.Aditya Institute of Technology & Management -K.Kotturu Village, Tekkali Taluk,Srikakulam District-PIN 532 201
  • 2.GMR Institute of Technology -GMR Nagar, Rajam - 532 127,Srikakulam district, Andhra Pradesh
  • 3.Sarada Institute of Science & Technology And Management- AMPOLU ROAD,GARA MANDALAM-Pin : 532001
  • 4.Prajna Instt. of Tech. & Mgmt, NH-5, Ramakrishnapuram, Palasa-532243, Ragoi, Via Haripuram, Srikakulam dist.,\
  • 5.Sri Sivani College of Engg, NH-5, Chilakalapalem Jn, Etcherla (M), Srikakulam - 532 402.
  • 6.Sri Sivani Inst. of Tech., Chilakapalem Jn. Etcherla (M), Srikakulam Dist. - 532 402
  • 7.Sri Vaishnavi College of Engg., Singupuram (V), Srikakulam (M), Srikakulam Dist - 532185.
  • 8.Sri Venkateswara College of Engg. & Tech., Etcherla, Srikakulam - 532 402
  • 9.Mithra Inst.of Technology, Mithra Hospital Complex, Beside KR Stadium, Srikakulam
  • 10.Shiva Rama Krishna College of Engineering & Technology,Turakala Kota, Nandigam Mandal Srikakulam Dist.


  • ===============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Thursday, March 25, 2010

నదులు శ్రీకాకుళం లో , Rivers in Srikakulam





శ్రీకాకుళం లో ప్రక్రుతి ప్రసాదించిన ఎన్నో నదులున్నా ముఖ్యము గా చెప్పుకోదగ్గవి ....

1. నాగావళి,
2. వంశధార ,
౩. మహేన్ద్రతనయ,
4. చంపావతి,
5. బహుద,
6. కుమ్భికోతగెడ్డ,
7. సువర్ణముఖి,
8. వేగావతి,
9. గోముఖి.

  • వంశధార

* ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లాలోని మిన్నజోలా వద్ద వంశధార జన్మించింది. ఆ రాష్ట్రంలో 154 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. అక్కడి నుంచి సరిహద్దులో 29 కిలోమీటర్ల దూరం ప్రయాణించి భామిని మండలం కంట్రగడ వద్ద ఆంధ్ర భూభాగంలోకిప్రవేశిస్తోంది.అది మొదలుకొని జిల్లాలో ఈ నది మొత్తం 82 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. గార మండలం కళింగపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తోంది.వంశధార నదిపై గొట్టా బ్యారేజీ ఉంది. దీనికి కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి.
* హిరమండలం మండలం గొట్ట వద్ద 1972వ సంవత్సరంలో గొట్టా బ్యారేజీ పనులు ప్రారంభించి 1977లో పూర్తి చేశారు.
* బ్యారేజీతో పాటు 1,48,230 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో 1977 సెప్టెంబరు 29న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ బ్యారేజీని ప్రారంభించారు.
* కుడికాల్వ ద్వారా 67591 ఎకరాలకు నీరు అందించేందుకు పనులను 1983లో ప్రారంభించారు 2000 నాటికి పూర్తయ్యాయి.
* కుడి కాలువ పొడవు 56 కిలోమీటర్లు. హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస, గార, శ్రీకాకుళం, మండలాల్లోని 62 వేల ఎకరాలకు దీని ద్వారా సాగునీరందుతోంది.
* ఎడమ కాల్వ పొడవు 107 కిలోమీటర్లు. దీనిద్వారా నరసన్నపేట, టెక్కలి, జలుమూరు, పలాస తదితర 13 మండలాల పరిధిలో 1,48,000 ఎకరాలకు సాగునీరందుతోంది.
* గొట్టా బ్యారేజీ సాధారణ సామర్థ్యం 34 అడుగులు. గరిష్ఠ సామర్థ్యం 38 అడుగులు.
* ఈ గొట్టా బ్యారేజీ ద్వారా 2.10 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది.
* బ్యారేజీలో 38.01 (0.10 టీఎంసీలు) మీటర్ల మేర నీటిని నిల్వ ఉంచుతున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద 22 సాధారణ గేట్లతోపాటు 2 అత్యవసర గేట్లు ఉన్నాయి. బ్యారేజీ పొడవు 457 మీటర్లు

  • నాగావళి

నాగావళి ఒడిశాలోని రాయగడ కొండల్లో పుట్టి 90 కిలోమీటర్లు ఒరిస్సాలో ప్రవహించి జిల్లాలో వంగర మండలంలో ప్రవేశిస్తోంది. జిల్లాలో 115 కిలోమీటర్లు ప్రవహించి శ్రీకాకుళం సమీపంలోని కల్లేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. దీనికి లాంగుల్యా అను మారు పేరు ఉంది. నాగావళి నదిలో నీటి ప్రవాహం 70 వేల క్యూసెక్కులు దాటితే నదీపరీవాహక ప్రాంతాలకు వరద ముప్పు వాటిల్లినట్టే. కరకట్టల నిర్మాణం పూర్తి కాకపోవడంతో నదీ తీర ప్రాంతాల గ్రామాలన్నీ ఏటా ముంపు బారిన పడుతున్నాయి. నాగావళి నదిపై విజయనగరం జిల్లాలోని తోటపల్లి వద్ద తోటపల్లి ప్రాజెక్టు నిర్మించారు. దీన్ని జలయజ్ఞంలో భాగంగా రూ. 467 కోట్లతో రెండో దశ విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వల ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, రెండో దశ విస్తరణ పనులు పూర్తయితే మరో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. ప్రస్తుతం కుడికాల్వ ద్వారా వంగర మండలంలోని 3,500 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా 38 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రెండో దశ విస్తరణ పూర్తయితే జిల్లాకు అదనంగా జి.సిగడాం, రేగిడి, రాజాం, సంతకవిటి, వంగర, రణస్థలం, లావేరు మండలాల్లోని 58 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. నాగావళికి ఉపనదులు ఒట్టిగెడ్డ, జంఝావతి, సువర్ణముఖి.
శ్రీకాకుళం పట్టణానికి ప్రధాన నీటివనరు నాగావళి నది. ఈ నది ద్వారా సుమారు 10 మిలియన్‌ లీటర్ల నీటిని రోజువారి ఉపయోగిస్తున్నారు. మనిషికి సగటున 90 లీటర్ల చొప్పున పంపిణీ చేస్తున్నారు. నాగావళి నది వలన శ్రీకాకుళం పట్టణానికి వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఉండదు.

  • మహేంద్ర తనయ , బహుదా నదులు

మహేంద్ర తనయ , బహుదా నదులు ఇచ్చాపురం , పలాస నిహోజక వర్గాలకు ప్రధాన నీటి వనరులు . ఇవి ఒరిస్సాలొ పుట్టి ... ఆంధ్ర లొ సముద్రం లో కలుస్తున్నాయి . మహేంద్రతనయ నది ఆవిర్భావం తరువాత రెండుగా మారి ఒక పాయ్ ఇచ్చాపురం నియోజకవర్గం మీదుగా సాగరానికి చేరుతుంది . మరో పాయ పాతపట్నం పరిసర ప్ర్రాంతాల మీదుగా ప్రవహిస్తోంది . వీటి ద్వారా జిల్లాలో 50 వేల ఎకరాల వరకు సగుచేసే అవకాశం ఉన్నది .
  • బాహదా
    ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ గ్రామం వద్ద ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన బాహుదా నది కొళిగాం, కీర్తిపురం, పాయితారి, తోటూరు, బిర్లంగి, మశాకపురం, రత్తకన్న, ఇచ్ఛాపురం, లొద్దపుట్టి, శాసనం, అరకబద్ర, టి.బరంపురం తులసిగాం, కొఠారి, ఈదుపురం, కేశుపురం, బూర్జపాడు గ్రామాల మీదుగా ప్రవహించి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
    * ఒడిశా జరడా కొండలలో పుట్టిన ఈ నది ఒడిశాలో 38 కిలోమీటర్లు, ఆంధ్రాలో (కేవలం ఇచ్ఛాపురం) కేవలం 16 కిలోమీటర్లు ప్రవహించి సముద్రానికి చేరుతోంది.
    * ఒడిశా రాష్ట్రం ఈ నదీ జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఏటా రెండు పంటలు సమృద్ధిగా సాగుచేసుకుంటోంది. అదే ఆంధ్రాలో ఈ నదిలో వచ్చిన వరద జలాలను సైతం జాగ్రత్త పరిచే చర్యలు లేవు. వరదలు వస్తే ముంపు, లేకుంటే కరవు.. ఇదీ ఆంధ్రా పరిస్థితి.
    * ఇచ్ఛాపురానికి సుమారు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న భగలట్టి గ్రామం వద్ద కిలోమీటరున్నర పొడవున 110 అడుగుల ఎత్తున ఒడిశా ఆనకట్టను నిర్మించింది. గత పదేళ్ళుగా ఈ ప్రాజెక్టు కోసం రూ.వందల కోట్లు వెచ్చించారు. బాహుదా జలాలన్నీ అక్కడే నిల్వ చేసుకుని ఆ రాష్ట్రంలో సగం ప్రాంతానికి ఈ నీటిని విడుదల చేస్తున్నారు.
    * ఆంధ్రాలో బాహుదాజలాలపై ఆధారపడి సుమారు 7 వేల ఎకరాల పంటభూములు ఉన్నాయి. ఈ భూములను ప్రస్తుతం పరిశీలిస్తే, అన్ని చోట్లా బోర్లు వేసుకుని సాగుచేసుకోవడంకనిపిస్తుంది.
    * అరకబద్రవద్ద రిజర్వాయర్‌ కట్టాలని 1978లో ఆంధ్రా ప్రభుత్వం సంకల్పించింది. అప్పట్లో దీనికి రూ. 40 కోట్లు అవసరమౌతాయని భావించారు. సర్వేలు, అంచనాలతో సంవత్సరాలు గడిచిపోయాయి. సర్వే కోసమే రూ. 40 కోట్లు ఖర్చు చేశారు. తీరా చివరకు తేల్చిందేమిటంటే ఈ ప్రాజెక్టుకోసం రూ. 250 కోట్లు కావాలని చెప్పారు. 7 వేల ఎకరాల కోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకని ప్రభుత్వం వెనకంజ వేసింది. అదే ఈ ప్రాంత ప్రజల పాలిట శాపంగా మారింది.
    * ఈ నదిపై ప్రత్యక్షంగా ఈదుపురం ఉద్దానం మంచినీటి పథకంతో పాటు, శాసనం, ఇచ్ఛాపురం పురపాలకసంఘం మంచినీటి పధకం ఆధారపడి ఉన్నాయి. రత్తకన్న ప్రాంతానికి బాహుదానదిలో వేసిన ఊటబావుల ద్వారానే మంచినీటిని సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో పురుషోత్తపురం గ్రామంలో ఏర్పాటు చేసే మంచినీటి పథకానికి కూడా బాహదా జలాలే ఆధారం. ఇక పరోక్షంగా కొళిగాం నుంచి డొంకూరు వరకు గల గ్రామాలన్నీ ఈ నదీ జలాలకు సమీపలోనే బోర్లు వేసుకుని నీటిపథకాలను అమలు చేస్తున్నాయి.
    * ఎగువనున్న ఒడిశా అంతరాష్ట్రనదీజలాల ఒపందాన్ని కాలరాస్తోంది. 1974లో అప్పటి ఆంధ్రా ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్‌ల మధ్య భువనేశ్వర్‌లో జల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాది పొడునా 1.5 టి.ఎం.సి.ల నీటిని ఆంధ్రాకు విడిచి పెట్టాలి. గతంలో వరదలు వస్తే నీరు నిల్వ చేసే అవకాశం లేక నీటిని ఆంధ్రాకు విడిచి పెట్టేసేవారు. దాంతో ఆంధ్రా పంటభూములన్నీ మునిగిపోయేవి. ఇప్పుడు భగలట్టి ఆనకట్ట ఎత్తు పెరిగి పోవడంతో వరద నీరుకూడా దిగువకు విడిచి పెట్టడం లేదు. దాంతో వర్షాలు పడిన మూడు నెలలు మినహా మిగిలిన కాలమంతా బాహుదానది ఎండిపోయి కనిపించేది.
    * ఆంధ్రా పరిధిలో ఉన్న ఈ నదికి 11 ఓపెన్‌ హెడ్‌ చానళ్లు ఉన్నాయి.

  •  బాహుదానది చేరిన నీరు: 11.50 శతకోటి ఘటపుటడుగులు (టీఎంసీలు) శ్రీకాకుళం జిల్లాకు రావాల్సిన వాటా: 1.5 టీఎంసీలు వచ్చిన వాటా: 0.60  టీఎంసీలు * మన నీటిలోనూ ఒడిశా వాడకం: 0.20 టీఎంసీలు సముద్రంపాలైది: 0.10 టీఎంసీలు.  మన నీటి వాటా 1.5 శతకోటి ఘటపుటడుగులు (టీఎంసీలు).. భారీ వర్షాలు.. తుపానులు వస్తే.. నీటిని దాచుకోవడం కష్టం అనిపిస్తే.. వాటిని ఆంధ్రాకు విడిచిపెడుతూ.. 'ఇవే లెక్కకట్టుకోండని' అని చెబుతున్నారు ఒడిశా అధికారులు.. బగలట్టి జలాశయాన్ని 110 మీటర్ల ఎత్తుకు పెంచారు. కేవలం బాహుదా నదిపై నిర్మించిన కట్టడాల కోసమే రూ. 500 కోట్లకు పైగా వెచ్చించారు. 8 మినీ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారు.. వారికి నీరంటే అంత ప్రాణం మరి..

    బాహుదాతో 12,000 ఎకరాలకు సాగు.. 28 గ్రామాలకు తాగునీరు.. ఇవీ మన అవసరాలు.. మరిమనమేం చేస్తున్నాం.. ఒడిశాను ప్రశ్నించలేకపోతున్నాం.. వచ్చిన నీటిలో 0.10 టీఎంసీల నీటిని సముద్రంలో కలిపేస్తున్నాం.. పాలకులు.. అధికారుల్లో ఒకటే నిర్లక్ష్యం.. మనదేంపోయింది.. జనమేగా.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. భారీ వర్షాలొస్తే పంటలన్నీ ముంపే..వర్షాలు లేకుంటే చెరువులు సైతం నీటిచుక్కలేని వనరులుగా మిగిలిపోతున్నాయి. జిల్లాలో ప్రధాన నదులు వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా.. మిగిలిన నదులకన్నా బాహుదా పూర్తి నిర్లక్ష్యానికి గురౌతోంది. ఒడిశాలో పుట్టి ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ వద్ద ఆంధ్రాలోకి ప్రవేశించిన ఈ నదీ జలాలు వృథాగా బంగాళాఖాతానికి చేరుతున్నాయి. మధ్యలో ఎక్కడా నీటిని ఆపే ప్రయత్నాలు మన ప్రభుత్వం చేయడంలేదు.
    • అవసరాలు అధికం
    * బాహుదా నదికి ఉన్న పంట కాలువలైనా అభివృద్ధి చెంది ఉంటే గతరెండేళ్లుగా వరుసగా కరవు పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చేదికాదు. ఈ నదికి 11 పంటకాలువలున్నాయి. వాటిపై ఆధారపడి 18 పంచాయతీల పరిధిలోని సుమారు 12వేల ఎకరాల సాగుభూమి.. తాగునీటి కోసం ఇచ్ఛాపురం పురపాలక సంఘంతో పాటు ఇచ్ఛాపురం, కవిటి మండలాల లోని 28 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. బాహుదా తీరం వెంబడి చూస్తే, నదికి చేరువలో ఉన్న గ్రామాల్లో సైతం మోటార్లు పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కనిపిస్తున్నారు.
    • ఎగువ అలసత్వం.. దిగువ నిర్లక్ష్యం
    ఎగువ ఒడిశాలో పుట్టిన బాహుదా ఆంధ్రా మీదుగా బంగాళాఖాతంలో కలుస్తోంది. ఒడిశాలో 38, ఆంధ్రాలో 16 కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తోంది. ఒడిశా అనుమతిలేని కట్టడాలతో నీటిని వినియోగించుకుంటుండటంతో ఆంధ్రాకు అతి తక్కువగా నీరు వస్తోంది. అదీ వరదలు వచ్చినపుడే నదిలో నీటికళ కనిపిస్తోంది. వరద నీరుకూడా ఆంధ్రాకు దక్కకూడదన్నట్లుగా బగలట్టి ఆనకట్ట ఎత్తు పెంచుకోవడంతో పాటు ఆంధ్రా ప్రాంతాలలోకి చొచ్చుకువచ్చి
    • అడ్డుకట్టలు కడుతోంది.

    * మన ప్రాంతంలో కాలువల నిర్వహణ కొరవడింది. రైతులే ఏటా శ్రమదానం చేసి కాస్త రూపు తెస్తున్నారు. బాహుదా ఉత్తరవాహిని (ఉత్తరాయణం) వద్ద సిమెంటు పనులు తప్పా నీటిపారుదల శాఖ ఏ పనులూ చేయలేదు. కొన్ని చోట్ల రైతులకు సొమ్ములిప్పిస్తామని చెప్పి, పనులు చేయించుకుని, సొమ్ములు ఇవ్వని పరిస్థితి కూడా ఉంది. సక్రమంగా నిర్వహణలేని కాలువల పరిస్థితి దయనీయంగా మారాయి. ప్రథమ కాలువ రాజ్‌గాయ్‌ మొదలుకుని చివరి కేశుపురం, బూర్జపాడు వరకు అంతటా ఇదే పరిస్థితి. పురుషోత్తపురం పుష్పగిరి, బెల్లుపడ శుద్ధికొండ, పీర్లకొండ, సూదికొండలపై కురిసిన వర్షపు నీరంతా వివిధ మార్గాలలో బాహుదా నదికే చేరుతోంది. ఈ నీటిని కట్టడి చేసినా ఫలితం దక్కేది.

    * సమస్యపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. సానుకూలమైన నివేదికను ప్రభుత్వానికి దాఖలు పరచింది. 12వేల ఎకరాలకు రూ. 250కోట్లు వెచ్చించడమా అంటూ పాలకులు వెనుకంజవేశారు. ఒడిశా ప్రభుత్వం కేవలం బాహుదానదీ జలాల కోసం ఏటా రూ. వందల కోట్లు వ్యయం చేస్తోంది. ఇచ్ఛాపురం ప్రాంతంలో సాగునీటి వనరుల అభివృద్ధికి రూ. 3.54 కోట్లు వచ్చాయి. వీటిని బాహుదా కాలువల బాగుకు కేటాయించారు. ఈ నిధులను వ్యయం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. గత ఏడాది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి వనరుల అభివృద్ధిని చేపట్టారు. అందులో మూడు చోట్ల అనుబంధ పనులు చేశారు. కూలీలకు ఉపాధి అయితే దొరికింది గానీ కాలువలకు పూర్తి మేలు జరగలేదు. ఇచ్ఛాపురం ప్రాంతంలో బాహుదా నది కాక భీమసాగరం గెడ్డ, పద్మాపురం గెడ్డ, వందల ఎకరాల విస్తీర్ణంతో ఉండే సాయిరాం, వడ్డిన, సిద్ధి చెరువులు ఉన్నాయి. 25 ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు ఆయకట్టు గల పంచాయతీరాజ్‌ చెరువులు 120 ఉన్నాయి. జలాలన్నీ ఒడిశాకే
    * ఎగువన ఒడిశా ఉండటం, దిగువున ఆంధ్రా ఉండటంతో ఎగువ నుంచి ప్రవహించే నదీ జలాలను ఒడిశా వినియోగించుకుంటోంది. గత ఒప్పందాలను కూడా కాలరాయడమే కాకుండా, ఎక్కడికక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టి నీటిని హరిస్తోంది. ఇంత జరుగుతున్నా ఆంధ్రా పాలకులు చోద్యం చూస్తున్నారు. అక్కడ 11.50 శతకోటి ఘటనపుటడుగుల (టి.ఎం.సి.)ల నీరు చేరుతోంది. వాటిని వివిధ జలాశయాలు, కాలువల ద్వారా నిల్వచేసి మళ్లిస్తోంది.ఆంధ్రాకు వచ్చే వరదనీరు వృథాయే ఆంధ్రా ప్రాంతానికి చేరే కాస్త జలాలనైనా వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడా నీటిని అడ్డుకట్ట వేసి, మళ్లించే చర్యలు లేవు. బాహుదానది ఆంధ్రాలోకి ప్రవేశించాక 8 మినీ ఎత్తిపోతల పథకాలను ఒడిశా నిర్వహిస్తోంది. ఆంధ్రాలో ఈదుపురం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం కూడా మూలకు చేరినా పట్టించుకునే నాథుడు కరవయ్యారు. బాహుదానది ద్వారా ఆంధ్రాకు 0.60 టి.ఎం.సి. నీరు వస్తోంది. అందులో ఆంధ్రాకు 0.30 టి.ఎం.సి.ల నీరు వినియోగమౌతుంటే, ఒడిశాకు 0.20 టి.ఎం.సి.ల నీరు వాడుతున్నారు. ఇక్కడ 12 వేల ఎకరాలు ఉండగా, అక్కడ కేవలం 2,500 ఎకరాల కోసం ఆ నీరు వాడుతున్నారు. మిగిలిన 0.10 టి.ఎం.సి.ల నీరు సముద్రానికే చేరుతోంది. ఒప్పందం అమలుకావడం లేదు -నాటి ఇరురాష్ట్రాల ఒప్పందం అమలు కావడం లేదు. బాహుదాతో పాటు అన్ని నదుల పరిస్థితి ఇలానే ఉంది.

    --న్యూస్‌టుడే-ఇచ్ఛాపురం (డిసెంబర్ 2012)
 
  • మహేంద్రతనయ
    మహేంద్రతనయ నది ఒడిశాలోని తుంబ అటవీ ప్రాంతంలో పుట్టి రెండుపాయలుగా విడిపోయి ఆంధ్రాలో ప్రవేశిస్తోంది. ఒక పాయ మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో ప్రవహిస్తుండగా మరొక పాయ మందస, సోంపేట మండలాల్లో ప్రవహిస్తోంది. మహేంద్రతనయపై వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, గ్రోయిన్‌ల ద్వారా 40 వేల ఎకరాల వరకు పంట పొలాలు సాగవుతున్నాయి. మందస మండలం పెద్దకోష్ట వద్ద ఆంధ్రాలో ప్రవేశించే మహేంద్రతనయ నది 45 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి సోంపేట మండలం బారువ కొత్తూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. నదిపై పైడిగాం మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుతోపాటు పొత్తంగి, ఏటిబట్టి, బారువ, మూలపొలం గ్రోయిన్‌లు, పొత్రఖండ ఎత్తిపోతల పథకాల ద్వారా మందస, కంచిలి, సోంపేట మండలాల పరిధిలో 25 వేల ఎకరాల పంట పొలాలు సాగవుతున్నాయి. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో 300కు పైగా గ్రామాల పరిధిలో 4 లక్షల మందికి తాగునీరందుతోంది. నదిపై ఉద్దానం ప్రాజెక్టుతోపాటు 10 రక్షిత మంచినీటి పథకాలు, ఒక సమగ్ర గ్రామీణ మంచినీటి పథకం పనిచేస్తున్నాయి
సోంపేట , కంచలి , మందస , మెళియాపుట్టి , పలాస , పాతపట్నం మండలాల పిధిలో మహేంద్రతనయ ప్రవహిస్తుంది .
ఇచ్చాపురం , పలాస నియోజకవర్గాల పరిధిలో మూడువందల గ్రామాలు ఈ నదీ జల్లల పైనే త్రాగు నీటికి ఆధారపడి ఉన్నాయి . పైడిగాం ప్రోజెక్ట్ తో పాటు బారువ , పొత్తంగి , ఏటిబట్టి , మూలపొలం గ్రోయిన్లు , పొత్రఖండ వద్ద ఎత్తిపోతల పథకాలు ఈ నది పై ఉన్నాయి .
బహుదా నది పై ఈదుపురం వద్ద ఒకేఒక ఎత్తిపోతల పథకం ఉన్నది ... అది కుడా అలంకారప్రాయమయింది .

  • సువర్ణముఖి
ఒరిస్సాలో జన్మించిన ఈ నది వంగర మండలం కొండ శేఖరపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తోంది. జిల్లాలో మొత్తం 17 కిలోమీటర్ల మేర ప్రవహించి వంగర మండలం సంగం వద్ద నాగావళి నదిలో కలుస్తోంది. సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు ఉంది. దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది.కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది.ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
  • వేగవతి
వేగవతి నది విజయనగరం జిల్లా పాచిపెంట కొండల వద్ద ప్రారంభమై పశ్చిమ నుంచి తూర్పుగా ప్రవహించి సువర్ణముఖి, గోముఖి నదుల్లో విజయనగరం జిల్లా శిర్లాం వద్ద కలుస్తోంది. అక్కడి నుంచి సువర్ణముఖి నది ప్రవాహం వంగర మండలం మడ్డువలస జలాశయంలోకి చేరుతోంది. ఇక్కడ సామర్ధ్యానికి మించి నీరు నిండితే ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 11 గేట్ల ద్వారా నాగావళి నదిలోకి నీటిని విడిచి పెడతారు. నాగావళి నది ద్వారా అదనపు జలాలు సముద్రంలో కలసిపోతున్నాయి
  • ==========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

http://dr.seshagirirao.tripod.com/

Drinking Water problem in Srikakulam ,త్రాగునీటి ఎద్దడి శ్రీకాకుళం లో




  • శ్రీకాకుళం లో 38 మండలాలు , 1107 గ్రామపంచాయతీలు , 16 మేజరు పంచాయతీలు , ఒక నోటిఫైడ్ నగరపంచయతే -- రాజాం , & 4 మునిసిపాలిటీలు -- శ్రీకాకుళం , ఆమదాలవలస , పలాస , ఇచ్చాపురం . ఉన్నాయి. జిల్లా జనాభా : 28.50 లక్షలు , జనన రేటు : 18.7 /1000, మరణ రేటు : 8 / 1000,గా ఉన్నాయి
  • ఎంత ఘనత సాధించిన త్రాగునీటికి మాత్రం ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు . దీనికి కారణము ఎవరు ? ఎందుకిలా జరుగుతుంది .
  • శ్రీకాకుళం లో ప్రక్రుతి ప్రసాదించిన ఎన్నో నదులున్నాయి ....

    1. నాగావళి,
    2. వంసధార ,
    ౩. మహేన్ద్రతనయ,
    4. చంపావతి,
    5. బహుద,
    6. కుమ్భికోతగెడ్డ,
    7. సువర్ణముఖి,
    8. వేగావతి,
    9. గోముఖి.

ఇన్ని నదులున్నా త్రాగడానికి ఎందుకు నీరు లేదు . నూతులు తవ్వితే నీరు పాడడం లేదు , బోరు వేస్తే ఎక్కడో తప్ప వేసవిలో నీరు ఉండదు . కారణము .. భూమి ఉపరితలము పై నీరు నిలవా లేదు . నదులలో నీరు వేసవిలో ఉండదు ... నిలవా ఉండేందుకు తగిన ఏర్పాట్లు లేవు . పూర్వము ప్రతి గ్రామానికి కనీసము మూడు (3)చెరువులు ఉండేవి ఈలెక్కన జిల్లాలో చిన్న , పెద్ద కలిపి సుమారు 3600 చెరువులు ఉండేవి వర్షాకాలములో నిండి వేసవిలో నీటి అవసరాలు తీర్చేవి ... కాని రాజకీయ నాయకుల పుణ్యమా అని ... ప్రభుత్వపరం గా ఓటు భ్యాంక్ రాజకీయం తో ... ఉన్న పోరంబోకు భూములు , పశువు మేసే పచ్చిక బయళ్ళు , ప్రబుత్వ చెరువు పేదవారికి భూమి పంపకము పేరుతొ ధారదత్తము చేశారు . ప్రక్రుతి ప్రసాదించిన నీరివనరులు ప్రజల అన్యాకాంతం అయి నీటి ఎద్దడికి దారితీసినది .

భూమి లోపల ఉండేది వేడితో కూడుకున్న లావా మరి భూమి లో లోతుగా తవ్వితే మనకి వచ్చేది లావాయే కాని నీరు కాదు . అందుకే
  • భూ ఉపరితలము పై నీటినిలవలు మెరుగు పరిచే ప్రణాలికలు చేపట్టాలి .
  • ప్రతి ఊరికి నాలువైపుల చెరువులు తవ్వి నీటి నిలవ పనులు చేపట్టాలి .
  • ప్రతి నదికీ ప్రతి 20 కిలోమీటర్లకు ఒక నీటి నిలవా డాం (గట్టు) వరదలకు తావివ్వకుండా కట్టి త్రాగునీటి అవసరాలకువినియోగించాలి .
శ్రీకాకుళం జిల్లాలో సుమారు 588 పంచాయతీలలో రక్షిత మంచినీటి పతకాలు చేపట్టేరు ... ఎంతో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారు . నీరుమాత్రం అందడం లేదు .
జిల్లాలో ఉద్దానము , శాలిహుండం పెద్ద పథకాలు . ఇంకా ఎన్నో చిన్న చిన్న నీటి పథకాలున్నాయి .

రాజాం నగర పంచాయతి :
రాజాం పట్టణానికి 16 కి.మీ.దూరములో ఉన్న రేగిడి మండలం నాగావళి నది నుండి పైపులైన్లు ద్వారా తాగునీటిని తరలిస్తున్నారు . పట్తణ జనాభా 46 వేలు దాటే ఉన్నది . . . ఆ స్థాయి తాగునీటి సరఫరా మాత్రం కావడం లేదు . ప్రదాన పైపు లైన్‌ కి మజ్జిరాయుడు పేట , బూరాడ , గురవాం , లింగాలవలస కూడలి , శిర్లాం కూడలి , తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున లీకులు ఏర్పడడం తో చాలా మటుకు మంచినీరు వృదా అవుతుంది . ఇప్పటి వరకు రాజాం లో 300 వరకు పబ్లిక్ కొళాయిలు , 800 వరకూ ఇంటి కుళాయిలు ఉన్నాయి. కొన్ని చోట్ల ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు . ఎన్ని నీటిపథకాలు పెట్టినా వాటి నిర్వహణ బాద్యతలు చేపట్టనిదే ఎందుకు పనికిరాకుండా నిరుపయోగమవును. ప్రభుత్వ బాద్య్యత ఎంతఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రజలు , ప్రబుత్వోద్యోగులు వహించాల్చిన అవసరము ఉంది .

శ్రీకాకుళం పట్టణము :
36 వార్డులు , లక్షా 27 వేల జనాభా ఉన్న శ్రీకాకుళం టౌన్‌ లో ఒక సెంట్రల్ రిజర్వాయర్ , 9 సర్వీస్ రిజర్వాయర్లు , 3 పంపింగ్ స్టేషన్లు , 285 వరకు బోర్ల ద్వారా పస్తుతము తాగునీటి సరఫరా చేస్తున్నారు . 8950 ఇంటి కుళాయి కనెక్షన్లు , 412 పబ్లిక్ కుళాయిలు , ద్వారా రోజుకు 10.50 మిలియన్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు . ఈ లెక్కన ఒక్కో పౌరుడుకి 90 లీటర్ల నీటిని ఇస్తున్నందునట్లు అధికార గణాంకాలు చూ్సిస్తున్నాయి . కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా తాగునీటిని సరఫరా అవుతుంది . నాగావళి నది నీటిని క్లోరినేషన్‌ చేసి సరఫరా అవుతుంది .

కొన్ని నిజాలు :
  • శ్రీకాకుళం లో సుమారు 22 ఏళ్ళ క్రితం వేసిన గొట్టాల ద్వారానె నేటికి నీరు సరఫరా చేస్తున్నారు . కొన్ని చోట్ల నీటి గొట్టాలు తృప్పు పట్టి రంద్రాలు ఏర్పడి కొన్ని చోట్ల మురుగు కాలవల నీటితో కలుసితమవుతున్నాయి.
  • పైపుల లీకుల మూలాన నీటిలో బ్యాక్టీరియా , ఇతరత్రా విషపదార్దాలు నేరుగా కలిసిపోతున్నాయి.
  • ఏడాది రూ. 75 లక్షల వరకూ ఆదాయము వస్తున్నా నీటి గొట్టాలు మార్చడం కాని , రిపేరు చేయడం గాని , అధికారుల , నాయకుల పర్యవేక్షణ లేదు.
  • చాలా కుళాయిలము డైరెక్ట్ గా మోటార్లు పెట్టి నీటిని తోడేయడం వలన ఎత్తు ప్రాంతాలకు నీరు అందడం లేదు . హొటల్లు, లాడ్జీలు, ఆపార్ట్మెంట్లు, పెద్దపెద్ద హాస్పిటల్ ఈ మోటార్ల ద్వారా తమ నీటి అవసరాలు తీర్చుకుంటున్నాయి. వీరికి తగిన శిక్షలు వేయాలి . లంచాలకు అలవాటైన ఉద్యోగులు ఈ విషయాన్ని చూసి చూడనట్లు కాలం వెళ్ళబుచ్చుతున్నారు .
  • పేద , ధనిక అనే తారతమ్యము లేకుండా కుళాయిలన్నింటికీ మీటర్లు పెట్టి నీటి వాడకం బట్టి రుసుము వసూలు చేయాలి . నాయకులు ఓటు బ్యాంక్ కోసం ఆ పని చేయడం లేదు .
  • శ్రీకాకుళం జనాభా ------------------లక్షా 27 వేలు ,
  • మొత్తము వార్డులు -----------------36 ,
  • కుళాయి కనెక్షన్లు ------------------8950,
  • పబ్లిక్ కుళాయిలు ------------------412 ,
  • పట్టణములో పైపులైన్ల పొడవు ------110 కి.మీ.,
  • రోజుకు ఒక్కక్కరికి అవసరమైననీరు -100 లీ.
  • సరఫరా అవుతున్న నీరు -----------90 లీ.

ఆవదాలవలస పట్టణము :

నాగావళి , వంశధార రెండు ప్రదహాన నదుల చెంతన ఉన్నా ఆమదాలవలస పట్టణము లో దాహం కేకలు తప్పడం లేదు . తగిన తాగునీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడం లో అధికార యంత్రాంగము విఫలమవుతోంది . సుదూర ప్రాంతాలలోని బోరు బావులపైనే పట్టణవాసులు ఆధారపడుతున్నారు . పట్టణ జనాభా ప్రకారము రోజుకు 7.5 లక్షల క్యాలన్ల తాగునీరు అవసమవగా 4.5 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా అవుతుంది . సరియైన పర్యవేక్షణ , నిర్వహణ లేక ఈ నీటిలో కొంత వృదాఅయిపోతుంది .
నిజమైన నిజాలు :
  • పురాతన పైపులే ఉండడం తో ఎక్కడి కక్కడే లీకులు ఉన్నాయి.
  • పురపాలక సంఘం ఆవిర్భవించి 25 ఏళ్ళు గడుస్తున్నా కొన్ని వార్డులలో పైపులైన్లు ఇంకా వేయలేదు .
  • కుళాయి నిర్వహణ బాగులేనందున కుళాయి చుట్టూ నేల బావి లా తలపిస్తున్నాయి .
  • రాజకీయ నాయకులు సేవా దృక్పదము తో కాకుండా ఓటు బ్యాంక్ కోసం మే పనులు చేస్తున్నారు . . అభివృద్ధి కుంటుపడుతుంది .
  • ఆముదాలవలస జనాభా ----------37931 (2001),
  • వార్దులు -------------------------23,
  • విస్తీర్ణము -----------------------19.65 చ.కి.మీ.,
  • రక్షత పథకాలు ------------------4,
  • రిజర్వాయరు --------------------1,
  • పైలెట్ వాటర్ పథకాలు ----------3,
  • బోర్లు --------------------------169 ,
  • బావులు ----------------------82 ,
  • ప్రజా కుళాయిలు -------------178,
  • ఇంటి కుళాయిలు -------------1325,
పలాస -కాశీబుగ్గ :
దినదినాభి వృద్ధి చెందుతున్న పలాస -కాశీబుగ్గ మున్‌సిపాలిటి లో 25 వార్డులకు సగానికే రక్షత తాగునీటి సరఫరా ఉంది .
జనాభా ---------------57323,
రోజుకు అవసరమగు నీరు ---8 మిలియన్‌ లీటర్లు ,
పస్తుతం సరఫరా నీరు ------01 మిలియన్‌ లీటర్లు ,
పైపులైన పరిది ------------38 కి.మీ,.
వీధి కుళాయిలు -----------170 ,
బోర్లు ---------------------195,
ఇంటి కుళాయిలు ---------730, .
ఇచ్చాపురం :
పదేళ్ళ క్రితం ఇచ్చాపురం జనాభా 32662 ఉండేది . ప్రస్తుతం ఇది 36,000 లకు పెరిగింది . బహుదా నది లో మూడు ఊట బావుల ద్వారా సేకరించిన నీటిని పైపులైన్లు ద్వారా సరఫరా చేస్తున్నారు . ఇచ్చాపురం పురపాలక సంఘం లో 23 వార్డులు ఉన్నాయి . ఇక్క డ 23 కి.మీ మేరకు పైపులైన్లు ఏర్పాటు చేస్సరు . పట్నం అన్ని వార్డులకు నీరు అందడం లేదు . నీటి ట్యాఖర్ల ద్వారా కొన్ని ప్రాంతాలకు రక్షత నీటిని అందజేస్తున్నారు .
ఇక్కడ వాస్తవంగా ...
  • మనిషికి రోజుకు 100 లీటర్ల నీటిని అందివ్వాల్సివుంది , ఇక్కడ 50 లీటర్ల వరకు అందుతుంది .
  • రోజుకు 3.60 మిలియన్ల లీటర్ల నీరు అవసరము ఉండగా 2.50 మిలియన్ల నీరు మాత్రమే లభ్యమవుతుంది .
  • గృహకుళాయిలు ------------------------- 1050,
  • ప్రజా కూళాయిలు ------------------------108 ,
  • గొట్టపు బావులు -------------------------120 ,

కలుషితమవుతున్న మంచినీరు - శ్రీకాకుళం :

కలుషిత నీరు కారణంగా జిల్లాలో ఏటా వేల సంఖ్యలో అతిసారం, టైపాయిడ్‌, పచ్చకామెర్లు, విష జ్వరాల బారిన పడుతున్నారు.
జిల్లాలో 794 మంచినీటి పథకాలు, 13,127 తాగునీటి బోర్లు, 325 మంచినీటి బావులున్నాయి. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో నదులు, గెడ్డలు, చెరువుల్లో నీరు కనిపిస్తోంది.క్లోరినేషన్‌ చేయకపోవడంతో కుళాయిల నుంచి కొన్నిచోట్ల బురదనీరు, మరికొన్ని చోట్ల కలుషితనీరు వస్తోంది. ట్యాంకుల్లో నాచు తయారై బ్యాక్టీరియా ఏర్పడి తాగునీరు కలుషితం అవుతోంది. ఆ నీటిని తాగిన ప్రజలు వ్యాధులపాలవుతున్నారు.

అనర్ధాలు :
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారము జనాన్ని పీడిస్తున్న రోగాల్లో అంటువ్యాధులు 21.5 శారము . ఇందులో 11.5 శాతము రోగాలకు జలకాలుష్యమే కారణము .
  • వ్యవసాయం లో రసాయనాల వినియోగము , పరిశ్రమల వ్యర్ధాలు , మురుగు వల్ల నీరు కలుషితమవుతోంది . దీనివలన తాగునీటిలో ఉండాలసిన లవణల పరిమితి దాటిపోతోంది .
  • నీటిలో మురికి శారము 10 దాటితే రంగు మారిపోతుంది . దీనిని ఎట్టిపరిస్థితుల్లొనూ తాగకూడదు .
  • నీటి పి.హెచ్ (ఆమ్ల గాఢత ) 6.5 నుండి 8.5 శాతము మధ్యలో ఉండాలి ... ఇది దాటితే శరీరము చర్మపొరల పైన , ఆరో్గ్యముపైన తీవ్ర ప్రభావము చూపుతుంది .
  • నీటిలో సుమారుగా 500 లవణాలు ఉండలి . ఇవి 2000 (రెండువేలు) దాటితే జీర్ణకోశ , పేగు సంబంధిత వ్యాధులొస్తాయి.
  • ఆల్కలెనిటీ (క్షారగుణము ) 600 శారము దాటితే నీటికి దుర్వాసన వస్తుంది .
  • నీటి గాఢత (Hardness) 300 శాతము లోపు ఉండాలి ... ఇది 6oo శాతము దాటితే శరీరములోని అన్ని అవయవాలపైనా ప్రభావము చూపిస్తుంది .
  • సున్నము (కాల్సియం) 75 శాతము ఉండాలి ... ఇది 200 శాతము దాటితే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి . కాళ్ళు నొప్పులు వస్తాయి .
  • క్లోరైడ్ శాతము ఎక్కువైతే అతిసారానికి దారితీస్తుంది .
  • సల్ఫేట్ 200 - 400 శారము మధ్య ఉండాలి అంతకంటే దాటితే జీర్ణకోశ , పేగు సంబంధిత వ్యాధులు వస్తాయి .
  • ఫ్లోరైడ్ ఒక్క శాతము ఉండాలి .. ఎక్కువైతే ఫ్లోరోసిస్ కి దారితీసి కాళ్ళు వంకర్లు , దంతాల పెలుసుబారడం జతుతాయి .
  • ఇనుము ఒక శాతము కంటే దాటితే రంగు , రుచి తగ్గుతుంది .
  • మెగ్నీషియం ఎక్కువైతే అస్సలు తాగేందుకు పనిరాదు .
నీరు ఎలా కలుషితమవుతుంది :
  • శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ గనుల తవ్వకాలు ఎక్కువ . ఈ రాళ్ళను కోసినపుడు సిలికాన్‌ అనే మూలకము బయటకొస్తుంది . ఇది నీటిలో కలుస్తుంది . ఈ నీటిని తాగడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ప్రస్తుతం ఉద్దానము ప్రాంతము లో మూత్రపిండాల వ్యాధి పెరగడానికి ఇదో కారణము .
  • సంతకవిటి మండలము కొన్ని ప్రాంతాలు ఉదా: మోదుగుల పేటలో ఫ్లోరైడ్ శాతము ఎక్కువ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నీటిని తాగకూడదు . ఇక్కడ నీటి నుంచి ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించడము కూడా వీలుపడదు . ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారానే త్రాగునీటిని అందించాలి .
  • శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బోన్‌మ్యారో క్యాన్‌సర్ , పక్షవాతము వంటి రోగాలు వ్యాప్తి చెందడానికి కారణము రసాయన పదార్ధాలు భూమిలోని నీటి వనరులును కలుషితము చేయడమే . .
  • వర్షాకాలము లో నీరు వృధాగా పోతుంది . . తగిన నిల్వచేసే మార్గాలు లేవు .. ఆ ఆలోచనా లేదు . ఎండాకాలము లో నీటి ఎద్దడి కి కారణము అవుతుంది .
  • పూ ర్వము గ్రామాల్లో చెరువులు ఉండేవి .. ప్రభుత్వము ఓటు బ్యాంక్ కోసము చెరువులు కప్పి , పేదలకు భూమిని పంచిపెట్టినది . . అందువల్ల భూగర్భ నీటి వనరులు తగ్గిపోయాయి . వేసవిలో బావులలోనూ , బోరు బావులలోనూ నీరుండడం లేదు .
  • గ్రామలలో ఆరుబయట మలవిసర్జన వల్ల అవి వర్షాకాలములో నీటిలో కలియడం వలన అంటువ్యాధులకు కారణమవుతుంది .
  • వర్షాకాలము లో ఒక్కోసారి ఆరుబయట వృధాగా పడేసిన టైర్లు , కొబ్బరిబొండాలు , రోడ్ల రిపేరుకోసం చేసిన గుంటలు తిరికి కప్పకపోవడం మూలాన నీరు నిలవా ఉండి దోమలు పెరిగి ... మలేరియా , ఫైలేరియా , డెంగీ జ్వరాలకు కారణము అవుతుంది . అన్నీ ప్రభుత్వమే చేస్తుందనుకోవడం కంటే ప్రతి పౌరుడూ తనవంతు బాధ్యతగా పరిసరాల పరిశుభ్రత చూడాలి .
  • నీటి బావులు , బోరుబావుల చుట్టూఉండే వాడుక నీరు పోయేందుకు సరియైన డ్రైనేజ్ మార్గాలు లేకపోవడం వలన తిరిగి ఆ నీరు బావుల్లోకే పోయి మొత్తం నిరంతా కలుషితమవుతుంది .
  • గ్రామాల్లోను , పట్టణాలలోనూ మంచినీటి కొలై (నాళా) చుట్టూ బట్టలు ఉతకడం , స్నానాలు చేయడం వంటి అపరిశుబ్ర తెలితక్కువ పనులు వల్ల మంచినీరు కలుషితం అయ్యే అవకాశము ఉంటుంది .
  • గ్రామాలలో మంచినీటి చెరువుల్లో పశువులు కడగడం , బహిరంగ స్నానాలు చేయడం , బట్టలు ఉతకడం , వ్యర్ధపదార్ధాలు విసిరేయడం , పుణ్యము కోసం పూజాద్రవ్యాలు నీటిలో కలపడం , గట్ల పైన మలమూత్రాలు విసర్జన చేయడం , మలవిసర్జన తరువాత గుదం కడుక్కోవడం వంటి అపరిశుభ్ర పనులు వల్ల తాగే నీరు కలుషితం అవుతుంది .
  • =====================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, March 23, 2010

గోగునార పరిశ్రమ శ్రీకాకుళం లో , Jute Industry in Srikakulam




వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు పాలిథిన్‌ను విడిచిపెట్టి గోగు (మెస్తా) ఉత్పత్తులను వినియోగించాలని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నా, జ్యూట్‌ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు ఉత్పత్తి కొన్నేళ్లగా భారీగా తగ్గిపోయింది. పదేళ్ల క్రితం వరకూ గోగు పంటకు రాష్ట్రంలోనే చిరునామాగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉండేవి. ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.

ఉత్తరాంధ్ర వాణిజ్య పంటల్లో ప్రధానమైన గోగు నార సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గుతూ వస్తోంది. దీనిపై ఆధారపడి నడుస్తున్న జనపనార పరిశ్రమలకు కష్టాలు ఎదురవుతున్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఏటా 1,75,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసేవారు. 2008లో ఆ విస్తీర్ణం 69,780 ఎకరాలకు తగ్గిపోయింది. విజయనగరం జిల్లాలోనే ఎక్కువగా 1,08,288 ఎకరాల సాగు జరిగేది. విజయనగరంలో ప్రాంతీయ గోగునార పరిశోధన సంస్థతో పాటు జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాది విశాఖపట్నం జిల్లాలో గోగు పండించడాన్ని మానుకున్నారు. విజయనగరం జిల్లాలో 30,000 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 12,000 ఎకరాల్లో మాత్రమే పండించారు.

ఇవీ సమస్యలు: అననుకూల వాతావరణ పరిస్థితులు, గిట్టుబాటు కాని ధరల కారణంగా రైతు స్థితిగతుల్లో మార్పు రాకపోవడంతో గోగు సాగు చేయడం మానుకుంటున్నారు.

* ఫలితంగా జనపనార ఆధారిత పరిశ్రమలు సంక్షోభంలో పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ల వైపు ఆశగా చూస్తున్నాయి.
* రాష్ట్రంలో 29 జూట్‌ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో గోనె సంచులు చేసే పెద్ద కర్మాగారాలు 9, మిగతావి పురికొసలు, తాళ్లు తయారు చేసేవి. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే 13 వరకు పరిశ్రమలు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనపనార మిల్లులు 30,000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వీరందరి భవిష్యత్తు అంధకారంలో మునిగే ప్రమాదం ఉంది.

దిగనాసిల్లుతున్న దిగుబడి
సహకరించని వాతావరణ పరిస్థితుల్లో ఈ ఏడాది సాగుతో పాటు గోగు నార దిగుబడి కూడా తగ్గిపోయింది. సాధారణంగా ఎకరాకు 6 క్వింటాళ్ల నార దిగుబడి కావాలి. కానీ ఈ ఏడాది ఎకరాకు 3 నుంచి 3.5 క్వింటాళ్ల దిగుబడే వస్తోంది. 2008లో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 23 లక్షల క్వింటాళ్ల గోగునార ఉత్పత్తి జరిగింది. అది గత ఏడాది 7 లక్షల క్వింటాళ్లకు తగ్గిపోయింది. ఈ ఏడాది 1.3 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. చెరువుల్లో నీరు వరి పంటకు తోడివేయడం వల్ల జనుమును బురద నీటిలో ఊర వేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. దీంతో గోగునార నాణ్యత తగ్గి గిట్టుబాటు ధర రావడం లేదు. గోగు సాగుకు సంబంధించి రైతుకు ప్రోత్సాహం లేకపోవడంతో వారంతా జీడి, మామిడి, సరుగుడు తోటల వైపు మళ్లిపోతున్నారు.

దిగుమతులు నిల్‌: ఉత్తరాంధ్రలో సాధారణ విస్తీర్ణంలో గోగు సాగు చేస్తే రాష్ట్రంలోని జనపనార పరిశ్రమలకు 70 శాతం ముడిసరకు అవసరాలు తీరిపోతాయి. మిగతా పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ల నుంచి నుంచి దిగుమతి చేసుకొనే వారు. బంగ్లాదేశ్‌లో ఉన్న మిల్లు యజమానులు అక్కడి నుంచి జ్యూట్‌ మన దేశానికి ఇవ్వడానికి వీల్లేదని అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది జ్యూట్‌ పరిశ్రమలకు గడ్డు కాలం తప్పేటట్లు లేదు.
జేసీఐ ప్రేక్షక పాత్ర
గోగునార దిగుమతులు కొనుగోలు చేసేందుకు జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జేసీఐ) చేతులెత్తేసింది. ఈ ఏడాది ప్రభుత్వం కనీస మద్దతు ధర టన్నుకు రూ.13,750 మాత్రమే చెల్లిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో దీని ధర రూ.25,000 నుంచి రూ.27,000 వరకు పలుకుతోంది. అందువల్ల రైతులు జేసీఐకు గోగు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఫలితంగా జేసీఐ ఒక కిలో గోగు నారనైనా కొనలేదు. రైతులతో ఒప్పందాలు కూడా లేనందున 2008 తరువాత జేసీఐ తరఫున కొనుగోళ్లు నిలిపేసినట్లు ఆ సంస్థ ప్రాంతీయ మేనేజర్‌ ప్రసాద్‌ తెలిపారు.
  • ============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Srikakulam Town , శ్రీకాకుళం పట్టణము

About Srikakulam Town - > Click here

  • ================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Friday, March 19, 2010

స్వయం శక్తి మహిళా సంఘాలు శ్రీకాకుళం లో , Self Help women-groups in Srikakulam





పదేళ్ళ కిందట స్వయం శక్తి ఉద్యమము మొగ్గ తొడిగింది , గ్రామీణులు పొడుపు బాటతో భవిష్యత్తు ఆశాకిరణం గా మారింది . శ్రీకాకుళం జిల్లాలో 38 మండలాల , 4 మున్సిపాలిటిలలో లో 36,600 స్వయం శక్తి మహిళా సంఘాలు ఉన్నాయి . 4.30 లక్షల కుటుంబాలు సభ్యులు గా ఉన్నారు . మొత్తం 7.10 లక్షల మంది మహిళలు నమోదయ్యారు . పొడుపు ఇప్పటికి 40 కోట్లు కు చేరింది . ఈ ఏడాది రూ. 360 కోట్లు బ్యాంకుల ద్వారా లిందేజీలు ఇప్పిచాలని నిర్ణయించారు . రూ .285 కోట్లు పంపిణీ చేశారు .

అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని లాభాల బాట పట్టిడం లో మహిళలు చూపిస్తున్న చొరవకు " తృప్తి" గుర్తింపు తెచ్చినది . సేంద్రియ పద్దతుల్లో పండిస్తున్న - అల్లము , టమోటా , మామిడి , గోంగూర పచ్చల్లను శ్రీకాకుళం లోని సంతోషిమాత గ్రూఫ్ మహిళలు " తృప్తి" పేరిట విక్రయిస్తున్నారు . నెలకు రూ.౫ వేలు ఆదాయము లబిస్తుంది .ప్రతుతం రెండు దుకాణాలు మహిళలు నిర్వహిస్తున్నారు . త్వరలో పలాస , రాజాము , ఆమదాలవలస , ఇచ్చాపురం నగర పంచాయతీల్లో ఈ సేవలు అన్డుబారులోకి తచ్చేందుకు నిమగ్నమయ్యారు .అపరిశుభ్రత కారణము గా గర్భకోశ వ్యాధులకు గురవుతున్న గ్రామీణ మహిళల కోసం "ఆమ్పంగి" అనర్ పేరు పెట్టారు . కోయం బట్టురు నుంచి వస్త్రము తెప్పించి జల్లా సమాఖ్య ఆధ్వర్యము లో ప్రత్యేక లోదుస్తులు తయారుచేస్తున్నారు . మార్కెట్ లో వివిధ బ్రాండ్ల పేరిట రూ.30 కు లభ్యమవుతున్న ప్యాక్ ను సంపంగి ద్వారా మహిళలు రూ.౧౫ కే ఇస్తున్నారు .

సదా మీ సర్వలో :
మధ్య తరగతి కుటుంబాల ప్రయోజనార్ధం శ్రీకాకుళం సదా మీసేవలో కార్యక్రమము పరిచయము చేశారు . పల్లెల నుంచి నిరుద్యోగులను ఈ సేవకు వినియోగిస్తున్నారు . ప్రతి పది గృహాలకు ఒక ఫ్రంట్ లైన్ సర్వీస్ అసిస్టంట్ ను నియమించారు . కాల్ సెంటర్ కు ఫోన్ రాగానే సంబంధిత గృహానికి వెళ్లి అవసరమైన సేవలు చేస్తుంటారు .దీని ద్వారా నిరుద్యోగులకు ఉపాది కల్పిస్తున్నారు .
ప్రాణదాత పేరిట జనరిక్ మందులు దుకాణాలు ప్రస్తుతము శ్రీకాకుళం , సీతంపేట లలో కొనసాగుతుండగా కొద్ది నెలలో ఇంకా ౮ సెంటర్లలో పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి .

కార్మిక బ్యాంక్ ఏర్పాటు :
అసంఘటిత రంగము లో ఉన్న కార్మికులకు జిల్లా మహిళా సమాఖ్య ఆద్వర్యము లో పెద్ద ఎత్తున ఉపాది చూపించేందుకు లేబర్ బ్యాంక్ ఏర్పాటుకు శ్రీకారము చుట్టేరు . జిల్లా కేంద్రానికి చుట్టుప్రక్కల ఉన్న ఏడు మండలాల నుంచి నిత్యం వివిధ రకాల వృత్తుల పనివారు సుమారు 4687 మంది కార్మికులను గుర్తించి సబ్యులు గా చేరుస్తారు . ఏడు కేటగిరీలలో విభజించి కొద్ది రోజుల్లోనే బ్యాంకులు ప్రారంబిస్తారు .

  • ==================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

కొబ్బరి పీచు పరిశ్రమ శ్రీకాకుళం లో , Coir industry in Srikakulam








శ్రీకాకుళం జిల్లాలో సోంపేట , కవిటి , కంచిలి , ఇచ్చాపురం మందస , సంతబొమ్మాలి , రణస్థలం మండలము లలో ~28 వరకు పీచు పరిశ్రమలు ఉన్నాయి . కేరళ కొబ్బరి అభివృద్ధి బోర్డు సహకారం తో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమల ద్వారా మూడు వేల మందికి ప్రత్యక్షము గాను , రెండు వేల మందికి పరోక్షముగాను ఉపాది లబిస్తుంది .పరిష్టమలో పనిచేసే కూలీలు , గుమాస్తాలు , ఇతర సిబ్బంది తో పాటు కొబ్బరి డొక్కలు ఒలిచే కార్మికులకు ఉపాది అవకాశాలు లబిస్తున్నాయి .

ఈ మధ్యన కొబ్బరి కాయలు డొక్కలతో (పీచు తీయకుండా) ఎగుమతి చేయడం తో ఈ పరిశ్రమకు పని తక్కువైనది . శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల మేర కొబ్బరి సాగు అవుతున్నది . ఇందులో బొండాం రూపములో 30% , డొక్కా తో 40% వరకు కాయలు చెల్లుబాటు అవుతుండడం తో కనీసము 30% డొక్క దొరకడం కష్టం గా ఉన్నది .

Baruva Coier industry-Srikakulam,బారువ కొబ్బరి పీచు పరిశ్రమ-శ్రీకాకుళం

 సోంపేట కొబ్బరి పీచు పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అన్ని విధాలుగా అనుకూలమైనదని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి ప్రోత్సాహం అందిస్తామని రాజమండ్రి కొబ్బరి బోర్డు ప్రాంతీయ అధికారి పి.టి.అశోకన్‌ తెలిపారు. మంగళవారం బారువలో కొబ్బరి ఉత్పత్తులు, పీచు పరిశ్రమల ఏర్పాటు, ఇతర అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్రంలో ఏడు జిల్లాల పరిధిలో కొబ్బరి అభివృద్ధి జరుగుతుందని, కొన్ని చీడపీడలు ఆశించడం మూలంగా నాణ్యతతోపాటు కాయ దిగుబడి తగ్గిందని చెప్పారు. కొబ్బరి ఉప ఉత్పత్తుల ప్రోత్సాహానికి నిరుద్యోగులకు సహకారం అందజేస్తుందన్నారు. కొబ్బరి పీచు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఆర్థికంగా, సాంకేతికంగా సహాయం అందజేస్తామని, మార్కెట్‌తోపాటు ఇతర విధాలుగా మద్దతు ఉంటుందని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న నిరుద్యోగ యువకులు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైతే ఉపకార వేతనంతో కూడిన శిక్షణ ఏడాదిపాటు ఇస్తామన్నారు. కొబ్బరి బోర్డు ద్వారా అమలు జరుగుతున్న ఇతర పథకాల గురించి వివరించారు.

పీచు కేంద్రం పునరుద్ధరణ- నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ,- బారువ శిక్షణ కేంద్రం పునరుద్ధరణ, 

దశాబ్దాల పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలిగించిన బారువ కొబ్బరి పీచు శిక్షణ కేంద్రాన్ని పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీకాకుళం జిల్లా పరిశ్రమల అధికారి బి.గోపాలకృష్ణ తెలిపారు. ఈ శిక్షణ కేంద్రానికి అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ అర్ధాంతరంగా మూతపడిందని, దీనిని తెరిపిస్తే ఎంతో మందికి ప్రయోజనం ఉంటుందని పూర్వ విద్యార్థి సంఘం ప్రతినిధులు డాక్టర్‌ ఎ.వి.రామకృష్ణ, తుమ్మిడి యోగి, రత్నాల ఖగపతి, రామ్మోహనరావు, బలివాడ కృష్ణారావు, తదితరులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎ.పి. ఐ.ఐ.సి. మేనేజర్‌ హరిధరరావు, కొబ్బరి బోర్డు అధికారులు ఎం. రాజశేఖరరావు, కె. దశరధరావు, సయ్యద్‌బాబాసాదిక్‌, సోంపేట మాజీ సర్పంచి వి.ఎం.గాంధీ, తదితరులు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు కొబ్బరి బోర్డు ద్వారా అందించే రాయితీలు, కొత్త పారిశ్రామికవేత్తలకు అందించే సహకారం గురించి వివరించారు.

  • ===========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, March 17, 2010

పరిశ్రమలు శ్రీకాకుళం లో , Industries in Srikakulam




ప్రతి జిల్లా కు పరిశ్రమలు ఆ జిల్లా ప్రగతిని చూసిస్తాయి . పరిశ్రమలు ఎన్నో రకాలుగా ఉంటాయి . కుటీర పరిశ్రమలు , చిన్న తరహా పరిశ్రమలు , మధ్య తరహా పరిశ్రమలు , భారీ పరిశ్రమలు ... మున్నగునవి . ఏపీఐఐసీ శ్రీకాకుళం జిల్లాలో 06 పారిశ్రావికవాడల్ను నెలకొల్పింది. వీటిలో వివిధరకాల పరిశ్రమలు నెలకొల్పడము జరిగినది .

కొన్ని పరిశ్రమలు : >
  • రైస్ మిల్లులు పరిశ్రమలు,
  • జీడిపప్పు పరిశ్రమలు,
  • జూట్ పరిశ్రమలు,
  • కొబ్బరి పీచు పరిశ్రమలు,
  • మందులు పరిశ్రమలు,
  • పేపరు పరిశ్రమలు,
  • బెవరేజస్ పరిశ్రమలు,
  • పంచదార పరిశ్రమలు,
  • పిస్టన్స్ అండ్ రింగ్స్ పరిశ్రమలు,
  • పవర్ జనరేషన్ పరిశ్రమలు,
  • ఇథనాల్ పరిశ్రమలు ,
  • గ్రానైట కటింగు పరిశ్రమలు,
  • గార్నైట్ పరిశ్రమలు,
  • ఉప్పు పరిశ్రమలు , 
  •  


ప్రధాన పారిశ్రామిక కేంద్రం .. పైడిభీమవరం .

శ్రీకాకుళం జిల్లాలో భారీపరిశ్రమలు --- 29 ,
మధ్య, చిన్న తరహా పరిశ్రమలు --4110 ,
నూనె ఆడే పరిశ్రమలు ,గ్రానైట్ పరిశ్రమలు , టింబర్ కోత డిపోలు , పేపర్ మిల్లులు , జూట్ ఫాక్టరీస్ , నౌపొడా ఉప్పు పరిశ్రమ , కొబ్బరి పీచు పరిశ్రమ , ఉదాహరణకు కొన్ని.

శ్రీకాకుళం జిల్లా అరుదైన నీలిగ్రానైట్‌, జీడిపప్పు పరిశ్రమలకు ప్రసిద్ధి. ఇవి కాక రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో ఎన్నో ఔషధ తయారీ సంస్థలున్నాయి. త్వరలోనే రణస్థలం మండలం కొవ్వాడలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో 6 వేల మెగావాట్ల సామర్ధ్యంతో అణువిద్యుత్తు పార్కును నిర్మించనున్నారు. జిల్లాలో అయిదు థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం ఆందోళనల కారణంగా పనులు, సర్వేలు, భూసేకరణ నిలిచిపోయాయి. జిల్లాలోని వివిధ పరిశ్రమల వివరాలు ఇలా ఉన్నాయి..

అరబిందో ఫార్మా: రణస్థలం మండలం పైడిభీమవరంలో 1996లో ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద బల్క్‌ యూనిట్‌గా పేరు గాంచింది. ఇందులో ప్రధానంగా అన్ని రకాల బల్క్‌ డ్రగ్స్‌ తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 600 మంది పని చేస్తుండగా 4వేల మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.

ఆంధ్రా ఆర్గానిక్స్‌: దీనిని కూడా రణస్థలం మండలం పైడిభీమవరంలో 1997లో ప్రారంభించారు. సల్ఫామెథాజోల్‌ ప్రధాన ఉత్పత్తిగా తయారు చేస్తున్నారు. ఇవేకాకుండా బల్క్‌ డ్రగ్స్‌ తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా 200 మంది వరకు పని చేస్తుండగా పరోక్షంగా 400 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
సరాకా కెమికల్స్‌: ఈ పరిశ్రమను 2004లో పైడిభీమవరం పారిశ్రామికవాడకు సమీపంలో చిట్టివలస గ్రామం వద్ద ప్రారంభించారు. ఇక్కడ కూడా బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తి చేస్తున్నారు. పరిశ్రమలో ప్రత్యక్షంగా 150 మంది వరకు పని చేస్తుండగా, మరో 200 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.

లేన్‌టెక్‌ కెమికల్స్‌- పైడిభీమవరం సమీపంలో చిట్టివలస గ్రామం వద్ద 2008లో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇంకా పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ప్రారంభించలేదు. ఇక్కడ కూడా బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం 50 మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.

శ్యాంక్రిగ్‌ రింగ్స్‌- పైడిభీమవరం పంచాయతీ పరిధిలోని వరిసాం వద్ద 1989లో దీనిని ప్రారంభించారు. వాహనాల రింగ్స్‌, పిస్టన్స్‌ను తయారు చేస్తారు. ఇక దీనికి సంబంధించి మరో యూనిట్‌ ఎచ్చెర్ల మండలం అరిణాంఅక్కివలస వద్ద ఉంది. ఇక్కడ కూడా పెద్ద వాహనాలకు అవసరమైన రింగ్స్‌, పిస్టన్స్‌ తయారు చేస్తారు. రెండు పరిశ్రమల్లో ప్రత్యక్షంగా 800 మంది పని చేస్తున్నారు.

స్వర్ణాంధ్ర జ్యూట్‌ మిల్లు: రణస్థలం మండలం పిషిణి పంచాయతీ పరిధిలో నెలివాడ వద్ద దీన్ని ప్రారంభించారు. జ్యూట్‌ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇక్కడ 300 మంది కార్మికులు పని చేస్తున్నారు.

స్ప్రింజ్‌ లేబ్‌: రణస్థలం మండలం పిసిని వద్ద రూ. 20 కోట్లతో దీనిని నిర్మించారు. ఇక్కడ కూడా బల్క్‌డ్రగ్స్‌ ఉత్పత్తి చేస్తున్నారు.ప్రస్తుతం 50 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.

వి.కె.టి ఫార్మా: రణస్థలం మండలం దేరసాం గ్రామం వద్ద దీనిని ఏర్పాటు చేస్తున్నారు. రూ. 20 కోట్లతో నిర్మితమవుతున్న ఈ పరిశ్రమలో వివిధ రకాల మందులను తయారు చేస్తారు.

యునైటెడ్‌ బ్రేవరీస్‌: రణస్థలం మండలం బంటుపల్లి గ్రామం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పలు రకాల బీర్లు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ప్రత్యక్షంగా 200 మంది ఉపాధి పొందుతుండగా 500 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.

రఫా పేపర్‌ ఇండస్ట్రీస్‌: లావేరు మండలం సుబధ్రాపురం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ పేపరు గ్లాసులు, ప్లేట్లు తయారు చేస్తున్నారు.

హర్ష స్టీల్స్‌: లావేరు మండలం బుడుమూరు వద్ద రూ. 10 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. ఇంకా ఉత్పత్తులు ప్రారంభించలేదు.

నాగావళి సాల్వెంట్స్‌- ఎచ్చెర్ల మండలం పోలీస్‌ క్వార్టర్స్‌ సమీపంలో 1995లో ప్రారంభించారు. ఇక్కడ నూనె తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా 100 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.
వరం పవర్‌ ప్రాజెక్టు: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద 2000లో వరం పవర్‌ ప్రోజెక్టును నెలకొల్పారు. ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ప్రత్యక్షంగా 100 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.

స్మార్ట్‌కెం: ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద దీనిని 1999లో నెలకొల్పారు. ఇక్కడ అమోనియా, నైట్రేట్‌ను తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 100 మంది వరకు, పరోక్షంగా 2500 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.

క్రోనిమెట్‌ ఎల్లాయిస్‌: రావివలసలో 1990లో శారదా ఫెర్రోఎల్లాయిస్‌గా ప్రారంభమైన ఈ పరిశ్రమ అనంతరం జీఎమ్మార్‌ వాసవిగా రూపాంతరం చెంది 2010లో క్రోనిమెట్‌ ఎల్లాయిస్‌ యాజమాన్యం చేతిలోకి వెళ్లింది. ఏటా రూ.50 కోట్ల టర్నోవర్‌ కలిగిన ఈ పరిశ్రమలో 300 మంది వరకూ ఉద్యోగులున్నారు.
భవాని గ్రానైట్స్‌: టెక్కలి ప్రాంతంలో 2008లో ప్రారంభమైన ఈ పరిశ్రమకు గ్రానైట్‌ స్టోన్‌ క్రషింగ్‌, పాలిషింగ్‌ ప్రధాన వ్యాపారం. ఏటా రూ. కోటి వరకూ టర్నోవర్‌ చేస్తారు.
గండి సూర్యనారాయణరెడ్డి స్టోన్‌ క్రషర్స్‌: సవరకిల్లి సమీపంలో ఉంది. 1995లో దీన్ని ప్రారంభించారు. టెక్కలి పరిసర ప్రాంతాల్లో ప్రధాన వ్యాపారం ఇక్కడి నుంచే జరుగుతోంది.

గున్న సూర్యనారాయణ స్టోన్‌ క్రషర్‌ కంట్రగడ సమీపంలో ఉంది. శక్తి స్టోన్‌ క్రషర్స్‌ అంజనాపురం సమీపంలో ఉంది. కనకదుర్గ స్టోన్‌ క్రషర్స్‌ వి.ఆర్‌.కె.పురం సమీపంలో ఉంది.
మధుకాన్‌ గ్రానైట్స్‌: నామా నాగేశ్వరరావుకు చెందిన సంస్థ ఇది. టెక్కలి పరిసర ప్రాంతాల్లో క్వారీలు నిర్వహిస్తున్నారు. ఫోను నెంబరు 9440257809

బేరక్‌ గ్రానైట్స్‌: బేరక్‌ గ్రానైట్స్‌ టెక్కలి ప్రాంతంలో నాలుగు క్వారీలు నిర్వహిస్తున్నారు.టెక్కలిలో 30 వరకు రైసుమిల్లులున్నాయి. జిల్లా రైస్‌ మిల్లర్ల సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జామి నర్సింహమూర్తి వీరిని సమన్వయం చేస్తుంటారు.

డాక్టర్‌ రెడ్డీస్‌: రణస్థలం మండలం పైడిభీమవరంలో 1990లో ఏర్పాటు చేశారు. వివిధ రకాల మందులకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తారు. ప్రధానంగా ఎన్‌.మిథైల్‌, సైక్లోప్రోపైల్‌, ఎసిట్‌ ఉత్పత్తులు తయారవుతాయి. ఇక్కడ ప్రత్యక్షంగా 400 మంది ఉద్యోగులు పని చేస్తుండగా కాంట్రాక్టు కార్మికులు 500 వరకు ఉంటారు. దీనికి సమీపంలోనే రూ.580 కోట్లతో 250 ఎకరాల్లో రెడ్డీస్‌ వాణిజ్య మండలి సిద్ధమవుతోంది. ఇందులో కూడా పలు ఫార్మా యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.

నాగార్జున అగ్రికెం: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద 1995లో దీనిని నెలకొల్పారు. ప్రధానంగా పురుగు మందులు నివారణకు అవసరమైన మందులు ఇక్కడ తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 300 మంది కార్మికులు పని చేస్తుండగా పరోక్షంగా 300 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.

ట్రాన్స్‌వరల్డ్‌ గార్నెట్‌, సతివాడ, గార మండలం - ఫోన్‌: 08942 283781
ట్రైమాక్స్‌ సాండ్స్‌, వత్సవలస, గారమండలం - ఫోన్‌: 08942 283755
నీలం జ్యూట్‌మిల్‌, సింగుపురం - 08942 232142
  • ==============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

చేనేత సహకార సంఘాలు శ్రీకాకుళం లో , Handloom co-operative societies-Srikakulam




  • శ్రీకాకుళం జిల్లాలో 42 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి . 36 మాత్రమే పనిచేస్తున్నాయి . సుమారు 7,౦౦౦ (ఏడువేలు ) మగ్గాలు ఉన్నాయి ... వీటిపై 50 వేలమంది ప్రత్యక్షము గాను , మరో 50 వేలమంది పరోక్షముగాను ఆధారపడిజీవిస్తున్నారు . మన రాష్టము లో 748 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి
  • నేటి సమాజము లో ప్రపంచమతా మరమగ్గాల తో బట్టలు నేస్తూ ఉంటే ... మన రాస్తాం లో ఇంకా ఉపాదికల్పన అనే పేరుతొ చేతి మగ్గాలతో బట్టలు తయారు చేస్తూ (నేస్తూ) ఉన్నారు . ఇది ఒకవిధము గా అభివృద్ధి ని ఆటంకపరచినట్లేకదా . మిల్లు లో తయారైన వస్త్రాలు మంచి నాణ్యత తో ఉంటాయి ... నిముషాలలో వేల టన్నులు కొద్దీతయారవుతూ ఉంటాయి . చేతితో అలా అవదుకదా . జీవనోపాదికి వేరే మార్గాలు చూపించవచ్చు గాని అభివృద్ధి నిఅడ్డుకోకూడదు ... అని నా అబిప్రాయము .
జిల్లాలోని 42 చేనేత సహకార సంఘాల పరిధిలో 6,500 అంత్యోదయ అన్నయోజన (ఎ.ఎ.వై.) కార్డులను అందజేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు ఎం.కాటంరాజు తెలిపారు. గురువారం స్థానిక ఖాదీ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇంతవరకు చేనేత కార్మికులకు 4,500 వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నామన్నారు. జిల్లాలో 2010-11 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.24 కోట్ల విలువ చేసే వస్త్రాలు ఉత్పత్తి అయ్యాయన్నారు. రూ. 4.80 కోట్ల విక్రయాలు జరిగాయన్నారు. మహాత్మారుణకర్‌ బీమా యోజన కింద 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న కార్మికులు ఏడాదికి రూ. 80 చెల్లిస్తే వివిధ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. జిల్లాలో 150 మంది వికలాంగ చేనేత కార్మికులకు అంత్యోదయ అన్నయోజన కింద రూ.25 కిలోల వంతున బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. సమావేశంలో చేనేత అభివృద్ధి అధికారులు సిహెచ్‌.లక్ష్మణరావు, బెండి ధనుంజయరావు, స్థానిక చేనేత సంఘం అధ్యక్షుడు యర్రా విశ్వనాథం పాల్గొన్నారు.

  • మూలము : కలక్టర్ ఆఫీసు - శ్రీకాకుళంస్
 update >14/12/2012 :

చేనేత సహకార సంఘాలు

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు చేనేత సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఫిబ్రవరిలోనే వీటి ఎన్నికలు నిర్వహించాలని చేనేత శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. చేనేత సంఘాల ఎన్నికల తర్వాతే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)ల ఎన్నికలు నిర్వహించాలని కోరింది. రాష్ట్రంలో 1200 చేనేత సహకార సంఘాలుండగా అందులో 388 మూతపడ్డాయి. 812 ప్రస్తుతం నడుస్తున్నాయి. వీటిలో 1.60 లక్షమంది సభ్యులున్నారు. వ్యవసాయ సహకార సంఘాల తర్వాత చేనేత సంఘాలే ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నాయి. చేనేత సంఘాల పాలకమండళ్ల గడువు ఫిబ్రవరి 14తో ముగియనుంది. వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల షెడ్యూలును ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
  • =============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

Sunday, March 14, 2010

ఖనిజ లవణ జల సరఫరా కేంద్రాలు , Mineral Water supply Centers

  • మానవ అవసరాల్లో అతి ముఖ్యమైనది నీరు ... ప్రకృతిలో దొరికే స్వచ్చమైన నీరంతా కలుషితమయిపోతుండటంతో రక్షిత నీటికోసం పరుగులు తీస్తున్నారు . పట్టణ ప్రజలు శుద్దజలాలకోసం అధిక మొత్తములో డబ్బులు వెచ్చిస్తూన్నారు . అయినా ప్రజలకు అందుతున్నది నిజమైన శుద్దజలమేనా అని సందేశమే . అయా ప్లాంట్ల యజమాన్యాలు సురక్షిత నీటిని సరఫరాచేయడము లో నిబందనలు , ప్రామాణాలు (standards) పాటించడము లేదనే తెలుస్తుంది . తగిన మోతాదులో అవసరమైన లవణాలు సమతుల్యము గా అందించాల్చింది పోయి ఏదో నీటిని తూతూమంత్రముగా పరీక్షచేసి బాటిల్లలో నింపి అందిస్తున్నారు .


శ్రీకాకుళం జిల్లా 4 మునిసిపాలిటీలు , 38 మండలాలతో మొత్తము 26, ౦౦,౦౦౦ ల జనాబా ఉండి 198 కి.మీ . సముద్ర తీరప్రాంతము తో 9 జీవనదులతో ఎల్లాప్పుడు పచ్చదనము తో కళలాడుతూ ఉంటుంది . కాని త్రాగేందుకు మంచి నీరు ఉండదు . దానికి కారణము ఇక్కడ నెలకొని ఉన్న రాజకీయము . డబ్బు రాజకీయము , పదవీ వ్యామోహ రాజకీయము , నెరవేరని హామీల రాజకీయము .
ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్స్ క్యాన్ల ద్వార త్రాగే నీటిని అమ్ముతూ ఉంటుంటారు . శ్రీకాకుళం లో లైసెన్స్ ఉన్నవి 8 ఖనిజ లవణ జల సరఫరా కేంద్రాలు , లైసెన్స్ లేనివి 8 ఖనిజ లవణ జల సరఫరా కేంద్రాలు ఉన్నాయి . జిల్లాలోని ప్రధాన పట్టణాలైన - >
  1. శ్రీకాకుళం ,
  2. ఆమదాలవలస ,
  3. రాజాం ,
  4. పాలకొండ ,
  5. నరసన్నపేట ,
  6. టెక్కలి ,
  7. పలాస - కాశీబుగ్గ ,
  8. సోంపేట ,
  9. ఇచ్చాపురం ,
మినరల్ వాటర్ సరఫరా కేంద్రాలు ఉన్నాయి . సుమారు 20 లీటర్ల నీటి క్యాన్ కి 4౦-45 రూపాయిలు ఖరీదు చేస్తారు . 200మీ.లీ.ప్యాకెట్ కి 1 రూపాయి ఖరీదు చేస్తారు . సంవత్సరానికి సుమారు 30 కోట్ల రూపాయిల వ్యాపారము జరుగుతూ ఉంటుంది . సంభందిత అధికారుల తనికీలు ఉండవు కనుక ఎంతవరు ఈ నీరు ఆరోగ్యానికి మంచిదో తెలీదు .


ఏమిటీ 'మినరల్‌ వాటర్‌' ? : నీటిని మూడు కేటగిరీల రసాయన పరీక్షలు నిర్వహించాలి . మొదటి కేటగిరీలో " నీటి ఆమ్ల స్వభావము (phc value) , క్లోరైడ్ , సల్ఫేట్ ... తదితర పరీక్షలు లను రోజూ క్రమము తప్పకుండా చేపడుతుండాలి " రెండో కేటగిరిరీ లో ... బేరియం , కాల్సియం , మిగ్నీషియం , అల్యూమినియం , జింక్ , కాపర్ తదితర ఖనిజాలను వారానికి ఒకసారి పరీక్షించాలి . వీటితోపాటు బోరేట్ , ఆంటిమొనీ లోహాల గాడతను నెలకొకసారి తప్పనిసరిగా పరీక్షించాలి . మూడో కేటగిరిలో నీటిలో ఉన్న సూక్ష్మ జీవులను గుర్తించేందుకు ' కోలి ఫారంస్ ' మైక్రోబయోలజీ పరీక్షలు అతికీలకమైనవి . అలాగే బౌతిక పరీక్షలకు సంభందించి ... రంగు , రుచి , వాసన , నీటిలో మొత్తము కలిగిఉన్న పదార్దాల పరీక్షలు నిర్వహించాల్సిఉంటుంది .
ఇటువంటి పరీక్షలకు వాటి నిర్వహణ కు వినియోగించే రసాయనాల కోసం అధిక మొత్తములో ఖర్చు చేయాల్సి ఉంటుంది . వీటికి తోడు శుద్దజలము ప్రక్రియ జరుగుతున్న ప్రాంతములో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందకుండా ఏసీ సౌకర్యము ఉండాలి . పరికరాలు , కేన్లు . స్టెరిలైజేషన్‌ కోసము ' హాట్ ఎయిర్ ఓవెన్‌ " ఏర్పాటు చేసుకోవాలి . ఇవన్ని ఖరీదైనవి కావడము తో సంబంధిత యాజమాన్యాలు తూతూమంత్రం గా పరీక్షలు చేపట్టి చేతులు దులిపేసుకుంటున్నాయి .

-
సిబ్బంది కి సంకూర్చే రక్షక కవచాలు :
ప్లాంటు లోని కార్మికులు తమ చేతులకు స్పిరిట్ రాసుకోని ' గ్లౌస్ ' తొడుక్కొని పనిచేయాల్సి ఉంటుంది . శరీరానికి " ఆప్రాన్‌ " ధరించాలి . ముక్కుకు మాస్కు ధరించాలి . అయితే ఇవేవీ ఏ ప్లాంట్ లోనూ కనిపించడం లేదు . వీరి జీతాలు కూడా అరకొర గానే ఉంటాయి కావును వ్యక్తిగత శుభ్రతకూడా ఏమీ బాగుండదు .

నాణ్యత పాటించకుంటే అనర్ధాలే : సాధారణ జలము శుద్ద జలము గా మార్చే ప్రక్రియలో పలు దశల్లో నిర్వహిస్తున్న పరీక్షలు సక్రమముగా లేనట్లయితే చాలా అనర్ధాలకు దారితీస్తుంది . ప్రత్యేకము గా సూక్ష్మజీవులు , ప్రమాదకర ఖనిజాల కోసము చేసే పరీక్షలు పక్కాగా లేకుంటే ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదము ఉంటుంది . బాటిల్స్ లో ఉన్న శుద్దజలము కొంతవరకు సురక్షితమైనా ప్యాకెట్లలో ఉండే నీరు ఆరోగ్యానికి అంతమంచిది కాదని మైక్రోబయోలజీ నిపుణులు చెబుతున్నారు . ప్యాకెట్లలో ఉన్న నీటికి యు.వి (ఆల్ట్రా వైలెట్) ప్రక్రియ జరిగే అవకాసము లేదని పేర్కోంటున్నారు . కోలీఫారంస్ పరీక్షల్లో భాగంగా ఈ కోలీబాక్టీరియా పూర్తిగా తొలగించకుంటే ఉదరకోశ వ్యాధులు , అల్సర్లు , జీర్ణసంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదము ఉంటుంది . సాదారణ జలాలో ఉండే హెపటైటిస్ -బి వైరస్ ను నిర్మూలించకపోతే పచ్చకామెర్ల వ్యాది సోకుతుంది . బాసిల్లస్ బ్యాక్టీరియాతో టైఫాయిడ్ , డయేరియా తదితర వ్యాధులు సోకుతాయి . నీటి ఆమ్లపు భావాన్ని పి.హ్చ్.సి 6.0 కంటే తక్కువ విలువ అయితే గాస్ట్రిక్ అల్సర్లు వస్తాయి . కాల్సియం , నైట్రేట్లు మోతాదు మించితే కిడ్నీ , రక్త సంబంధిత వ్యాధులు వస్తాయి . నీటిలో ఉన్న వృదా ఖనిజాల తొలగింపుతో పాటు అవసరమైన వాటిని పరిమిత మోతాదులో ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోపోతే మినరల్ వాటర్ అవదు కదా ' అశుద్ధ జలము ' అవుతుంది
ఈ బాదలన్ని పడే కంటే నీటిని బాగా కాచి వడపోసి తాగితే 100 శాతము సురక్షితము .

ఒకప్పుడు 'మినరల్‌ వాటర్‌' అనే పదాన్ని కేవలం ప్రకృతి సహజంగా భూగర్భం నుండి ఉబికి వచ్చే నీటికి లేదా ఎత్తయిన పర్వత ప్రాంతాల నుంచి సహజంగా ఊటగా వచ్చే నీటికి వాడేవారు. భూగర్భం నుండి సహజంగా ఉబికి వచ్చే నీటిలో కొన్ని ప్రత్యేకమైన లవణాలు (గంధకంలాంటివి) కరిగి ఉంటాయని, ఈ నీటితో స్నానం చేస్తే కొన్ని జబ్బులు నయమవుతాయని, అలాగే ఈ నీటిని తాగినప్పుడు ఆరోగ్యం బాగు పడుతుందని ఎంతోమందికి నమ్మకం. అందువల్ల ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సహజంగా వచ్చే ఈ నీటి ఊట స్థలాలకు వెళ్లి స్నానాలు చేసేవారు. ఇలాగే పెద్ద పెద్ద పర్వతాల నుండి (హిమాలయాలు) వచ్చే నీరు అత్యంత పరిశుభ్రంగా ఉండడమే కాక, ఆరోగ్యానికీ పనికివచ్చే మూలకాలు దీనిలో కరిగి ఉంటాయని, ఈ నీరు కూడా ఆరోగ్యానికి మంచిదని ఎంతోమంది నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు మనదేశంలో పంప్‌ చేస్తున్న అన్ని భూగర్భ జలాలను 'మినరల్‌ వాటర్‌గా' పరిగణిస్తున్నారు. (1954 ఆహారకల్తీ నిరోధకచట్టం రూల్‌ ఎ 32) అందు వల్ల పరిశుభ్రం చేసి బాటిళ్లలో (సీసాలు) నింపి న ప్రతినీరునూ 'మినరల్‌ వాటర్‌' అనే పిలుస్తు న్నారు. వాణిజ్యపరంగా ఇప్పుడు మార్కెట్‌లో విస్తారంగా దొరుకుతున్న 'మినరల్‌ వాటర్‌', మనకు మొదట తెలిసిన 'మినరల్‌ వాటర్‌' ఒకటే కావు. ఇది కేవలం శుద్ధిచేసిన బోరుబావి నీళ్ళే. దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

పై నేపథ్యంలో ఇప్పుడు ఎంతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ కనీసం ప్రయాణ సమ యంలో ఎంతోమంది బాటిల్‌ నీళ్లను కొని, తాగుతు న్నారు. దీనికి ప్రధానకారణం ప్రయాణంలో మామూ లుగా దొరికే నీళ్ల కన్నా బాటిల్‌ నీళ్లు సురక్షితమని వీరు భావించటమే. కానీ, బాటిల్‌ నీళ్లు మామూలుగా తాగే కుళాయి నీళ్లు నాణ్యతల మధ్య తేడా అంతగా లేదని కొన్ని సందర్భాలలో బాటిల్‌ నీళ్లలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెబ్‌సైట్‌ సమాచారం తెలుపుతోంది

మినరల్‌ వాటర్‌ మామూలుగా బోరుబావి నుండి తీసిన నీటితో తయారుచేస్తున్నప్పుడు దీనికీ, కుళాయి నీటి నాణ్యతకూ తేడా ఏమిటి? అన్న ప్రశ్న వస్తుంది. బోరుబావి నీటిని వడకొట్టి, క్లోరినేషన్‌ చేస్తే సురక్షితమైన నీరుగా మారిపోతుంది. సురక్షిత నీటి పథకం పేరుతో ఎన్నో గ్రామాల్లో బోరుబావి నీళ్లను కేవలం పంపుచేసి, పైపుల ద్వారా సురక్షిత నీరుగా సరఫరా చేస్తున్నారు. కానీ ఈ నీటిని శుద్ధి చేయడానికి వడకట్టడం గానీ, క్లోరినేషన్‌గానీ చేయడం లేదు. కానీ, ప్రజల్లో మాత్రం ఈ నీరు సురక్షితమైనదనే ప్రచారం జరుగుతుంది. ఈ బోరు బావి నీటిని శుద్ధిచేసి పంపితే అదే 'మినరల్‌ వాటర్‌' అవుతుంది. ఇలా శుద్ధిచేయడానికి నామమాత్రపు ఖర్చే అవుతుంది. దురదృష్టంగా దీనికై కేటాయించిన బడ్జెట్‌ దుర్వినియోగం అవుతుంది. ఎక్కడా క్లోరినేషన్‌ జరగడం లేదు. హైదరాబాద్‌ నడిబొడ్డున వున్న భోలకపూేర్‌ ప్రాంతంలో క్లోరినేషన్‌ చేయడంలోని వైఫల్యం ఇటీవల ఎంతో మంది మరణాలకు, అంటురోగాల వ్యాప్తికి దారి తీసిందంటే.. రాష్ట్రం మొత్తంలో క్లోరినేషన్‌ ద్వారా శుద్ధి చేయడంలో ఎంత నిర్లక్ష్యం జరుగుతుందో తెలుసు కోవచ్చు. కేవలం తగు యాజమాన్యంతో అవసరమైన చోట నామమాత్రపు బడ్జెట్‌తో శుద్ధిచేసి, మంచి నీటిని అందించే బదులు ఎంతో ఖర్చుతో కూడిన బాటిల్‌ వాటర్‌ను సరఫరా చేసి, గిరిజనుల ప్రాణాలను రక్షిస్తా మన్న ప్రభుత్వ నిర్ణయం అశాస్త్రీయమైంది, అసంబద్ధ మైంది. ఇదే విధంగా కాచి, చల్లార్చి, వడబోసిన నీటిని తాగే అలవాటును ప్రజల్లో వ్యాప్తిచేయకుండా, బాటిల్‌ నీళ్ళే సురక్షితమైనవనే భావనను వ్యాప్తిచేయడం ప్రజల ప్రయోజనానికికాక, వ్యాపార, వాణిజ్యవర్గాలకు సహాయ కారిగానే కొనసాగుతుంది. పేదలు, మధ్యతరగతి కుటుంబ బడ్జెట్‌లపై ఇది ఎనలేని భారాన్ని మోపుతుంది.

ఎందుకిలా?

సహజంగా, దాదాపు ఉచితంగా దొరికే మంచినీటిని సరఫరా చేసే స్థితిలో ఉన్న ప్రభుత్వం ఖర్చుతో కూడిన బాటిల్‌ నీళ్ళను గిరిజనుల ప్రాణాలను రక్షించే పేరుతో ఎందుకు సరఫరా చేసేందుకు నిర్ణయించిందనేది ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు చేపట్టిన తర్వాత సహజవనరులైన నీటిని కూడా అమ్మి, కొనే మార్కెట్‌ వస్తువుగా మార్చి, వ్యాపార స్తులకు ఎనలేని లాభాలను సమకూర్చే విధానాలను ప్రభుత్వం చేపట్టింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర 'నీటి విధానాన్ని' ప్రభుత్వం రూపొందించింది. కానీ ఈ విధా నాలకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రజల్ని మానసికంగా, భౌతికంగా నీటిని కొని తాగేందుకు అలవాటు చేయడా నికి మొదట నామమాత్రపు ధరలో లేదా ఉచితంగా మినరల్‌వాటర్‌ను సరఫరా చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని భావించాల్సి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, ఇదే బోరుబావుల నీటిని వడకట్టి, క్లోరినేషన్‌ చేసి, శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని అతి తక్కువ ఖర్చుతో కాపాడవచ్చు.
  • ================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.