Sunday, April 18, 2010

శ్రీకాకుళం లో సంస్క్రుతి వారసత్వ దినోత్సవం , Haritage day in Srikakulam

తరతరాల చరిత్ర కలిగిన వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రతి యేటా ఏప్రిల్ 18 తేదీన ప్రపంచ సంస్కృతి వారసత్వ దినోత్సవం జరుపుకుంటున్నాము . శ్రీకాకుళం లో కూడా ఈ సంస్కృతీ వారసత్వ దినము జరుపుకుంటున్నారు . తరతరాల నుండి వస్తున్న పురాతన క్ట్టడాలను , చారిత్రక ప్రదేశాలు , పుణ్యక్షేత్రాలు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం లో ఈ ఉత్సవాలకు ప్రాధాన్యత యేర్పడినది .



8 మందికి హెరిటేజ్‌ పురస్కారాలు

ప్రపంచ సంస్కృతీ వారసత్వ దినోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి విజేత ఇన్‌ హోటల్‌లో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా రంగాలలో నిష్ణాతులైన 8 మందిని హెరిటేజ్‌ పురస్కారాలతో సత్కరించారు.
  1. నర్తకీమణి స్వాతీ సోమనాధ్‌,
  2. ఉభయభాషా ప్రవీణుడు కాకరపర్తి ముఖలింగశర్మ,
  3. ఉపనిషన్మనందిరం అధ్యక్షులు ఈశ్వర సీతారామ ధన్వంతరి,
  4. నటుడు యడ్ల గోపాలరావు,
  5. సంగీత విద్యాంసులు మావుడూరి జగన్నాధశర్మ,
  6. ప్రముఖ సంఘ సేవకులు మగటపల్లి వెంకటరమణమూర్తి,
  7. సవరభాషా ప్రచారకులు పత్తిక బాంబు,
  8. యువ చిత్రకారుడు కల్కిలు వీటిని అందుకున్నారు.


దేశసంస్కృతీ సంపదలను భావితరాలకు అందించాల్సిన అవసరం చాలా ఉందని సంస్కృతీ వారసత్వ వేడుకలలో పాల్గొన్న పలు ప్రముఖులు అన్నారు .. జిల్లాలో సంస్కృతికి సంబంధించిన అంశాలే చాలామందికి తెలియని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. వీటిపై అవగాహన కల్పించేలా ప్రచారం అవసరమన్నారు. పూర్వీకులు జ్ఞానం, సంస్కృతిని -- కళారూపాల ద్వారానే అందించేవారని చెప్పారు.

Click here for full details (పూర్తి వివరాలకోసం ) -> Heritage day in srikakulam
  • ============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !