Monday, October 15, 2012

Eastern Ghats in Srikakulam - శ్రీకాకుళం లోతూర్పు కనుమలు.




  •  
  •  
సహజరక్షణ గోడలు.. తూర్పు కనుమలు-వాతావరణ నియంత్రణలో కీలకపాత్ర-ఎత్త్తెన కొండలు... మనకు అండగా నిలిచిన పెట్టని గోడలు.. ప్రకృతిచ్చిన  వరం.. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా ఏడాదిలో ప్రతీ నెలలోనూ ఎక్కడో ఒకచోట వర్షం పడేది మన శ్రీకాకుళం జిల్లాలోనే.... కారణం..  ఆకాశాన్నంటుతున్న కొండల వల్లనే. ప్రకృతి చక్రం సక్రమంగా నడవాలంటే ఇవెంతో కీలకం....


  • తూర్పు కనుమలు (Eastern Ghats) అంటే?
 భారత ద్వీపకల్పానికి తూర్పు సముద్ర తీరం వెంట ఉండే కొండల వరుస. ఇవి ఉత్తరంగా పశ్చిమ బెంగాల్ నుండి, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ ద్వారా దక్షిణంగాతమిళనాడు రాష్ట్రాలలోనికి వ్యాపించాయి. ఇవి అనేక నదులు ఉదా: గోదావరి, మహానది, కృష్ణా నది మరియు కావేరి నదుల ప్రవాహం వలన వేరుచేయబడ్డాయి. ఇవి బంగాళఖాతం సముద్రానికి సమాంతరంగా వ్యాపించాయి. వీని మధ్య ప్రదేశాన్ని కోస్తా ప్రాంతం అంటారు. దక్కను పీఠభూమి  తూర్పు మరియు పడమర కనుమల మధ్యగా విస్తరించి ఉన్నది. పడమటి కనుమల కన్నా తూర్పు కనుమల ఎత్తు తక్కువగా ఉంటాయి. దక్షిణ బాగాన తూర్పు కనుమలు విడిపొయి చిన్న చిన్న పర్వత శ్రేణులుగా విస్తరించి వుంటాయి. తూర్పు కనుమలు యొక్క దక్షిన చివరి భాగం తమిళనాడులొని సిరుమలై మరియు కరన్ తమలై అనె పర్వతశేణితొ ముగుస్తుంది. కావేరి నది ఉత్తరాన కొల్లి హిల్ల్స్ (కొల్లమలై), పంచమలై హిల్ల్స్ షెవరొయ్ హిల్ల్స్, సెర్వరొయన్,కల్ రాయన్ హిల్ల్స్, చిత్తేరి,పలమలై మరియు మెత్తుర్ హిల్ల్స్ అనె ఎత్తైన పర్వతాలు(తూర్పు కనుమలు) ఉత్తర తమిళనాడు లో విస్తరించి వున్నాయి. ఇక్కడ కొండలు పైన ఉష్ణోగ్రతలు చుట్టు ప్రక్కల ప్రదేశాల కంటే చల్లగాను తేమగాను వుంటాయి. ఈ ప్రదేశాలులొ కాఫీ తొటలు మరియు అడవులు ఉంటాయి

  • శ్రీకాకుళం లో
పేదల ఊటీగా పేరొందిన సిక్కోలు -జిల్లా విస్తీర్ణం: 5385 చదరపు కిలోమీటర్లు, అడవుల విస్తీర్ణం: 70,767 హెక్టార్లు ,ఇందులో కొండల విస్తీర్ణం: సుమారుగా 50 వేల హెక్టార్లు , తూర్పు తీరం వెంబడి తీరానికి అనుసంధానంగా తూర్పుకనుమలు ఉన్నాయి. చందనం, టేకు, నేరేడు, నీలగిరి, ఇరిడి తదితర వాణిజ్య ప్రాధాన్యమున్న వృక్షాలున్నాయి.

  • ఇదీ స్వరూపం
ఒడిశాలోని బ్రాహ్మణి నది నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు తూర్పుకనుమలు విస్తరించి ఉన్నాయి. ప్రత్యేక నిర్మాణం శైలితో కనిపిస్తాయి. జీవ వైవిధ్యానికి, జీవకోటి నిలయానికి పెట్టింది పేరు. విస్తారమైన అటవీ, ఔషధ సంపద నిలయమిది.

* శిలలు(కొండలు) మూడు రకాలు. అవి అగ్ని శిలలు, అవక్షేప శిలలు, రూపాంతర ప్రాప్తి శిలలు. తూర్పుకనుమలు ప్రాంతమంతా రూపాంతర ప్రాప్తిశిలలే. ఎక్కువగా రాళ్లు... మధ్య మధ్యలో మట్టితో ఇవి విభిన్నంగా ఉంటాయి. రాళ్ల పగుళ్లు.. కొండలు, బండల మధ్య ఉన్న మట్టిలో మొక్కలు  పెరుగుతాయి. ఇందులో విభిన్నమైన వృక్షజాతులు.. పండ్ల చెట్లు.. ఔషధ మొక్కలు... శాస్త్రీయంగా ఎంతో ప్రాధాన్యమున్న మొక్కలు ఉన్నాయి.

* పీడనం, ఉష్ణోగ్రత ప్రభావం వల్ల తూర్పు కనుమల్లోని రాళ్లు నీలం, ఊదా రంగులో ఉంటాయి. పగుళ్లు, గట్టితనం ఇక్కడి వాతావరణ ప్రభావం వల్లనే వస్తుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

* మన జిల్లాలోని తూర్పు కనుమల్లో పాలపిట్ట, ఊరపిచ్చుక, రాబందు, లకుముకిపిట్ట, గద్దలు, అడవికాకులు, దుమ్ములగొండి, నక్క, కుందేలు, ఏనుగులు, అడవిదున్నలు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, దుప్పి, కొండ గొర్రె, తోడేళ్లు తదితర జీవరాశులు జీవనం సాగిస్తున్నాయి. ఒకప్పుడు పులులు ఉన్నా.. ఇప్పుడవి అంతరించిపోయాయి.

* తూర్పుకనుమలకే ప్రత్యేకమైన జాతీయపక్షి నెమలి, రాష్ట్ర పక్షి పాలపిట్టల సంఖ్య ఇక్కడే ఉన్నాయి .

* కింగ్‌ఫిషర్‌ (పికిలిపిట్ట, వడ్రంగిపిట్ట) తూర్పు కనుమలకే ప్రత్యేక అందం తెచ్చింది. ఇది  జిల్లాలో ఎక్కడబడితే అక్కడ కనిపించేది.

* ఔషధ మొక్కలైన సర్పగంధి, బ్రహ్మకమలం, డయాస్కోరియా, వస మొక్కలు, అట్రోపా బెల్లడోనాతో పాటు శాస్త్ర పరిశోధనలకు వినియోగించే పిచ్చర్‌ మొక్క, బెలనోఫోరా, డిస్కిడీయా, సీప్రియా హిమాలయానా, సెరోపీజియాజైనీ వంటి మొక్కలు కూడా తూర్పుకనుమల్లో ఉన్నాయి .

* కలప అవసరాలకు వినియోగించే రక్తచందనం, గంధపుచెట్టు, పైనస్‌ గెరార్డియానా వంటివాటితో పాటు అలంకరణలకు వినియోగించే రోడోడెంట్రాన్‌ సింఫ్లోకస్‌, ఫోడో ఫిల్లమ్‌ వంటివి విస్తారంగా ఉన్నాయి.

* ప్రపంచంలో ఒక్క అరకులో తప్ప మరెక్కడా ఉండని మోసుదా (ఫ్రెరియా ఇండికా), రత్నగిరి అడవుల్లోనే లభించే సెరోపీజియా జైనీ వంటి మొక్కలూ మన జిల్లాలో ఉన్నాయి.

* గ్త్లెఫోబోలా, మైసోరెన్సిస్‌ వంటి అరుదైన మొక్కలు, ఆర్థిక ప్రాధాన్యం ఉన్న డెకసోకార్పస్‌ వల్లిబియానస్‌, ఫిల్లోస్టాకిస్‌ బాంబుసాయిడిస్‌ వంటివి ఒకపుడు ఉన్నాయి. ఇందులో అత్యధికశాతం అంతరించిపోగా.. మరికొన్నిటిని అంతిమదశలో ఉన్నవాటిగా గుర్తించారు.

  • కొండలు, అడవులను ధ్వంసం చేస్తే :
కొండలు, అడవులను ధ్వంసం చేస్తే భూమిపై  క్షయం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా వర్షాలు, వరదలు వచ్చినపుడు భూమిపై సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా వృక్షాలు, మొక్కలు మాత్రమే నిలువరిస్తాయి. ఇవే లేకపోతే సారవంతమైన పొర సముద్రంలోకి కొట్టుకుపోతుంది. దీనివల్ల భూములు బంజరుగా మారిపోతాయి. మరోవైపు జంతువులు ఆవాసాన్ని కోల్పోయి ప్రత్యుత్పత్తి తగ్గిపోతుంది.
* తూర్పుకనుమల కారణంగా ఏకాలంలోనైనా మన జిల్లాలో వర్షం పడుతుంది. భూమిలోని నీటిని మొక్క తీసుకుంటుంది. ఆ నీటిని బాష్పోత్సాకం ద్వారా వాతావరణంలోకి నీటి ఆవిరి రూపంలో విడుదల చేస్తుంది. ఇవి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాలు అడవుల నుంచి వచ్చే చల్లటి గాలులకు  సంకోచిస్తాయి. దీని వల్ల వర్షాలు పడతాయి. ఇదే జలచక్రం. ప్రస్తుతం కొండల్ని పిండి చేస్తుండటం వల్ల ఈ జలచక్రం గతి తప్పుతోంది. కొండలను తొలిచేస్తే... ఆ ప్రాంతంలో పంటలను పండించుకోవచ్చని కొందరు వితండవాదన చేస్తుంటారు.  వాస్తవమేమంటే కొండలను తవ్వేసినా.. దానికింద రాతిపొరే ఉంటుంది. ఒకవైపు  జీవవైవిధ్యం.. మరోవైపు భౌగోళిక సమతుల్యత దెబ్బతింటుంది. సునామీలు, భూకంపాల తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

  • ==============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !