ఆర్థిక ఇబ్బందులు... అక్రమ సంబంధాలు... అసహాయ పరిస్థితులు... కుటుంబసమస్యలు... ఆడపిల్లలనే భారం... పురిటి నీరైనా పోసుకోని పసిమొగ్గల తల రాతలను మారుస్తున్నాయి. తల్లి ఒడిలో సేద తీరాల్సిన పసిపాపలు... తల్లి మాధుర్యం దూరం కావడంతో బోసినవ్వుల పసిపాపల ఆలనా పాలనా మరుస్తున్న తల్లులెందరో కన్న బిడ్డలను ముళ్ళపొదలు, డ్రైనేజీ కాలువలు, మరుగుదొడ్లు, జన సంచారంలేని ప్రాంతంలో వదిలివేస్తున్న సంఘటనలు తరచూ శ్రీకాకుళం ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. పేగు బంధం... రక్తసంబంధాన్ని సైతం లెక్కలోకి తీసుకోకుండా తమకు అంటిన మచ్చను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కడుపుకోతను దిగమింగుకున్న కన్నవారే కనికరం చూపకుండా పసికూనలను అనాథలుగా మారుస్తున్నారు. కట్టుకున్న మొగుడు తరిమివేయడమో, పుట్టింటి వారు ఆదరించకపోవడం, నమ్మించి గర్భిణీని చేసి చివరకు వదిలివేయడంతో సమాజంలో తలెత్తుకోలేక విధి వంచితులై నిస్సహాయులైన మహిళలు... ఇలా ఎన్నో కారణాలతో పసిపిల్లలను అనాథలుగా మారుస్తున్నారు
జిల్లాలో 'శిశుగృహ' --* ఆగస్టు 15న ప్రారంభం
శ్రీకాకుళము పరిసర ప్రాంతాల్లో శిశువులను చెత్తకుండీలో వేయడం లేదా రోడ్లపై పడివేయడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి.ఇలా రోడ్లపై వదిలి వెళ్ళిన శిశువులను స్వాధీనం చేసుకొని వారిని హైదరాబాద్‌లోని శిశువిహార్‌కు పంపించాలంటే కష్టంగా మారింది. వందల కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు తరలించేలోపే శిశువులు మరణిస్తున్న సంఘటనలు ఉన్నాయి. శిశువులను తరలించడానికి కూడా సరైన వాహనాలు లేక మామూలు వాహనాల్లో లేత శిశువులను తరలిస్తుండడంతో వారు అనారోగ్యపాలవుతున్నారు.వీటిని దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం లో మహిళా శిశుసంక్షేమశాఖ అధ్వర్యములో శిశుగృహ ఏర్పాటు చేసారు .
రాస్ట్రం లో శిశుగృహను ప్రస్తుతం 13 జిల్లలలో ఏర్పాటు చేసారు ఇంకా 11 జిల్లలలో ఏర్పాటు చేయవలసి ఉంది . ఇంతవరకు శ్రికాకుళం లోని నాధ పిల్లలకు విశాఖపట్నం లో ఉన్న అనాధ శరణాలయాని పంపేవారు . ఇక నుండి శ్రీకాకుళం లోనే అన్ని ఏర్పాట్లు జరుగుతాయి .
'ఏ దిక్కూ లేని వారికి దేవుడే దిక్కన్నది సామెత'.. వెనుకా ముందూ లేని వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 'శిశుగృహ' పేరిట జిల్లా కేంద్రంలో అనాథాశ్రమాన్ని ఈనెల 15న ప్రారంభించేరు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ పర్యవేక్షణలో ఈ గృహం పనిచేయనుంది.
తల్లిదండ్రులు లేని చిన్నారులు, తల్లి లేదా తండ్రి లేని వారికి భద్రత కల్పించే ప్రధాన లక్ష్యంతో శిశు గృహను ప్రారంభిస్తున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగే కార్యక్రమాలు ఇకపై జిల్లా కేంద్రంలోనే నిర్వహించేలా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనాథ పిల్లలు, వృద్థులను సమీకరిస్తారు. ఇందుకోసం ఈ నెల 15 నుంచి 22 వరకు జిల్లా అంతటా ప్రచార కార్యక్రమాన్ని చేపడతారు. ఇందు కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, స్వయం శక్తి సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, అధికార, అనధికార ప్రముఖుల సేవలు, సలహాలను ఉపయోగించుకుంటారు. అనాథల 0 - 14 సంవత్సరాల అనాధ బాలబాలికల వివరాలు సేకరించి వారిని శిశుగృహలో చేర్పిస్తారు. ఇలా చేర్పించిన వారిని జిల్లా పిల్లల సంక్షేమ కమిటీ (డిస్ట్రిక్ట్ చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటి) ఛైర్మన్ సమక్షంలో అనాథలుగా వారికి చట్టబద్ధత కల్పిస్తారు. పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. శిశుగృహంలో ఉన్న చిన్నారులను ఎవరైనా దత్తతతీసుకునేందుకు ముందుకొస్తే దత్తత ఇస్తారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు కానున్న శిశు గృహలో పనిచేసే సిబ్బంది :-> కో-ఆర్డినేటర్, సోషల్ వర్కర్లు, నర్సులు, ఆరుగురు ఆయాలు, కాంట్రాక్టు పద్ధతిపై వైద్యుడి నియామకం చేపడతారు.
శిశుగృహ ల ద్వారా ఒక్కొక్కరికి నెలకు రూ.వెయ్యి వంతున ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు.
==========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !