Friday, April 2, 2010

108 - వాహన సేవలు - శ్రీకాకుళం లో , 108 Services in Srikakulam



  • Emergency Management and Research Institute
GVK Emergency Management And Research Institute
Industry - Emergency Management Services
Founded - April, 2005
Headquarters - Hyderabad, Andhra Pradesh, India
Key people - Mr. Ramalinga Raju,
Founder- Venkat Changavalli, CEO

* నేడు వ్యవస్థాపక దినం-- 02/ఎప్రిల్ .

108.. ఈపేరు వినగానే ఆపద్భందువు గుర్తుకు వస్తుంది. 2006లో జిల్లాలో ఒక వాహనంతో ప్రారంభమై నేడు 27 వాహనాలతో ఆపన్నులను ఆదుకుంటోంది. జిల్లాలో సమర్థమైన సేవలు అందించినందుకు 108 సీఈవో నుంచి జిల్లాకు ఉత్తమ అవార్డు లభించింది. ఈ ఇ.ఎం.ఆర్‌.ఐ. వ్యవస్థ ఏర్పాటు చేసి శుక్రవారం నాటికి ఐదేళ్లు పూర్తయినది .

గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆపదలో ఉన్న వారికి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం కింద ఎంతో మంది మృత్యుముఖం నుంచి బయటపడ్డారు. పాఠశాల విద్యార్థి నుంచి వృద్ధుల వరకు 108 నెంబరు గుర్తుంచుకోవడం వల్ల చాలావరకు ప్రమాదాల సమాచారం తెలుసుకుని ఆ వాహనాలు అక్కడికి చేరుకోవడంతో ఎంతో మందికి మేలు జరుగుతోంది.

జిల్లాకు ఉత్తమ అవార్డు
జిల్లాలో 108 అందిస్తున్న సేవలకు గాను 2009-10 సంవత్సరంలో ఉత్తమ అవార్డు లభించింది. మార్చి మొదటి వారంలో జిల్లా మేనేజర్‌ పి.ఎస్‌.ప్రసాదరాజు 108 ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) వెంకట్‌ నుంచి దీన్ని అందుకున్నారు .

గ్రామాల్లో చైతన్యం
108 వాహనం సద్వినియోగం చేసుకోవాలని ఆ సిబ్బంది గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ చైతన్యం చేస్తున్నారు. గ్రామీణులు, గిరిజనులు, పోలీసులు, ఇతర కార్యాలయ అధికారులు ఇలా అందరికీ ఇ.ఎం.ఆర్‌.ఐ. అందిస్తున్న సర్వీసులు అంతా చెబుతున్నారు. ప్రజలందరి నోళ్లలో 108 నెంబరు నలిగేలా చేయడం ద్వారా ఏ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని సమీప ఆసుపత్రులు, అవసరమైన పక్షంలో రోగిని బతికించేందుకు విశాఖపట్నం కూడా తీసుకువెళుతున్నారు.

వాహనంలో ఏముంటాయి
  • * ముగ్గురు డ్రైవర్లు, ముగ్గురు సాంకేతిక సిబ్బంది ఉంటారు.
  • * సాంకేతిక సిబ్బంది ప్రాథమికచికిత్స నిర్వహిస్తారు.
  • * నాలుగు రకాల స్ట్రెచ్చర్లు ఉంటాయి. ప్రమాదం జరిగిన తీరును అనుసరించి వీటిని వినియోగిస్తారు.
  • * ఆక్సిజన్‌ సౌకర్యం ఉంటుంది.
  • * పెయిన్‌ కిల్లర్స్‌, ఇంజక్షన్లు, మాత్రలు ఉంటాయి.
  • * సిలైన్‌ బాటిల్స్‌ ఉంటాయి.

జిల్లాలో అందించిన అత్యవసర సేవలు

కేటగిరీ---- ----2006-- 2007---- 2008-- 2009
-----------------------------------------------
గర్భిణులు------59---- 3,923-- 16,278- 14,281
గుండె-------- 28---- 529----- 1,978-- 1,474
యానిమల్‌బైట్‌-14---- 478----- 1,550-- 1,157
శ్వాససమస్య-- 5- ----547----- 2,120-- 1,034
జ్వరాలు- -----నిల్‌---- 691----- 8,062- 5,388
ఆర్టీఎ(RTA)-112-- 1,520--- 4,064-- 3,349
-----------------------------------------------

సర్వీసు దుర్వినియోగం కారాదు: డివిజినల్‌ మేనేజర్‌
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నిర్వహిస్తున్న 108 సర్వీసులను అత్యవసర పరిస్థితి ఉన్నవారే వినియోగించుకోవాలని శ్రీకాకుళం డివిజనల్‌ మేనేజర్లు బి.వి.జనార్థనరావు, పి.వి.రమణలు కోరారు. అయిదేళ్లు అవుతున్నందున శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని తమ విభాగంలో సమావేశం నిర్వహిస్తున్నామని వివరించారు. తక్షణవైద్యం అందించేందుకు చేస్తున్న తమ ప్రయత్నంలో అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఫ్లీట్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఎం.అప్పలరాజు మాట్లాడుతూ వృధా కాల్స్‌ వల్ల ఇంధనం వృధా కావడంతో పాటు అదే సమయంలో మరో అత్యవసర కేసుకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోందని, ఇటువంటి వాటికి స్వస్తిపలికి అవసరానికి వినియోగించుకోవాలని కోరారు.

చరిత్ర - విధివిదానాలు :
2005 ఆగస్టు 15న హైదరాబాద్‌లో 30 వాహనాలతో ప్రారంభమైన 108 సేవలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 752 వాహనాలతో విస్తృతమైందన్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడంలో 108 వాహన చోదకులు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది.

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా మొదటి సారిగా ఎన్నికైన అనంతరం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల్లో అత్యంత జనాదరణ పొందిన వాటిలో 108 వాహన సేవలు ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. 95 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మిగిలిన 5 శాతం నిధులను సత్యం కంప్యూటర్స్ సౌజన్యంతో ఇఎంఆర్ఐ (ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ) ఆధ్వర్యంలో 108 నడుస్తున్న సంగతి విదితమే. పల్లె పల్లెల్లో 108 గురించి ప్రజలకు అవగాన ఏర్పడింది. దీంతో తుమ్మినా, దగ్గినా కూడా 108 వాహనంకు ఫోన్ చేయడం వాటి సేవలు పొందడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సత్యం కంప్యూటర్స్‌లో ఏర్పడిన సంక్షోభం ఫలితంగా 108 పథకం నిర్వహణలో సత్యం కంప్యూటర్స్ చేతులెత్తేసింది. కాగా ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. దీంతో 108 పథకం యధావిధిగా కొనసాగించడానికి ప్రభుత్వం ఇతర కంపెనీలతో చర్చలు సాగించింది. ఈ నేపథ్యంలో జివికె గ్రూపు 108 నిర్వహణలో 5 శాతం నిధులు భరించడానికి ముందుకు రావడం జరిగింది. కాగా బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ చిన్న చిన్న జబ్బులతో బాధపడుతూ ఆసుపత్రికి చక్కగా నడచి రాగలిగే రోగులు కూడా కొంతమంది 108 వాహనంకు ఫోన్ చేసి ఆ వాహన సేవలు పొందారు. అలాగే పట్టణాల్లో ఉచితం కదా అని ఆటో బదులుగా మారుమూల సందుల్లోకి కూడా 108 వాహనాన్ని రోగులు రప్పించుకున్న సంఘటనలు కూడా కోకొల్లలు. కాగా మరికొంత మంది ఆకతాయిలు ఏదో ఘనకార్యం సాధించినట్లు రాంగ్ కాల్స్ చేసి 108 వాహనాన్ని రప్పించి సిబ్బందిని ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే సందర్భంలో నిజంగా సేవలు పొందాల్సిన బాధితులు నష్టపోవడం కూడా జరిగింది. ఇవన్నీ నిశితంగా గమనించిన 108 ఉన్నతాధికారులు ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. గతంలో ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ నుండి వచ్చే 108 టోల్ ఫ్రీ కాల్‌ను హైదరాబాద్‌లో రిసీవ్ చేసుకొని వెంటనే సంబంధిత దగ్గరి ప్రదేశం నుండి వాహనాన్ని పంపే ఏర్పాటు చేసేవారు. కానీ ఇటీవల 108 ఉన్నతాధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేసి పథకంలో జరిగిన మార్పులపై అవగాహన కల్గించారు. ప్రస్తుత విధానం వల్ల 108కు కాల్ చేస్తూనే ఆ కాల్‌ను హైదరాబాద్‌లోని సి ఓ (కమ్యూనికేషన్ ఆఫీసర్) రిసీవ్ చేసుకొని వివరాలను నోట్ చేసుకొని వాటిని డి ఓ (డిస్పాచింగ్ ఆఫీసర్) కు సమాచారం అందిస్తారు. వివరాలను తెలుసుకున్న డి ఓ అవసరమైతేనే 108 వాహనాన్ని సంఘటనా స్థలం వద్దకు పంపే ఏర్పాటు చేస్తారు. గుండెనొప్పి, గర్భవతి, రోడ్డు ప్రమాదం, బర్నింగ్, తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, పాము, తేలు కాటు, మూర్ఛ వ్యాధి, కోమా, ఆయాసం, ఆత్మహత్యాయత్నం, శిశు ఆరోగ్యం లాంటి అత్యవసరమైన పరిస్థితులకు మాత్రమే 108 వాహనం సేవలు ఉచితంగా లభిస్తాయి.ఒకవేళ అత్యవసరం కాకపోయినా అత్యవసరం అంటూ ఫోన్ కాల్ చేసినట్లయితే సంఘటనా స్థలానికి చేరుకున్న 108 వాస్తవ పరిస్థితిని గమనించి వెనక్కి కూడా వెళ్లవచ్చు. ప్రజలు 108 పథకాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
  • ===================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !