Thursday, August 12, 2010

కస్తూరిబా గాంధీ పాఠశాలలు శ్రీకాకుళం లో , KASTURBA GANDHI BALIKA VIDYALAYA RESIDENTIAL SCHOOL- in srikakulam


----
Kasturba with Mahatma Gandhi .


  • బడిమానిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూరిబా గాంధీ గురకుల పాఠశాలలో నిరు పేద విద్యా కుసుమాలు వికసించా యి. బాలికల్లో డ్రాపౌట్లు లేకుండా వారి చదువును ప్రోత్సహించడానికి ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు(కె.జి.బి.వి.) ఏర్పాట్లు పూర్తిచేశారు.

  • జిల్లాలో 12 కె.జి.బి.వి. పాఠశాలలు ఉన్నాయి . ఈ పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వం రూ. 3.34 కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తోంది. ఆర్‌.వి.ఎం. (Rajiv Vidya Mission) ఆర్థిక సాయంతో ఈ కేంద్రాలు నిర్వహిస్తున్నప్పటికీ గురుకుల సంస్థల పర్యవేక్షణలో నడుస్తున్నాయి.
జిల్లాలో ఎ.పి.ఆర్‌.ఎస్‌. ఆధ్వర్యంలో ఎనిమిది కె.జి.బి.వి.లు
  1. జలుమూరు,
  2. సంతబొమ్మాళి,
  3. పోలాకి,
  4. జి.సిగడాం,
  5. సంతకవిటి,
  6. ఆర్‌.ఆమదాలవలస,
  7. రాజాం,
  8. వంగర
ల్లో నిర్వహిస్తున్నారు.

ఎ.పి.టి.డబ్బ్యు.ఎస్‌.ల పరిధిలో 3 .
  1. పాతపట్నం,
  2. మెళియాపుట్టి,
  3. సీతంపేటల్లో,

ఎ.పి.ఎస్‌.డబ్ల్యు.ఎస్‌. పరిధిలో 1.
  1. కంచిలి ........లో నిర్వహిస్తున్నారు.
ఒక్కో కేంద్రంలో 170 మంది డ్రాపౌటు బాలికల్ని చేర్చుకుంటున్నారు.






  • =============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !