For good Friday Click - > గుడ్ఫ్రైడే - చరిత్ర, ప్రాధాన్యత
శ్రీకాకుళం చర్చిల్లో 'ఈస్టర్' వేడుకలు
శుక్రవారం నాడు సిలువ ద్వారా మరణం పొందిన ఏసుక్రీస్తు, ఆదివారం నాడు తిరిగి జీవించే అద్భుత వేడుక 'ఈస్టర్'ని పట్టణంలో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మరణం సంభవించిననూ, తిరిగి జీవించునన్న సత్యాన్ని పునరుత్ధానం ద్వారా ఏసుప్రభువు రుజువు చేశాడని క్రైస్తవుల అపార విశ్వాసం. పట్టణంలో పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఏసుక్రీస్తు సందేశాలు, గీతాలాపనలు, సమాధుల్లో పితృదేవతలకు ఆరాధనలు జరిపారు. తెలుగు బాప్టిస్టు చర్చిలో ఫాదర్ జాకబ్ అధికారి మాట్లాడుతూ క్రైస్తవ విశ్వాసానికి పట్టుగొమ్మ పునరుత్ధానం, క్రీస్తును ఆరాధించడం ఆశీర్వాదమేనని తెలిపారు. తెలుగు బాప్టిస్టు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం.భాస్కరరావు డి.ఎల్.బి.ఎల్. కుమార్, కోశాధికారి బి.అప్పారావునాయుడు, క్రైస్తవులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల రహదారిలో ఉన్న సహాయ మాతాలయం కెథిడ్రియల్‌లో ఫాదర్ ఎ.ప్రేమానందం ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు పునరుత్ధానం మహోత్సవ పూజాబలి ప్రార్థనలు జరిగాయి. పీఠాధిపతి అడ్డగట్ల ఇన్నయ్య, పాధర్ విజయ్, కృపారావు, భూషణ్‌లు, ఎక్కువ సంఖ్యలో క్రీస్తు ఆరాధకులు పాల్గొన్నారు. టౌనుహాలు దరి సెయింట్ థామస్ చర్చిలో ఫాదర్ డామినిక్ రెడ్డి తుమ్మా నిర్వహణలో ఈస్టర్ వేడుకలు, సామూహిక ప్రార్థనలు జరిపారు.
బలగ ఆసుపత్రి రహదారిలోని షారోను కృపానిలయం, కొత్తవంతెన దరి చర్చి, రెల్లివీధిలోని క్రీస్తుసంఘం, అఫీషియల్ కాలనీ, ఆదివారం పేట, పాతశ్రీకాకుళం వృద్ధ జనాశ్రమం దరి చర్చి, మహిళా డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న క్రీస్తు ఆరాధన కేంద్రం, మంగువారితోట, పలు ప్రాంతాల్లోని చర్చిల్లో ఈస్టర్ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళా కళాశాల ఎదురుగా ఉన్న క్రైస్తవ ఆరాధన కేంద్రంలో ఏసుక్రీస్తు పునరుత్ధాన పండుగ జరిగింది. కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు డా గోడి శ్యామ్యూల్ ఏసుక్రీస్తు సిలువ మరణం తర్వాత పునరుత్ధానం గురించి వివరించారు. క్వయిర్ బృందం ఆధ్యాత్మిక గీతాలు, బాలబాలికల నృత్య ప్రదర్శనలు జరిగాయి.
- ======================================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !