ప్రాధమిక విద్య
దీనిలో 1 నుండి 5 తరగతులలో (ప్రాథమిక పాఠశాల), 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు విద్యనభ్యసిస్తారు. ఏప్రిల్ 1, 2010 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక నిర్బంధ విద్య అనే చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ని చేయడం ద్వారా భారత్ ఇదివరకే ఇలాంటి చట్టాన్ని చేసి ఉన్న 130 దేశాల సరసన చేరింది.
ప్రాధమికోన్నత విద్య
దీనిలో 1 నుండి 7 తరగతులలో (ప్రాథమికోన్నత పాఠశాల), 6 నుండి 13 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు విద్యనభ్యసిస్తారు.
ఉన్నత పాఠశాల విద్య
ఉన్నత పాఠశాల విద్య (High School Education) లో 6 నుండి 10 తరగతులలో, 11 నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు ఉన్నత పాఠశాల (High School) లో విద్య నభ్యసిస్తారు.
- ============================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !