శ్రీకాకుళం లో ప్రక్రుతి ప్రసాదించిన ఎన్నో నదులున్నా ముఖ్యము గా చెప్పుకోదగ్గవి ....
1. నాగావళి,
2. వంశధార ,
౩. మహేన్ద్రతనయ,
4. చంపావతి,
5. బహుద,
6. కుమ్భికోతగెడ్డ,
7. సువర్ణముఖి,
8. వేగావతి,
9. గోముఖి.
- వంశధార
* ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లాలోని మిన్నజోలా వద్ద వంశధార జన్మించింది. ఆ రాష్ట్రంలో 154 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. అక్కడి నుంచి సరిహద్దులో 29 కిలోమీటర్ల దూరం ప్రయాణించి భామిని మండలం కంట్రగడ వద్ద ఆంధ్ర భూభాగంలోకిప్రవేశిస్తోంది.అది మొదలుకొని జిల్లాలో ఈ నది మొత్తం 82 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. గార మండలం కళింగపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తోంది.వంశధార నదిపై గొట్టా బ్యారేజీ ఉంది. దీనికి కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి.
* హిరమండలం మండలం గొట్ట వద్ద 1972వ సంవత్సరంలో గొట్టా బ్యారేజీ పనులు ప్రారంభించి 1977లో పూర్తి చేశారు.
* బ్యారేజీతో పాటు 1,48,230 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో 1977 సెప్టెంబరు 29న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ బ్యారేజీని ప్రారంభించారు.
* కుడికాల్వ ద్వారా 67591 ఎకరాలకు నీరు అందించేందుకు పనులను 1983లో ప్రారంభించారు 2000 నాటికి పూర్తయ్యాయి.
* కుడి కాలువ పొడవు 56 కిలోమీటర్లు. హిరమండలం, ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస, గార, శ్రీకాకుళం, మండలాల్లోని 62 వేల ఎకరాలకు దీని ద్వారా సాగునీరందుతోంది.
* ఎడమ కాల్వ పొడవు 107 కిలోమీటర్లు. దీనిద్వారా నరసన్నపేట, టెక్కలి, జలుమూరు, పలాస తదితర 13 మండలాల పరిధిలో 1,48,000 ఎకరాలకు సాగునీరందుతోంది.
* గొట్టా బ్యారేజీ సాధారణ సామర్థ్యం 34 అడుగులు. గరిష్ఠ సామర్థ్యం 38 అడుగులు.
* ఈ గొట్టా బ్యారేజీ ద్వారా 2.10 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది.
* బ్యారేజీలో 38.01 (0.10 టీఎంసీలు) మీటర్ల మేర నీటిని నిల్వ ఉంచుతున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద 22 సాధారణ గేట్లతోపాటు 2 అత్యవసర గేట్లు ఉన్నాయి. బ్యారేజీ పొడవు 457 మీటర్లు
- నాగావళి
శ్రీకాకుళం పట్టణానికి ప్రధాన నీటివనరు నాగావళి నది. ఈ నది ద్వారా సుమారు 10 మిలియన్ లీటర్ల నీటిని రోజువారి ఉపయోగిస్తున్నారు. మనిషికి సగటున 90 లీటర్ల చొప్పున పంపిణీ చేస్తున్నారు. నాగావళి నది వలన శ్రీకాకుళం పట్టణానికి వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఉండదు.
- మహేంద్ర తనయ , బహుదా నదులు
మహేంద్ర తనయ , బహుదా నదులు ఇచ్చాపురం , పలాస నిహోజక వర్గాలకు ప్రధాన నీటి వనరులు . ఇవి ఒరిస్సాలొ పుట్టి ... ఆంధ్ర లొ సముద్రం లో కలుస్తున్నాయి . మహేంద్రతనయ నది ఆవిర్భావం తరువాత రెండుగా మారి ఒక పాయ్ ఇచ్చాపురం నియోజకవర్గం మీదుగా సాగరానికి చేరుతుంది . మరో పాయ పాతపట్నం పరిసర ప్ర్రాంతాల మీదుగా ప్రవహిస్తోంది . వీటి ద్వారా జిల్లాలో 50 వేల ఎకరాల వరకు సగుచేసే అవకాశం ఉన్నది .
- బాహదా
ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ గ్రామం వద్ద ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన బాహుదా నది కొళిగాం, కీర్తిపురం, పాయితారి, తోటూరు, బిర్లంగి, మశాకపురం, రత్తకన్న, ఇచ్ఛాపురం, లొద్దపుట్టి, శాసనం, అరకబద్ర, టి.బరంపురం తులసిగాం, కొఠారి, ఈదుపురం, కేశుపురం, బూర్జపాడు గ్రామాల మీదుగా ప్రవహించి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
* ఒడిశా జరడా కొండలలో పుట్టిన ఈ నది ఒడిశాలో 38 కిలోమీటర్లు, ఆంధ్రాలో (కేవలం ఇచ్ఛాపురం) కేవలం 16 కిలోమీటర్లు ప్రవహించి సముద్రానికి చేరుతోంది.
* ఒడిశా రాష్ట్రం ఈ నదీ జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఏటా రెండు పంటలు సమృద్ధిగా సాగుచేసుకుంటోంది. అదే ఆంధ్రాలో ఈ నదిలో వచ్చిన వరద జలాలను సైతం జాగ్రత్త పరిచే చర్యలు లేవు. వరదలు వస్తే ముంపు, లేకుంటే కరవు.. ఇదీ ఆంధ్రా పరిస్థితి.
* ఇచ్ఛాపురానికి సుమారు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న భగలట్టి గ్రామం వద్ద కిలోమీటరున్నర పొడవున 110 అడుగుల ఎత్తున ఒడిశా ఆనకట్టను నిర్మించింది. గత పదేళ్ళుగా ఈ ప్రాజెక్టు కోసం రూ.వందల కోట్లు వెచ్చించారు. బాహుదా జలాలన్నీ అక్కడే నిల్వ చేసుకుని ఆ రాష్ట్రంలో సగం ప్రాంతానికి ఈ నీటిని విడుదల చేస్తున్నారు.
* ఆంధ్రాలో బాహుదాజలాలపై ఆధారపడి సుమారు 7 వేల ఎకరాల పంటభూములు ఉన్నాయి. ఈ భూములను ప్రస్తుతం పరిశీలిస్తే, అన్ని చోట్లా బోర్లు వేసుకుని సాగుచేసుకోవడంకనిపిస్తుంది.
* అరకబద్రవద్ద రిజర్వాయర్ కట్టాలని 1978లో ఆంధ్రా ప్రభుత్వం సంకల్పించింది. అప్పట్లో దీనికి రూ. 40 కోట్లు అవసరమౌతాయని భావించారు. సర్వేలు, అంచనాలతో సంవత్సరాలు గడిచిపోయాయి. సర్వే కోసమే రూ. 40 కోట్లు ఖర్చు చేశారు. తీరా చివరకు తేల్చిందేమిటంటే ఈ ప్రాజెక్టుకోసం రూ. 250 కోట్లు కావాలని చెప్పారు. 7 వేల ఎకరాల కోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకని ప్రభుత్వం వెనకంజ వేసింది. అదే ఈ ప్రాంత ప్రజల పాలిట శాపంగా మారింది.
* ఈ నదిపై ప్రత్యక్షంగా ఈదుపురం ఉద్దానం మంచినీటి పథకంతో పాటు, శాసనం, ఇచ్ఛాపురం పురపాలకసంఘం మంచినీటి పధకం ఆధారపడి ఉన్నాయి. రత్తకన్న ప్రాంతానికి బాహుదానదిలో వేసిన ఊటబావుల ద్వారానే మంచినీటిని సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో పురుషోత్తపురం గ్రామంలో ఏర్పాటు చేసే మంచినీటి పథకానికి కూడా బాహదా జలాలే ఆధారం. ఇక పరోక్షంగా కొళిగాం నుంచి డొంకూరు వరకు గల గ్రామాలన్నీ ఈ నదీ జలాలకు సమీపలోనే బోర్లు వేసుకుని నీటిపథకాలను అమలు చేస్తున్నాయి.
* ఎగువనున్న ఒడిశా అంతరాష్ట్రనదీజలాల ఒపందాన్ని కాలరాస్తోంది. 1974లో అప్పటి ఆంధ్రా ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్‌ల మధ్య భువనేశ్వర్‌లో జల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాది పొడునా 1.5 టి.ఎం.సి.ల నీటిని ఆంధ్రాకు విడిచి పెట్టాలి. గతంలో వరదలు వస్తే నీరు నిల్వ చేసే అవకాశం లేక నీటిని ఆంధ్రాకు విడిచి పెట్టేసేవారు. దాంతో ఆంధ్రా పంటభూములన్నీ మునిగిపోయేవి. ఇప్పుడు భగలట్టి ఆనకట్ట ఎత్తు పెరిగి పోవడంతో వరద నీరుకూడా దిగువకు విడిచి పెట్టడం లేదు. దాంతో వర్షాలు పడిన మూడు నెలలు మినహా మిగిలిన కాలమంతా బాహుదానది ఎండిపోయి కనిపించేది.
* ఆంధ్రా పరిధిలో ఉన్న ఈ నదికి 11 ఓపెన్ హెడ్ చానళ్లు ఉన్నాయి.
- బాహుదానది చేరిన నీరు: 11.50 శతకోటి ఘటపుటడుగులు (టీఎంసీలు) శ్రీకాకుళం జిల్లాకు రావాల్సిన వాటా: 1.5 టీఎంసీలు వచ్చిన వాటా: 0.60 టీఎంసీలు * మన నీటిలోనూ ఒడిశా వాడకం: 0.20 టీఎంసీలు సముద్రంపాలైది: 0.10 టీఎంసీలు. మన నీటి వాటా 1.5 శతకోటి ఘటపుటడుగులు (టీఎంసీలు).. భారీ వర్షాలు.. తుపానులు వస్తే.. నీటిని దాచుకోవడం కష్టం అనిపిస్తే.. వాటిని ఆంధ్రాకు విడిచిపెడుతూ.. 'ఇవే లెక్కకట్టుకోండని' అని చెబుతున్నారు ఒడిశా అధికారులు.. బగలట్టి జలాశయాన్ని 110 మీటర్ల ఎత్తుకు పెంచారు. కేవలం బాహుదా నదిపై నిర్మించిన కట్టడాల కోసమే రూ. 500 కోట్లకు పైగా వెచ్చించారు. 8 మినీ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారు.. వారికి నీరంటే అంత ప్రాణం మరి..
బాహుదాతో 12,000 ఎకరాలకు సాగు.. 28 గ్రామాలకు తాగునీరు.. ఇవీ మన అవసరాలు.. మరిమనమేం చేస్తున్నాం.. ఒడిశాను ప్రశ్నించలేకపోతున్నాం.. వచ్చిన నీటిలో 0.10 టీఎంసీల నీటిని సముద్రంలో కలిపేస్తున్నాం.. పాలకులు.. అధికారుల్లో ఒకటే నిర్లక్ష్యం.. మనదేంపోయింది.. జనమేగా.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. భారీ వర్షాలొస్తే పంటలన్నీ ముంపే..వర్షాలు లేకుంటే చెరువులు సైతం నీటిచుక్కలేని వనరులుగా మిగిలిపోతున్నాయి. జిల్లాలో ప్రధాన నదులు వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా.. మిగిలిన నదులకన్నా బాహుదా పూర్తి నిర్లక్ష్యానికి గురౌతోంది. ఒడిశాలో పుట్టి ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ వద్ద ఆంధ్రాలోకి ప్రవేశించిన ఈ నదీ జలాలు వృథాగా బంగాళాఖాతానికి చేరుతున్నాయి. మధ్యలో ఎక్కడా నీటిని ఆపే ప్రయత్నాలు మన ప్రభుత్వం చేయడంలేదు.- అవసరాలు అధికం
- ఎగువ అలసత్వం.. దిగువ నిర్లక్ష్యం
- అడ్డుకట్టలు కడుతోంది.
* మన ప్రాంతంలో కాలువల నిర్వహణ కొరవడింది. రైతులే ఏటా శ్రమదానం చేసి కాస్త రూపు తెస్తున్నారు. బాహుదా ఉత్తరవాహిని (ఉత్తరాయణం) వద్ద సిమెంటు పనులు తప్పా నీటిపారుదల శాఖ ఏ పనులూ చేయలేదు. కొన్ని చోట్ల రైతులకు సొమ్ములిప్పిస్తామని చెప్పి, పనులు చేయించుకుని, సొమ్ములు ఇవ్వని పరిస్థితి కూడా ఉంది. సక్రమంగా నిర్వహణలేని కాలువల పరిస్థితి దయనీయంగా మారాయి. ప్రథమ కాలువ రాజ్‌గాయ్ మొదలుకుని చివరి కేశుపురం, బూర్జపాడు వరకు అంతటా ఇదే పరిస్థితి. పురుషోత్తపురం పుష్పగిరి, బెల్లుపడ శుద్ధికొండ, పీర్లకొండ, సూదికొండలపై కురిసిన వర్షపు నీరంతా వివిధ మార్గాలలో బాహుదా నదికే చేరుతోంది. ఈ నీటిని కట్టడి చేసినా ఫలితం దక్కేది.
* సమస్యపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. సానుకూలమైన నివేదికను ప్రభుత్వానికి దాఖలు పరచింది. 12వేల ఎకరాలకు రూ. 250కోట్లు వెచ్చించడమా అంటూ పాలకులు వెనుకంజవేశారు. ఒడిశా ప్రభుత్వం కేవలం బాహుదానదీ జలాల కోసం ఏటా రూ. వందల కోట్లు వ్యయం చేస్తోంది. ఇచ్ఛాపురం ప్రాంతంలో సాగునీటి వనరుల అభివృద్ధికి రూ. 3.54 కోట్లు వచ్చాయి. వీటిని బాహుదా కాలువల బాగుకు కేటాయించారు. ఈ నిధులను వ్యయం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. గత ఏడాది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి వనరుల అభివృద్ధిని చేపట్టారు. అందులో మూడు చోట్ల అనుబంధ పనులు చేశారు. కూలీలకు ఉపాధి అయితే దొరికింది గానీ కాలువలకు పూర్తి మేలు జరగలేదు. ఇచ్ఛాపురం ప్రాంతంలో బాహుదా నది కాక భీమసాగరం గెడ్డ, పద్మాపురం గెడ్డ, వందల ఎకరాల విస్తీర్ణంతో ఉండే సాయిరాం, వడ్డిన, సిద్ధి చెరువులు ఉన్నాయి. 25 ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు ఆయకట్టు గల పంచాయతీరాజ్ చెరువులు 120 ఉన్నాయి. జలాలన్నీ ఒడిశాకే
* ఎగువన ఒడిశా ఉండటం, దిగువున ఆంధ్రా ఉండటంతో ఎగువ నుంచి ప్రవహించే నదీ జలాలను ఒడిశా వినియోగించుకుంటోంది. గత ఒప్పందాలను కూడా కాలరాయడమే కాకుండా, ఎక్కడికక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టి నీటిని హరిస్తోంది. ఇంత జరుగుతున్నా ఆంధ్రా పాలకులు చోద్యం చూస్తున్నారు. అక్కడ 11.50 శతకోటి ఘటనపుటడుగుల (టి.ఎం.సి.)ల నీరు చేరుతోంది. వాటిని వివిధ జలాశయాలు, కాలువల ద్వారా నిల్వచేసి మళ్లిస్తోంది.ఆంధ్రాకు వచ్చే వరదనీరు వృథాయే ఆంధ్రా ప్రాంతానికి చేరే కాస్త జలాలనైనా వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడా నీటిని అడ్డుకట్ట వేసి, మళ్లించే చర్యలు లేవు. బాహుదానది ఆంధ్రాలోకి ప్రవేశించాక 8 మినీ ఎత్తిపోతల పథకాలను ఒడిశా నిర్వహిస్తోంది. ఆంధ్రాలో ఈదుపురం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం కూడా మూలకు చేరినా పట్టించుకునే నాథుడు కరవయ్యారు. బాహుదానది ద్వారా ఆంధ్రాకు 0.60 టి.ఎం.సి. నీరు వస్తోంది. అందులో ఆంధ్రాకు 0.30 టి.ఎం.సి.ల నీరు వినియోగమౌతుంటే, ఒడిశాకు 0.20 టి.ఎం.సి.ల నీరు వాడుతున్నారు. ఇక్కడ 12 వేల ఎకరాలు ఉండగా, అక్కడ కేవలం 2,500 ఎకరాల కోసం ఆ నీరు వాడుతున్నారు. మిగిలిన 0.10 టి.ఎం.సి.ల నీరు సముద్రానికే చేరుతోంది. ఒప్పందం అమలుకావడం లేదు -నాటి ఇరురాష్ట్రాల ఒప్పందం అమలు కావడం లేదు. బాహుదాతో పాటు అన్ని నదుల పరిస్థితి ఇలానే ఉంది.
--న్యూస్‌టుడే-ఇచ్ఛాపురం (డిసెంబర్ 2012)
- మహేంద్రతనయ
మహేంద్రతనయ నది ఒడిశాలోని తుంబ అటవీ ప్రాంతంలో పుట్టి రెండుపాయలుగా విడిపోయి ఆంధ్రాలో ప్రవేశిస్తోంది. ఒక పాయ మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో ప్రవహిస్తుండగా మరొక పాయ మందస, సోంపేట మండలాల్లో ప్రవహిస్తోంది. మహేంద్రతనయపై వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, గ్రోయిన్‌ల ద్వారా 40 వేల ఎకరాల వరకు పంట పొలాలు సాగవుతున్నాయి. మందస మండలం పెద్దకోష్ట వద్ద ఆంధ్రాలో ప్రవేశించే మహేంద్రతనయ నది 45 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి సోంపేట మండలం బారువ కొత్తూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. నదిపై పైడిగాం మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుతోపాటు పొత్తంగి, ఏటిబట్టి, బారువ, మూలపొలం గ్రోయిన్లు, పొత్రఖండ ఎత్తిపోతల పథకాల ద్వారా మందస, కంచిలి, సోంపేట మండలాల పరిధిలో 25 వేల ఎకరాల పంట పొలాలు సాగవుతున్నాయి. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో 300కు పైగా గ్రామాల పరిధిలో 4 లక్షల మందికి తాగునీరందుతోంది. నదిపై ఉద్దానం ప్రాజెక్టుతోపాటు 10 రక్షిత మంచినీటి పథకాలు, ఒక సమగ్ర గ్రామీణ మంచినీటి పథకం పనిచేస్తున్నాయి
ఇచ్చాపురం , పలాస నియోజకవర్గాల పరిధిలో మూడువందల గ్రామాలు ఈ నదీ జల్లల పైనే త్రాగు నీటికి ఆధారపడి ఉన్నాయి . పైడిగాం ప్రోజెక్ట్ తో పాటు బారువ , పొత్తంగి , ఏటిబట్టి , మూలపొలం గ్రోయిన్లు , పొత్రఖండ వద్ద ఎత్తిపోతల పథకాలు ఈ నది పై ఉన్నాయి .
బహుదా నది పై ఈదుపురం వద్ద ఒకేఒక ఎత్తిపోతల పథకం ఉన్నది ... అది కుడా అలంకారప్రాయమయింది .
- సువర్ణముఖి
- వేగవతి
- ==========================================
http://dr.seshagirirao.tripod.com/
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !