రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర నిర్దేశించడంలో అతి కీలకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీలు కేవలం అలంకా రప్రాయంగా మారిపోయాయి. దళారుల హవా పెరిగిపోవడంతో మార్కెటింగ్ శాఖను ప్రభుత్వమూ కొంత భాద్యత తీసుకోవాలి .
సహకార సేవా సంఘాలు
అమ్మకాలు, కొనుగోళ్లలో రైతుల ప్రయోజనా లను కాపాడడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి. రైతాంగ దుస్థితికి కారణాలను విశ్లేషించిన స్వామినాథన్ జాతీయ రైతుల కమిషన్, జయతీఘోష్ కమిషన్‌లు రైతుల సమస్యలను సహకార చట్రం పరధిలోనే సూచించారు. ఈ సంఘాలను సక్రమంగా పనిచేయించగలిగితే రైతులకు మనుగడనిస్తాయి. పాల ఉత్పత్తిదారుల సంఘాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తిదారుల సంఘాలు వీటికి మంచి ఉదాహరణ. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కంపెనీ సేద్యానికి 'సహకార సేద్యంగా' పేరు పెట్టి, ఆ విధంగా మభ్యపెట్టే ప్రచారం చేస్తూ రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా కంపెనీ సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. రైతు సహకార సేవా సంఘాలు, సహకార సేద్యం ఒకటే కావు. వీటిలో ఎంతో తేడా ఉంది. ఇప్పుడు రైతుసంఘాలు కోరుకునేది రైతు సహకార సేవాసంఘాలు మాత్రమే. ఇవే దుష్టమార్కెట్ శక్తుల నుండి రక్షిస్తూ రైతుల మనుగడకు దోహదపడతాయి. రైతుల ఎడల నిజమైన ప్రేమ ఉన్న ఏ ప్రభుత్వమైనా రైతు సహకార సంఘాలను ప్రోత్సహించాలి. వీటికి అవసరమైన మద్దతును ఇవ్వాలి.
శ్రీకాకుళం జిల్లా లో మొత్తము 13 వ్యసాయ మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి . ఇవి అన్నీ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఆధీనము లో ఉంటాయి .
జిల్లాలోని మార్కెటింగ్ కమిటీలు :
- శ్రీకాకుళం ,--1993 డిసెంబర్ లో ఆముదాలవలస మార్కెట్ కమిటీ నుంచి విడిపోయి శ్రీకాకుళం ప్రత్యేక మార్కెట్ కమిటీ ఏర్పాటైనది . దీని పరిదిలో శ్రీకాకుళం , గార మండలాలు ఉన్నాయి .
- ఆమదాలవలస ,
- పొందూరు ,
- రాజాం ,
- పాలకొండ ,
- హిరమందలము,
- పాతపట్నం ,
- నరసన్నపేట ,
- కోటబొమ్మాలి ,
- టెక్కలి ,
- సోంపేట ,
- కంచిలి ,
- ఇచ్చాపురం
13 వ్యవసాయ మార్కటింగ్ కమిటీల పరిధిలో 18 చెక్పోస్టులు ఉన్నాయి . సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నది . వ్యవసాయ ఉత్పత్తులు , పశుగనాలు , అటవీ ఉత్పత్తులకు సంభందించి వాటి విలువలో ఒక శాతము మొత్తాన్ని మార్కెట్ రుసుము గా వాసులు చేస్తున్నారు . వీటిలో రవాణాకు సంభంచి చెక్ పోస్టుల వద్ద వాహనాలను నిలుపుదల చేసి రుసుకు వాసులు చేస్తారు .
మార్కెట్ కమిటీల పునర్ వ్యస్ఠీకరణ : అంత అవసరమా? .. ఉన్నవాటిని సరియైన మార్గం లో పెడితే సరిపోదా ? .. . ఏదో చేయాలనే తపన తీరా మొ దటికే మోసం రావచ్చును .
- శ్రీకాకుళం జిల్లా మార్కెట్ కమిటీల్లో మార్పు : 14/01/2011
* ఆమదాలవలస మార్కెట్ కమిటీలో ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాలు ఉన్నాయి. ఎల్.ఎన్.పేట మండలాన్ని తొలగించి హిరమండలం మార్కెట్ కమిటీలో కలిపారు. పాలకొండ మార్కెట్ నుంచి బూర్జ మండలాన్ని తొలగించి ఆమదాలవలస కమిటీలో కలిపారు. పొందూరు మార్కెట్ కమిటీని రద్దు చేసి ఆమదాలవలస కమిటీలో కలిపారు.
* రాజాం మార్కెట్ కమిటీ పరిధిలో రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాలు ఉన్నాయి. పాలకొండ కమిటీ నుంచి వంగరని తొలగించి ఇక్కడ కలిపారు. నియోజకవర్గ కేంద్రంలోకి రావడం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
* పాలకొండ మార్కెట్ కమిటీ పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాలు ఉన్నాయి. భామిని మండలాన్ని హిరమండలం కమిటీ నుంచి తొలగించి పాలకొండ కమిటీలో కలిపారు. వంగరని తొలగించారు.పాలకొండ నియోజకవర్గ కేంద్రం వెళ్లడానికి రైతులు సులభంగా ఉంటుంది.
* హిరమండలం మార్కెట్ కమిటీలో హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట మండలాలు ఉన్నాయి. ఆమదాలవలస కమిటీ నుంచి ఎల్.ఎన్.పేటని తొలగించి హిరమండలం కమిటీలో కలిపారు.
* అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం, హిరమండలం మార్కెట్ కమిటీలు చెక్కుచెదర్లేదు. పాతపట్నం మార్కెట్ కమిటీలో సారవకోటని తొలగించి పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్ని ఉంచారు.
* కోటబొమ్మాళి మార్కెట్ కమిటీలో కోటబొమ్మాళి, టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాలు ఉన్నాయి. కాశీబుగ్గ కమిటీ నుంచి టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్ని తొలగించి కోటబొమ్మాళి కమిటీలో కలిపారు.
* సోంపేట మార్కెట్ కమిటీని రద్దుచేసి కంచిలి మార్కెట్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో కంచిలి, సోంపేట మండలాలు ఉన్నాయి. అయిదో నంబరు జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో రైతులకు మేలు జరగనుంది.
* జలుమూరు మార్కెట్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. జలుమూరు గతంలో కోటబొమ్మాళి కమిటీ పరిధిలో ఉండేది. పాతపట్నం నుంచి సారవకోట మండలాన్ని తీసుకుని రెండింటిని కలిపి జలుమూరు కమిటీని ఏర్పాటుచేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది.నరసన్నపేట మార్కెట్ కమిటీ ఉందా? రద్దయిందా? అనే విషయాలు స్పష్టంగా పేర్కొనలేదు.
* ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ కొత్తగా ఏర్పాటుచేశారు. ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం, రణస్థలం మండలాలు ఇందులో ఉన్నాయి. గతంలో ఇవి పొందూరు మార్కెట్ కమిటీలో ఉండేవి.
* పలాస మార్కెట్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న 'కాశీబుగ్గ కమిటీని రద్దు చేశారు. పలాస, వజ్రపుకొత్తూరు మండలాలు గతంలో కాశీబుగ్గ కమిటీలో ఉండేవి. మందస సోంపేట కమిటీలో ఉండేది.
- ==========================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !