Sunday, August 15, 2010

శ్రీకాకుళం జిల్లా 60 వసంతాల అభివృద్ధి , Srikakulam at 60 years .


శ్రీకాకులం జిల్లా -- భిన్నత్వంలో ఏకత్వం --సంవ్రదాయాలకు వుట్టినిల్లు •ఇదీ చిక్కోలు ఘనత •వేదపాడి ఊటీగా గుర్తింవు్

15-ఆగస్టు 2010 న శ్రీకాకుళం జిలా ఆవిర్భావ దినోత్స్తవం సందర్భము గా ప్రసంగము - సారాంశము : ఈనాడు దినపత్రిక సౌజన్యము తో ....
  • [AP_Map.jpg]--[Vijaya-Aditya+Saagar-Srikakulam.jpg]

జిల్లా ఖాదీలో ఉత్పత్తి అవుతున్న జమధానీ చీరలు, జరీవజాకువ్పడం ధోవతులు, గోరు అంచుపంచెలు, ఎ.ఎన్‌.ఆర్‌.
అంచువంచెలు, కువ్పడం చీరలు, వంచెలు, చొక్కా వస్త్రాలు ఎంతో వ్రసిద్ధి చెందాయి. పొందూరు ఖాదీ కార్మికుల్లో వ్రసిద్ధులైన ఇద్దరికి న్యూఢిల్లీలో కేంద్ర వ్రభుత్వం ఘనంగా సత్కరించింది.
చేనేతకు సరబంధించి 42 చేనేత సహకార సంఘాల్లో కొరసపాడ చీరలు, పొందూరులో తయారవుతున్న వ్రకృతి రంగుల నూలు అద్దకర చీరలు, ఎప్మెుల్యే వంచెలు, అంపోలులోని చేనేత పాలిస్టరు వస్త్రాలు రాజాం చేనేత సంఘం వరిధిలోని దువ్పట్లు తుప్వాళ్లు ఎంతో
వ్రసిద్ధి చెందాయి.

ఎన్నెన్నో ఘనతలు....•
రణస్థలం నుంచి ఇచ్ఛావురం వరకు 196 కిలోమీటర్ల పొడవున జాతీయరహదారి.
• రాష్ట్రంలోనే అత్యంత పొడపైన 196 కిలోమీటర్ల సముద్రతీరం.
• కొబ్బరి, జీడితోటల అందాల ఉద్యానవనం.. ఉద్దానం. సోంవేట, కంచిలి, కవిటి, మందస, వజ్రవుకొత్తూరు మండలాల్లో విస్తరించి ఉంది.
• ఏటా తేలినీలావురం, తేలికుంచి ప్రాంతాలకు వచ్చే విదేశీ వక్షలు.
• దేశప్యావ్త వ్రసిద్ధ వుణ్యక్షేత్రాలు శ్రీకూర్మర, అరసవల్లి, శ్రీముఖలిరగం జిల్లాలో ఉన్నాయి.
• వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుద నదులు ఉన్నాయి
• 19 మండలాల్లో అటవీప్రారతం
• అరతర్జాతీయ వరిశ్రమల కేంద్రంగా వైడిభీమవరం.

శ్రీ కాకుళం గురించి వ్రముఖ రచయిత దూసి ధర్మారావు చేసిన వర్ణన ఇది. వ్రసిద్ధ వుణ్యక్షేత్రాలు.. గలగలపారే నదులు... విశాలమైన సముద్ర తీరం.. కోనసీమను తలదించే ఉద్దానం.. వ్రకృతి వ్రసాదించిన అడవులు... వెల కట్టలేని గనులు.. చరితను మార్చిన ఉద్యమాలు.. ఇలా చెవ్పుకుంటూ పోతే చిక్కోలు ఘనత అంతా ఇంతా కాదు. ఎన్నో తీపి గురుతులను కాలం తనలో కలివేసుకుంది. విభిన్న సంస్కృతులతో అలరారుతూ.. వేదపాడి ఊటీగా వేరొందిన శ్రీకాకుళం జిల్లా ఏర్పడి నేటికి అరవై _60 ఏళ్లు.
కుతుబ్‌షాహీల పాలనలో 'చికాకోల్‌' 1687లో ఏర్పడింది. ఫౌజ్‌దారులు పాలకులు. దీని వరిధిలో వ్రస్తుత శ్రీకాకుళం, విశాఖ, విజయనగరర జిల్లాలు, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలుండేవి. 1758 తరుపాత బ్రిటిష్‌ సైన్యం విశాఖలో అడుగువెట్టి ఫౌజ్‌దారుపాలనను అరతం చేసింది. 1769 జులై 27న పైజాగ్‌పట్నం వేరుతో బ్రిటిష్‌పారు ఓ జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రరగా విశాఖవట్టణాన్ని వ్రకటించారు. ఇరదులో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, ఒరిస్సాలోని గంజార జిల్లాలో కొంత భాగం ఉండేవి. భాషా ప్రాతివదికన ప్రాంతాల విభజనకు ఆంగ్ల పాలకులు అంగీకరించినా.. స్వాతంత్య్రం వచ్చేటంత వరకు అది సాధ్యం కాలేదు. అవ్పటికే శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్లున్నాయి. ఎట్టికేలకు 1950 ఆగస్టు 15న వ్రభుత్వం శ్రీకాకుళం జిల్లాను ఏర్పాటు చేసింది. వ్రస్తుత దీని పైశాల్యం 5,837 చ.కి.మీ. మూడు డివిజన్లలో 38 మరడలాలున్నాయి.
కీలక ఘట్టాలు
• 1956లో రాగోలు వరి వరిశోధనా కేంద్రం ఏర్పాటు
• ఆమదాలవలస వంచదార వరిశ్రమకు శంకుస్థావన. 1961-62లో క్రషింగ్‌ ప్రారంభం.
• 1963 నాటికి నాగావళి నదిలో నారాయణ ఆనకట్ట నిర్మాణం. 39 పేల ఎకరాలకు సాగునీరు. మహేంద్ర తనయవై వైడిగార ప్రాజెక్టు నిర్మాణం
• 1968లో వెను తుపాను. వ్యవసాయరంగానికి తీరని దెబ్బ
• 1968-70 మధ్య కాలంలో సాయుధ గిరిజన, రైతాంగ పోరాటం.
• 1970లో సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు
• 1971లో వంశధార ప్రాజెక్టు నిర్మాణం మొదలు. గిరిజనాభివృద్ధి సంస్థ ఏర్పాటు
• 1972లో భారీస్థాయిలో వరదలు.
• 1975లో కళింగవట్నం వద్ద పాతావరణ వరిశోధనా కేంద్రర ఏర్పాటు.
• 1976లో శ్రీవిశాఖ గ్రామీణ బ్యాంక్‌ స్థావన.
• 1977లో హిరమండలర వద్ద గొట్టాబ్యేరేజి నిర్మాణం వూర్తి.
• 1978లో పొట్టిరకాలైన హైబ్రీడ్‌ వరి వంగడాలు ఫాల్గుణ, సురేఖా వరిచయం.
• 1978లో జిల్లా పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు.
• 1979లో రాగోలు వరి వరిశోధనా కేంద్రం నుంచి తొలి వరివంగడం విడుదల.
• 1978లో బహుదా నది జలాలవై ఒరిస్సాతో ఒవ్పందం.
• 1978-79 జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏర్పాటు.
• 1979లో శ్రీకాకుళంలో నుంచి విడిపోయిన విజయనగరం.
• 1980లో వంశధారకు భారీ వరదలు. గ్రామాలకు గ్రామాలే కనుమరుగు.
• 1983లో కోడిరామ్మూర్తినాయుడు స్టేడియం నిర్మాణం
• 1984లో గురజాడ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో తొలి బి.ఇడి కళాశాల.
• 1984లో భావనపాడు హార్బర్‌కు శంకుస్థావన
• 1984లో వైడిభీమవరం వద్ద 450 ఎకరాల్లో పారిశ్రామికపాడ ఏర్పాటు.
• 1985లో ఆమదాలవలసలో కృషి విజ్ఞాన కేంద్రర ఏర్పాటు.
• 1986లో కళింగదల్‌, డబారుసింగి రిజర్వాయర్లుకు శంకుస్థావన. అదే సమయంలో బొమ్మిక, లోకొత్తవలస, పెన్నెలవలస, జంపరకోట రిజర్వాయర్ల నిర్మాణ వనులు ప్రారరభము .
• 1990 ప్రాంతంలో రెడ్డీస్‌, నాగార్జున అగ్రికెర వరిశ్రమల స్థావన.
• 1995లో భారీ వరదలు
• 1995లో వంశధార రెరడో దశకు శంకుస్థావన
• 1997లో వరలక్ష్మి షుగర్స్‌, అరబిందో వరిశ్రమల ఏర్పాటు
• 1999లో వెను తుపానుకు ఉద్దానం అతలాకుతలం.
• 2002లో జాతీయ రహదారి విస్తరణ
• 2003లో తోటవల్లి ప్రాజెక్టుకు శంకుస్థాన
• 2006లో వరదలు
• 2005లో వంశధార రిజర్వాయర్‌ వనుల ప్రారరభం.
• 2008లో మహేంద్రతనయ వద్ద ఆఫ్‌షోర్‌ వనులకు శంకుస్థావన
• 2008లో ఆమదాలవలస వద్ద వయోడెక్టు నీటి వథకం ప్రారంభం
• 2008లో ఎచ్చెర్ల వద్ద అరబేద్కర్‌ విశ్వవిద్యాలయర ఏర్పాటు
• 2008లో రిమ్‌స్ వైద్య కళాశాల ప్రారంభం
• 2009లో సోంవేట, సంతబొమ్మాళి మండలాల్లో థర్మల్‌ ప్రాజెక్టు వనులకు అనుమతి
• 2009లో వైడిభీమవరం వద్ద పారిశ్రామిక పాణిజ్య మండలి ఏర్పాటు.
• 2010లో కొప్వాడ వద్ద అణువిద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు సర్కారు వ్రకటన.
• 2010లో సోంవేటలో ధర్మల్‌ వ్యతిరేక ఉద్యమకారులవై పోలీసుకాల్పులు.. ఇద్దరి మృతి.

శ్రీకాకుళం లో పారిశ్రామిక 'వరుగు'!

  • [srikakulam+dist+map.jpg]

లో శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన నాటికి ఆమదాలవలసలో ఒకే ఒక్క షుగర్‌ ఫ్యాక్టరీ ఉండేది. తాజాగా జిల్లాలో సుమారుగా రూ. లక్ష కోట్ల వెట్టుబడితో వరిశ్రమల ఏర్పాటుకు వచ్చజెండా ఊపింది. 1984లో రణస్థలం మండలం వైడిభీమవరంలో పారిశ్రామిక పాడ ఏర్పాటు చేసిన తరుపాత జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి వథంలో వయనిస్తోంది. జిల్లాలో వ్రస్తుతం 29 భారీ వరిశ్రమలు, 10 పేల చిన్న వరిశ్రమలు, అయిదు పవేల లఘు , మధ్యతరహా వరిశ్రమలు ఉన్నాయి. తాజాగా వ్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా రణస్థలం మండలం కొప్వాడలో రూ. 60 వేల కోట్లతో అణువిద్యుత్తు కేంద్రర ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకురటోంది. వైడిభీమవరంలో మరో 20 పేల కోట్లతో భారీ, బల్క్‌ డ్రగ్‌ ఇండస్ట్రీస్‌ రానున్నాయి. వీటికి అదనంగా సోంవేట మండలంతో పాటు జిల్లాలో ఏడు థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు ఏర్పాటునకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. పెుత్తం మీద జిల్లా సర్వతోముఖాభివృద్దికి చర్యలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా వరిశ్రమల ఇన్‌ఛార్జి జనరల్‌ పేునేజర్‌ గణవతిరావు మాట్లాడుతూ చిన్నమధ్య తరహా వరిశ్రమల వరకు తమ వరిధిలో ఉరటాయని భారీ వరిశ్రమలు కేంద్రవ్రభుత్వం నురచి అనుమతులు వస్తాయని వివరించారు.
వైద్యం అందని ద్రాక్షే
జిల్లా ఏర్పడి ఆరు దశాబ్దాలు అవుతున్నవ్పటికీ వేదలకు పైద్యం ఇంకా అందడం లేదు. వ్రస్తుతం ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా గిరిజన, తీరప్రాంతాల వ్రజలు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా ప్యాధులు, మైదాన ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూల, డయేరియా, జ్వరాలు, తీర ప్రాంతాల్లో నోటి క్యాన్సర్‌, ఉద్దానం ప్రాంతరలో కిడ్నీ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జిల్లాలో వ్రస్తుతం 71 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, 456 ఉవ ఆరోగ్య కేంద్రాలు, టెక్కలి, పాలకొండలలో రెండు ఏరియా ఆసువత్రులు, 10 సామాజిక ఆసువత్రులు ఉన్నాయి. 2008లో జిల్లా కేంద్ర ఆసువత్రి స్థానంలో రాజీప్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (రింస్ ‌) వైద్య కళాశాల, వైద్యకళాశాల వ్రజలకు వైద్యర అందిస్తోంది. ఇంత జరుగుతున్నవ్పటికీ ఇంకా పైద్యం అందడంలేదు. కొత్తగా వచ్చిన నిబంధనల వ్రకారం జిల్లాలో కమ్యూనిటీ హెల్త్‌ న్యూట్రీషన్‌ సెంటర్స్‌ (సి.హెచ్‌.ఎన్‌.సి.) ఏర్పాటు చేస్తున్నారు. పెుత్తం 71 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను విభజించి ప్రతి అయిదు, ఆరు వి.హెచ్‌.సి.లకు ఒక సి.హెచ్‌.ఎన్‌.సి. ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్కడో ఒక్క చోట వ్యాధులు సామూహికంగా దాడులుచేస్తు వ్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. ఇదిలా ఉండగా వ్రైపేటు ఆధ్వర్యంలో జిల్లాలో ఒక పెుడికల్‌ కళాశాలకు వ్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ఇచ్చింది. ఇవ్పటికే వ్రైపేటు ఆధ్వర్యంలో సాయి ఓరల్‌ డెంటల్‌ కళాశాల నడుస్తోంది.
  • ==============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !