- క్రీడలు శారీకం గాను , మానసికం గాను ఎంతోఉపయోగ పడతాయి . శరీర సౌస్ఠవాన్నీ , శరీర ఆరోగ్యాని పెంపొందిస్తాయి . మానసిక ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని , మనోవికాసాన్ని కలిగిస్తాయి . నిర్ధిస్టమైన లక్ష్య సాధన కోసం సమూహం గా ఏర్పడి ఆ దిశగా కృషి చేయడమే సంఘాల ఆశయము . ఆ దిశ గా ఏర్పడినవే ఈ క్రీడాసంఘాలు ... శ్రీకాకులం జిల్లాలో 32 క్రీడా సంఘాలేర్పడ్డాయి . క్రీడల ఖిల్లాగా పేరొందిన చిక్కోలులో ఇవి తమదైన రీతిలో ముందుకు సాగుతున్నాయి .
శ్రీకాకుళం జిల్లాలో క్రీడా సంఘాలు :
- అథ్లెటిక్స్ ,
- ఆర్చరీ ,
- వెయిట్ లిఫ్టింగ్ ,
- కబడ్డీ ,
- ఖోఖో ,
- వాలీబాల్ ,
- బాస్కెట్ బాల్ ,
- ఫుట్ బాల్ ,
- త్రోబాల్ ,
- బేస్ బాల్ ,
- బ్యాడ్మింటన్ ,
- టేబుల్ టెన్నిస్ ,
- చదరంగము ,'
- తైక్వాండో ,
- కరాటే ,
- బాక్షింగ్ ,
- రెజ్లింగ్ ,
- టెన్నికాయిట్ ,
- క్రికెట్ సీనియర్స్ ,
- క్రికెట్ జూనియర్స్ ,
- హాకీ ,
- కేరమ్‌స్ ,
- నెట్ బాల్ ,
- టెన్నిస్ ,
- సటిల్ కాక్ ,
- జావలిన్,
- ఒలింపిక్ సంఘము , ఇంకా ?
సంఘాల నిర్మాణము :
సభ్యులుగా చేరేవారు సంబంధిత క్రీడలో రాస్ట్ర , జాతీయ స్థాయిలోని ప్రతిభ చూపినవారై ఉండాలి . వీరిలోనే కార్యవర్గాన్ని ఎనూకుంటారు . జిల్లా ఒలింపిక్ సంఘం , సంబంధిత రాస్ట్ర సంఘ ప్రతినిధుల అధ్వర్యము లో ఎన్నిక జరుగుతుంది . ప్రబుత్వ ప్రతినిధి కూడా ఎన్నిక పరిశీలకులు గా వ్యవహరిస్తారు . క్రీడా సంఘాలన్నీ ఒలింపిక్ అస్సోసియేషన్ సభ్యులుగా ఉంటారు . ఎంఫికలో పారదర్శకత పాటించాలి . నకిలీ జన్మ ధ్రువ పత్రాలతో పోటీలకు వెళ్ళే వారి సంఖ్య పెరుగుతుంది . ఈ విషయము లో అలసత్వము పనికిరాదు . దశాబ్దాల తరబడి కొన్ని సంఘాల్లో ప్రతినిధులు వివిధ హోదాలలో నాటుకుపోయారు . వీరు వైదొలగి చురుకైన , ఆసక్తి ఉన్న యువతరాన్ని ప్రోత్సహించాలి .
క్రీడా సంఘాల బాధ్యతలు :
- మారుమూల ప్రాంతాలలో క్రీడలను అభివృద్ధి పరచడం .
- జిల్లాలో అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో క్రీడా ఎంఫికలు , పోటీల నిర్వహణ ,
- ఎంపికలో పారదర్శకత పాటించాలి ,
- రాస్ట్ర పోటీ్లకు జిల్లా జట్టును సిద్ధం చేయడం ,
- పోటీల కోసం ఆర్ధిక వనరులను దాతల నుంచి సేకరించడం , అవరము మేరకు వితరణ శీలుర సాయాన్ని తీసుకోవడం ,
- క్రీడలకు సంబంధించిన మౌలికసదుపాయాల కల్పనకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం ,
- సెమినార్ లు , వర్కుషాపులు నిర్వహించి మెలకువలను క్రీడాకారులకు తెలియజేయడం ,
- ఆధునిక క్రీడా సంకేతిక పరిజ్ఞానాన్ని క్రీడాకారులు అందిపుచ్చుకునేలా చొరవ చూపాలి ,
- జాతీయ , అంతర్జాతీయ క్రీడా ముత్యాలను సత్కరించి వర్ధమాన క్రెశాకారులకు స్పూర్తి కలిగించడం ,
- అవగాహన లేని కొన్ని క్రీడాంశాల కోసం సంబంధిత సంఘాలు పాఠశాల స్థాయిలో విద్యార్ధుల్లో ఆసక్తి కలిగించేలా ప్రదర్శించాలి ,
- క్రీడా పరికరాలు ప్రభుత్వ సహాయము తో సమకూర్చాలి .
అన్ని ప్రాంతాల్లో మౌళిక వసతులు కల్పించాలి . అథ్లెటిక్స్ కు సంబందించి రాస్ట్రం మొత్తం మీద రాజధానిలో మాత్రమే సింథటిక్ ట్రాక్ ఉన్నది . ప్రతి జిల్లాకు క్రీడా శిక్షకులను నియమించాలి . రాస్ట్రం లో అథ్లెటిక్స్ కు 07 శిక్షకులుండగా శ్రీకాకుళం జిల్లాలో లేరు . ఇక్కడ మూడు క్రీడాంశాలకే శిక్షకులున్నారు . నిధులను సెస్ ద్వారా కాకుండా రాస్ట్ర బడ్జెట్ నుండే విడుదల చేయాలి . కార్పొరేట్ సంస్థలను భాగస్వాముల ను చేయడానికి అవసరమైతే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి .
- ===========================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !