Monday, February 8, 2010

ఉత్సవాలు-శ్రీకాకుళం లో, Fairs in Srikakulam




ఉత్సవము:Ceremony & Celebration :


ఉత్సవము ఒక సంతోషకరమైన సంఘటనను గుర్తించుట, సాధారణముగా ఒక వ్యక్తి లేక వస్తువు అంతస్థులో మార్పు. సాధారణముగా ఉత్సవము ఎక్కువ మంది జరుపుకొనే ఒక విందు. ఉత్సవము సమాజమును శక్తి వంతము చేయుటలో ఒక ముఖ్యమైన భాగము. సమాజము అంటే ఒకే జాతికి లేక అనేక జాతులకు చెందిన అనేక వ్యక్తులు పెద్ద మెత్తముగా పోటిపడుతూ, సహకరించుకొంటూ, నివసిస్తూ ఉండటమని జీవ శాస్త్రజ్జ్ఞులు అందురు.


శ్రీకాకుళం జిల్లాలో కొన్ని పర్వదినాలు ,యాత్రలు ,జాతరలు ,Yatras in Srikakulam district.

ఏప్రాంతంలో సంస్కృతి, సంప్రదాయాలను విలువనిచ్చే విధంగా పర్వదినాలు, ఉత్సవాలు జరుపుకుంటారో ఆ ప్రాంతం వైభవంగా విరాజిల్లుతుందని పెద్దలు చెబుతారు.

1. శ్రీకాకుళం పట్టణంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఏడాది పొడుగునా భక్తుల రద్దీ ఉంటున్నప్పటికీ ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో స్వామివారి ఆలయం ఉత్సవాలు, జాతరతో కిటకిట లాడుతుంది. శ్రీ సూర్యనారాయణ స్వామివారి జన్మదినం మాఘశుద్ధ సప్తమి రోజున ప్రతీ ఏడాది జరుపుకుంటారు. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి ఆదిత్యుని దర్శించుకుంటారు. ఇదే విధంగా మార్గశిర ఏకాదశి పర్వదినాన ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం అంగరంగ వైభంగా నిర్వహించడం ఆనవాయితీ. కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి పురస్కరించుకుని ఆదిత్యునికి హంసనావికోత్సవం వైభవంగా జరుగుతుంది. ఇక మాఘాదివారాలు, వైశాఖ భానువారోత్సవాలు ఆదిత్యుని సన్నిధిలో నిర్వహిస్తారు. తెలుగు సంవత్సరాది రోజున ఆదిత్యుని సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు, మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహిస్తుంటారు.

2. జిల్లా కేంద్రానికి సమీపంలో గార మండలంలో ఉన్నశ్రీకూర్మనాధ స్వామి దేవస్థానంలో ఫాల్గుణ పౌర్ణమి హోళి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.

3. భీష్మ ఏకాదశి రోజున సాలిహుండాలం వేణుగోపాలస్వామి దేవాలయంలో జరిగే జాతరకు ప్రత్యేకత ఉంది. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దేవాలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. భీష్మ ఏకాదశి జాతరను సాలిహుండాం గ్రామస్తులు తమ ఊరి ఉత్సవంగా భావించి ఆనందోత్సాహలతో జరుపుకుంటారు.

4. గార మండలంలోని వత్సవలస గ్రామంలో నాలుగు వారాల పాటు "వత్సవలస యాత్ర" జరుగుతుంది. ఈ ప్రాంతానికి రాజమ్మ అమ్మవారు(Rajamma Goddess) కి ఈ జాతర ఓ ప్రత్యేకత.

5. కళింగపట్నం మదీనా దర్గాలో కులమతాలకు అతీతంగా జరిగే పీర్ల పండుగను ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల నుండి భక్తులు హాజరవుతారు.

6. శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. బలరాముడు ఇక్కడ శివలింగం ప్రతిష్టించారని స్థలపురాణంలో చెప్పబడి ఉంది. కోటేశ్వరాలయంతో పాటు కళ్లేపల్లి మణినాగేశ్వరాలయం, సంగాంలోని సంగమేశ్వర ఆలయాలను బలరాముడే స్వయంగా నాగావళీ తీరంలో ప్రతిష్టించినట్లుగా ఇతిహాసం ఉంది. ఈ శివాలయాల్లో మహాశివరాత్రి ఒక ఉత్సవంలా జరుపుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఎన్ని శివాలయాలున్నా బలరాముని ప్రతిష్ట చేసిన ఆలయంగా ప్రతి ఒక్కరు ఈ దేవాలయానికి వస్తుంటారు.

7. పాలకొండ డివిజన్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానం. ప్రతి ఏడాది ఆశ్వయుజ పాడ్యమి నుండి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపిస్తారు.

8. పాలకొండ జగన్నాధ స్వామి వారికి ఆషాఢమాసంలో రథాయాత్రను 12 రోజుల పాటు జరిపించడం ప్రత్యేకత.

9. ఇక రాజాం ప్రాంతంలో పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. మార్చి నెలలో మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండే కాకుండా ఒరిస్సా ప్రాంతం నుండి కూడా భక్తులు వస్తుంటారు.

10. సీతంపేట మండలంలో నివసించే గిరిజనులు ఆగం పండుగ పేరిట ఆగస్టులో ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ జతరలో ఎక్కువగా జంతు బలులకే ప్రాధాన్యత ఇస్తారు.

11. కమ్మసిగడాం ప్రాంతంలో మహలక్ష్మమ్మ జాతరను కూడా పరిసర ప్రాంతాల ప్రజలు భక్తిశ్రద్దలతో చేస్తారు. శిల్ప సంపదకు ఆలవాలంగా వాసికెక్కిన గుళ్లసీతారాంపురం శ్రీ కోదండ రామాలయంలో రామనవమి వేడుకలు సంప్రదాయంగా నిర్వహిస్తారు.

12. టెక్కలి డివిజన్ పరిధిలో ప్రత్యేకంగా మహేంద్రగిరులపై జరిగే జాతర విశేషంగా ఉంటుంది. మహాశివరాత్రి రోజున ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల నుండి భక్తులు మహేంద్రగిరులపైకి వెళ్తుంటారు. మహేంద్రగిరులు ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలకు మధ్యలో ఉండడంతో రెండు రాష్ట్రాల నుండి కూడా కొండపైకి వెళ్లే మార్గం ఉంది. మహాశివరాత్రి ముందురోజు నుండి ఈ ప్రాంతం అంతా సందడిగా ఉంటుంది.

13. మందస శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఉగాది రోజున పెరుమాళ్ల స్వామివారి ఉత్సవాన్ని భక్తి శ్రద్దలతో జరిపిస్తారు. రట్టి వేణుగోపాల స్వామి సన్నిధిలో నిర్వహించే డోలోత్సవం జాతర చూసేందుకు రెండు కనులు చాలవన్నట్లుగా ఉంటుంది.

14. టెక్కలి డివిజన్ అంతటికి ప్రముఖ పుణ్యక్షేత్రం కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి దేవాలయం. ప్రతీ ఏడాది దసరా ఉత్సవాలు అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిపిస్తారు.

15. పలాప ప్రాంతంలో వేసవిలో జరిగే ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. వరుసగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఈ జాతరలు జరుగుతుంటాయి. మంకినమ్మ జాతర, కంచిలిలోని కంచిమాంబ జాతర, బారువ అమ్మవారి జాతర వరుసగా వేసవిలోనే చేస్తారు.

16. బ్రాహ్మణ తర్ల గ్రామంలో ఉగాది రోజున జరిగే కాకమ్మతల్లి జాతరకు రెండు రాష్ట్రాలనుండి భక్తులు తండోపతండాలుగా హాజరవుతారు.

17. పలాసలోని దేవరకొండపైన సంక్రాంతి రోజున జరిగే జాతరకు ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరు హాజరవుతారు.

18. ఇచ్ఛాపురం ప్రాంతానికి సుప్రసిద్ధమైన ఆలయం స్వేచ్ఛావతి అమ్మవారి దేవస్థానం. మే నెలలో అమ్మవారికి నిర్వహించే జాతర రెండు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. శ్రీకాకుళం జిల్లా సరిహద్దులోనే కాకుండా ఆంద్ర, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దులో ఉండడంతో అమ్మవారి జాతరకు రెండు రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తారు.

19. కవిటిలో చింతామణి అమ్మవారి జాతర మార్చిలో, శివరాత్రి తరువాత జామి ఎల్లమ్మ తల్లి జాతర ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది పొడుగునా జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహిస్తునే ఉంటారు. వీటిలో ముఖ్యమైన పర్వదినాల్లో జాతరలు పెద్ద ఎత్తున జరుపుకోవడం ఆనవాయితీ.

  1. వత్సవలస రాజమ్మ ఉత్సవము :
  2. బలగా భద్రమ్మ తల్లి ఉత్సవము-Srikakulam town ,
  3. శ్రీ వాసుదేవపెరుమాళ్ బ్రహ్మోత్సవము -మందస ,
  4. రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారు జాతర-Rajam.




=========================================

Visit my Website > Dr.Seshagirirao - MBBS.

2 comments:

  1. Many hostels offer in-room lockers but I suggest using mini-locks on your suitcase/backpack, as well.

    Hostels in Ushuaia

    ReplyDelete
  2. When hostels are providing these sorts of lockers, that they are able to fit padlocks of varying sizes, to suit all sizes of padlocks that guests may bring with them.

    Hostel Sao Paulo

    ReplyDelete

Your comment is important for improvement of this web blog . Thank Q !