కొన్ని పరిశ్రమలు : >
- రైస్ మిల్లులు పరిశ్రమలు,
- జీడిపప్పు పరిశ్రమలు,
- జూట్ పరిశ్రమలు,
- కొబ్బరి పీచు పరిశ్రమలు,
- మందులు పరిశ్రమలు,
- పేపరు పరిశ్రమలు,
- బెవరేజస్ పరిశ్రమలు,
- పంచదార పరిశ్రమలు,
- పిస్టన్స్ అండ్ రింగ్స్ పరిశ్రమలు,
- పవర్ జనరేషన్ పరిశ్రమలు,
- ఇథనాల్ పరిశ్రమలు ,
- గ్రానైట కటింగు పరిశ్రమలు,
- గార్నైట్ పరిశ్రమలు,
- ఉప్పు పరిశ్రమలు ,
ప్రధాన పారిశ్రామిక కేంద్రం .. పైడిభీమవరం .
శ్రీకాకుళం జిల్లాలో భారీపరిశ్రమలు --- 29 ,
మధ్య, చిన్న తరహా పరిశ్రమలు --4110 ,
నూనె ఆడే పరిశ్రమలు ,గ్రానైట్ పరిశ్రమలు , టింబర్ కోత డిపోలు , పేపర్ మిల్లులు , జూట్ ఫాక్టరీస్ , నౌపొడా ఉప్పు పరిశ్రమ , కొబ్బరి పీచు పరిశ్రమ , ఉదాహరణకు కొన్ని.
శ్రీకాకుళం జిల్లా అరుదైన నీలిగ్రానైట్, జీడిపప్పు పరిశ్రమలకు ప్రసిద్ధి. ఇవి కాక రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో ఎన్నో ఔషధ తయారీ సంస్థలున్నాయి. త్వరలోనే రణస్థలం మండలం కొవ్వాడలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో 6 వేల మెగావాట్ల సామర్ధ్యంతో అణువిద్యుత్తు పార్కును నిర్మించనున్నారు. జిల్లాలో అయిదు థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం ఆందోళనల కారణంగా పనులు, సర్వేలు, భూసేకరణ నిలిచిపోయాయి. జిల్లాలోని వివిధ పరిశ్రమల వివరాలు ఇలా ఉన్నాయి..
అరబిందో ఫార్మా: రణస్థలం మండలం పైడిభీమవరంలో 1996లో ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద బల్క్ యూనిట్‌గా పేరు గాంచింది. ఇందులో ప్రధానంగా అన్ని రకాల బల్క్ డ్రగ్స్ తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 600 మంది పని చేస్తుండగా 4వేల మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.
ఆంధ్రా ఆర్గానిక్స్: దీనిని కూడా రణస్థలం మండలం పైడిభీమవరంలో 1997లో ప్రారంభించారు. సల్ఫామెథాజోల్ ప్రధాన ఉత్పత్తిగా తయారు చేస్తున్నారు. ఇవేకాకుండా బల్క్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా 200 మంది వరకు పని చేస్తుండగా పరోక్షంగా 400 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
సరాకా కెమికల్స్: ఈ పరిశ్రమను 2004లో పైడిభీమవరం పారిశ్రామికవాడకు సమీపంలో చిట్టివలస గ్రామం వద్ద ప్రారంభించారు. ఇక్కడ కూడా బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నారు. పరిశ్రమలో ప్రత్యక్షంగా 150 మంది వరకు పని చేస్తుండగా, మరో 200 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.
లేన్‌టెక్ కెమికల్స్- పైడిభీమవరం సమీపంలో చిట్టివలస గ్రామం వద్ద 2008లో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇంకా పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ప్రారంభించలేదు. ఇక్కడ కూడా బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం 50 మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.
శ్యాంక్రిగ్ రింగ్స్- పైడిభీమవరం పంచాయతీ పరిధిలోని వరిసాం వద్ద 1989లో దీనిని ప్రారంభించారు. వాహనాల రింగ్స్, పిస్టన్స్‌ను తయారు చేస్తారు. ఇక దీనికి సంబంధించి మరో యూనిట్ ఎచ్చెర్ల మండలం అరిణాంఅక్కివలస వద్ద ఉంది. ఇక్కడ కూడా పెద్ద వాహనాలకు అవసరమైన రింగ్స్, పిస్టన్స్ తయారు చేస్తారు. రెండు పరిశ్రమల్లో ప్రత్యక్షంగా 800 మంది పని చేస్తున్నారు.
స్వర్ణాంధ్ర జ్యూట్ మిల్లు: రణస్థలం మండలం పిషిణి పంచాయతీ పరిధిలో నెలివాడ వద్ద దీన్ని ప్రారంభించారు. జ్యూట్ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇక్కడ 300 మంది కార్మికులు పని చేస్తున్నారు.
స్ప్రింజ్ లేబ్: రణస్థలం మండలం పిసిని వద్ద రూ. 20 కోట్లతో దీనిని నిర్మించారు. ఇక్కడ కూడా బల్క్‌డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నారు.ప్రస్తుతం 50 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.
వి.కె.టి ఫార్మా: రణస్థలం మండలం దేరసాం గ్రామం వద్ద దీనిని ఏర్పాటు చేస్తున్నారు. రూ. 20 కోట్లతో నిర్మితమవుతున్న ఈ పరిశ్రమలో వివిధ రకాల మందులను తయారు చేస్తారు.
యునైటెడ్ బ్రేవరీస్: రణస్థలం మండలం బంటుపల్లి గ్రామం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పలు రకాల బీర్లు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ప్రత్యక్షంగా 200 మంది ఉపాధి పొందుతుండగా 500 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.
రఫా పేపర్ ఇండస్ట్రీస్: లావేరు మండలం సుబధ్రాపురం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ పేపరు గ్లాసులు, ప్లేట్లు తయారు చేస్తున్నారు.
హర్ష స్టీల్స్: లావేరు మండలం బుడుమూరు వద్ద రూ. 10 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. ఇంకా ఉత్పత్తులు ప్రారంభించలేదు.
నాగావళి సాల్వెంట్స్- ఎచ్చెర్ల మండలం పోలీస్ క్వార్టర్స్ సమీపంలో 1995లో ప్రారంభించారు. ఇక్కడ నూనె తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా 100 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.
వరం పవర్ ప్రాజెక్టు: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద 2000లో వరం పవర్ ప్రోజెక్టును నెలకొల్పారు. ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ప్రత్యక్షంగా 100 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
స్మార్ట్‌కెం: ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద దీనిని 1999లో నెలకొల్పారు. ఇక్కడ అమోనియా, నైట్రేట్‌ను తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 100 మంది వరకు, పరోక్షంగా 2500 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.
క్రోనిమెట్ ఎల్లాయిస్: రావివలసలో 1990లో శారదా ఫెర్రోఎల్లాయిస్‌గా ప్రారంభమైన ఈ పరిశ్రమ అనంతరం జీఎమ్మార్ వాసవిగా రూపాంతరం చెంది 2010లో క్రోనిమెట్ ఎల్లాయిస్ యాజమాన్యం చేతిలోకి వెళ్లింది. ఏటా రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన ఈ పరిశ్రమలో 300 మంది వరకూ ఉద్యోగులున్నారు.
భవాని గ్రానైట్స్: టెక్కలి ప్రాంతంలో 2008లో ప్రారంభమైన ఈ పరిశ్రమకు గ్రానైట్ స్టోన్ క్రషింగ్, పాలిషింగ్ ప్రధాన వ్యాపారం. ఏటా రూ. కోటి వరకూ టర్నోవర్ చేస్తారు.
గండి సూర్యనారాయణరెడ్డి స్టోన్ క్రషర్స్: సవరకిల్లి సమీపంలో ఉంది. 1995లో దీన్ని ప్రారంభించారు. టెక్కలి పరిసర ప్రాంతాల్లో ప్రధాన వ్యాపారం ఇక్కడి నుంచే జరుగుతోంది.
గున్న సూర్యనారాయణ స్టోన్ క్రషర్ కంట్రగడ సమీపంలో ఉంది. శక్తి స్టోన్ క్రషర్స్ అంజనాపురం సమీపంలో ఉంది. కనకదుర్గ స్టోన్ క్రషర్స్ వి.ఆర్.కె.పురం సమీపంలో ఉంది.
మధుకాన్ గ్రానైట్స్: నామా నాగేశ్వరరావుకు చెందిన సంస్థ ఇది. టెక్కలి పరిసర ప్రాంతాల్లో క్వారీలు నిర్వహిస్తున్నారు. ఫోను నెంబరు 9440257809
బేరక్ గ్రానైట్స్: బేరక్ గ్రానైట్స్ టెక్కలి ప్రాంతంలో నాలుగు క్వారీలు నిర్వహిస్తున్నారు.టెక్కలిలో 30 వరకు రైసుమిల్లులున్నాయి. జిల్లా రైస్ మిల్లర్ల సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జామి నర్సింహమూర్తి వీరిని సమన్వయం చేస్తుంటారు.
డాక్టర్ రెడ్డీస్: రణస్థలం మండలం పైడిభీమవరంలో 1990లో ఏర్పాటు చేశారు. వివిధ రకాల మందులకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తారు. ప్రధానంగా ఎన్.మిథైల్, సైక్లోప్రోపైల్, ఎసిట్ ఉత్పత్తులు తయారవుతాయి. ఇక్కడ ప్రత్యక్షంగా 400 మంది ఉద్యోగులు పని చేస్తుండగా కాంట్రాక్టు కార్మికులు 500 వరకు ఉంటారు. దీనికి సమీపంలోనే రూ.580 కోట్లతో 250 ఎకరాల్లో రెడ్డీస్ వాణిజ్య మండలి సిద్ధమవుతోంది. ఇందులో కూడా పలు ఫార్మా యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.
నాగార్జున అగ్రికెం: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద 1995లో దీనిని నెలకొల్పారు. ప్రధానంగా పురుగు మందులు నివారణకు అవసరమైన మందులు ఇక్కడ తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 300 మంది కార్మికులు పని చేస్తుండగా పరోక్షంగా 300 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.
ట్రాన్స్‌వరల్డ్ గార్నెట్, సతివాడ, గార మండలం - ఫోన్: 08942 283781
ట్రైమాక్స్ సాండ్స్, వత్సవలస, గారమండలం - ఫోన్: 08942 283755
నీలం జ్యూట్‌మిల్, సింగుపురం - 08942 232142
- ==============================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !