Saturday, April 3, 2010

ఆకాశవాణి కేంద్రం శ్రీకాకుళం లో , Radio Station in Srikakulam







శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నిరంతరాయం గా సిగ్నల్ సమస్యలు లేకుండా రేడియో ప్రసారాలు వినేందుకు , చిన్న చిన్న కార్యక్రమాలు రికార్డింగ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2002 లో జిల్లాలో మినీ ఆకాశవాణి కర్న్ద్రానికి స్థల సేకరణ చేసింది . మొదటిగా ఆర్ట్స్ కళాశాల మైదానం సమీపం లో ఏర్పాటు చేయాలని అనుకున్నపటికీ వరదలను ద్రుష్టి లో పెట్టుకొని పెద్దపాడు లో నిర్మించేందుకు నిర్ణయించారు . 2004 లో అప్పటి ప్రసారభారతి సి.ఇ.ఓ. శర్మ దీనికి శంకుస్థాపన చేశారు . రూ . 3 కోట్ల వ్యయం తో చేపట్టిన ఈ కేంద్రం మూడేళ్ళలో పూర్తిచేసి కోట్ల విలువైన యంత్ర సామగ్రి అమర్చారు . సిబ్బందికి వసతి గృహాలు నిర్మించారు . అందం గా కార్యాలయం సిద్ధమైనా ప్రారంభానికి నోచుకోలేదు . కొన్నాళ్ళకు విలువైన యంత్ర సామగ్రి పాడైపోయే అవకాసం ఉంది .
యం.పి-ఎర్రం నాయుడు పోయే .... డా. క్రుపారాణి వచ్చే ... రేడియో కేంద్రం మాత్రం అలాగే ఉంది ... పోను లేదు రాను లేదు ..

11/March /2013

శ్రీకాకుళం చరిత్రతో..ఎఫ్‌.ఎం. నిర్మాణ కేంద్రం--కేంద్ర సహాయ మంత్రి కృపారాణి=లాంచనంగా ఆకాశవాణి ఎఫ్‌.ఎం కేంద్రం ప్రారంభం
పెద్దపాడు(రామలక్ష్మణకూడలి), న్యూస్‌టుడే: శ్రీకాకుళం ఎఫ్‌.ఎం.కేంద్రం కేవలం రిలే కేంద్రంగానే కాకుండా శ్రీకాకుళం చరిత్రను ఉపయోగించి నిర్మాణ కేంద్రంగా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి అన్నారు. పెద్దపాడులో నిర్మించిన ఆకాశవాణి ఎఫ్‌.ఎం కేంద్రాన్ని ఆదివారం ఆమె లాంచనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జిల్లా వాసుల కల ఈ రోజు సాకారమైందన్నారు. 2006లో మంజూరైన ఎఫ్‌.ఎం కేంద్రం 2007 నాటికి సివిల్‌ పనులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తిచేశారన్నారు. సాంకేతిక పరికరాలు రాకపోవడంతో జాప్యం జరగిందన్నారు. సంబంధిత మంత్రి అంబికా సోనితో మాట్లాడి సాంకేతిక పరికరాలు వీలైనంత తొందరగా కేంద్రానికి రావడానికి కృషి చేశామన్నారు. ఎఫ్‌.ఎం కేంద్రంగానే కాకుండా అన్ని కార్యక్రమాలతో సంపూర్ణ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆర్‌అండ్‌బి మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు కోరారు. ఈ సందర్భంగా బండారు చిట్టిబాబు బృందం సంగీతాలాపన, దూసి తప్పెడు గుళ్ల కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి అదనపు డైరెక్టర్‌ జనరల్‌(ఇంజినీరు- చెన్నై) ఎస్‌.కె అగర్వాల్‌, అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (ప్రోగామ్‌-సౌత్‌) జి.జైలాన్‌,అదనపు డైరెక్టర్‌ (ఎం.అండ్‌ సి-న్యూఢిల్లీ) ఏ.ఆర్‌.షేక్‌, విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్‌ ఆర్‌.హర్షలత, కేంద్ర కమ్యూనికేషన్లు, ఐ.టి సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, జిల్లా సహకార బ్యాంక్‌ అధ్యక్షులు డోల జగన్‌ తదితరులు పాల్గొన్నారు.


రేడియో పరిచయం : ఆలిండియా రేడియో (అధికారికంగా ఆకాశవాణి) భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసరణ మంత్రాంగ అధ్వర్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగం. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థ దూరదర్శన్ సోదర విభాగం.


ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్‌లో ఉన్నది. ఆకాశవాణి భవన్‌లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం కూడా ఆకాశవాణి భవన్‌లో 6వ అంతస్థులో ఉంది.

చరిత్ర

భారతదేశంలో మెదటి రేడియో ప్రసారాలు 1923 జూన్ లో "రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి" ద్వారా ప్రసారం చేయబడినాయి. దీని తరువాత "బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ" ఏర్పాటయింది. ప్రయోగాత్మకంగా జూలై 1927లో కలకత్తా, బొంబాయి నగరాలలొ "ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ" ప్రసారాలు చేసింది.

ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలొ ఈ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరములో ఆకాశవాణి ప్రభుత్వ సంస్ధగా అవతరించింది. అంతకి పూర్వం ప్రైవేటు రేడియో క్లబ్బులు ఉండేవి. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు (కలకత్తా, డిల్లీ, బొంబాయ్, మద్రాసు, లక్నో, తిరుచినాపల్లి) మాత్రమే ఉన్నాయి.

ఇప్పుడు 215 అకాశవాణి కేంద్రాలు 337 ప్రసార కేంద్రాల (144 MW కేంద్రాలు, 54 SW కేంద్రాలు, 139 FM కేంద్రాలు) తొ 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో టీవీ ఛానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ ఎమ్ రేడియో చానెళ్లు అన్ని వర్గాల వారికీ శ్రవణానందాన్ని కలిగిస్తూ సృష్టిస్తున్న సంచలనం అందరికీ తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాష్టంలొ కల ఆకాశవాణి ప్రసార కేంద్రాలు అదిలాబాదు, కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, అనంతపురం, కర్నూలు, కొత్తగూడెం, నిజామాబాదు, తిరుపతి, వరంగల్లు.

ఇటీవలి కాలంలో FM పై ఆకాశవాణి రెయిన్ బో (హైదరాబాదు , విజయవాడ) కేంద్రాలతో పాటు కొన్ని ప్రెవేటు FM కేంద్రాలు (రేడియో మిర్ఛి , రేడియో సిటీ , బిగ్ FM , ఎస్ FM) ప్రజాదరణ పొందుతున్నాయి. విద్యా ప్రసారాలకై జ్ఞానవాణి కేంద్రం (హైదరాబాదు , విశాఖపట్నం , ఇతర ముఖ్య నగరాలలో) పని చేస్తున్నది.

Update News : 

విశాఖలో ప్రాంతీయ వార్తా కేంద్రం--శ్రీకాకుళంలో ఎఫ్‌.ఎం. స్టేషన్‌_ఆకాశవాణి అదనపు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి.జె.సుధాకర్‌.

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో ప్రాంతీయ వార్తా కేంద్రాన్ని (ఆర్‌.ఎన్‌.యు.) ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని ఆకాశవాణి వార్తావిభాగం అదనపు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి.జె.సుధాకర్‌ వెల్లడించారు. శనివారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, విజయవాడల్లో మాత్రమే ప్రాంతీయవార్తా కేంద్రాలు ఉన్నాయని.. ఉత్తరాంధ్ర వాసుల, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు విశాఖలో ఆర్‌.ఎన్‌.యు.ను ప్రారంభించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబరు చివరివారం నుంచి నవంబరు మొదటివారంలోపు ప్రారంభమయ్యే ప్రాంతీయ వార్తా విభాగం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 10 నిముషాల చొప్పున వార్తలను ప్రసారం చేస్తుందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 1.35కోట్ల ప్రజలకు ఆయా వార్తాప్రసారాలు చేరుతాయని వివరించారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో శ్రీకాకుళంలో ఎఫ్‌.ఎం. స్టేషన్‌ను కూడా త్వరలో ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకులు బి.నూకరాజు, ఆకాశవాణి ప్రతినిధులు పాల్గొన్నారు.

  • ==============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !