Wednesday, April 21, 2010

సహకార సంస్థలు శ్రీకాకుళం లో , Co-Operative Societies in Srikakulam




సహకార సంఘాలు అంటే ? :

కొంతమంది వ్యక్తులు కలసి తమ అందరి బాగోగుల కోసం పనిచేయడాన్ని సహకారం (Cooperation) అంటారు. ఒక్కరు చేయలేని పనిని కొంతమంది కలసి సాధించవచ్చును. ఇలా కొంతమంది కలసి ఉమ్మడి లక్ష్యం కోసం ఉద్యమించడమే సహకారోద్యమం (Cooperative movement). ఇలా ఏర్పడిన సంఘాలను సహకార సంఘాలు (Cooperative Societies) అంటారు. ఇందులో భాగస్వాములైన వ్యక్తులకు కొన్ని నిర్ధిష్టమైన ఆశయాలుంటాయి. సభ్యులు అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అందరూ కలసి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సహకార సంఘాలు మొదట జర్మనీ దేశంలో స్థాపించబడ్డాయి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సహకారోద్యమం ప్రారంభమైంది. భారతదేశంలో 1904 సంవత్సరంలో ఈ ఉద్యమం ప్రారంభమైనది. వీటికి సహాయం చేయడానికి ప్రభుత్వంలో సహకార మంత్రిత్వ శాఖలు ఏర్పాటుచేయబడ్డాయి. రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయిలలో సహకార భూమి తనఖా బ్యాంకులు స్థాపించబడ్డాయి. మన రాష్ట్రంలో వివిధ రంగాల్లో సుమారు పన్నెండు వేలకు పైగా సహకార సంఘాలున్నట్లు అంచనా.

శ్రీకాకుళం లొ కొన్ని సహకార సంఘాలు :
ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీస్(PACS)
కోపరేటివ్ వ్యసాయ మార్కెటింగ్ కమిటీలు ( CAMS-Srikakulam),
పాల ఉత్పత్తిదారుల సంఘాలు,
పండ్లు, కూరగాయల ఉత్పత్తిదారుల సంఘాలు, 
రైతు సహకార సేవా సంఘాలు .
రుణ వితరణా పాలసీ,
చేనేత సహకార సంఘాలు : 

ఆంధ్రప్రదేశ్ లో 22 డి.సి.సి బ్యాంక్ లు ఉన్నాయి . ఒక్కొక్క బ్యాంక్ కి కొన్నీ పి.ఎ.సి.ఎస్. లు అనుసందానము గా ఉనంటాయి .

-----------------------------------------------------------------

మన రాస్ట్రం లో బ్యాంక్ లు ఈ విదం గా ఉన్నాయి .
కమర్సియల్ బ్యాంక్ లు (CBs)= 48 ,
ప్రాంతీయ రూరల్ బ్యాంక్ లు (RRBs) = 16 ,
లోకల్ ఏరియా బ్యాంఖ్ లు(LABs) = 2 ,
కోపరేటివ్ బ్యాంక్ రాస్ట్రం అంతటికీ(APCAB) = 1 ,
జిల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లు (DCCBs)= 22 ,
ప్రాధమిక వ్య్వసాయ సహకార బ్యాంక్ లు(PACS) = 4469 ,
-------------------------------------------------------------------

మన దేశంలో సహకార ఉద్యమానికి ఘనమైనచరిత్ర ఉంది . నేడు మన భారతదేశపు సహకార ఉద్యమం అనేది ప్రపంచంలోనే అతి పెద్దది . స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి వ్యవసాయాభివృద్ధిలో అధి క దిగుబడి , సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి, పంటల్లో విభిన్నత్వంవంటి అంశాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ ఘనత ఒక్క వ్యవసాయ పరిశోధన, నీటి పారుదల వ్యవస్థ, వ్యవసాయ పబ్లిక్ పాలసీలది మాత్రమే కాదు. ఎంతో విస్తరించిన సహకార సంస్థల నెట్వర్క్ ద్వారా ఏర్పడిన వ్యవసాయ రుణ వితరణ వ్యవస్థకు కూడా అందులో చెప్పుకోదగ్గ పాత్ర ఉంది.

సమయానుసారంగా రైతులకు సరైన ఆర్థిక సహాయం అందిస్తే, వారు అధిక పంట దిగుబడిని, ఉత్పత్తిని వారందించగలరనే ఉద్దేశ్యంతోను సాధారణంగా గ్రామీణ/వ్యవసాయ రుణాలను ప్రవేశపెట్టారు. సంస్థలనుంచి రుణాలు పొందడంలో చిన్నరైతులకు, సన్నకారు రైతులకు మెరుగైన మార్గాలు చూపడంవల్ల, వారికి ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుకొనువీలు  నేర్పించడం, మెరుగైన వ్యవసాయ మెళకువలను నేర్పించడం అనేవి ఈ రుణ వితరణా పాలసీ ముఖ్యోద్థేశ్యాలు.



  • =============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !