Sunday, August 29, 2010

కోడిరామముర్తి స్టేడియం , Kodi Ramamurty Stadium in Srikakulam




ఆటల ఖిల్లా గా అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సిక్కోలు లో ప్రతిభ పుష్కలం గా ఉన్నా సౌకర్యాలు కొరవడి ఆటలు నిర్వీర్యమయిపోతుంది . మైదానాలు దురవస్థలో ఉన్నాయి . జాతీయ , అంతర్జాతీయ పోటీల సాధనకు అవసరమైన మినీ స్టేడియం లు అసలే లేవు . జిల్లా కేంద్రం లో ఉన్న కోడిరామముర్తి స్టేడియం మాత్రమే ఆటలకు పెద్ద దిక్కు గా ఉన్నది .

నాగావళి వడ్డున సుమారు 6 ఎకరాల విస్తీర్ణములో నిర్మించిన ఈ స్టేడియం 1979 లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శంకుస్థాపన చేసారు . 1983 లో అప్పటి ముఖ్య మంత్రి యన్‌.టి.రామారావు దీనిని జాతికి అంకితం చేసారు . దీని ఆవరణ లో 1985 లో ఇండోర్ స్టేడియం నిర్మించారు .

మైదానము లో అథ్లెటిక్స్ , పుట్ బాల్ , కబాడీ , ఖోఖో , హ్యాండ్ బాల్ , వాలీబాల్ , క్రికెట్ , బాస్కెట్ బాల్ , హాకీ తదితర క్రీడాంశాల్లో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు .

ఇండోర్ స్టేడియం లో బ్యాడ్మింటన్‌ , టేబుల్ టెన్నిస్ , వెయిట్ లిఫ్టింగ్ , మున్నగు క్రీడాంశాలలో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు .
  • ==================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !