- శ్రీకాకుళం లో 38 మండలాలు , 1107 గ్రామపంచాయతీలు , 16 మేజరు పంచాయతీలు , ఒక నోటిఫైడ్ నగరపంచయతే -- రాజాం , & 4 మునిసిపాలిటీలు -- శ్రీకాకుళం , ఆమదాలవలస , పలాస , ఇచ్చాపురం . ఉన్నాయి. జిల్లా జనాభా : 28.50 లక్షలు , జనన రేటు : 18.7 /1000, మరణ రేటు : 8 / 1000,గా ఉన్నాయి
- ఎంత ఘనత సాధించిన త్రాగునీటికి మాత్రం ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు . దీనికి కారణము ఎవరు ? ఎందుకిలా జరుగుతుంది .
- శ్రీకాకుళం లో ప్రక్రుతి ప్రసాదించిన ఎన్నో నదులున్నాయి ....
1. నాగావళి,
2. వంసధార ,
౩. మహేన్ద్రతనయ,
4. చంపావతి,
5. బహుద,
6. కుమ్భికోతగెడ్డ,
7. సువర్ణముఖి,
8. వేగావతి,
9. గోముఖి.
ఇన్ని నదులున్నా త్రాగడానికి ఎందుకు నీరు లేదు . నూతులు తవ్వితే నీరు పాడడం లేదు , బోరు వేస్తే ఎక్కడో తప్ప వేసవిలో నీరు ఉండదు . కారణము .. భూమి ఉపరితలము పై నీరు నిలవా లేదు . నదులలో నీరు వేసవిలో ఉండదు ... నిలవా ఉండేందుకు తగిన ఏర్పాట్లు లేవు . పూర్వము ప్రతి గ్రామానికి కనీసము మూడు (3)చెరువులు ఉండేవి ఈలెక్కన జిల్లాలో చిన్న , పెద్ద కలిపి సుమారు 3600 చెరువులు ఉండేవి వర్షాకాలములో నిండి వేసవిలో నీటి అవసరాలు తీర్చేవి ... కాని రాజకీయ నాయకుల పుణ్యమా అని ... ప్రభుత్వపరం గా ఓటు భ్యాంక్ రాజకీయం తో ... ఉన్న పోరంబోకు భూములు , పశువు మేసే పచ్చిక బయళ్ళు , ప్రబుత్వ చెరువు పేదవారికి భూమి పంపకము పేరుతొ ధారదత్తము చేశారు . ప్రక్రుతి ప్రసాదించిన నీరివనరులు ప్రజల అన్యాకాంతం అయి నీటి ఎద్దడికి దారితీసినది .
భూమి లోపల ఉండేది వేడితో కూడుకున్న లావా మరి భూమి లో లోతుగా తవ్వితే మనకి వచ్చేది లావాయే కాని నీరు కాదు . అందుకే
- భూ ఉపరితలము పై నీటినిలవలు మెరుగు పరిచే ప్రణాలికలు చేపట్టాలి .
- ప్రతి ఊరికి నాలువైపుల చెరువులు తవ్వి నీటి నిలవ పనులు చేపట్టాలి .
- ప్రతి నదికీ ప్రతి 20 కిలోమీటర్లకు ఒక నీటి నిలవా డాం (గట్టు) వరదలకు తావివ్వకుండా కట్టి త్రాగునీటి అవసరాలకువినియోగించాలి .
జిల్లాలో ఉద్దానము , శాలిహుండం పెద్ద పథకాలు . ఇంకా ఎన్నో చిన్న చిన్న నీటి పథకాలున్నాయి .
రాజాం నగర పంచాయతి :
రాజాం పట్టణానికి 16 కి.మీ.దూరములో ఉన్న రేగిడి మండలం నాగావళి నది నుండి పైపులైన్లు ద్వారా తాగునీటిని తరలిస్తున్నారు . పట్తణ జనాభా 46 వేలు దాటే ఉన్నది . . . ఆ స్థాయి తాగునీటి సరఫరా మాత్రం కావడం లేదు . ప్రదాన పైపు లైన్ కి మజ్జిరాయుడు పేట , బూరాడ , గురవాం , లింగాలవలస కూడలి , శిర్లాం కూడలి , తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున లీకులు ఏర్పడడం తో చాలా మటుకు మంచినీరు వృదా అవుతుంది . ఇప్పటి వరకు రాజాం లో 300 వరకు పబ్లిక్ కొళాయిలు , 800 వరకూ ఇంటి కుళాయిలు ఉన్నాయి. కొన్ని చోట్ల ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు . ఎన్ని నీటిపథకాలు పెట్టినా వాటి నిర్వహణ బాద్యతలు చేపట్టనిదే ఎందుకు పనికిరాకుండా నిరుపయోగమవును. ప్రభుత్వ బాద్య్యత ఎంతఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రజలు , ప్రబుత్వోద్యోగులు వహించాల్చిన అవసరము ఉంది .
శ్రీకాకుళం పట్టణము :
36 వార్డులు , లక్షా 27 వేల జనాభా ఉన్న శ్రీకాకుళం టౌన్ లో ఒక సెంట్రల్ రిజర్వాయర్ , 9 సర్వీస్ రిజర్వాయర్లు , 3 పంపింగ్ స్టేషన్లు , 285 వరకు బోర్ల ద్వారా పస్తుతము తాగునీటి సరఫరా చేస్తున్నారు . 8950 ఇంటి కుళాయి కనెక్షన్లు , 412 పబ్లిక్ కుళాయిలు , ద్వారా రోజుకు 10.50 మిలియన్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు . ఈ లెక్కన ఒక్కో పౌరుడుకి 90 లీటర్ల నీటిని ఇస్తున్నందునట్లు అధికార గణాంకాలు చూ్సిస్తున్నాయి . కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా తాగునీటిని సరఫరా అవుతుంది . నాగావళి నది నీటిని క్లోరినేషన్ చేసి సరఫరా అవుతుంది .
కొన్ని నిజాలు :
- శ్రీకాకుళం లో సుమారు 22 ఏళ్ళ క్రితం వేసిన గొట్టాల ద్వారానె నేటికి నీరు సరఫరా చేస్తున్నారు . కొన్ని చోట్ల నీటి గొట్టాలు తృప్పు పట్టి రంద్రాలు ఏర్పడి కొన్ని చోట్ల మురుగు కాలవల నీటితో కలుసితమవుతున్నాయి.
- పైపుల లీకుల మూలాన నీటిలో బ్యాక్టీరియా , ఇతరత్రా విషపదార్దాలు నేరుగా కలిసిపోతున్నాయి.
- ఏడాది రూ. 75 లక్షల వరకూ ఆదాయము వస్తున్నా నీటి గొట్టాలు మార్చడం కాని , రిపేరు చేయడం గాని , అధికారుల , నాయకుల పర్యవేక్షణ లేదు.
- చాలా కుళాయిలము డైరెక్ట్ గా మోటార్లు పెట్టి నీటిని తోడేయడం వలన ఎత్తు ప్రాంతాలకు నీరు అందడం లేదు . హొటల్లు, లాడ్జీలు, ఆపార్ట్మెంట్లు, పెద్దపెద్ద హాస్పిటల్ ఈ మోటార్ల ద్వారా తమ నీటి అవసరాలు తీర్చుకుంటున్నాయి. వీరికి తగిన శిక్షలు వేయాలి . లంచాలకు అలవాటైన ఉద్యోగులు ఈ విషయాన్ని చూసి చూడనట్లు కాలం వెళ్ళబుచ్చుతున్నారు .
- పేద , ధనిక అనే తారతమ్యము లేకుండా కుళాయిలన్నింటికీ మీటర్లు పెట్టి నీటి వాడకం బట్టి రుసుము వసూలు చేయాలి . నాయకులు ఓటు బ్యాంక్ కోసం ఆ పని చేయడం లేదు .
- శ్రీకాకుళం జనాభా ------------------లక్షా 27 వేలు ,
- మొత్తము వార్డులు -----------------36 ,
- కుళాయి కనెక్షన్లు ------------------8950,
- పబ్లిక్ కుళాయిలు ------------------412 ,
- పట్టణములో పైపులైన్ల పొడవు ------110 కి.మీ.,
- రోజుకు ఒక్కక్కరికి అవసరమైననీరు -100 లీ.
- సరఫరా అవుతున్న నీరు -----------90 లీ.
ఆవదాలవలస పట్టణము :
నాగావళి , వంశధార రెండు ప్రదహాన నదుల చెంతన ఉన్నా ఆమదాలవలస పట్టణము లో దాహం కేకలు తప్పడం లేదు . తగిన తాగునీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడం లో అధికార యంత్రాంగము విఫలమవుతోంది . సుదూర ప్రాంతాలలోని బోరు బావులపైనే పట్టణవాసులు ఆధారపడుతున్నారు . పట్టణ జనాభా ప్రకారము రోజుకు 7.5 లక్షల క్యాలన్ల తాగునీరు అవసమవగా 4.5 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా అవుతుంది . సరియైన పర్యవేక్షణ , నిర్వహణ లేక ఈ నీటిలో కొంత వృదాఅయిపోతుంది .
నిజమైన నిజాలు :
- పురాతన పైపులే ఉండడం తో ఎక్కడి కక్కడే లీకులు ఉన్నాయి.
- పురపాలక సంఘం ఆవిర్భవించి 25 ఏళ్ళు గడుస్తున్నా కొన్ని వార్డులలో పైపులైన్లు ఇంకా వేయలేదు .
- కుళాయి నిర్వహణ బాగులేనందున కుళాయి చుట్టూ నేల బావి లా తలపిస్తున్నాయి .
- రాజకీయ నాయకులు సేవా దృక్పదము తో కాకుండా ఓటు బ్యాంక్ కోసం మే పనులు చేస్తున్నారు . . అభివృద్ధి కుంటుపడుతుంది .
- ఆముదాలవలస జనాభా ----------37931 (2001),
- వార్దులు -------------------------23,
- విస్తీర్ణము -----------------------19.65 చ.కి.మీ.,
- రక్షత పథకాలు ------------------4,
- రిజర్వాయరు --------------------1,
- పైలెట్ వాటర్ పథకాలు ----------3,
- బోర్లు --------------------------169 ,
- బావులు ----------------------82 ,
- ప్రజా కుళాయిలు -------------178,
- ఇంటి కుళాయిలు -------------1325,
దినదినాభి వృద్ధి చెందుతున్న పలాస -కాశీబుగ్గ మున్‌సిపాలిటి లో 25 వార్డులకు సగానికే రక్షత తాగునీటి సరఫరా ఉంది .
జనాభా ---------------57323,
రోజుకు అవసరమగు నీరు ---8 మిలియన్ లీటర్లు ,
పస్తుతం సరఫరా నీరు ------01 మిలియన్ లీటర్లు ,
పైపులైన పరిది ------------38 కి.మీ,.
వీధి కుళాయిలు -----------170 ,
బోర్లు ---------------------195,
ఇంటి కుళాయిలు ---------730, .
ఇచ్చాపురం :
పదేళ్ళ క్రితం ఇచ్చాపురం జనాభా 32662 ఉండేది . ప్రస్తుతం ఇది 36,000 లకు పెరిగింది . బహుదా నది లో మూడు ఊట బావుల ద్వారా సేకరించిన నీటిని పైపులైన్లు ద్వారా సరఫరా చేస్తున్నారు . ఇచ్చాపురం పురపాలక సంఘం లో 23 వార్డులు ఉన్నాయి . ఇక్క డ 23 కి.మీ మేరకు పైపులైన్లు ఏర్పాటు చేస్సరు . పట్నం అన్ని వార్డులకు నీరు అందడం లేదు . నీటి ట్యాఖర్ల ద్వారా కొన్ని ప్రాంతాలకు రక్షత నీటిని అందజేస్తున్నారు .
ఇక్కడ వాస్తవంగా ...
- మనిషికి రోజుకు 100 లీటర్ల నీటిని అందివ్వాల్సివుంది , ఇక్కడ 50 లీటర్ల వరకు అందుతుంది .
- రోజుకు 3.60 మిలియన్ల లీటర్ల నీరు అవసరము ఉండగా 2.50 మిలియన్ల నీరు మాత్రమే లభ్యమవుతుంది .
- గృహకుళాయిలు ------------------------- 1050,
- ప్రజా కూళాయిలు ------------------------108 ,
- గొట్టపు బావులు -------------------------120 ,
కలుషితమవుతున్న మంచినీరు - శ్రీకాకుళం :
కలుషిత నీరు కారణంగా జిల్లాలో ఏటా వేల సంఖ్యలో అతిసారం, టైపాయిడ్, పచ్చకామెర్లు, విష జ్వరాల బారిన పడుతున్నారు.
జిల్లాలో 794 మంచినీటి పథకాలు, 13,127 తాగునీటి బోర్లు, 325 మంచినీటి బావులున్నాయి. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో నదులు, గెడ్డలు, చెరువుల్లో నీరు కనిపిస్తోంది.క్లోరినేషన్ చేయకపోవడంతో కుళాయిల నుంచి కొన్నిచోట్ల బురదనీరు, మరికొన్ని చోట్ల కలుషితనీరు వస్తోంది. ట్యాంకుల్లో నాచు తయారై బ్యాక్టీరియా ఏర్పడి తాగునీరు కలుషితం అవుతోంది. ఆ నీటిని తాగిన ప్రజలు వ్యాధులపాలవుతున్నారు.
అనర్ధాలు :
- ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారము జనాన్ని పీడిస్తున్న రోగాల్లో అంటువ్యాధులు 21.5 శారము . ఇందులో 11.5 శాతము రోగాలకు జలకాలుష్యమే కారణము .
- వ్యవసాయం లో రసాయనాల వినియోగము , పరిశ్రమల వ్యర్ధాలు , మురుగు వల్ల నీరు కలుషితమవుతోంది . దీనివలన తాగునీటిలో ఉండాలసిన లవణల పరిమితి దాటిపోతోంది .
- నీటిలో మురికి శారము 10 దాటితే రంగు మారిపోతుంది . దీనిని ఎట్టిపరిస్థితుల్లొనూ తాగకూడదు .
- నీటి పి.హెచ్ (ఆమ్ల గాఢత ) 6.5 నుండి 8.5 శాతము మధ్యలో ఉండాలి ... ఇది దాటితే శరీరము చర్మపొరల పైన , ఆరో్గ్యముపైన తీవ్ర ప్రభావము చూపుతుంది .
- నీటిలో సుమారుగా 500 లవణాలు ఉండలి . ఇవి 2000 (రెండువేలు) దాటితే జీర్ణకోశ , పేగు సంబంధిత వ్యాధులొస్తాయి.
- ఆల్కలెనిటీ (క్షారగుణము ) 600 శారము దాటితే నీటికి దుర్వాసన వస్తుంది .
- నీటి గాఢత (Hardness) 300 శాతము లోపు ఉండాలి ... ఇది 6oo శాతము దాటితే శరీరములోని అన్ని అవయవాలపైనా ప్రభావము చూపిస్తుంది .
- సున్నము (కాల్సియం) 75 శాతము ఉండాలి ... ఇది 200 శాతము దాటితే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి . కాళ్ళు నొప్పులు వస్తాయి .
- క్లోరైడ్ శాతము ఎక్కువైతే అతిసారానికి దారితీస్తుంది .
- సల్ఫేట్ 200 - 400 శారము మధ్య ఉండాలి అంతకంటే దాటితే జీర్ణకోశ , పేగు సంబంధిత వ్యాధులు వస్తాయి .
- ఫ్లోరైడ్ ఒక్క శాతము ఉండాలి .. ఎక్కువైతే ఫ్లోరోసిస్ కి దారితీసి కాళ్ళు వంకర్లు , దంతాల పెలుసుబారడం జతుతాయి .
- ఇనుము ఒక శాతము కంటే దాటితే రంగు , రుచి తగ్గుతుంది .
- మెగ్నీషియం ఎక్కువైతే అస్సలు తాగేందుకు పనిరాదు .
- శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ గనుల తవ్వకాలు ఎక్కువ . ఈ రాళ్ళను కోసినపుడు సిలికాన్ అనే మూలకము బయటకొస్తుంది . ఇది నీటిలో కలుస్తుంది . ఈ నీటిని తాగడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ప్రస్తుతం ఉద్దానము ప్రాంతము లో మూత్రపిండాల వ్యాధి పెరగడానికి ఇదో కారణము .
- సంతకవిటి మండలము కొన్ని ప్రాంతాలు ఉదా: మోదుగుల పేటలో ఫ్లోరైడ్ శాతము ఎక్కువ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నీటిని తాగకూడదు . ఇక్కడ నీటి నుంచి ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించడము కూడా వీలుపడదు . ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారానే త్రాగునీటిని అందించాలి .
- శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బోన్‌మ్యారో క్యాన్‌సర్ , పక్షవాతము వంటి రోగాలు వ్యాప్తి చెందడానికి కారణము రసాయన పదార్ధాలు భూమిలోని నీటి వనరులును కలుషితము చేయడమే . .
- వర్షాకాలము లో నీరు వృధాగా పోతుంది . . తగిన నిల్వచేసే మార్గాలు లేవు .. ఆ ఆలోచనా లేదు . ఎండాకాలము లో నీటి ఎద్దడి కి కారణము అవుతుంది .
- పూ ర్వము గ్రామాల్లో చెరువులు ఉండేవి .. ప్రభుత్వము ఓటు బ్యాంక్ కోసము చెరువులు కప్పి , పేదలకు భూమిని పంచిపెట్టినది . . అందువల్ల భూగర్భ నీటి వనరులు తగ్గిపోయాయి . వేసవిలో బావులలోనూ , బోరు బావులలోనూ నీరుండడం లేదు .
- గ్రామలలో ఆరుబయట మలవిసర్జన వల్ల అవి వర్షాకాలములో నీటిలో కలియడం వలన అంటువ్యాధులకు కారణమవుతుంది .
- వర్షాకాలము లో ఒక్కోసారి ఆరుబయట వృధాగా పడేసిన టైర్లు , కొబ్బరిబొండాలు , రోడ్ల రిపేరుకోసం చేసిన గుంటలు తిరికి కప్పకపోవడం మూలాన నీరు నిలవా ఉండి దోమలు పెరిగి ... మలేరియా , ఫైలేరియా , డెంగీ జ్వరాలకు కారణము అవుతుంది . అన్నీ ప్రభుత్వమే చేస్తుందనుకోవడం కంటే ప్రతి పౌరుడూ తనవంతు బాధ్యతగా పరిసరాల పరిశుభ్రత చూడాలి .
- నీటి బావులు , బోరుబావుల చుట్టూఉండే వాడుక నీరు పోయేందుకు సరియైన డ్రైనేజ్ మార్గాలు లేకపోవడం వలన తిరిగి ఆ నీరు బావుల్లోకే పోయి మొత్తం నిరంతా కలుషితమవుతుంది .
- గ్రామాల్లోను , పట్టణాలలోనూ మంచినీటి కొలై (నాళా) చుట్టూ బట్టలు ఉతకడం , స్నానాలు చేయడం వంటి అపరిశుబ్ర తెలితక్కువ పనులు వల్ల మంచినీరు కలుషితం అయ్యే అవకాశము ఉంటుంది .
- గ్రామాలలో మంచినీటి చెరువుల్లో పశువులు కడగడం , బహిరంగ స్నానాలు చేయడం , బట్టలు ఉతకడం , వ్యర్ధపదార్ధాలు విసిరేయడం , పుణ్యము కోసం పూజాద్రవ్యాలు నీటిలో కలపడం , గట్ల పైన మలమూత్రాలు విసర్జన చేయడం , మలవిసర్జన తరువాత గుదం కడుక్కోవడం వంటి అపరిశుభ్ర పనులు వల్ల తాగే నీరు కలుషితం అవుతుంది .
- =====================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !