దైవభక్తి మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని, ప్రస్తుత సమాజంలో మానవాళికిఎంతో అవసరమని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయరుస్వామి అన్నారు. మందసలో జరుగుతున్న శ్రీవాసుదేవపెరుమాళ్ బ్రహ్మాత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులనుద్దేశించి మాట్లాడారు. వ్యక్తి జీవన మనుగడలో భక్తి ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. నిర్మలమైన మనస్సు, జ్ఞానసముపార్జన దైవసన్నిధిలోనే సాధ్యమన్నారు. ముందుగా స్వామివారి మంత్రోపదేశాలు కల్పవృక్షవాహన సేవ చేపట్టారు. సాయంత్రం హంసవాహన సేవతో పట్టణంలో స్వామివారిని ఊరేగించారు. అనంతరం ఆలయం చెంతన గోపాల సాగరంలో చేపట్టిన తెప్పోత్సవం నేత్రనందాన్ని కలిగించింది. చిన జీయరు స్వామి రాకతో ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాలు భక్తజనంతో కళకళలాడాయి. నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నప్రసాదాలు స్వీకరించి భక్తులు రోజంతా స్వామి సన్నిధిలో గడిపారు. ఆహోబిల రామానుజ జీయరు స్వామి, గోవిందస్వామి, పవన్‌స్వామి, పురుషోత్తంస్వామి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అశేష జనం వచ్చారు. సోంపేట సీఐ. ఇషాక్ అహ్మద్, ఆదేశాల మేరకు ఎస్సై జివి.రమణ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మందస వైద్యాధికారి వి.అశోక్, వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు.
- =============================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.
if u publish temple phone no it's very usefull to peligram's.
ReplyDelete