Friday, December 28, 2012

Srikurmam beach , శ్రీకూర్మాం బీచ్

  •  
  •  
శ్రీకూర్మాం లోకూర్మావతారమైన శ్రీమహావిష్ణు దేవాలము ఉన్నది . దశావతారాలలో 2 వ అవతారము : శ్రీకూర్మావతారము . ఈ ఆలయానికి భక్తులు దేశము నలుమూలలనుండి వస్తూ ఉంటారు. ఆలయానికి 2.5 కి.మీ. దూరములో ఉన్న వత్సవలస , మచ్యలేశము గ్రామాలను ఆనుకొని సముద్రతీరము ఉన్నది. సముద్ర స్నానాలకోసము భక్తులు ఈ తీరానికి వెళ్తూ ఉంటారు.
శ్రీకూర్మాం పేరుతో ఏ బీచ్ లూ లేవు . సముద్రస్నానాలు ఆరోగ్యానికి మంచిదని .. పుణ్యము వస్తుందని మూడ నమ్మకము గా భక్తులూ వత్సవలస , మత్యలేశము గ్రామాలను ఆనుకొని ఉన్న సముద్రతీరములో సముద్రస్నానాలు చేస్తూఉంటారు.  శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 15 కిలొమీటర్ల దూరములో శ్రీకూర్మాం గ్రామములో ఉన్న శ్రీకూర్మనాధ పుణ్యక్షేత్రము లో దేశములోనే బిన్నము గా ఇక్కడ దేవాలయము లో రెండు ధ్వజస్తంబాలు ఉన్నాయి . ఈ మందిరం లో శిల్పసోభితమైన 24 రాతిస్థంబాలు ఉన్నాయి . అజంతా , ఎల్లోరా గుహల్లో చిత్రాలను పోలిన కుడ్య చిత్రాలు భక్తులను ఆకర్షిస్తాయి . ఇక్కడికి చేరడానికి శ్రీకాకుళం టౌను నుండి కార్లు , ఆటోలు , ట్రక్కర్లు , ప్రతి అర-గంటకు ఒక బస్ ఉన్నాయి . ఈ పుణ్యక్షేత్రానికి దగ్గరిలో బీచ్ , అనేక పచ్చని తోటలు ఉన్నాయి కార్తీకమాసములో పిక్నిక్లు ఈ ప్రాంతములో ఎక్కువగా ఉంటాయి
  • =========================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !