ప్రతి సంవత్సరము పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఫిబ్రవరి /మార్చ నెలల్లో జరుపుకుంటారు . చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల నమ్మకం / ముడనమ్మకం పైనే జరుగుతుంది .రాజాం -రామభద్రాపురం ప్రధాన రహదారి ప్రక్కనే ౧౯౨౭ లో ఆలయాన్ని నిర్మించారు . అప్పటినుండి ఆలయ అభివృద్ధి జరుగుతూనే ఉంది. పట్టణ ప్రముఖులు , ఇతరత్రా పెద్దలు సహకరిస్తునే ఉన్నారు ... అయితే ఏటా నిర్వహించే జాతర సమయం లో పూర్తి బాధ్యతలను కొండపేట గ్రామానికి చెందినా "సలాది " కుటుంబ సభ్యులే తీసుకుంటున్నారు . ఆలయాన్ని ఆనుకొని విశాలమైన స్థలాలు వారికి ఉండడం తో జాతర సజావుగా జరుగుతోంది . కొండపేట నాయుడు గా పేరొందిన సలాది వెంకరతమన నేతృత్వం లో ఏడాది పొడువునా ఆలయ కార్యక్రమాలు జరిగేవి . ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఆలయం ఉనా సలాది కుటుంబ సభ్యులు సహకారము లేకపోతే జాతర నిర్వహణ కష్టము . సలాది రామారావు జాతర నిర్వహణ లో కీలకం గా మారేరు .
ఫిబ్రవరి 21 ,2010 నుండి జరిగే పోలిపల్లి పైడితల్లి అమ్మవారు జాతర 82 వ వార్షికోత్సవము . చదువుకున్న ప్రముఖులు రాజాం సీనియర్ సివిల్ జడ్జి -సోమేస్వరావు , దేవాదాయ ధర్మాదాయ శాఖ డి.సి -విజయకుమార్ , పాలకొండ ఆర్.డి.ఓ -అట్టాడ సిరి , పాలకొండ డి.యస్.పి.-మోహనరావు మున్నగువారు అమ్మవారిని దర్శించుకున్నారు . అంతా నమ్మకమే ... అనేక స్వస్చంద సంఘాలు ... మజ్జిక , పులిహార , లడ్డు , పశువు -కుంకుమ , పూలు ఉచితం గా ఇచ్చారు .
ఇక్కడ ఒక విశేషము ... చెట్టుకి , పుట్టకి , రాయిని నమ్మి పూజలు చేయడం అందులకు కొత్తేమీ కాదు . .. అయితే రావి , వేప చెట్లకు పూజలు చేయడం ఆనవాయితీ .. కాని రాజంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద " చింత చెట్టు " పూజలు అందుకొంటోంది . దీనికి ఎనిమిది దశాబ్దాలుగా ప్రజలు పూజలు చేస్తూ ఉన్నారు . 1926 లో ఆలయనిర్మానము జరిగినది . అమ్మవారు ప్రతిష్ట 1927 లో జరిగినది .
- =================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !