Wednesday, March 31, 2010

ఫ్లోరోసిస్ వ్యాది శ్రీకాకుళం లో , Florosis in Srikakulam


----




ఫ్లోరిన్‌ అధికంగా ఉండే నీటిని తాగడం ద్వారా వచ్చే వ్యాధి ఫ్లోరోసిస్‌. ఇది ఎముకలకు వస్తుంది. అమెరికా, యూరప్‌, ఆఫ్రికా, భారతదేశాల్లోని అనేక మంది ఈవ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రాంతాల్లో ఈవ్యాధి అధికంగా కనిపిస్తోంది. చవిటి భూముల్లో, రాతిబావుల్లో ఫ్లోరైడ్‌ అధిక శాతంలో ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తుంది. మనిషికి విటమిన్లు, ప్రొటీన్లతోపాటు కొన్ని పోషక పదార్థాలు కూడా అవసరమవుతాయి. వీటిని "trace"‌ ఎలి మెంట్స్‌ అని అంటారు. వీటిలో జింక్‌, మెగ్నీషియం, కాపర్‌,ఐరన్‌, ఫ్లోరిన్‌ మొదలైనవి ఉన్నాయి.

శారీరక ఆరోగ్యానికి ఫ్లోరిన్‌ అవసరం. ఫ్లోరైడ్‌ రూపంలో ఫ్లోరిన్‌ మన శరీరంలోకి చేరుతుంది. చిన్న ప్రేగుల్లో జీర్ణమయ్యే ఫ్లోరిన్‌ను శరీరం తన అవసరాలకు ఉపయోగించుకుంటుంది. మిగిలినది మలమూత్రాదుల ద్వారా బైటికి వెళ్లిపోతుంది.

మనం తాగే నీటిలో ఒక లీటర్‌కు ఒక మిల్లీగ్రాము ఫ్లోరిన్‌ ఉంటే మనకు రోజుకు ఒకటి లేదా రెండు మిల్లీగ్రాముల ఫ్లోరిన్‌ లభిస్తుంది. దీనిని ఒక పిపిఎం అంటారు. తాగడానికి ఉపయోగించే తీపి నీటిలో ఫ్లోరిన్‌ అసలు ఉండదు. ఉప్పు నీటిలో 10 పిపిఎంకు పైగా ఫ్లోరిన్‌ ఉంటుంది. సముద్రపు చేపల్లో 5 నుంచి 10 పిపిఎంలకుపైగా, టీలో ఇంకా ఎక్కువగా ఉంటుంది.

నీటిలో ఫ్లోరిన్‌ ఒక పిపిఎం కంటే తక్కువగా ఉంటే కలిగే ఫ్లోరిన్‌ లోపం వలన చిన్న పిల్లలో సుమారు 60 నుంచి 70 శాతం మేరకు దంతాలు త్వరగా పుచ్చిపో తాయి. దంతాలు సరిగ్గా ఏర్పడవు. వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్న వారిలో ఫ్లోరిన్‌ లోపం వలన ఆస్తియోపోరోసిస్(Osteoporosis)‌ అనే ఎముకల వ్యాధి లక్షణాలు కనిపి స్తాయి. దంతరక్షణకు, ఎముకల పటిష్టతకు ఫ్లోరిన్‌ అవసరం. తాగే నీటిలో ఫ్లోరిన్‌ 3 నుంచి 5 పిపిఎం వరకూ ఉంటే ఫ్లోరోసిస్‌ అనే వ్యాధి సోకుతుంది.

ఫ్లోరోసిస్‌ వలన ముందు దంతాలు దెబ్బ తింటాయి. పంటి ఎనామిల్‌పోయి దంతాలు పసుపుపచ్చ రంగులోకి మారుతాయి. దంతాలపై తెల్లటి మచ్చలు, గోధుమ రంగు గీతలు ఏర్పడుతాయి. దీనిని మాట్లింగ్‌ అంటారు. పళ్ల ఉపరితలంపై గుంటలు ఏర్పడుతాయి. ఫ్లోరోసిస్‌ కేవలం పండ్లకే పరిమితమైనవారు 70 శాతం మంది ఉంటారు.

నీటిలో 10 పిపిఎం కన్నా ఎక్కువ ఉంటే ప్రజలు ఈ వ్యాధికి గురవుతారు. దీని వలన వీరికి ఆకలి ఉండదు. వెన్నెముక, నడము, కాళ్లు, చేతులలోని ఎముకలు దళసరిగా మారుతాయి. ఎముకలలో ఉండే లిగమెంట్స్‌, టెండాన్స్‌లో ఫ్లోరైడ్‌ ధాతువు చేరి లోపాలేర్పడుతాయి.
కళ్ల ఎముకలు సన్నబడి వంకర్లుపోవడం, నడుము వంగడం, కీళ్లు వంగిపోవడం మొదలైన లక్షణాలు కనిపి స్తాయి. వీరికి మోకాళ్లు ఒకదానికి మరొకటి దగ్గర దగ్గ రగా వస్తాయి. ఈ వ్యాధికి గురైన వారు శ్రమించి ఏ పనీ చేయలేరు. పిల్లల్లో పెరుగుదల ఉండదు. దీర్ఘ కాలంగా ఫ్లోరిన్‌ ఎక్కువ ఉన్న నీటిని తాగడం వలన క్రానిక్‌ ఫ్లోరైడ్‌ పాయిజనింగ్‌ పరిస్థితి ఏర్పడుతుంది.

నీటిలో ఫ్లోరిన్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు రాతి బావుల్లోని, చవిటి భూముల్లోని నీటిని తాగకూ డదు. ఫ్లోరైడ్‌ ఎక్కువ ఉన్న నీటిలో పటికవంటి రసా యనాలు కలిపి అపాయం లేకుండా చేసుకుని తాగాలి.

శ్రీకాకుళం జిల్లాలో ప్రధానం గా ఉద్దానం ప్రాంతం లో 239 గ్రామాలలో - టెక్కలి , సంతబొమ్మాలి , నందిగం , పాతపట్నం , సారవకోట , మెళియాపుట్టి , తదితర మండలాలలో ఫ్లోరోసిస్ చాయలు కనిపిస్తున్నాయి . భాగీరదిపేట ,శాసనం , అబ్బాయిపేట , గంగాధరపేట , కైలాసపురం , కృష్ణాపురం , సంతలబయలు , ఉదికలపాడు ,బొంతువలస , పరశురాం పురం , ముకుందాపురం , పెద్దమడి , పద్దినాయుడుపేట , పోలవరం , పోతులూరు , స్వరభానాపురం , గంగువాడ , కే-తాల్లబద్ర , జైజోల , మొదుగువలస , కోటపాలెం , , చోమ్పాపురం , దీపావళి , తదితర గ్రామాలలో ఫ్లోరైడ్ జాడలు కనిపిస్తున్నాయి .
ఫ్లోరోసిస్ ఉన్న ప్రాంతాలలో టాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేయాలి , నీటిలో ఫ్లోరిన్అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు రాతి బావుల్లోని, చవిటి భూముల్లోని నీటిని తాగకూ డదు. ఫ్లోరైడ్ఎక్కువ ఉన్న నీటిలో పటికవంటి రసా యనాలు కలిపి అపాయం లేకుండా చేసుకుని తాగాలి. ఫ్లోరోసిస్ బాదితులు అదికం గా ఉన్న ప్రాంతాలవారికి సురక్షితమైన ప్రాంతాలలో పునరావాసము ఏర్పాటు చేయాలి . అమాయక ప్రజలకు మాస్ మీడియా ద్వారా ఫ్లోరోసిస్ గురించి చప్పాలి .

శ్రీకాకుళం లో ఫ్లోరైడ్ బాదితులు , Florosis effects in Srikakulam dist.--(courtesy Eenadu news paper)

జలం కాదు... హాలాహలం-ఫ్లోరైడ్‌ దెబ్బకు జనం విలవిల-పీడిత గ్రామాలు 52కుపైగానే-నివారణ చర్యలు శూన్యం.


ఒకటో రెండో కుటుంబాల వ్యథ కాదు... సుమారు 52 గ్రామాల ప్రజల కన్నీటి గాథ. జలమే హాలాహలమై... బతుకులనే విషపూరితం చేస్తున్న దయనీయస్థితి. కళ్లెదుట ఆడుతూ.. పాడుతూ.. తిరిగే పిల్లలు చివరకు కాళ్లు కదపలేని స్థితికి చేరుకుంటున్నారు. కారణం తాగునీటిలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉండడమే. ఆ నీరు తాగితే జబ్బులొస్తాయని తెలుసు. తెలిసినా ఏమీ చేయలేని దీనస్థితి. వేరే దిక్కులేక.. జీవితాలనే బలి తీసుకుంటున్నారు. ఈ పాపం ఎవరిది...? సురక్షిత మంచినీరు అందివ్వలేని పాలకులదా..? ప్రజలేమైపోతున్నారో అసలు పట్టించుకోని ప్రజాప్రతినిధులదా..? జనం అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారెవరు?


తాగునీటిలో హానికర మూలకాల శాతం ఎక్కువగా ఉంటే ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. సాధారణంగా లీటరు నీటిలో ఫ్లోరైడ్‌ కణాల శాతం 1.5 మిల్లీగ్రాములు దాటితే దంతహాని. మూడు మిల్లీగ్రాములు దాటితే ఎముకలపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రకారంగా చూస్తే జిల్లావ్యాప్తంగా ఫ్లోరైడ్‌, బ్రాకిస్‌ (ఉప్పునీరు) పీడిత ప్రాంతాల గ్రామాలు 52 వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏటా నీటి నమూనాలు సేకరిస్తున్నా అందులో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయటంలో జిల్లా యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఉద్దానం ప్రాంతంలో 239 గ్రామాల ప్రజలకు ఉపకరించేలా ఉద్దానం నీటిపథకం నిర్మించినా అది పూర్తిస్థాయిలో పని చేయటం లేదు. అయితే ఆ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ పీడితులకు కొంతవరకు ఉపశమనం కలిగింది.

  1. పీడిత గ్రామాలివే
  2. టెక్కలి,
  3. సంతబొమ్మాళి,
  4. నందిగాం,
  5. పాతపట్నం,
  6. సారవకోట,
  7. మెళియాపుట్టి......................... తదితర మండలాల పరిధిలో ఫ్లోరైడ్‌ ఛాయలు కనిపిస్తున్నాయి.
  8. బూరగాం,
  9. భగీరధిపేట,
  10. శాసనాం,
  11. అబ్బాయిపేట,
  12. గంగాధరపేట,
  13. కైలాసపురం,
  14. కృష్ణాపురం,
  15. సంతలబయలు,
  16. ఊడికలపాడు,
  17. బొంతువలస,
  18. పరశురాంపురం,
  19. ముకుందాపురం,
  20. పెద్దమడి,
  21. పెద్దినాయుడుపేట,
  22. పోలవరం,
  23. పోతులూరు,
  24. స్వరభనాపురం,
  25. గంగువాడ,
  26. కె.తాళ్లభద్ర,
  27. కైజోల,
  28. మోదుగువలస,
  29. కోటపాలెం,
  30. చొంపాపురం,
  31. దీపావళి,
  32. పెద్దరోకళ్లపల్లి,
  33. జెండాపేట,
  34. సింగుమహంతిపేట
తదితర ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

- ఈ ప్రాంతాల్లో పళ్లు గారపట్టడం, కీళ్లనొప్పులతో బాధపడటం, ఫ్లోరోసిస్‌ వ్యాధితో కాళ్లు వంకర్లు పోవటం వంటి ఛాయలు కనిపిస్తున్నాయి.


ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతంలో ప్రజారోగ్యం దెబ్బతింటున్నా పాలనా యంత్రాంగానికి పట్టడం లేదు. వేసవిలో కంటితుడుపు చర్యగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. కొన్నిచోట్ల నీటి పథకాలు నిర్మించినా నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఉపయోగం లేకుండా పోయింది. బూరాడలో మంచినీటి పథకం నిరుపయోగంగా ఉంది. పెదరోకలపల్లి, జెండాపేట, సింగుమహింతిపేట, బాలకవానిపేట, అగ్రహారం గ్రామాల్లో చెరువు నీరే ఆధారం. కిడ్నీ సంబంధిత వ్యాధులతోపాటు క్షయ, క్యాన్సర్‌ వంటి వాటితో జనం మృత్యువాత పడుతున్నారు.

పరిష్కారానికి చర్యలు
జిల్లాలో ఫ్లోరైడ్‌, బ్రాకిస్‌ (ఉప్పునీరు) ఉన్న 57 ప్రాంతాలున్నాయి. ఫ్లోరైడ్‌ పీడితప్రాంతాల్లో నీటిపథకాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. ఈ ఏడాది ప్రాంతాలన్నింటికీ దాదాపుగా తాగునీటిని పథకాల ద్వారా అందిస్తాం. మిగిలిన జిల్లాలతో పోలీస్తే శ్రీకాకుళంలో ఫ్లోరైడ్‌ సమస్య తక్కువే. అని ఆంటున్నారు - ఆర్‌.కాంతనాధ్‌, ఎస్‌.ఇ., ఆర్‌.డబ్ల్యు.ఎస్‌., శ్రీకాకుళం.

ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తమవంతు నివారణ , నియంత్రణ చర్యలు చేపడితే బాగుంటుంది . గ్రామాలలో సమిస్టిగా నీటిని సుద్దిచేసే ఏర్పాట్లు చేపట్టాలి . సంఘాలు , సమావేశాలతో ప్రజలను జాగ్రుత పరచాలి , కలుషిత నీటివలన నష్టాలను , కష్టాలను వివరించి అవగాహన కల్పించాలి .
  • ===========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !