Monday, October 1, 2012

Gandhi Memorila Library -గాంధీ స్మారక గ్రంథాలయం



 దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న రోజుల్లో 1927 డిసెంబరు 7న గాంధీజీ సిక్కోలు జిల్లాలో పర్యటించారు. సారవకోట గ్రామ చావడిలో ఒక రాత్రి బసచేసి, అనంతరం మెళియాపుట్టి వెళ్లారు. గాంధీజీకి నాటి స్థానిక నాయకులు బోయిన అప్పలస్వామి ఆతిథ్యం అందించారు. ఆ రోజున ఆయన బస చేసిన పూరిపాక (నాటి గ్రామ చావడి) స్థానంలో ఆయన స్మారకార్థం నాటి కలెక్టరు చెల్లప్ప రూ. 1.5లక్షలతో శాశ్వత భవనం నిర్మించారు. గాంధీ స్మారక గ్రంథాలయంగా ఏర్పాటు చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రంథాలయంలో  ఆయన స్మారక కార్యక్రమం ప్రతి సంవత్సరమూ ఏర్పాటు చేసినట్లు గ్రంథాలయాధికారిణి కె.ఎర్రమ్మ తెలిపారు. ఇలా.. ఎంతో మంది నిరుద్యోగులు, విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తుంధీ స్మారక గ్రంథాలయాలయం.
  • ==================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !