అగ్నిప్రమదాలు జరిగినపుడు , ప్రమాదవశాత్తు నదులు , చెరువులు లలో మునిగిపోయినవారిని , బోరు బావులలొ పడిపోయిన వారిని రక్షించేందుకు అందరికంటే ముందు వచ్చేవారు అగ్నిమాపక దళ సిబ్బందే .
శ్రీకాకుళం జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు ... వాటి పొను నెంబర్లు :
జిల్లా అగ్నిమాపక ,విపత్తుల అధికారి = కోటా జాన్ (2010 నుండి ) --
update - 02-ఏప్రిల్ 2015 : - శ్రీకాకుళం లో ఉన్న 1101 పంచాయతీలలో 4160 గ్రామాలలోని 27 లక్షల మంది జనాభా కు సేవలందించేందుకు గాను 12 ప్రభుత్వ అగ్నిమాపక కిఏంద్రాలు , మందస , పొందూరు మండల్ కేంద్రాలలో ఒప్పంద అగ్నిమాపక కేంద్రాలు పనిచేస్తున్నాయి.
- కేంద్రము -------- ఫోను నెంబరు
- శ్రీకాకుళం -------08942 222099 ,
- ఇచ్చాపురం ------08947 231101 ,
- సోంపేట ---------08947 234101 ,
- పలాస ----------08945 241101 ,
- టెక్కలి ----------08945 244277 ,
- కొత్తూరు --------08946 258444 ,
- పాలకొండ -------08941 220111 ,
- రాజాం ----------08941 251099 ,
- కోటబొమ్మాలి ----08942 238659 ,
- నరసన్న పేట ----08942 276777 ,
- ఆమదాలవలస --08942 286401 ,
- రణస్థలం --------08942 234499 ,
- పొందూరు ------08941 242101 ,
- మందస --------08947 237101 .
రాత్రివేళల్లో మంటలు ఆర్పేందుకు ఫోర్టబుల్ లైటర్స్ :->
జిల్లాలో ఎక్కడైనా భారీ అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని ఆర్పివేసేందుకు రాష్ట్ర అగ్నిమాపకశాఖ ప్రతి జిల్లా కేంద్రానికి ఒక పోర్టబుల్ లైటర్‌ను ఇచ్చారు. ఈ లైటర్‌ను జిల్లాకేంద్రంలోని ఫైర్ స్టేషన్‌లో వుంచుతారు. ఈ లైటర్ ఎక్కువ వెలుగువుండడంతో మంటలను ఆర్పేందుకు సులభతరంగా వుంటుంది.
Andhra Pradesh Fire Service Department is a humanitarian service dedicated to saving of life and property of the public. It is one of the largest Fire Brigade networks in India, started on first November ,1956.
ప్రమాదాలను 101కు ఫోన్ చేయాలి : జిల్లా ఫైర్ అధికారి
జిల్లాలో ఎక్కడైనా సరే అగ్నిప్రమాదాలు జరిగితే ప్రజలు 101 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ప్రజలకు అవగాహన లేకపోవడంతో 101కు తెలియపరచలేకపోతున్నారన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం గుడిసెల సంఖ్య తగ్గిపోయిందని అన్నారు .
1944 లొ ముంబై ఒడరెవులొ జరిగిన ఘోర అగ్నిప్రమాదం లో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న 46 మంది అగ్నిమాపక దళాధికారులు , 66 మంది సిబ్బంది మంటల్లో చిక్కుకుని మృతిచెందారు . ప్రాణాలకు తెగించి మీరు చేసిన సాహసానికి ప్రతీకగా ఏటా ఏప్రిల్ 14 నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు .
అగ్నిప్రమాదాలు ... అయిదు గ్రేడులు ->
ఎ-గ్రేడు : వెదురు , కాగితాలు , వస్త్రాలు పూర్తిగా కాలిబూడిద అయితే ఎ-గ్రేడుగా గుర్తిస్తారు . ఈ పరిస్తితిలో " వాటర్ టైప్ ఎస్టింగ్విషర్ పరికరం వినియోగించి మంటలు అదుపు చేస్తారు .
బి-గ్రేడు : కిరోసిం , పెట్రోల్ , గ్రీజు , ఇతర నూనెలు , రంగులు తదితరాలు కాలిపోతే వాటిని బి-గృడుగా గురిస్తారు . ఇటువంటి ప్రమాదాల్లో" హోం ఎస్టింగ్విషర్ " డ్రై కెమికల్ వినియోగిస్తారు .
సి-గ్రేడు : విద్యుత్తు ప్రమాదాలు సంభవిస్తే డ్రై కెమికల్ పొండర్ తో పాటు కార్బం డై ఆక్షైడ్ వినియోగించి మంటలను సదుపు చేస్తారు .
డి-గ్రేడు : బంగారం ,వెండి, రాగి, ముము , కంచు తదితర లోహాలు కాలిపోయినప్పుడు డ్రై కెమికల్ పొవ్డర్ చల్లి మంటలు ఆర్పుతారు .
ఇ-గ్రేడు : వంటగ్యాస్ , తేఇత ప్రమాదాలను దీనికిందకు వస్తాయి . ఇటువంటివి సంభవించినపుడు " కార్బండైయాక్షైడు " డ్రి కెమికల్ పౌడర్ , వినియోగించి అదుపులోకి తెస్తారు .
ప్రమాదాలనుంచి రక్షణ లొ రకాలు : ->
నదులు , చెరువులు , బావుల్లో పడిపోయిన వారిని రక్షంచేందుకు ,పొగప్రమాదాల్లో చిక్కుకుని స్పృహ తప్పిన వారిని రక్షించేందుకు అయిదు రకాలుగా ప్రయత్నిస్తారు .
*చాఫర్ మెదడ్ : నదులు , చెరువులు ,బావుల్లో పడిపోయి కడుపు నిండా నీరు తాగేసి స్పృఉహ తప్పిన వారిని ఛాఫర్మెదడ్ లో మనిషిని తిన్నగా పరుండబెట్టి రెండు చేతులను నిమిషానికి 17 సార్లు వంతున ఆడిస్తారు . ఇలా చేయడం వల్ల నీరు బయటకు వచ్చి ప్రాణాపాయం తప్పుతుంది .
*హోల్గర్ నెల్సన్ మెధడ్ : -> దీని ద్వారా నీరు తాగిన మనిషిని బోర్లా పరుండబెట్టి రెందు భుజాలపై గట్టిగా నిమిషానికి 17 సార్లు వంతున వత్తిడి చేయడం వల్ల నీరు బయటకు పూర్తిగా వచ్చి శరీరం తేలిక పడి ఊపిరి తీసుకునేందుకు వీలవుతోంది .
* సిల్వస్టర్ మెధడ్ : ఈ పద్దతిలో మనిషిని బోర్లా పరండబెట్టి నడుము పై రెండు చేతులు పెట్టి నిమిషానికి 17 సార్లు వంతున అదుముతూ నొక్కడం వల్ల కడుపులోని నీరంతా బయటకు వచ్చేస్తుంది .
*మౌత్ టు మౌత్ మెధడ్ : చిన్న పిల్లలకు వినియోగిస్తారు . నీట మునిగిన పిల్లలను బయటకు తీసిన వెంటనే శ్వాస అందించేందుకు నోటిలొ నోరు పెట్టి ఊపిరి ఊదుతారు . ఈ విధానం వల్ల చిన్నపిల్లలకు నేరుగా శ్వాస అందించడం వల్ల తక్షణమే లోలుకునే అవకాశం ఉంటుంది .
*పొగప్రమాధాలలో చిక్కుకున్నవారిని : కొన్ని సందర్భాలలో అగ్నిప్రమాదానికి గురైన ఇల్లు పొగతో నిండి ఉంటుంది కాబట్టి సిబ్బంది నేర్పుగా ఇంట్లో ప్రవేశిస్తారు . ఇంట్లో భూమి (గచ్చు )నుంచి అరు (6)అడుగుల పైన పొగ ఉండి కింద అంతా ఆక్షిజన్ ఉంటుంది . ఈ క్రమం లోనికి ప్రవేశించిన అగ్నిమాపక సిబ్బంది లోపల అంతా చిమ్మచీకటిగా ఉన్నందున రెండు పిడికిళ్లు బిగించి నేలపై పాకురుకుంటూ ఇళ్ళంతా వెతుకుతారు . ఎక్కడైనా స్పృఉహ తప్పిపోయిన మనిషి ని గుర్తిస్తే అతని రెండు చేతులను తాడ్ర్ , లేదా గుడ్డ తో కట్టేసి తన మెడలో రెండు చేతుల మధ్యభాగాన్ని వేసుకుని తిరిగి పాకురుకుంటూ బయటకు తీసుకువచ్చిన తరువాత అవసరమైన ప్రధం చికిత్స చేసి ఊపిరి ళుదుతారు .
వరదల్లో : వరదలు సంభవించినప్పుడు లైఫ్ జాకెట్లు , లైఫ్ బాయ్స్ , రొప్ తదితర వాటి సాయం తో నీట కొట్టుకుపొతున్న , మునిగిన వ్యక్తులను కాపాడుతారు .
అగ్నిమాపక నివారణ సామగ్రి :
జిల్లాలో అపార్టుమెంట్లు , దుకాణాలు , దుకాణసముదాయాలు , ఆసుపత్రులు , పెట్రోలు బంకులు , తదితర వాటిల్లో తప్ప్పనిసరిగా అగ్నిమాపక నివారణ సామాగ్రి ఉంచుకోవాలని సూచనలు ఉన్నాయి .
- ఇసుకతొ కూడిన బకెట్లు ,
- డ్రై కెమికల్ ఎస్టింగ్విషర్లు (సిలిండర్లు ),
- టార్చ్ లైట్లు ,
కేంద్ర అగ్నిమాపక కార్యాలయం సిద్ధం--24/02/2014
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంలో రూ. 35 లక్షలతో నూతనంగా నిర్మించిన కేంద్ర అగ్నిమాపక కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పాతబస్టాండ్ సమీపంలో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. గతంలో ఉన్న కార్యాలయం శిథిలావస్థలో ఉండడంతో అగ్నిమాపకశాఖ డీజీ నూతన కార్యాలయం నిర్మించాలని రూ. 35 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో ఈ భవనం నిర్మించారు. గతంలో పాతభవనం ఉండేటప్పుడు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ ఎదురుగా అగ్నిమాపక కేంద్రం దారి ఉండేది. దీనిని పురపాలక సంఘ కార్యాలయం వైపు ఇప్పుడు ఏర్పాటు చేశారు. రెండు అగ్నిమాపక శకటాలతో పాటు, ఒక మిష్టు వాహనం అందుబాటులో ఉండేలా ఈ భవనాన్ని నిర్మించారు. కేంద్ర అగ్నిమాపక అధికారి, సిబ్బంది వేర్వేరుగా ఉండేలా రెండు గదులు నిర్మించారు. కార్యాలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. సున్నాలు వేయించారు. వచ్చేనెల మొదటివారంలో ఈ నూతన భవనాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా అగ్నిమాపకాధికారి జె.మోహనరావు చెప్పారు.
Week celebrations of fire-services Srikakulam 2014,శ్రీకాకుళం లో అగ్నిమాపక వారోత్సవాలు2014
జిల్లా అగ్నిమాపక వారోత్సవాలను ఆ శాఖ జిల్లాధికారి మోహన్‌రావు సోమవారం(14-04-2014) ప్రారంభించారు. కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న ముంబాయి ఓడరేవులో ఆయుదాలు, గన్‌ఫౌడర్ కల్గిన 'పోర్ట్ స్త్టెయికింగ్' అనే నౌకలో అగ్ని ప్రమాదం జరిగి 336 మంది పౌరులతో పాటు 66 మంది అగ్నిమాపక సిబ్బంది మృతిచెందినట్లు తెలిపారు. వీరి సంస్మరణార్థం అగ్నిమాపక దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మృతుల గౌరవార్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అగ్నిమాపకాధికారి ఆర్.వెంకటరమణ, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
- ==================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !