Wednesday, September 8, 2010

Medical Colleges in Srikakulam dist. , వైద్యకళాశాలలు శ్రీకాకుళం లో

-

శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం లో ఉత్తరాంద్ర జిల్లాలలో చిట్టచివరది . ఆంధ్ర - ఒరిస్సా రాస్ట్రాల సరిహద్దు జిల్లా . భాషారాస్ట్రాల విభజనలో ఒరిస్సా నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ లో చేరింది . ఓరియా - తెలుగు భాషా మిళితం గా యాస తో మాట్లాడే ప్రజలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు . అన్నివిధాల అభి్వృద్ధి చెందిన విశాఖపట్నం , శ్రీకాకుళానికి 90 కి.మీ. దూరములో ఉండడం వలన ప్రతి అవసరానికి విశాఖపట్నం పై ఆధారపడడం అలవాటవడం చేత ఏవిధంగాను ఈ జిల్లా అభివృద్ధి చెందలేదు . ఇప్పుడిప్పుడే ప్రాంతీయ అభిమానము మేరకు జిల్లా నాయకులు , ఉన్నత వర్గాలకుచెందిన వారు , వ్యాపారవేత్తలు , విద్యావేత్తలు ఈ జిల్లా అభివృద్ధి కోసం కొంత శ్రద్ధ చూపడం కనబడుతుంది . ఈ కోవకు చెందిన అభివృద్ధి పదం లోని భాగమో లేదా వ్యాపారదృక్పదమో మొదటిగా శ్రీకాకులం లో ప్రవేటు యాజమాన్యములో " దంత వైద్యకళాశాల " చాపారం గ్రామం సమీపం లో నిర్మానము జరిగి విజయవంతం గా నడుస్తూ ఉన్నది . తరువాత అదే సొసైటీ అధ్వర్యములో " గ్రేట్ ఈస్ట్రన్‌ మెడికల్ స్కూల్ " (జెమ్‌స్ -GEMS) పేరిట రాగోలు దరి గూడెం గ్రామము సమీపములో వైధ్య కళాశాల నిర్మితమై కొన్నేళ్ళు ప్రభుత్వ అనుమతికోసం నానా తిప్పలు పడి 2010 లో 100 సీట్లతో మొదటి సంవత్సరం యం.బి.బి.యస్. (M.B.B.S) కోర్సు ప్రారంభమయినది . దీనికి ముందరే డా.రాజశేఖరరెడ్డి దయవలన ధర్మాన ప్రసాదరావు కృషివలన ' రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఒఫ్ మెడికల్ సైన్‌సెస్ ' (రిమ్‌సు -RIMS) అనే పేరిట మొదటి వైద్యకళాశాల 2008-09 ఎకడమిక్ సంవత్సరము తో 100 సీట్ల తో ప్రారంభమైనది . ఇవి కాక ఎన్నో వైద్య అనుబంధ కోర్సులు - నర్సులు , ఎ.యన్‌.ఎమ్‌. ల్యాబ్ టెక్నీషియన్‌, ఎక్ష్ రే టెక్నీషియన్‌ ల వైద్యవిద్య స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి .

- డా.శేషగిరిరావు MBBS.
  • ========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !