Friday, March 19, 2010

కొబ్బరి పీచు పరిశ్రమ శ్రీకాకుళం లో , Coir industry in Srikakulam








శ్రీకాకుళం జిల్లాలో సోంపేట , కవిటి , కంచిలి , ఇచ్చాపురం మందస , సంతబొమ్మాలి , రణస్థలం మండలము లలో ~28 వరకు పీచు పరిశ్రమలు ఉన్నాయి . కేరళ కొబ్బరి అభివృద్ధి బోర్డు సహకారం తో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమల ద్వారా మూడు వేల మందికి ప్రత్యక్షము గాను , రెండు వేల మందికి పరోక్షముగాను ఉపాది లబిస్తుంది .పరిష్టమలో పనిచేసే కూలీలు , గుమాస్తాలు , ఇతర సిబ్బంది తో పాటు కొబ్బరి డొక్కలు ఒలిచే కార్మికులకు ఉపాది అవకాశాలు లబిస్తున్నాయి .

ఈ మధ్యన కొబ్బరి కాయలు డొక్కలతో (పీచు తీయకుండా) ఎగుమతి చేయడం తో ఈ పరిశ్రమకు పని తక్కువైనది . శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల మేర కొబ్బరి సాగు అవుతున్నది . ఇందులో బొండాం రూపములో 30% , డొక్కా తో 40% వరకు కాయలు చెల్లుబాటు అవుతుండడం తో కనీసము 30% డొక్క దొరకడం కష్టం గా ఉన్నది .

Baruva Coier industry-Srikakulam,బారువ కొబ్బరి పీచు పరిశ్రమ-శ్రీకాకుళం

 సోంపేట కొబ్బరి పీచు పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అన్ని విధాలుగా అనుకూలమైనదని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి ప్రోత్సాహం అందిస్తామని రాజమండ్రి కొబ్బరి బోర్డు ప్రాంతీయ అధికారి పి.టి.అశోకన్‌ తెలిపారు. మంగళవారం బారువలో కొబ్బరి ఉత్పత్తులు, పీచు పరిశ్రమల ఏర్పాటు, ఇతర అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్రంలో ఏడు జిల్లాల పరిధిలో కొబ్బరి అభివృద్ధి జరుగుతుందని, కొన్ని చీడపీడలు ఆశించడం మూలంగా నాణ్యతతోపాటు కాయ దిగుబడి తగ్గిందని చెప్పారు. కొబ్బరి ఉప ఉత్పత్తుల ప్రోత్సాహానికి నిరుద్యోగులకు సహకారం అందజేస్తుందన్నారు. కొబ్బరి పీచు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఆర్థికంగా, సాంకేతికంగా సహాయం అందజేస్తామని, మార్కెట్‌తోపాటు ఇతర విధాలుగా మద్దతు ఉంటుందని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న నిరుద్యోగ యువకులు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైతే ఉపకార వేతనంతో కూడిన శిక్షణ ఏడాదిపాటు ఇస్తామన్నారు. కొబ్బరి బోర్డు ద్వారా అమలు జరుగుతున్న ఇతర పథకాల గురించి వివరించారు.

పీచు కేంద్రం పునరుద్ధరణ- నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ,- బారువ శిక్షణ కేంద్రం పునరుద్ధరణ, 

దశాబ్దాల పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలిగించిన బారువ కొబ్బరి పీచు శిక్షణ కేంద్రాన్ని పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీకాకుళం జిల్లా పరిశ్రమల అధికారి బి.గోపాలకృష్ణ తెలిపారు. ఈ శిక్షణ కేంద్రానికి అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ అర్ధాంతరంగా మూతపడిందని, దీనిని తెరిపిస్తే ఎంతో మందికి ప్రయోజనం ఉంటుందని పూర్వ విద్యార్థి సంఘం ప్రతినిధులు డాక్టర్‌ ఎ.వి.రామకృష్ణ, తుమ్మిడి యోగి, రత్నాల ఖగపతి, రామ్మోహనరావు, బలివాడ కృష్ణారావు, తదితరులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎ.పి. ఐ.ఐ.సి. మేనేజర్‌ హరిధరరావు, కొబ్బరి బోర్డు అధికారులు ఎం. రాజశేఖరరావు, కె. దశరధరావు, సయ్యద్‌బాబాసాదిక్‌, సోంపేట మాజీ సర్పంచి వి.ఎం.గాంధీ, తదితరులు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు కొబ్బరి బోర్డు ద్వారా అందించే రాయితీలు, కొత్త పారిశ్రామికవేత్తలకు అందించే సహకారం గురించి వివరించారు.

  • ===========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !