Wednesday, August 11, 2010

నాగావళి గ్రామీణాభివృద్ధి సంస్థ (నైరెడ్‌)శ్రీకాకుళం జిల్లా లో , NIRED -Rajaam in Sklm dist.


---

రాజాం పట్టణంలో నాగావళి గ్రామీణాభివృద్ధి సంస్థ (నైరెడ్‌)ను స్థాపించి యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇస్తున్నారు. 2003 జనవరిలో జి.ఎం.ఆర్.పౌండేషన్‌ , ఆంధ్రాబ్యాంకుతో సంయుక్తంగా ఈ సంస్థను నెలకొల్పారు. ఇప్పటివరకు పలు జిల్లాలకు చెందిన 5 వేల మందికి పైగా యువతకు భిన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వందలాది మంది జీవితాలలో వెలుగులు నింపుతుంది ..

గ్ర్రామీణ , పట్టణ ప్రాంతాల్లో కొద్దిపాటి చదువులు చదివి ఉపాది పొందలేక నిరాశ , నిస్పృహలతో ఉన్న యువతను అక్కున చేర్చుకొని ఓ మంచి ఉపాది అవకాశము కల్పిస్తోంది . ఇప్పటివరకు 4,462 మందికి శిక్షణనిచ్చారు . వీరిలో 3954 మంది వివిధ ఉద్యోగాలు , ఉపాధి సంస్థలలో స్థిరపడ్డారు . నైరెడ్ నేరుగా బ్యాంకుల నుంచి రుణ సదుపాయము కల్పించడంతో నేర్చుకున్న శిక్షణ ను సద్వినియోగము చేసుకొని ఉద్యోగాలలో , సొంత ఉపాదితో లభ్ది పొందుతున్నారు .

శిక్షణలో రకాలు :
ఈ శిక్షణ సంస్థలో 27 అంశాలలో కార్యక్రమాలు రూపొందించారు . 11 అంశాలలో మహిళలకు , 16 అంశాలలో పురుషులకు శిక్షణ ఇస్తారు . శిక్షణ కాలము లో ఉచిత భోజన , వసతి సౌకర్యాలు కల్పిస్తారు . ఇదే సమయం లో యోగా , స్పోకె్న్‌ ఇంగ్లిష్ లో శిక్షణ ఇస్తున్నారు . రైతులకు ఆధునిక సేస్య పద్ధతులు , స్వయం శక్తి సంఘాల సభ్యులకు వ్యాపార చిట్కాలు నేర్పుతున్నారు . మారుతున్న పరిస్థితులకు అనుగుణం గా సెల్ ఫోన్‌ మరమ్మత్తులు చేయడం లొ శిక్షణ ఇస్తున్నారు . టెలివిజన్‌ మరమ్మత్తులు కూడా నేపుతున్నారు . ఇది స్వయం ఉపాదికి ఎంతో తోడ్పడుతుంది . ఇంకా ...
పదో తరగతి ఉత్తీర్ణులైనవారికి .. ఎలక్ట్రీషియన్‌,
రైతులకు డ్రిప్ ఇరిగేషం లొ శిక్షణ ,
సర్ఫ్ , ఫినైల్ , బ్లీచింగ్ , షాంపూ తయారీలో గ్రామీణ మహిళలకు శిక్షణ ,

సందర్శకులు :
సంస్థ చేపడుతున్న కార్యక్రమ్మలను చౌసి ఎందరో ప్రముఖులు ప్రశంసించారు . భార మాజీ రాస్ట్రపతి ' అబ్దుల్ కలాం ' భేష్ అన్నారు . ఇక్కడ శిక్షణ పొందిన వారికి తమ సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించేందు కు ఎల్.అండ్. టి . చైర్మన్‌ ముందుకు వచ్చారు . కేంద్ర సహాయమంత్రి ... పురంధరేస్వరి , ఎం.పి... మధుయాస్కీ గౌడ్ , చినజీయర్ స్వామి , తి.తి.దే. కార్యనిర్వహణాధికారి ... ఐ.వై.ఆర్.కృష్ణారావు వంటి ప్రముఖులు సందర్శించారు .

ఆర్దిక స్తోమత లేక అరకో చదువుల తో ఆగిపోయిన యువతకు ఉపాది కల్పించడమే ఈ సంస్థ ఆశయము .
  • ==========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !