Monday, February 8, 2010

వత్సవలస రాజమ్మ , Vatsavalasa Rajamma





వత్సవలస రాజేశ్వరి (రాజమ్మ) ఉత్సవాలు ప్రతిసంవత్సరము మాఘమాసం లో మూడు శని , ఆదివారాలు ( రెండవ , మూడవ , నాల్గవ శని-ఆదివారాలు) వరుసగా జరుపుకుంటారు . రాజమ్మ అనేది ఒక గ్రామ దేవత . మనదేశం లో ఎన్నో గ్రామాలు ఎందరో గ్రామదేవతలు ఉన్నారు . చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు "మొక్కుబడులు " అనే పేరుతొ తమ మొక్కులు చెల్లించుకుంటారు . కోళ్ళు , గొర్రెలు , మేకలు అమ్మవారికి బలి గా ఇస్తారు . కొందరు ఈ బలి ప్రసాదము (మాంసము) అక్కడే వండికొని తింటారు . అరటి పళ్ళు , కొబ్బరికాయలు , పూజా సామగ్రి రాజమ్మ తల్లికి సమర్పించుకుంటారు . వత్సవలస శ్రీ కూర్మం ఆలయానికి చాలా దగ్గరగా ఉన్నందున యాత్రికులు కూర్మనాధ స్వామి ని దర్శించుకొని తిరుగుప్రయాణం చేస్తూ ఉంటారు .

  • =================================================================

Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !